రాబర్ట్ లుకాస్
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
అమెరికా ఆర్థికవేత్త మరియు అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత అయిన రాబర్ట్ లుకాస్ (Robert Lucas) సెప్టెంబర్ 15, 1937 లో వెల్లింగ్టన్ లోని యాకిమా లో జన్మించాడు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతని కుటుంబం సీటెల్ కు పయనమైంది. 1955 లో రాబర్ట్ లుకాస్ రూజ్వెల్ట్ కళాశాల నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాడు. 1959 లో చికాగో విశ్వవిద్యాలయం నుంచి చరిత్ర లో బి.ఏ. పట్టా పొందినాడు. 1964 లో అర్థశాస్త్రంలో పి.హె.డి.చేశాడు. 1963 నుంచి 1974 వరకు పెన్సిల్వేనియా లోని పిట్స్‌బర్గ్ లో కార్నెజీ ఇన్‌స్టిట్యూట్ టెక్నాలజీ లో ఆచార్యుడిగా పనిచేశాడు. 1974 లో చికాగో విశ్వవిద్యాలయంలో చేరినాడు. 1970 తర్వాత స్థూల అర్థశాస్త్రానికి అత్యంత ప్రభావం చూపిన వ్యక్తిగా రాయల్ స్వీడిష్ అకాడమి పేర్కొంది. ద్రవ్య విధానం లో అతని అర్థశాస్త్రానికి చేసిన సేవలకు గాను 1995 లో అతనికి నోబెల్ బహుమతి లభించింది. అతని యొక్క ప్రముఖ రచనలు Studies in Business Cycle Theory, Models of Business Cucles.