రావూరి భరద్వాజ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రావూరి భరధ్వాజ

రావూరి భరద్వాజ (జ. 1927, జూలై 5)[1] (మ. 2013, అక్టోబరు 18 )తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా పేరుతెచ్చుకున్నాడు. గొప్ప భావుకుడైన తెలుగు కవి మరియు రచయిత. రావూరి భరద్వాజ 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస మరియు ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు మరియు ఐదు రేడియో కథానికలు రచించాడు. [2] ఈయన బాలసాహిత్యంలో కూడా విశేషకృషి సలిపాడు. [3] సినీ పరిశ్రమలో తెరవెనుక జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించిన పాకుడు రాళ్ళు నవల భరద్వాజ యొక్క ఉతృష్ట రచనగా పరిగణింపబడుతుంది. ఈయన రచనలలో జీవన సమరం మరో ప్రముఖ రచన.

తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడితడు. ఆడంబరాలులేని సాధారణ జీవితం ఆయనది. భరద్వాజకు దిగువ మధ్యతరగతి మరియు పేదప్రజల భాషపై గట్టిపట్టు ఉన్నది. ఒక బీదకుటుంబంలో జన్మించిన భరద్వాజ కేవలం ఉన్నత పాఠశాల స్థాయివరకే చదువుకున్నాడు. ఆతరువాత కాయకష్టం చేసే జీవితాన్ని ప్రారంభించాడు. చిన్నతనంలో పొలాల్లో గడిపిన భరద్వాజ వ్యవసాయ కూలీల కఠినమైన జీవన పరిస్థితులను గమనించేవాడు. అప్పుడే పల్లెప్రజల భాష, యాస, ఆవేశాలు, ఆలోచనలు, కోపాలు, తాపాలు గమనినించిన భరద్వాజ ఆ అనుభవాలను తర్వాతకాలంలో తన రచనలలో నిజమైన పల్లె వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగించుకున్నాడు. 2013 అక్టోబర్ 18న రావూరి భరద్వాజ తిరిగిరాని లోకాలకు తరలివెళ్ళారు. [4]

ప్రారంభ జీవితం[మార్చు]

వీరు 1927 జూలై 5వ తేదీన కృష్ణా జిల్లా లోని నందిగామ తాలూకా కంచికచర్ల సమీపంలోని మొగులూరు (నాటి హైదరాబాదు సంస్థానంలోని) గ్రామంలో రావూరి కోటయ్య మరియు మల్లికాంబ దంపతులకు జన్మించారు. వీరి విద్యాభ్యాసం 8వ తరగతి వరకే సాగింది. తొలి నాళ్ళలో రావూరి భరద్వాజపై చలం ప్రభావం ఎక్కువగా ఉండేది. యుక్త వయసులోనే తెనాలిచేరి అక్కడ ఒక ప్రెస్సులో పనిచేయటం ప్రారంభించాడు. కొన్నాళ్ళ తర్వాత ఒక పత్రికకు ఉపసంపాదకుడైనాడు. ఆత్మాభిమానం కించపరచే ఒక సందర్భంలో తాళలేక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్ళు ఫౌంటెన్ పెన్నుల కంపెనీలో సేల్స్‌మన్‌గా పనిచేశాడు. అక్కడ కూడా యజమాని అమానుషత్వాన్ని భరించలేక రాజీనామా చేసి కొన్నాళ్ళపాటు ఖాళీగా ఉన్నాడు.

ఆ తర్వాత హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో 1959లో ప్రూఫ్ రీడింగ్ కళాకారునిగా చేరి చివరకు 1987లో ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా పదవీ విరమణ చేశాడు.

రచయితగా[మార్చు]

రావూరి భరధ్వాజ గురించి చాలాకాలం పరిశోధన చేసి వారి రచనల గురించి సమగ్రమైన పరిశీలన చేసిన బొగ్గుల శ్రీనివాస్ ప్రకారం భరధ్వాజ సుమారు 187 పైగా పుస్తకాలను వెలువరించారు, 500 పైగా కథలను 37 సంకలనాలుగా, 19 నవలలు, 10 నాటకాలు వ్రాశారు.[5] భరద్వాజ తన తొలి కథ ఒకప్పుడు ను 16 ఏళ్ల ప్రాయంలో వ్రాశాడు. ఇది జానపద శైలిలోసాగే కథ. భరద్వాజపై చలం ప్రభావం మెండుగా ఉన్నది. చలాన్ని అనుకరిస్తూ ఈయన అనేక సెక్సు కథలు వ్రాశాడు. త్వరలోనే సెక్సు కథలు వ్రాయటంలో అందెవేసినచెయ్యి అనిపించుకున్నాడు. అనేక పత్రికలు ఆ వ్యాసంగంలో ఈయన్ను ప్రోత్సహించాయి. ఏ మాత్రం సంకోచంగానీ, జంకుగానీ లేకుండా జీవనోపాధికై ఈయన అనేక కథలు వ్రాశాడు.

