రాష్ట్రకూటులు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
రాష్ట్రకూట వంశము బహు ప్రాచీనమైనది. క్రీ.శ. 6వ శతాబ్దము నుండియు ఈవంశపు రాజులు దక్షిణ హిందూదేశమున పెక్కుచోట్ల చిన్నచిన్న సంస్థానములు స్థాపించి పాలన చేయుచుండిరి. వీరు తొలుత చాళుక్యులకు సామంతులు. ఇప్పటి మహారాష్ట్ర లోని ఎల్లోరా ప్రాంతమునేలుచున్న దంతిదుర్గుడు బాదామి చాళుక్యుల కడపటి రాజు రెండవ కీర్తివర్మను కూలద్రోసి రాజ్యము చేశాడు. ఇతనిని దంతివర్మ అని కూడ అందురు. అద్వితీయ బల పరాక్రమ సంపన్నుడు. ఖడ్గావలోక, వైరమేఘ అను బిరుదులున్నాయి. క్రీ.శ. 758లో యుద్ధములో మరణించాడు. రాజ్యము చేసిన కొద్దికాలములోనే కాంచీ, కళింగ, కోసల, శ్రీశైల, మాళవ, లాట, టంక, సింధుదేశములను జయించాడు. ఇతనికి వేములవాడ చాళుక్య వంశమునకు మూలపురుషుడైన వినయాదిత్య యుద్ధమల్లుడు తోడ్పడ్డాడు.