రిచర్డ్ గేర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రిచర్డ్ గేర్
Richardgere.jpg
Gere in Venice, 2007
జన్మ నామం Richard Tiffany Gere
జననం (1949-08-31) ఆగష్టు 31, 1949 (వయస్సు: 65  సంవత్సరాలు)
క్రియాశీలక సంవత్సరాలు 1973–present
భార్య/భర్త Cindy Crawford (1991–1995)
Carey Lowell (2002–present)

రిచర్డ్ టిఫ్ఫనీ గేర్ ([1]pronounced /ˈɡɪər/geer; జననం ఆగస్ట్ 31, 1949) ఒక అమెరికా నటుడు. అతను 1970లలో నటించడం ప్రారంభించారు. అమెరికన్ గిగోలో అనే ఒక చిత్రంలో తాను వేసిన పాత్రతో అతను వెలుగులోకి వచ్చాడు. ఆ చిత్రం అతనిని ఒక శృంగార చిహ్నంగానూ ప్రధాన నటుడుగానూ నిలపెట్టింది. తరువాత అతను యాన్ ఆఫీసర్ అండ్ ఎ జెంటేల్మాన్ , ప్రెట్టి ఉమన్ , ప్రిమల్ ఫియర్ , మరియు షికాగో వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. షికాగో చిత్రంలో అతని నటనకు అతనికి గోల్డన్ గ్లోబ్ ఉత్తమ నటుడు పురస్కారం మరియు ఉత్తమ నటబృందంలో భాగమైనందుకు స్కీన్ యాక్టర్స్ గిల్డ్ పురస్కారం లభించింది.

ప్రారంభ జీవితం[మార్చు]

[1] పెనిసిల్వేనియా లోని ఫిలడెల్ఫియాలో జన్మించిన గేర్, మేఫ్లవర్ పిల్గ్రిమ్స్ ఫ్రాన్సిస్ ఈటన్, జాన్ బిల్లింగ్టన్, జార్జ్ సౌల్, రిచర్డ్ వారన్, డేగోరి ప్రీస్ట్, విల్లియం బ్రూస్టర్ మరియు ఫ్రాన్సిస్ కుక్ యొక్క సంతతి కి చెందినవారు.[1][2] గేర్ తల్లి డోరిస్ అన్నా (నీ టిఫ్ఫాని) ఒక గృహిణి, తండ్రి హోమర్ జార్జ్ గేర్, ఒక మంత్రి అవ్వాలని అనుకున్నారు. కాని, నేషన్వైడ్ మ్యూచువల్ ఇన్ష్యురన్స్ కంపెని లో ఒక భీమా ఏజెంట్ గా పని చేశారు.[2] గేర్ కు మూడు సోదరులు మరియు ఒక సోదరుడు ఉన్నారు. 1967లో అయన నార్త్ సైరక్యుస్ సెంట్రల్ హై స్కూల్ నుండి చదువు పూర్తి చేశారు. అక్కడ జిమ్నాస్టిక్స్ మరియు ట్రంపెట్ వాద్యసంగీతంలో మంచి ప్రావీణ్యం చూపారు.[2] జిమ్నాస్టిక్స్ లో ఉపహారవేతనం పొంది, యునివర్సిటీ ఆఫ్ మసచుసేట్ట్స్ అమ్హెర్స్ట్ లో చేరి, తత్వజ్ఞానం చదివారు. కాని చదువు పూర్తి చేయకుండానే రెండేళ్ల తరువాత మానేశారు.[2][3]

వృత్తి[మార్చు]

