రాబర్ట్ కోచ్

వికీపీడియా నుండి
రాబర్ట్ కోచ్
RobertKoch cropped.jpg
జననం డిసెంబరు 11 1843(1843-12-11)
Clausthal, Kingdom of Hanover
మరణం 1910(1910-05-27) (వయసు 66)
Baden-Baden, Grand Duchy of Baden
రంగము సూక్ష్మ జీవశాస్త్రం
మాతృ సంస్థ University of Göttingen
పర్యవేక్షకుడు Friedrich Gustav Jakob Henle
ప్రాముఖ్యత బాక్టీరియాలను కనిపెట్టడం
కోచ్ ప్రతిపాదితాలు
ఆంథ్రాక్స్, క్షయ మరియు కలరా వ్యాధి కారకాలను గుర్తించడం.
ముఖ్య పురస్కారాలు నోబెల్ బహుమతి (1905)

డాక్టర్ రాబర్ట్ కోచ్ (ఆంగ్లం: Heinrich Hermann Robert Koch (జ: డిసెంబర్ 11 1843 – మ: మే 27 1910) జర్మనీకి చెందిన ప్రపంచ ప్రసిద్ధ వైద్యుడు మరియు శాస్త్రవేత్త. ఇతడు ఆంథ్రాక్స్ వ్యాధి కారకమైన బాసిల్లస్ ఆంథ్రసిస్ ను (1877), క్షయ వ్యాధి కారకమైన మైకోబాక్టీరియాను (1982) మరియు కలరా వ్యాధి కారకమైన విబ్రియో కలరా ను (1883) తొలిసారిగా గుర్తించాడు. ఇతడే వ్యాధులకు వాటి కారకాలకు సంబంధించిన కోచ్ ప్రతిపాదితాలను సూచించాడు.


క్షయ వ్యాధికి సంబంధించిన దానిపై 1905 లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు. ఇతడు సూక్ష్మ జీవశాస్త్రంలో ప్రముఖులైన పాల్ ఎర్లిష్ వంటి ప్రముఖులకు మార్గదర్శకులు.

బయటి లింకులు [మార్చు]