రామ్ (నటుడు)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రామ్
Ram Pothineni.jpg

This file is a candidate for speedy deletion. It may be deleted after గురువారము, 21 నవంబర్ 2013.
జననం పోతినేని రామ్
(1987-05-15) మే 15, 1987 (వయస్సు: 27  సంవత్సరాలు)[1]
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
భారత దేశము
ఇతర పేర్లు రామ్
వృత్తి నటుడు
క్రియాశీలక సంవత్సరాలు 2006 నుండి ఇప్పటివరకు

రామ్ తెలుగు, తమిళ భాషల చిత్రసీమకు సంబంధించిన ఒక ప్రముఖ నటుడు. తెలుగులో ప్రధానంగా ఇతని సినిమాలు వచ్చాయి.

వ్యక్తిగత జీవితం[మార్చు]

రామ్ ప్రముఖ నిర్మాత "స్రవంతి" రవికిషోర్ తమ్ముడైన మురళి పోతినేని కొడుకు. హైదరాబాద్ లో పుట్టినా తన విద్యాభ్యాసం తమిళనాడులో చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమం మరియు సెంట్ జాన్ పాఠశాలలో చేసాడు.[2]

సినీ జీవితం[మార్చు]

రామ్ నటించిన మొదటి చిత్రం దేవదాసు. ఇందులో ఇలియానా కథానాయిక. వై.వీ.ఎస్. చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 11 2006 న విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాక రామ్ కి ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ - ఉత్తమ నూతన నటుడు అవార్డును అందించింది. తన రెండో చిత్రం సుకుమార్ దర్శకత్వం వహించిన జగడం. ఈ చిత్రం మార్చి 16 2007 న విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విఫలమైనప్పటికీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందాయి. 2008 లో శ్రీను వైట్ల దర్శకత్వంలో జెనీలియా సరసన రెడీ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో రామ్ పెద్ద హీరోల్లో ఒకడయ్యాడు.[3]

2009 లో రెండు చిత్రాల్లో నటించాడు. ఒకటి బి.గోపాల్ దర్శకత్వంలో మస్కా. ఇందులో హన్సిక, షీలా కథానాయికలు. మరో చిత్రం ఎం.శరవణన్ దర్శకత్వంలో గణేష్. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయిక. మస్కా ఓ మోస్తరు విజయం సాధించగా గణేష్ పరాజయం పాలైంది. కానీ ఈ రెండు చిత్రాల్లోనూ రామ్ తన నటనకు ప్రశంసలు సొంతం చెసుకున్నాడు. 2010 లో రామ్ శ్రీవాస్ దర్శకత్వంలో రామ రామ కృష్ణ కృష్ణ చిత్రంలో నటించాడు. ఇందులో ప్రియా ఆనంద్, బిందు మాధవి కథానాయికలు. ఈ చిత్రం కూడా ఓ మోస్తరు విజయాన్ని సొంతం చెసుకుంది. 2011 లో రామ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో కందిరీగ చిత్రంలో నటించాడు. ఇందులో హన్సిక, అక్ష కథానాయికలు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది.

2012 లో రామ్ ఏ.కరుణాకరన్ దర్శకత్వంలో ఎందుకంటే...ప్రేమంట! చిత్రంలో నటించాడు. ఇందులో తమన్నా కథానాయిక. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం భారీ పరాజయంగా నిలిచింది కానీ రామ్ మరియూ తమన్నాల నటనకు భారీ ఎత్తున ప్రశంసలు అందాయి.[4] 2013 లో రామ్ భాస్కర్ దర్శకత్వంలో ఒంగోలు గిత్త చిత్రంలో నటించాడు. ఇందులో కృతి కర్బంధ కథానాయిక. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది. ప్రస్తుతం రామ్ కె. విజయభాస్కర్ దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ తో కలిసి హిందీ చిత్రం బోల్ బచ్చన్ తెలుగు పునః నిర్మాణం అయిన మసాలాలో నటిస్తున్నాడు.[5]

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర కథానాయిక ఇతర విశేషాలు
2006 దేవదాసు దేవదాస్ ఇలియానా విజేత, ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ - ఉత్తమ నూతన నటుడు
2007 జగడం శీను ఇషా సహాని
2008 రెడీ చందు జెనీలియా పేర్కొనబడ్డాడు, ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ - ఉత్తమ నటుడు
2009 మస్కా క్రిష్ హన్సికా
షీలా
2009 గణేష్ గణేష్ కాజల్ అగర్వాల్
2010 రామ రామ కృష్ణ కృష్ణ రామ కృష్ణ ప్రియా ఆనంద్
బిందు మాధవి
2011 కందిరీగ శీను హన్సిక
అక్ష
పేర్కొనబడ్డాడు, ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ - ఉత్తమ నటుడు
2012 ఎందుకంటే...ప్రేమంట! కృష్ణ
రామ్
తమన్నా
2013 ఒంగోలు గిత్త వైట్ కృతి కర్బంధ
2013 మసాలా రామ్ / రహ్మాన్ షాజన్ పదాంసీ

మూలాలు[మార్చు]

  1. http://www.heroram.com/biography.html
  2. http://www.telugucinema.com/c/publish/stars/sravanthiravikishore_interview_2.php
  3. http://articles.timesofindia.indiatimes.com/2008-09-27/news-interviews/27923690_1_pleasant-surprise-hansika-ram
  4. http://telugu.way2movies.com/exclusivesingle_telugu/Tollywood-Hits-and-Flops-2012-11-282424.html
  5. http://entertainment.oneindia.in/telugu/news/2013/venkatesh-join-hands-ram-bol-bachchan-remake-103086.html