కేప్ కాడ్ లో ఉన్న ప్రావిన్స్ టౌన్ ప్లేహౌస్ లో 1971లో గేర్ మొదట్లో పని చేసి, {{0}1}రోసేన్ క్రాన్ట్స్ మరియు గైల్డెనస్టెర్న్ ఆర్ డేడ్ లో నటించారు. గేర్ కి మొదటి పెద్ద నటనా పాత్ర, 1973లో గ్రీస్ యొక్క అసలైన లండన్ రంగస్థల నాటికలో లభించింది.[2] 1970ల మధ్యలో అయిన హాలివుడ్ చిత్రాల్లో నటించడం మొదలుపెట్టారు. లుకింగ్ ఫర్ మిస్టర్ గుడ్బార్ అనే థ్రిల్లర్ చిత్రంలో సహాయ నటుడిగా నటించారు. చక్కగా విశ్లేషించబడిన 1978 సంవత్సరపు చిత్రమైన దర్శకుడు టెరన్స్ మాలిక్ యొక్క డేస్ ఆఫ్ హెవన్ లో ప్రధాన పాత్ర పోషించారు.[2] 1980లో గేర్ బ్రాడ్వే నిర్మాణం చేసిన బెంట్ లో నటించారు. ఆ సంవత్సరం, అమెరికన్ గిగోలో అనే చిత్రంలో నటించటంతో, అతని నటనా జీవితం గొప్పగా మలుపు తిరిగింది. తరువాత, 1982లో దాదాపు $130 మిలియన్ వసూళ్లు నమోదు చేసిన యాన్ ఆఫీసర్ అండ్ అ జెంటిల్మాన్ అనే రసవత్తరమైన చిత్రంలో నటించారు.[4]

అయితే, 1982 తరువాత గేర్ యొక్క నటనా జీవితం అనేక బాక్స్ ఆఫీస్ వైఫల్యాలతో తగ్గుముఖం పట్టింది.[5][6] 1990లో ఇంటర్నల్ అఫ్ఫెర్స్ మరియు ప్రెట్టి ఉమన్ అనే రెండు చిత్రాల విడుదలతో అతని నటనా జీవితం కొంత మేరకు కోలుకుంది. మళ్ళీ ప్రధాన నటుడు అనే గేర్ యొక్క హోదా బలపడి, 1990ల అంతటా అయన అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. వీటిలో కొన్ని ఏమనగా సోమర్స్ బై (1993), ప్రిమల్ ఫియర్ (1996), మరియు రన్ అవే బ్రైడ్ (1999). రన్ అవే బ్రైడ్ చిత్రం, ప్రెట్టి ఉమన్ చిత్రంలో అతని సహనటి అయిన జూలియా రాబెర్ట్స్ తో అతన్ని మళ్ళీ జత కలిపింది.[5]

1999లో పీపుల్ పత్రిక గేర్ ని "జీవించి ఉన్న వాళ్లలో అతి శృంగారమైన పురుషుడు" అని పేర్కొంది. 2002లో అయన మూడు గొప్ప చిత్రాలలో నటించారు. అవి ది మోత్మన్ ప్రోఫేసీస్ అనే భీకరమైన థ్రిల్లర్, అన్ ఫెయిత్ఫుల్ అనే నాటకీయ చిత్రం మరియు అకాడమి పురస్కారం- గెలుచుకున్న షికాగో యొక్క చిత్ర వెర్షన్.[2] ఈ చిత్రానికి ఆయనకు ఉత్తమ నటుడు - హాస్యం లేదా సంగీతపరమైన విభాగంలో గోల్డన్ గ్లోబ్ గెలుచుకున్నారు. గేర్ యొక్క 2004 సంవత్సరపు బాల్రూం నృత్య నాటిక షెల్ వీ డాన్స్ మంచి ప్రదర్చన చూపించి, ప్రపంచవ్యాప్తంగా $170 మిలియను వసూళ్లు నమోదు చేసింది.[7] అయితే అతని మరుసటి చిత్రమైన 2005 సంవత్సరపు బీ సీసన్ , వ్యాపార రీత్యా విఫలమయింది.[8]

గేర్ హార్వర్డ్ యునివర్సిటి కు చెందిన హస్టి పుడ్డింగ్ థియేట్రికల్స్ వారి మాన్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచారు. 2007లో, అయన జెస్సి ఈశన్బెర్గ్ మరియు టెరన్స్ హోవార్డ్ తో కలిసి ది హన్టింగ్ పార్టి అనే ఒక హాస్య థ్రిల్లర్ చిత్రంలో బోస్నియా కు చెందిన ఒక విలేఖరి పాత్రలో నటించారు. అదే ఏడాది అయన క్రిస్టియన్ బేలే తో కలిసి హీత్ లేడ్జేర్ అనే చిత్రంలోనూ కేట్ బ్లాంచెట్ తో కలిసి టోడ్ హాయ్న్స్ యొక్క బాబ్ డైలన్ గురించిన సగం-జీవిత చరిత్ర చిత్రమైన అయం నాట్ దేర్ లోనూ నటించారు.