విచిత్రమైన మానవ భావోద్వేగాలే ప్రధానాంశాలిగా కథలు వ్రాసే భరద్వాజ శైలి సరళమైనది.[6] పాత్ర చిత్రీకరణలో, ఒక సన్నివేశాన్ని పరిచయం చేయటంలో రావూరి భరద్వాజకు ఉన్న ఒడుపు అద్భుతమైనది[7]

వ్యక్తిగత విషయాలు[మార్చు]

ఇతని వివాహం 1948 మే 28 తేదీన శ్రీమతి కాంతం గారితో జరిగింది. వీరికి ఐదుగురు సంతానం: రవీంద్రనాథ్, గోపీచంద్, బాలాజీ, కోటీశ్వరరావు మరియు పద్మావతి. ఇతని భార్య1986 ఆగష్టు 1వ తేదీన పరమపదించింది.

రావూరి భరద్వాజ 2013 అక్టోబర్ 18న తిరిగిరాని లోకాలకు తరలివెళ్ళారు.

పాకుడురాళ్ళు[మార్చు]

రావూరి భరద్వాజను నిలబెట్టే రచనల్లో అతి ముఖ్యమైనది చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా చేసుకొని తెలుగులో వెలువడిన మొట్టమొదటి నవల పాకుడురాళ్లు. భరద్వాజ దీనికి మాయ జలతారు అని నామకరణం చేశారు. అయితే శీలా వీర్రాజు పాకుడురాళ్లు అనే పేరు పెట్టాడు. మల్లంపల్లి సోమశేఖరశర్మ, ముదిగొండ సుబ్రహ్మణ్యశర్మల ప్రోత్సాహంతో రావూరి భరద్వాజ తాను అంతకుమునుపే రాసిన 'పాలపుంత' అనే ఓ పెద్ద కథని పాకుడురాళ్లు నవలగా రాశారు. మూడు సంవత్సరాలపాటు కృష్ణా పత్రికలో ధారావాహికగా వెలువడిన పాకుడురాళ్లు నవలపై శ్రీకృష్ణదేవరాయ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగడం విశేషం.[8]

రచనలు[మార్చు]

రావూరి భరద్వాజ షుమారు 150 రచనలు చేశాడు.

కథా సంకలనాలు[మార్చు]

 • అపరిచితులు
 • అపశ్రుతి
 • ఆనాడు
 • అర్థాంగి
 • ఆహుతి
 • భాగేశ్వరి
 • కథావాహిని
 • గాలివాటు
 • మహతి వ్యాసాలు
 • కిన్నెర మిథునం
 • కల్పన
 • గాలిపటం
 • జాలిగుండె
 • దైవరాజకీయాలు
 • రాగిని (1950)
 • జయంతి
 • దావానలము
 • కథాసాగరము
 • ఉన్నది - ఊహించేది (1955)[9]
 • పాపం (1956)
 • లోకం కోసం (1956)
 • పాలపుంత (1961)
 • అన్యధా శరణం నాస్తి (1962)
 • పుత్రకామేష్టి (1962)
 • కొత్త చిగుళ్లు
 • మచ్చుకో చచ్చుకథ
 • మళ్ళీ తెలవారింది
 • మమకారం
 • మానవుడు-దానవుడు
 • మానవుడు మరణిస్తున్నాడు
 • మంజూష
 • మనోరమ
 • మొనలేని శిఖరం
 • మూఢనిద్ర
 • నర(క)లోకం
 • నిన్ను గురించిన నిజం
 • పాడ్యమి (1984)
 • పద్మవ్యూహం
 • సౌందరనందం (1987)
 • శ్రీరస్తు (1989)
 • సిరికింజెప్పడు
 • సౌదామని
 • త్రినేత్రుడు
 • కల్పన
 • మనోరథం
 • మేనక
 • స్వయంవరం
 • విచిత్ర ప్రపంచం
 • వసుంధర
 • వసు చరిత్ర
 • విజయ విలాసం
 • వినదగు

నవలలు[మార్చు]

