రమాకాంత్ దేశాయ్
| రమాకాంత్ దేశాయ్ | ||||
| వ్యక్తిగత సమాచారం | ||||
|---|---|---|---|---|
| బ్యాటింగ్ శైలి | కుడిచేతి బ్యాట్స్‌మన్ | |||
| బౌలింగ్ శైలి | రైట్-ఆర్మ్ ఫాస్ట్ మీడియం | |||
| కెరీర్ గణాంకాలు | ||||
| Tests | ODIs | |||
| మ్యాచ్‌లు | 28 | 150 | ||
| పరుగులు | 418 | 2384 | ||
| బ్యాటింగ్ సగటు | 13.48 | 18.19 | ||
| 100లు/50లు | 0/1 | 1/9 | ||
| అత్యుత్తమ స్కోరు | 85 | 107 | ||
| ఓవర్లు | 5597 | 23906 | ||
| వికెట్లు | 74 | 468 | ||
| బౌలింగ్ సగటు | 37.31 | 24.10 | ||
| ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | 2 | 22 | ||
| ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు | 2 | n/a | ||
| అత్యుత్తమ బౌలింగ్ | 6/56 | 7/46 | ||
| క్యాచ్ లు/స్టంపింగులు | 9 | 50 date = డిసెంబరు16 | ||
1939, జూన్ 20న ముంబాయిలో జన్మించిన రమాకాంత్ దేశాయ్ (Ramakant Bhikaji Desai) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.[1] 1959లో టెస్ట్ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన ఇతను ఫాస్ట్ బౌలర్‌గా జట్టుకు సేవలందించాడు.వెస్టిండీస్ తో ఆడిన తొలి టెస్టులోనే 49 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టినాడు. 1959లో ఇంగ్లాండు, 1961-62లో వెస్టీండీస్, 1967-68లో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లలో పర్యటించిన భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1960-61లో పాకిస్తాన్ పై జరిగిన సీరీస్‌లో 21 వికెట్లు సాధించాడు. ముంబాయి టెస్టులో 10వ నెంబరు బ్యాట్స్‌మెన్‌గా ప్రవేశించి 85 పరుగులు సాధించాడు. ఇది జాతీయ రికార్డు. అంతేకాకుండా 9 వికెట్టుకు నానా జోషితో కలిసి 149 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించిన తరువాత సెలెక్షన్ కమిటీ చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టినాడు. 1998, ఏప్రిల్ 28న మరణించినాడు.
విషయ సూచిక |
టెస్ట్ క్రికెట్ గణాంకాలు [మార్చు]
రమాకాంత్ దేశాయ్ 28 టెస్టులు ఆడి 37.31 సగటుతో 74 వికెట్లు సాధించాడు. ఇన్నింగ్సులో 5 వికెట్లను రెండు సార్లు పడగొట్టినాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 56 పరుగులకు 6 వికెట్లు. బ్యాటింగ్‌లో 13.48 సగటుతో 418 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 85 పరుగులు. ఇదే టెస్టులలో అతని ఏకైక అర్థసెంచరీ.
రంజీ ట్రోఫి గణాంకాలు [మార్చు]
దేశాయ్ రంజీ ట్రోఫిలో ప్రవేశించిన తొలి సంవత్సరమే 7 మ్యాచ్‌లలో 50 వికెట్లు సాధించాడు. ముంబాతి జట్టు తరఫున ఇది ఇప్పటికీ రికార్డుగా కొనసాగుతోంది. 1958-59 నుంచి 1968-69 వరకు 11 సంవత్సరాలు ముంబాతి జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
సెలెక్షన్ కమిటీ చైర్మెన్ [మార్చు]
1996-97లో రమాకాంత్ దేశాయ్ సెలెక్షన్ కమిటీ చైర్మెన్‌గా కొనసాగినాడు. చనిపోవడానికి ఒక మాసం ముందే ఆ పదవికి రాజీనామా చేశాడు.