ఈమధ్య కాలములో గేర్ డయాన్ లేన్ తో కలిసి 2008లో విడుదలైన నైట్స్ ఇన్ రోడాంత్ అనే శృంగార నాటిక చిత్రంలో నటించారు. ఈ చిత్రం విమర్శకుల తీవ్ర విమర్శకు గురయింది[9] (2008లో ది లండన్ టైమ్స్ చెత్త చిత్రాల జాబితాలో $74 స్థానంలో ఉంది).[10] అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా $84 మిలియను వసూళ్లు నమోదు చేసింది.[11]

వ్యక్తిగత జీవితం మరియు చైతన్యం[మార్చు]

గేర్ కు 14వ దలై లామా ఒక ఖటా అనబడే వస్త్రాన్ని బహుగారించడం

గేర్ కు సూపర్ మాడల్ సిండి క్రాఫోర్డ్ తో వివాహం అయి 1991 నుండి 1995 వరకు వివాహం అమలులో ఉంది. 2002లో ఆయన మాడల్ మరియు నటి అయిన కేరి లోవల్ ని వివాహం చేసుకున్నారు. వాళ్ళ ఇద్దరికీ హోమర్ జేమ్స్ జిగ్మే గేర్ అనే కొడుకు 2000లో జన్మించాడు. గేర్ తండ్రి పేరుని బట్టి అబ్బాయికి పేరు పెట్టారు.[2]

మేతాడిస్ట్ తల్లితండ్రుల చే గేర్ పెంచబడ్డరు;[12] 1978లో బ్రెజిల్ కు చెందిన చిత్రకారుడు సిల్వియా మార్టినస్ తో కలిసి నేపాల్ కు వెళ్ళినప్పుడు, అతనికి బౌద్దిసం మీద ఆసక్తి ఏర్పడింది.[13] అతను ఇప్పుడు బౌద్దిసం ని ఆచరిస్తూ, దలాయి లామా ని గట్టిగా అచరిస్తున్నాడు.[2] గేర్ తిబేత్ లో మానవ హక్కులకి నిరంతర ఆదరణ ఇస్తున్నారు; అయిన తిబెత్ హౌస్ స్థాపించానవాళ్లలో ఒక్కరు. అతను గేర్ ఫౌండేషన్ స్థాపించినవారు. అయిన ఇంటర్నేషనల్ కాంపైన్ ఫార్ తిబెత్ పాలక మండలికి అధ్యక్షుడు. తిబెత్ స్వాతంత్ర ఉద్యమాన్ని తీవ్రంగా ఆదరిస్తున్నారు కనుక పీపుల్స్ రిపబ్లిక్ అఫ్ చైనా లోకి అడుగు పెట్టకూడదని నిషేదించబడ్డారు. 1993లో అకాడెమీ అవార్డ్ బహుకరించే వారిలా, గేర్ నిషేధించబడ్డారు ఎందుకంటే ఆ అవకాశాని వాడి చైనా ప్రబుత్వాన్ని అయిన కండించారు కనుక.[14][15] సెప్టెంబర్ 2007లో, చైనా మీద ఒత్తిడి పెట్టాలని, 2008 బీజింగ్ ఒలింపిక్స్ ని బహిష్కరించాలని గేర్ పిలుపు ఇచ్చారు. లాన్శియా డెల్టా గురించిన రాజకీయ ఉద్దేశమున్న మరియు తిబెత్ కు అనుకూలమైన ఒక లాంశియా వ్యాపార ప్రకటనలో నటించారు.[16]