 • కరిమింగిన వెలగపండు (1962)
 • జలప్రళయం (1963)
 • పాకుడురాళ్ళు (1965)
 • చంద్రముఖి
 • కాదంబరి
 • చిత్రగ్రహం
 • ఇదంజగత్ (1967)
 • నామీద నాకే జాలిగ వుంది
 • ఒక రాత్రి, ఒక పగలు
 • జీవన సమరం
 • రాజపుత్ర రహస్యం
 • తెలుసుకుంటూ..తెలుసుకుంటూ...
 • సాహస విక్రమార్క
 • శిధిలసంధ్య
 • తోడుదొంగలు
 • వీరగాధ
 • లోకం కోసం - కథల సంపుటి [5]
 • ఇది నాది కాదు
 • ఆకళ్లు

పిల్లల కోసం[మార్చు]

 • ఉడుత ఉపదేశం
 • కీలుగుర్రం
 • చిలుక తీర్పు
 • జాలిగుండె
 • తెలివైన దొంగ (పిల్లల కథలు)
 • పద్దు తెచ్చిన ముద్దు తమ్ముడు (పిల్లల కథలు)
 • పరకాయ ప్రవేశం
 • మణిమందిరం
 • మాయాలోకం
 • రత్నాలలోయ
 • వాణి-రాణి
 • సముద్రవీరుడు

అపరాధ పరిశోధన[మార్చు]

 • విషనాగు
 • దుష్టచతుష్టయం
 • సత్యాన్ని దాచటం సాధ్యంకాదు
 • ఎత్తుపల్లాలు
 • మంచుమనిషి

సాహిత్య వ్యాసాలు[మార్చు]

 • ఇనుపతెర వెనుక
 • కంచికి వెళ్ళిన కథ
 • నేనెందుకు రాస్తున్నాను
 • మహతి
 • మొగ్గతొడిగిన ఎర్రగులాబి
 • శూన్యం నుండి సృష్టి

స్మృతి సాహిత్యం[మార్చు]

విజ్ఞాన సాహిత్యం[మార్చు]

 • అచ్చు ముచ్చట
 • అద్దం కథ
 • అవని-ఆకాశం
 • గడియారం
 • గ్రహాలు
 • చెత్త నుండి విత్తం
 • నిప్పు కథ
 • నీరు
 • బొగ్గు కథ
 • మనిషి
 • లింగాణి
 • లోకాలు
 • వ్యర్థం నుండి అర్థం
 • స్టాంపులు

అవార్డులు[మార్చు]

రావూరి భరద్వాజకు 1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1987లో జవర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, 1991లో నాగార్జున విశ్వవిద్యాలయం గౌర్రవ డాక్టరేట్లు ప్రదానం చేసి గౌరవించాయి.[10]

 • 1980 - కళాప్రపూర్ణ - ఆంధ్ర విశ్వవిద్యాలయం.
 • 1983 - కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం.
 • 1985 - సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం ఇనుక తెర వెనక కు లభించింది.
 • 1987 - రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు
 • 1987 - తెలుగు కళాసమితి కె.వి.రావు, జ్యోతిరావు అవార్డు[11]
 • 2007 - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న అవార్డు
 • 2008 - లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం (వినూత్న సాహితీ ప్రక్రియ కల్పించినందుకు, డిసెంబర్ 4 వ తేదీన ప్రకటించారు)[12]
 • 2011 - కేంద్ర సాహిత్య అకాడమీ, వంగూరి ఫౌండేషన్, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారాలు.
 • 2012 - జ్ఞానపీఠ అవార్డు తెలుగు సినిమా ప్రపంచంలోని వెలుగుల వెనుక చీకటిని ఆవిష్కరిస్తూ రచించిన పాకుడురాళ్ళు నవలకు ఈ గౌరవం దక్కింది. [13]

అభినందన చందనం[మార్చు]

రావూరి భరధ్వాజ గురించి చాలాకాలం పరిశోధన చేసి వారి రచనల గురించి సమగ్రమైన పరిశీలన చేసిన బొగ్గుల శ్రీనివాస్ భరధ్వాజ గురించి రచించిన కవిత:

