రామసేతు

వికీపీడియా నుండి
Landsat 5 image of Rama's Bridge

భారత్-శ్రీలంక దేశాల మధ్య రామేశ్వరం మరియు శ్రీలంక దీవులును కలుపుతు ప్రకృతి సిద్ధమైన సేతువు లాంటి సున్నపు రాతి ఆకారం. దీనిని 'ఆడమ్స్ బ్రిడ్జ్' అని కూడ అంటారు. ఇది పాక్ జలసంధిలో ఉన్నది. అంగ్లంలో సేతువులను 'షోల్స్' లేక 'సాండ్ బార్స్' అని అంటారు.

విషయ సూచిక

షోల్స్ ఏర్పడే విధానం [మార్చు]

సముద్ర కెరటాలు గట్టు వైపు వస్తున్నడు ఇసుక, బురద, గుళకరాళ్ళతో కలిసి గట్టుని కోస్తాయి. సముద్రగట్టు కోతకు గురి అయినప్పుడు కెరటాల ద్రవ్య వేగం నశించి నీరు వెనక్కి వెళ్ళుట వలన అడుగుభాగంలో వ్యతిరేక ప్రవాహము పుడుతుంది. దీనితో ఇసుక, బురద, గుళకరాళ్ళు కూడా నీళ్ళతో పాటు వెళ్ళతాయి. ప్రవాహం ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించినప్పుడు ఈ పదార్దాలు నిక్షిప్తమవుతాయి. ఇలా సముద్ర గట్టు వెంబడి కెరటాల ప్రవాహం వలన కాల క్రమేణా దారివలె దిబ్బలా రూపాంతరం చెందుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి షోల్స్ చాలా ఉన్నాయి. రామసేతు అనే షోల్ కూడా ఇలా ఏర్పడిందే.

మతవిశ్వాసం [మార్చు]

కవి వాల్మీకి వ్రాసిన రామాయణం ప్రకారం సీతను రావణుడు అపహరించిన తర్వాత వానరసేన సహాయంతో సీతాన్వేషణ ప్రారంభించాడు రాముడు. లంకానగరంలో సీత రావణుడి చెరలో ఉన్నదని హనుమంతుడి ద్వారా తెలుసుకున్న రాముడు రావణుడిపై యుద్ధాన్ని ప్రకటించాడు. అందుకు సమస్త వానర సేనావాహినిని లంకకు తరలించడానికై సముద్రం అడ్డుగా ఉండటంతో వారధి నిర్మించాలని నిర్ణయించాడు రాముడు. ఆ విధంగా వానరులసహాయంతో లంకకు వారధి నిర్మించడం, రావణుని సంహరించడం జరిగింది. కనుక రాముడే ఈ వారధిని నిర్మించాడని, అందుకే దీనిని రామసేతు అంటారని హిందువుల నమ్మకం.

పరిశోధనలు [మార్చు]

రామసేతు అనేది రాముడు కట్టించినట్టు ఎటువంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టువారు తీర్పు ఇచ్చారు. రామసేతు చారిత్రాత్మక కట్టడం కాదని, కేవలం సముద్ర ప్రవాహాల వల్ల కాలక్రమేణా సహజసిద్ధంగా వేలాది సంవత్సరాలుగా ఏర్పడిన సున్నపురాళ్ళ గుంపు అని పరిశోధనలు తెలుపుతున్నాయి.

చూడవలసిన లింకులు [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=రామసేతు&oldid=816975" నుండి వెలికితీశారు