రిచర్డ్ గేర్ అనే ప్రపంచవ్యాప్తంగా తెగ జాతి వాళ్ల హక్కులు మరియు భూములు సంరక్షణకు పోరాడే సర్వైవల్ ఇంటర్నేషనల్ సంస్థని తీవ్రంగా ఆదరిస్తున్నారు.[13] అక్టోబర్ 2009లో విడుదలైన వీ ఆర్ వన్: ఎ సెలెబ్రేషన్ ఆఫ్ ట్రైబల్ పీపెల్స్ అనే పుస్తకములో అతను కూడా కొంత భాగం రాశారు.[17] ఈ పుస్తకములో ప్రపంచ జనాల సంస్క్రుతులని గురించి, వాటి బిన్నత్వం మరియు వాటికి ఉన్న ప్రమాదాల గురించి రాయబడింది. ఆ పుస్తకములో వ్యాసాలు రాసిన వాళ్లలో లారన్స్ వాన్ డేర్ పోస్ట్, నోమ్ చోమ్స్కీ, క్లాడే లేవి-స్త్రాస్ వంటి పాశ్చాత్య రచయితలు మరియు డావి కోపెనావ యనోమమి, రాయ్ సేసన వంటి దేశవాళి రచయితలు ఉన్నారు. జుమ్మాలు భూమి పోగొట్టుకోవడము మరియు వాళ్ల మీద దౌర్జన్యం గురించి రిచర్డ్ గేర్ రాసారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఖండాలలో జరుగుతూ ఉన్న బాధాకరమైన విషయాలకు ఒక ఉదాహరణగా దానిని రాసారు. ఒక సాంతమైన సంస్కృతి మీద జరిగిన నేరము, అది ఎలాగ ప్రకృతితో మన సంబంధము మీద ప్రభావం చూపిస్తుందని మరియు జీవించి ఉండటానికి ఉన్న సామర్ధ్యం గురించి అయిన రాసారు.[18] ఈ పుస్తకము యొక్క అమ్మకమునుంది తనకు లబించే ప్రతిఫలాన్ని సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే ఒక దేశవాళి సంస్థకు ఇచ్చేస్తున్నారు.

USAID లో భాగంగా గేర్ ముంబై లోని USAID HIV / AIDS వారి "ఆపరేషన్ లైట్ హౌస్" పతాకాన్ని సందర్శించడం.

గేర్ భూగ్రుహ సమస్యలు, AIDS అవగాహన పెంచడాని కోసము ప్రచారం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, న్యాయం మరియు అవగాహన పెంచడానికోసం కృషి చేస్తున్న హీలింగ్ ది డివైడ్ అనే సంస్థ యొక్క పాలక మండలిలో అయిన ప్రస్తుతం సభ్యుడిగా ఉంటున్నారు.[19] భారతదేశంలో AIDS తో బాధపడుతున్న మహిళలు మరియు పిల్లలు కోసం AIDS కేర్ హోమ అనే ఒక నివాస వసతిగృహాన్ని స్థాపించడానికి అయిన సహాయం చేసారు. భారతదేశంలో అనేక మానవతా కార్యక్రమాలని చేపడ్డటానికి 1999లో అయిన గేర్ ఫౌండేషన్ ట్రస్ట్ అనే ఒక సంస్థని స్థాపించారు.[20]