 • సినీ ' మాయా సరస్సు ' లో అడుగేస్తే ' కాలుజారే ' పాకుడురాళ్ళ ' పై మారుమూల మంగమ్మను ' మహానటి-మంజరి ' గా మార్చి మార్లిన్ మన్రోతో మాట్లాడించిన - మహా వ్యక్తిత్వ వికాస నిపుణుడు .
 • ' మధుర వాణి ' సరసన ' మంజరి ' ని కూర్చుండబెట్టిన - మరో గురజాడ .
 • ' దెయ్యాలతోపు ' లో ' దావానలం ' సృష్టించే ' రాగిణి-కస్తూరి ' ' ఆకర్ష ' కు ' కొత్త చిగుళ్లు ' పూయించిన - యవ్వన వాత్సాయనుడు .
 • అలనాటి ' వీరగాధ ' ను అలవోకగా శౌనకాది మునులకు వినిపించిన - సూతుండు .
 • ' కీలుగుఱ్ఱం ' ఎక్కి ' బంగారులేడి ' ని వెంబడించి ' రతనాలలోయ ' ను చేరి ' పంజరంలోని చిలుక ' లోకి ' పరకాయ ప్రవేశం ' చేసి ' అనగనగా ' అంటూ చిన్నారులను అలరించిన - చిన్నయసూరి .
 • ' విషనాగు ' ల్లాంటి ' దుష్టచతుష్టయం ' చేసే ఘోరాన్ని ' సత్యాన్ని దాచడం సాధ్యంకాదు ' అంటూ ఎన్నో ' ఎత్తుపల్లాలు ' అధిగమించి వెలుగులోకి తెచ్చిన ' మంచుమనిషి ' - డిటెక్టివ్ జయదేవ్ .
 • ' మాకూ ఉన్నాయి స్వగతాలు ' అంటూ చెట్టుకూ, పుట్టకూ, గడ్డి పరకకూ, ' వెలుతురు చినుకులు ' నింపి చీమకూ, దోమకూ, ఎలుకకూ, చిలుకకు పలుకులు నేర్పి దిక్కూమొక్కూలేని కష్టజీవుల యదార్థ బ్రతుకులపై ' జీవనసమరం ' పూరించిన - గోపీచంద్ .
 • కష్టాల ' ఆశలకొలిమి ' కి గాలితిత్తులతో ఊపిరులు ఊదుకొని, ' బ్రతుకు ' అనే నిప్పుకణికలపై, మోసాల సమ్మెట దెబ్బలతో, అవమానాల రంపపు కోతలతో గొడ్డుచాకిరినీ, దుర్భర దారిద్ర్యాన్ని అనుభవ వేద్యంగా జీవితపు అట్టడుగు లోతుల నుండి ఎదిగిన - మాక్సీం గోర్కీ .
 • ' కరిమింగిన వెలగపండు ' లాంటి ఈ సమాజంలో అనురాగాలు, ఆత్మీయతలు మృగ్యమై ' మానవుడు మరణిస్తున్నాడు ' అంటూ ' ఇనుపతెర వెనుక ' ' లోగుట్టు ' వివరించిన - మహోన్నత మానవతావాది .
 • అశ్పృశ్యత నివారణ, హరిజనుల ఉద్ధరణ కోసం ' అమరజీవి ' తో కలిసి పోరాడి వారి జీవితాలలో ' వేకువ ' లు సృష్టించుటకు అనుక్షణం అలమటించిన - అక్షర పెరియార్ .
 • తన ' అంతరంగిణి ' అంతర్ధానం అయినప్పటికీ ' నాలోని నీవు ' దూరం కాలేదని, నాకు నువ్వుతప్ప ఇంకో ' ఐతరేయం ' లేదని ' అయినా ఒక ఏకాంతం ' లో ' ఒకింత వేకువ కోసం ' ఎదురు పడతావనీ ప్రతిరోజూ ఒక ' మొగ్గతొడిగిన ఎర్ర గులాబీ ' తో ఎదురుచూస్తున్న - స్మృతి చకోరుడు .

మూలాలు[మార్చు]

 1. తెలుగువన్ సాహిత్యంలో రావూరి భరద్వాజ ఇంటర్వ్యూ
 2. http://www.jnanpith.net/sites/default/files/Press%20Release%2048th%20Jnanpith%20Award.pdf
 3. Indian literature By Nagendra పేజీ.95 [1]
 4. Encyclopaedia of Indian literature vol. 1 By Amaresh Datta, various పేజీ. 446 [2]
 5. బొగ్గుల శ్రీనివాస్, రావూరి భరద్వాజ పరిశోధకులు.
 6. Modern Telugu short stories By Vaadrevu Patanjali, A. Muralidhar పేజీ.11 [3]
 7. Encyclpopaedia of Indian Literature By Mohan Lal, various పేజీ.4076 [4]
 8. ఈనాడు సాహిత్యంలో చీకోలు సుందరయ్య వ్యాసం
 9. http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=unnadi%20uuhin%27cheidi&author1=bharadvaaja%20raavuuri&subject1=GENERALITIES&year=1955%20&language1=Telugu&pages=103&barcode=2030020024792&author2=&identifier1=&publisher1=adarsha%20gran%27tha%20man%27d%27ali&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/852
 10. ఆంధ్రప్రభలో రావూరి భరద్వాజపై వ్యాసం
 11. http://www.tfas.net/general/awards.html
 12. http://www.hindu.com/2008/12/05/stories/2008120560680600.htm
 13. http://www.jnanpith.net/sites/default/files/Press%20Release%2048th%20Jnanpith%20Award.pdf