రఘుపతి సహాయ్ ఫిరాఖ్
రఘుపతి సహాయ్ 'ఫిరాఖ్' గోరఖ్‌పూరీ (ఉర్దూ: فراق گورکھپوری, హిందీ: फ़िराक़ गोरखपुरी) (1896 - 1982), ప్రముఖ ఉర్దూ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. ప్రామాణిక ఉర్దూ సాహిత్య జగత్తులో ప్రముఖంగా ప్రస్తావించవలసిన కవి. సాహిర్, ఇక్బాల్, భూపేంద్రనాథ్ కౌషిక్ ఫిక్ర్, ఫైజ్ అహ్మద్ ఫైజ్ మరియు కైఫీ అజ్మీల వంటి ప్రముఖ ఉర్దూ కవుల సమకాలీకుడు. ఈయన కవితాసంకలనాలలో రూహ్-ఓ-ఖయామత్, గుల్-ఏ-రనా, నగ్మానుమా మరియు ఈయన సర్వోత్కృష్ట రచన గుల్-ఏ-నగ్మా ప్రముఖమైనవి.
రఘుపతి సహాయ్ 1896లో గోరఖ్‌పూర్‌లోని కాయస్థ కుటుంబంలో జన్మించాడు. ప్రాంతీయ సివిల్ సర్వీసులో పదవి పొంది ప్రభుత్వోద్యోగిగా పనిచేశాడు. ఆ తరువాత్ రాజీనామా చేసి అలహాబాదు విశ్వవిద్యాలయంలో ఆంగ్ల భాషా ఉపన్యాసకునిగా పనిచేశాడు. ఉర్దూ భాషా మణిబాల 'గుల్-ఎ-నగ్మా' రచించాడు. ఈ రచన ఆయనకు జ్ఞానపీఠ అవార్డు తో పాటు 1960 సంవత్సరానికి ఉర్దూలో సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని కూడా తెచ్చిపెట్టింది.[1]
ఫిరాఖ్ ఉర్దూ భాషలో ప్రప్రథమంగా జ్ఞానపీఠ అవార్డును పొందిన ఘనుడు.
మూలాలు [మార్చు]
- ↑ Awards - 1955-2007 Sahitya Akademi Official listing.
|
|||||