ఏప్రిల్ 15, 2007లో ఇండియా లోని జైపూర్ లో అయిన ఒక AIDS అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ట్రక్ డ్రైవర్లలో కండోం వాడకాన్ని ప్రోత్సాహించడానికోసం ఏర్పాటు చేసిన ఒక లైవ్ విలేకరి సమావేశములో, అయిన బాలివుడ్ తార శిల్పా శెట్టి ని కౌగలించుకొని, వంచి, అనేక సార్లు బుగ్గలో ముద్దు పెట్టారు.[21] దానికోసమని, ఒక స్థానిక న్యాయస్థానం "బహిరంగ అశ్లీల" చట్టాన్ని ఉల్లంగించారని గేర్ మరియు శెట్టి లని అదుపులో తీసుకోవాలని ఆదేశించింది. వెంటనే దేశమునుండి పారిపోయిన గేర్, ఈ వివాదం "కటినమైన వైకరి కలిగి ఉన్న ఒక చిన్న రాజకీయ పక్షము వల్ల సృష్టించబడింది" అని చెప్పారు. దాదాపు ఒక నెల తరువాత, భారత దేశము యొక్క ప్రధాన న్యాయమూర్తి KG బాలకృష్ణన్ నేత్రుత్వం వహించిన ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాశనం ఈ కేసుని "అర్ధంలేనిదని" చెప్పి, ఇటువంటి ఫిర్యాదుల (ప్రసిద్ది చెందిన వాళ్ల మీద) "చోకబారి ప్రచారం" కోసమే చేబడ్డాయని ఇవి దేశానికి చెడ్డ పేరు తెస్తాయని వ్యాక్యానించింది. "రిచర్డ్ గేర్ దేశములో స్వేచ్చగా అడుగు పెట్టొచ్చని" తీర్పు ఇచ్చారు.[22] తరువాత ఈ వివాదానికి తెర బడింది."[22]

జూన్ 2008లో గేర్ యురోప్ మార్కెట్ ని ఉద్దేశించి తీయబడిన ఒక ఫియట్ వ్యాపార ప్రకటనలో, ఒక కొత్త లంశియా డెల్టాని హాలివుడ్ నుండి తిబెత్ వరకు నడుపుతున్నట్టు నటించారు. "కొత్త లంశియా డెల్టా: వేరుగా ఉండటానికి కావాల్సిన శక్తి" అనే వాఖ్యంతో ఈ ప్రకటన ముగిసింది. ఈ ప్రకటన గురించి చైనా వార్తాపత్రికలలో రాయడింది. ఫియట్ చైనా కు క్షమాపణ చెప్పింది.[23] అయితే ఫియట్ ఈ ప్రకటన వివాదాన్ని శ్రుష్టిస్తుదని ముందుగానే ఊహించిందని జాన్ టాన్టిల్లో అనే బ్రాండింగ్ నిపుణుడు చెప్పారు. ఈ వివాదం వల్ల పత్రికలలో రాసినప్పుడు లబించే ప్రచారం నుండి లాభం పొందాలని ఫియట్ అనుకుంది అని చెప్పి, ఇది ఒక అడ్ పబ్లిటైజింగ్ అని చెప్పారు.[24]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

పవర్1994 2004

సంవత్సరం చిత్రం Role గమనికలు
1977 లూకింగ్ ఫర్ Mr. గడ్బార్ టోనీ లో పోర్టో
1978 బ్లడ్ బ్రదర్స్ థామస్ స్టోనీ డి కోకో
డేస్ ఆఫ్ హెవన్ బిల్ ఉత్తమ విదేశీ నటుడు అనే డేవిడ్ డి డోనటేల్లో పురస్కారం
1979 యంక్స్ మాట్ డైసన్
1980 అమెరికన్ గిగోలో జూలియన్ కే
1982 యాన్ ఆఫీసర్ అండ్ ఎ జెంటేల్మాన్ జాక్ మాయో

అభ్యర్థిత్వం – ఉత్తమ నటునికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు – చలన చిత్ర నాటకం

1983 ది హానరరి కాన్సుల్ Dr. ఎడ్వర్డో ప్లార్
బ్రేత్లేస్ జెస్సీ లుజాక్
1984 ది కాటన్ క్లబ్ డిక్షే ద్వఎర్
1985 కింగ్ డేవిడ్ డేవిడ్
1986 నో మెర్సి ఎడ్డీ జిల్లెట్
పీట్ St. జాన్
1988 మెయిల్స్ ఫ్రం హోం ఫ్రాంక్ రాబర్ట్స్, Jr.
1990 ప్రెట్టి ఉమన్ ఎడ్వర్డ్ లూయిస్

