రఫీయుల్ దర్జత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రఫీయుల్ దర్జత్
భారతదేశపు 11వ మొఘల్ చక్రవర్తి
Reign28 ఫిబ్రవరి – 6 జూన్ 1719
Predecessorఫర్రుక్‌సియార్
Successorరెండవ షాజహాన్
Regentసయ్యద్ సోదరులు (1719)
జననం(1699-11-30)1699 నవంబరు 30
మరణం1719 జూన్ 13(1719-06-13) (వయసు 19)
ఆగ్రా
Burial
ఖ్వాజా కుత్బుద్దీన్ కాకీ సమాధిమందిరం, ఢిల్లీ
Spouseఇనాయత్ బాను బేగం
Names
అబుల్ బరకత్ షంషుద్దీన్ ముహమ్మద్ రఫీ-ఉల్ దర్జత్ పాద్‌షా ఘాజీ షెహన్షాయే బహ్రుబార్
Houseతైమూరు వంశం
రాజవంశంతైమూరు వంశం
తండ్రిరఫీయుష్షాన్
తల్లిరజియత్ ఉన్నీసా బేగం
మతంఇస్లాం

రఫీయుల్ దర్జత్ (డిసెంబర్ 1, 1699 - జూన్ 13, 1719) రఫీయుష్షాన్ చిన్నకుమారుడు, ఆజం - ఉష్- షా మేనల్లుడు, ఫర్రుక్‌సియార్ తరువాత 11వ మొఘల్ సింహాసం అధిష్టించాడు.

రఫీయుల్ దర్జత్ 1719 ఫిబ్రవరి 28న సింహాసనం అధిష్టించాడు. సయ్యద్ సోదరులు రఫీయుల్ దర్జత్ ను మొఘల్ చక్రవర్తిగా ప్రకటించారు.

పాలన[మార్చు]

సయ్యద్ సోదరుల పాత్ర[మార్చు]

రఫీయుల్ దర్జత్ తన అధికారాన్ని సయ్యద్ సోదరుల పరంచేసాడు. క్రమంగా సయ్యద్ సోదరులు రాజ్యాధికారం మీద సంపూర్ణంగా పట్టు సాధించి, రఫీయుల్ దర్జత్ ను నామమాత్రపు చక్రవర్తిగా చేసారు. మునుపటి చక్రవర్తి ఫర్రుక్‌సియార్‌ను పదవీచ్యుతుని చేసింది కూడా సయ్యద్ సోదరులే.

సింహాసనం నుండి తొలగుట[మార్చు]

రఫీయుల్ దర్జత్ పాలన అరాజకంగా సాగింది. రఫీయుల్ దర్జత్ సింహాసనం అధిష్టించిన మూడు మాసాల కాలం తరువాత 1719 మే 18 న రఫీయుల్ దర్జత్ మామ, నేకూసియార్ ఆగ్రాకోట వద్ద మొఘల్ సింహాసనం అధిష్టించాడు. ఆయన అధికారం వహించడానికి తగినవాడని భావించబడింది.

నేకూసియార్ పదవిని అధిష్టించిన మూడు మాసాల తరువాత సయ్యద్ సోదరులు మొగల్ సింహానాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోట సయ్యద్ సోదరుల వశం అయింది. నెకుసియార్ పట్టుబడ్డాడు. ఆయనను అలీముల్ ఉమ్రా గౌరవపూర్వకంగా ఖైదు చేసి సలీంఘర్ వద్ద బంధించబడ్డాడు. నేకూసియార్ 1723లో మరణించాడు.

మరణం[మార్చు]

1719 జూన్ 6వ న రఫీయుల్ దర్జత్ చనిపోయే ముందు తన అన్నను చక్రవర్తిని చేయమని కోరాడు. ఆయన పాలన ముడు మాసాల ఆరు రోజులపాటు కొనసాగిన తరువాత ఆయన పదివినుండి తొలగించబడ్డాడు. తరువాత రెండు రోజులకు ఆయన సోదరుడు " రఫీయుద్దౌలా " సింహాసాధిష్ఠుడయ్యాడు. 1719 జూన్ 13న రఫీయుల్ దర్జత్" ఊపిరితిత్తుల కేన్సర్‌తో మరణించడం కాని హత్యచేయబడడం గాని జరిగి ఉండవచ్చని భావించారు. ఆయన భౌతికకాయం ఢిల్లీ లోని మెహ్రౌలీ వద్ద సూఫీ సన్యాసి ఖ్వాజా కుత్బుద్దీన్ కాకీ సమాధి సమీపంలో సమాధి చేయబడింది.

వెలుపలి లింకులు[మార్చు]

అంతకు ముందువారు
ఫర్రుక్‌సియార్
మొఘల్ చక్రవర్తి
1719
తరువాత వారు
రెండవ షాజహాన్