రవితేజ (నటుడు)
రవితేజ (జననం: జనవరి 26, 1968) ప్రముఖ తెలుగు సినిమా నటుడు.
| రవితేజ | |
|---|---|
రవితేజ |
|
| జననం | భూపతిరాజు రవిశంకర్ రాజు 1968, జనవరి 26 |
| బిరుదు(లు) | ఆంధ్ర అమితాబ్, మాస్ మహారాజ్ |
| వృత్తి | సినిమా నటుడు |
| ముఖ్య_కాలం | 1990 నుండి |
| భార్య / భర్త(లు) | కళ్యాణి |
విషయ సూచిక |
వ్యక్తిగత సమాచారం [మార్చు]
రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట ఆయన జన్మస్థలం. ముగ్గరు కొడుకుల్లో రవితేజ అగ్రజుడు. ఆయన తండ్రి భూపతిరాజు రాజగోపాల్ రాజు ఫార్మాసిస్టు. తల్లి రాజ్యలక్ష్మి గృహిణి. ఆయన ఇద్దరు తమ్ముళ్ళు రఘు, భరత్ లు కూడా నటులే. రవితేజ తెలుగు సినీ పరిశ్రమ లో ప్రవేశించక ముందు ఉత్తర భారతదేశం లో జైపూర్, ఢిల్లీ, ముంబై, భోపాల్ మొదలైన ప్రదేశాలన్నీ తిరిగాడు. తరువాత కుటుంబంతో సహా విజయవాడ కు వెళ్ళారు. అక్కడ ఆయన సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో బియ్యే కోర్సులో చేరాడు.
ప్రస్థానం [మార్చు]
శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా నీ కోసం సినిమాతో రవితేజ హీరోగా పరిచయమయ్యాడు. ఆ చిత్రంలో ఆయన నటనకు పలువురి ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది.తరువాత మిరపకాయ్, ఈడియెట్, డాన్ సీను, కిక్, విక్రమార్కుడు, కృష్న ,వెంకి,భధ్ర, బలాదూర్, దరువు, దుబాయ్ సీను, నా ఆటోగ్రాఫ్,శెంభో శివ శెంభో,అమ్మ నాన్న ఓ తమిలమ్మాయి, అవును వాల్లిద్దరు ఇష్టపడ్డారు, ఇట్లు శ్రావణి సుభ్రమణ్యం, లాంటి పెద్ద పెద్ద విజయాలతో తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీలో రవితెజ ముఖ్య స్థానంలో ఉన్నారు.
చిత్రాలు [మార్చు]
| సంవత్సరం | చిత్రం | పాత్ర | ఇతర విశేషాలు |
|---|---|---|---|
| 1991 | కర్తవ్యం | ||
| చైతన్య | |||
| 1992 | ఆజ్ కా గూండా రాజ్ | గ్యాంగ్ లీడర్ చిత్రం యొక్క హిందీ పునఃనిర్మాణం | |
| 1993 | అల్లరి ప్రియుడు | ||
| 1994 | క్రిమినల్ | ||
| 1996 | నిన్నే పెళ్ళాడుతా | అతిథి పాత్ర | |
| 1998 | సింధూరం | చంటి | |
| సీతారామరాజు | |||
| పాడుతా తీయగా | |||
| 1999 | మనసిచ్చి చూడు | ||
| ప్రేమకు వేళాయెరా | రవి | ||
| నీ కోసం | రవి | విజేత ,నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం | |
| సముద్రం | చేపల నాని | ||
| ఓ పనైపోతుంది బాబూ | |||
| ప్రేమించేమనసు | |||
| 2000 | క్షేమంగా వెళ్ళి లాభంగా రండి | అతిథి పాత్ర | |
| తిరుమల తిరుపతి వెంకటేశ | తిరుపతి | ||
| సకుటుంబ సపరివార సమేతం | అతిథి పాత్ర | ||
| అన్నయ్య | రవి | ||
| 2001 | చిరంజీవులు | చందు | |
| అమ్మాయి కోసం | రవి | ||
| బడ్జెట్ పద్మనాభం | రవి | ||
| ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం | సుబ్రహ్మణ్యం | ||
| 2002 | వందేమాతరం | రవి | |
| అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు | అనీల్ | ||
| ఇడియట్ | చంటి | ||
| అన్వేషణ | అవినాష్ | ||
| ఖడ్గం | కోటి | విజేత, నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం | |
| 2003 | ఈ అబ్బాయి చాలా మంచోడు | వివేకానంద | |
| అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి | చందు | ||
| ఒక రాజు ఒక రాణి | రవి | ||
| దొంగోడు | మాధవ | ||
| వీడే | ఏడుకొండలు | ||
| 2004 | వెంకీ | వెంకీ | |
| నా ఆటోగ్రాఫ్ | శీను | ||
| చంటి | చంటి | అతిథి పాత్ర | |
| 2005 | భద్ర | భద్ర | |
| భగీరథ | చందు | ||
| 2006 | షాక్ | శేఖర్ | |
| విక్రమార్కుడు | అత్తిలి సత్తిబాబు, విక్రమ్ సింగ్ రాథోడ్ IPS |
ద్విపాత్రాభినయం | |
| ఖతర్నాక్ | దాసు | ||
| 2007 | దుబాయ్ శీను | శీను | |
| శంకర్‌దాదా జిందాబాద్ | అతిథి పాత్ర | ||
| 2008 | కృష్ణ | కృష్ణ | పేర్కొనబడ్డాడు, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు |
| బలాదూర్ | శీను | ||
| నేనింతే | రవి | విజేత, నంది ఉత్తమ నటుడు పురస్కారం | |
| 2009 | కిక్ | కళ్యాణ్ | పేర్కొనబడ్డాడు, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు |
| ఆంజనేయులు | ఆంజనేయులు | ||
| 2010 | శంభో శివ శంభో | కర్ణ | |
| మర్యాద రామన్న | వ్యాఖ్యాత | ||
| డాన్ శీను | డాన్ శీను | ||
| 2011 | మిరపకాయ్ | రిషీ | |
| కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు | అతిథి పాత్ర | ||
| దొంగల ముఠా | సుధీర్ | ||
| వీర | వీర | ||
| 2012 | నిప్పు | సూర్య | |
| దరువు | బుల్లెట్ రాజా, రవీంద్ర |
ద్విపాత్రాభినయం | |
| దేవుడు చేసిన మనుషులు | రవితేజ | ||
| సారొచ్చారు | కార్తీక్ నారాయణ | ||
| 2013 | బలుపు | చిత్రీకరణ జరుగుతున్నది | |
| జింతాతా | నిర్మాణ దశలో ఉంది | ||
| రోమియో | అతిథి పాత్ర, నిర్మాణ దశలో ఉంది |