ప్రతిబాధించబడ్డారు — ఉత్తమ నటికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు – సంగీత ప్రధాన లేదా హాస్యరస చలన చిత్రం

ఇంటర్నల్ అఫెర్స్ డెన్నిస్ పెక్
1991 రాప్సోడి ఇన్ ఆగస్ట్ క్లార్క్
1992 ఫైనల్ అనాలిసిస్ Dr. ఇసక్ బార్
1993 Mr. జోన్స్ Mr. జోన్స్
సోమ్మేర్సబై జాన్ రాబర్ట్ 'జాక్' సోమ్మేర్సబై
అండ్ ది బ్యాండ్ ప్లేడ్ ఆన్ ది కొరియోగ్రాఫర్ ప్రతిబాడించబడ్డారు - ఒక చిత్రంలో లేదా చిన్న సిరీస్ లో సహాయ నటుడుకు కేబెల్ ఏస్ పురస్కారం
ప్రతిబాడించబడ్డారు - ఒక చిత్రంలో లేదా చిన్న సిరీస్ లో ఉత్తమ సహాయ నటుడుకు ఎమ్మే పురస్కారం
ఇంటర్ సెక్షన్ విన్సెంట్ ఈస్ట్మాన్
1995 ఫస్ట్ నైట్ లాన్స్ లాట్
1996 ప్రిమల్ ఫియర్ మార్టిన్ వైల్
1997 ది జాకాల్ డెక్లాన్ జోసఫ్ ముల్క్వీన్ నేషనల్ బోర్డ్ ఆఫ్ రేవియు ఫ్రీడం ఆఫ్ ఎక్ష్ప్రెశన్ అవార్డ్
రెడ్ కార్నర్ జాక్ మూర్
1999 రన్అవే బ్రిడ్ ఇక్ గ్రహం
2000 Dr. T & ది ఉమెన్ Dr. T

ప్రతిబాధించబడ్డారు — ఉత్తమ నటికి శాటిలైట్ అవార్డు - సంగీత ప్రధాన లేదా హాస్యరస చలన చిత్రం

ఆటం ఇన్ న్యు యార్క్ విల్ కీన్
2002 షికాగో బిల్లీ ఫ్లిన్ ఉత్తమ తారాగణానికి బ్రాడ్‌కాస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ఉత్తమ నటికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు – సంగీత ప్రధాన లేదా హాస్యరస చలన చిత్రం
చలన చిత్రంలో విశిష్టమైన ప్రదర్శన కనబరిచిన తారాగణానికి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్
ప్రతిపాదించబడ్డారు – ఉత్తమ నటీనటులకు ఫీనిక్స్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డు
ప్రతిపాదించబడింది– ప్రధాన పాత్రలో విశిష్టమైన ప్రదర్శన కనబరిచిన పురుష నటుడికి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు
అన్ఫైత్ఫుల్ ఎడ్వర్డ్ సంనర్
ది మోత్మన్ ప్రోఫేసీస్ జాన్ క్లీన్
షెల్ వి డాన్స్ జాన్ క్లార్క్
2005 బీ సీసన్ సాల్ నౌమాన్
2007 ది హాక్స్ క్లిఫ్ఫార్డ్ ఇర్వింగ్

ప్రతిపాదించబడ్డారు — ఉత్తమ నటికి శాటిలైట్ అవార్డు - సంగీత ప్రధాన లేదా హాస్యరస చలన చిత్రం

ది హన్టింగ్ పార్టి సైమన్
అయం నాట్ దేర్ బిల్లీ ది కిడ్ లాగ బాబ్ డైలాన్ ఇందేపెందేంట్ స్పిరిట్ రాబర్ట్ అల్ట్ మాన్ అవార్డ్
ది ఫ్లాక్ అజేంట్ ఏర్రోల్ బాబ్బెజ్
2008 నైట్స్ ఇన్ రోడాంత్ Dr. పాల్ ఫ్లానేర్
2009 అమేలియా జార్జ్ పుట్నాం
Hachiko: A Dog's Story పార్కర్ విల్సన్

