రతి

వికీపీడియా నుండి

రతి లేదా సెక్స్ (Sexual intercourse) స్తీ పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యక్రమము. భార్యాభర్తల మధ్య జరిగే రతి మూలంగా, భార్య గర్భం ధరించి, పిల్లలు కలిగి వారి కుటుంబం మరియు వంశం వృద్ధి చెందుతాయి. జీవశాస్త్రం ప్రకారం పురుషాంగం యోనిలో ప్రవేశించడాన్ని రతి అంటారు.[1] సాధారణంగా రతిని అన్నిరకాల స్త్రీపురుష సంబంధాలకు మూలంగా భావిస్తారు.[2] ఆధునిక పాశ్చాత్య దేశాల్లో దీనిని మూడు రకాలుగా చెబుతారు. అవి: యోని ద్వారా రతి, నోటితో రతి మరియు మలద్వారం ద్వారా రతి. అయితే చేతితో జననేంద్రియాలను ప్రేరేపించుకొనే హస్తప్రయోగం రతిగా పరిగణించరు. మనుషులకు భిన్నంగా, చాలా జంతువులు రతి ప్రక్రియ సంతానాభివృద్ధి కోసమే ఋతుచక్రంలో నిర్ధిష్టమైన సమయంలో మాత్రమే జరుపుతాయి.[3][4]

విషయ సూచిక

[మార్చు] రతివల్ల కలిగే లాభాలు

  • భార్యభర్తల మధ్య అనురాగం మరియు అనుబంధం పెరుగుతుంది.
  • ఆరోగ్యానికి ఉపయోగపడే అనేక హార్మోనులు సెక్స్ ప్రక్రియ సందర్భంగా విడుదల అవుతాయి.
  • రతిలో భావప్రాప్తి పొందిన తరువాత సుఖంగా నిద్రపోయి ఉదయాన్ని ఎంతో ఫ్రెష్ గా ఉంటుంది.
  • రతి ప్రక్రియ ఒక మంచి వ్యాయామంతో సమానం మరియు ఎంతో శ్రేష్టమైనది.
  • రతి సమయంలో విడుదలయ్యె ఆక్సిటోసిన్ ప్రభావం వలన తలనొప్పితో పాటు శారీరక నొప్పులను తగ్గిస్తుంది.
  • సెక్స్ వలన రోగనిరోధక శక్తి వృద్ధి చెందుతుంది.
  • సెక్స్ సమయంలో ఏర్పడే చెమటలో ఉపయోగమైన నూనెలు ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి.

[మార్చు] రతి భంగిమలు

  • మిషనరీ భంగిమ: అత్యంత సాధారణంగా సాధించగలిగేది.
  • 69 భంగిమ: ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా పడుకొని సాగించేది.
  • స్త్రీ పైనుండే భంగిమ:
  • జంతువుల భంగిమ: వెనుక నుండి అంగప్రవేశం చేయగల

[మార్చు] స్వలింగ సంపర్కం

ప్రధాన వ్యాసం: స్వలింగ సంపర్కం

ఒకే లింగ జాతికి చెందిన వ్యక్తుల మధ్య రతి సంబంధాన్ని స్వలింగ సంపర్కం (Homosexual sex) అంటారు. అనగా ఒక స్త్రీ మరొక స్త్రీతో అలాగే ఒక పురుషుడు మరొక పురుషునితో లైంగిక సంబంధం కలిగివుండడం. ఇది అమెరికా మరికొన్ని ఐరోపా దేశాలలో చట్టపరంగా గుర్తించబడ్డారు. భారతదేశంలో ఇదొక సాంఘిక అనైతిక చర్యగా భావిస్తారు, ఇక్కడి చట్టాలు వీరి మధ్య వివాహం వంటి సంబంధాన్ని గుర్తించవు.

[మార్చు] వ్యాధులు

రతి క్రీడ ద్వారా ప్రముఖంగా వ్యాప్తిచెందే వ్యాధుల్ని సుఖ వ్యాధులు (Sexually transmitted disease) అంటారు.

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు

  1. sexual intercourse బ్రిటానికా ప్రకారం
  2. Sexual Intercourse. health.discovery.com. తీసుకొన్న తేదీ: 2008-01-12.
  3. "Females of almost all species except man will mate only during their fertile period, which is known as estrus, or heat..." Helena Curtis (1975). Biology. Worth Publishers, 1065. ISBN 0879010401. 
  4. Pineda, Leslie Ernest McDonald (2003). McDonald's Veterinary Endocrinology and Reproduction. Blackwell Publishing, 597. ISBN 0813811066. 

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/wiki/%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు