రాంలాల్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఠాకూర్ రాంలాల్
Thakur Ram Lal.jpg
ఠాకూర్ రాంలాల్
నియోజకవర్గం జుబ్బల్, కోట్‌ఖాయ్
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి
In office
28 జనవరి 1977 – 30 ఏప్రిల్ 1977
Preceded by యశ్వంత్ సింగ్ పార్మార్
Succeeded by శాంతకుమార్
In office
14 ఫిబ్రవరి 1980 – 7 ఏప్రిల్ 1983
Preceded by శాంతకుమార్
Succeeded by వీరభద్ర సింగ్
ఆంధ్ర ప్రదేశ్ గవర్నరు
In office
15 ఆగష్టు 1983 – 29 ఆగష్టు 1984
Preceded by కె.సి.అబ్రహాం
Succeeded by శంకర్ దయాళ్ శర్మ
వ్యక్తిగత వివరాలు
జననం 15 జనవరి 1929
మరణం జూలై 6, 2002(2002-07-06) (వయసు 72)
సిమ్లా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
వ్యాపకం రాజకీయవేత్త

ఠాకూర్ రాంలాల్, కాంగ్రెసు పార్టీ నేత, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి[1]మరియు ఆంధ్ర ప్రదేశ్ గవర్నరు.

రాంలాల్ 1929, జనవరి 15న జుబ్బల్ లోని భర్తాట గ్రామములో జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం సిమ్లా మరియు అమృత్‌సర్ లలో జరిగింది. లా డిగ్రీ కలిగిన ఈయన రాజకీయాలలో చేరక మునుపు కొంతకాలము న్యాయవాద వృత్తిలో కొనసాగాడు. ప్రజాదరణ కలిగిన నాయుకునిగా, ఠాకూర్ రాంలాల్ 1957లో తొలిసారిగా రాష్ట్ర శాసనసభలో స్వతంత్ర అభ్యర్ధిగా అడుగిడినప్పటి నుండి 1998 ఎన్నికల వరకు పోటీ చేసిన అన్ని శాసనసభా ఎన్నికలలో గెలుపొందిన అరుదైన ఘనత సాధించాడు. ప్రజలతో సన్నిహిత సంబంధాలేర్పరచుకొని జుబ్బల్ మరియు కోట్‌ఖాయి నియోజకవర్గాలను తనకు పెట్టనికోటలా మలచుకొన్నాడు. ఇక్కడి నుండే ఈయన 9 పర్యాయాలు ఎన్నికైనాడు. 1990 లో జనతాదళ్ అభ్యర్ధిగా పోటీచేస్తూ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ను కూడా ఎన్నికలలో ఓడించాడు.

రాంలాల్ 2002 జూలై 6న సిమ్లాలో తీవ్రమైన గుండెపోటుతో మరణించాడు.[2]

మూలాలు[మార్చు]

  1. జనవరి 25, 1971 కి మునుపు హిమాచల్ ప్రదేశ్ కి ముఖ్యమంత్రులు ఉన్నా, అప్పుడది కేంద్రపాలిత ప్రాంతముగానే ఉన్నది.
  2. "HP ex-CM Thakur Ramlal dead". Chandigarh: The Times of India. 8 July 2002. Retrieved 10 January 2010. 

బయటి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=రాంలాల్&oldid=998584" నుండి వెలికితీశారు