నిర్మాణాంతరం

2010 బ్రూక్లిన్స్ ఫైనస్ట్ ఎడ్డీ దుగన్

నిర్మాణాంతరం

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 Roberts, Gary Boyd. ""The New England Ancestry of Actor Richard (Tiffany) Gere"". New England Historic Genealogical Society. సంగ్రహించిన తేదీ 2007-01-12. 
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 ఇన్సైడ్ ది యచ్తర్స్ స్టూడియో , 2002 గురించిన ఒక బేటి లో చెప్పారు
 3. "రిచర్డ్ గేర్ బయోగ్రాఫి", కేరి లాటిమోర్, ది బయోగ్రఫీ చానల్ . మే 1, 2008 నాడు తీయబడింది.
 4. "An Officer and a Gentleman". Box Office Mojo. సంగ్రహించిన తేదీ 2009-05-04. 
 5. 5.0 5.1 "Richard Gere". Box Office Mojo. సంగ్రహించిన తేదీ 2009-05-04. 
 6. "Richard Gere". Rotten Tomatoes. సంగ్రహించిన తేదీ 2009-05-04. 
 7. "Shall We Dance". Box Office Mojo. సంగ్రహించిన తేదీ 2009-05-04. 
 8. "Bee Season". Box Office Mojo. సంగ్రహించిన తేదీ 2009-05-04. 
 9. "Nights in Rodanthe (2008)". Rotten Tomatoes. సంగ్రహించిన తేదీ 2009-05-04. 
 10. "Turkeys! The 100 Worst Movies of 2008". The London Times. 2008-12-08. సంగ్రహించిన తేదీ 2009-05-04. 
 11. "Nights in Rodanthe". Box Office Mojo. సంగ్రహించిన తేదీ 2009-05-04. 
 12. BBC NEWS | ఇన్ డెప్త్ | న్యూస్మేకర్స్ | రిచర్డ్ గేర్: ఆన్ గార్డ్
 13. 13.0 13.1 "రిచర్డ్ గేర్ బయోగ్రాఫి", కేరి లాటిమోర్, ది బయోగ్రఫీ చానల్ . May 12, 2007 నాడు తీయబడింది.
 14. మీ ప్రియమైన ప్రసిద్ధ వ్యక్తుల గురించిన ఒక లోతైన చూపు - hellomagazine.com, HELLO!
 15. రిచర్డ్ గేర్: ముసుగుల మనిషి
 16. రిచర్డ్ గేర్ తిబెత్ కు అనుకూలమైన ఒక లాంశియ TV వ్యాపార ప్రకటనలో నటించారు
 17. సర్వైవల్ ఇంటర్ నేషనల్ - వీ ఆర్ వన్
 18. Eede, Joanna (2009). We are One: A Celebration of Tribal Peoples. Quadrille Publishing. ISBN 1844007294. 
 19. హీలింగ్ ది డివైడ్
 20. ది గేర్ ఫౌండేషన్. May 12, 2007 నాడు తీయబడినతి.
 21. యు ట్యూబ్ - రిచర్డ్ గేర్ శిల్పా శెట్టికి ముద్దు పెట్టడం
 22. 22.0 22.1 BBC NEWS | దక్షిణ ఆశియ | రిచర్డ్ గేర్ కు అశ్లీల ఆరోపణనుండి విముక్తి
 23. "రిచర్డ్ గేర్ వ్యాపార ప్రకటన గురించి ఫియట్ చైనా కు క్షమాపణ చెప్పడం " ఆటో బ్లాగ్. జూన్ 20, 2008.
 24. "ప్రమాదకరమైన మరియు కొత్త ప్రపంచవ్యాప్త బ్రాండింగ్ ప్రపంచంలో రిచర్డ్ గేర్ యొక్క ఫియట్ ప్రకటన కేవలం ఒక కొత్త మలుపు" మార్కెటింగ్ డాక్టర్ బ్లాగ్. జూన్ 25, 2008.

వేలుపరి వలయాలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.