రినైటిస్
| ICD-10 | J00., J30., J31.0 |
|---|---|
| ICD-9 | 472.0, 477 |
| OMIM | 607154 |
| DiseasesDB | 26380 |
| MedlinePlus | 000813 |
| eMedicine | ent/194 med/104, ped/2560 |
| MeSH | D012220 |
రినైటిస్(pronounced /raɪˈnaɪtɪs/) అనేది ముక్కు లోపలి భాగాల్లో సలపరం, మంట కలిగించే లక్షణాలను వర్ణించే పదం. దీన్ని సాధారణంగా స్టఫీ నోస్ అని కూడా అంటారు. ముక్కు కారడం రినైటిస్ తాలూకు ప్రాథమిక లక్షణం. ఇది వైరస్, బ్యాక్టీరియా, లేదా ఇరిటాన్త్స్ వంటి వాటి కారణంగా ముక్కులోని శ్లేష్మం మెంబ్రేన్ తాలూకు దీర్ఘకాలపు, తీవ్రమైన మంట వల్ల వస్తుంది. మితిమీరిన శ్లేష్మం ఉత్పత్తి వల్ల మంట వస్తుంది. ఈ మంట కారణంగా సాధారణంగా పైన చెప్పుకున్న మితిమీరిన శ్లేష్మపు జలుబుకు దారి తీస్తుంది. దాంతోపాటే ముక్కు దిబ్బడ, ముక్కు కారిన అనంతరం ఉండే సమస్యలు తలెత్తుతాయి. ఇటీవల అమెరికాలో పూర్తి చేసిన పలు అధ్యయనాల ప్రకారం ఒక్క అమెరికాలోనే ఏకంగా 5 కోట్ల మంది ప్రస్తుతం రినైటిస్‌తో బాధపడుతున్నారు.[clarification needed] రినైటిస్ కేవలం ముక్కును మాత్రమే కాకుండా గొంతు, కళ్లను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తేలింది. నిద్రకు సంబంధించిన సమస్యలు, చెవుల స్థితిగతులు, అభ్యసన సమస్యలతో రినైటిస్‌కు సంబంధముందని చెబుతారు.[1] హిస్టమైన్ల పెరుగుదల రినైటిస్‌కు దారితీస్తుంది. చాలా సాధారణంగా వాయు సంబంధిత అలెర్జెన్‌లు ఇందుకు కారణమవుతాయి. ఈ అలెర్జెన్‌లు బాధితుని ముక్కు, గొంతు, లేదా కళ్లను ఇబ్బంది పెడతాయి. ఆయా ప్రాంతాల్లో స్రావాల పరిమాణాన్ని బాగా పెంచుతాయి.
విషయ సూచిక |
రకాలు [మార్చు]
రినైటిస్‌ను మూడు రకాలుగా వర్గీకరిస్తారు: (1) అందరికీ వ్యాపించే (ఇన్ఫెక్టివ్) రినైటిస్. ఇది తీవ్రమైన, దీర్ఘకాలిక బ్యాక్టీరియా సంబంధిత ఇన్ఫెక్షన్లతో కూడి ఉంటుంది. (2) నాన్ అలెర్జిక్ (వాసోమోటార్) రినైటిస్. ఇందులో ఆటోనామిక్, హార్మోనల్, డ్రగ్ ఇండ్యూస్ట్, అట్రోపిక్, గస్టటరీ రినైటిస్, రినైటిస్ మెడికామెంటోసా ఉంటాయి. (3) అరెల్జిక్ రినైటిస్. పొలెన్, మోల్డ్, జంతువుల ధూళి, దుమ్ము వంటి లోనికి పీల్చుకునే అలెర్జెన్‌ల వల్ల ఇది వస్తుంది.[2]
అంటు వ్యాధి (వ్యాపించే స్వభావమున్న) [మార్చు]
రినైటిస్ సాధారణంగా వైరల్, లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల సోకుతుంది. సాధారణ జలుబు కూడా ఇందుకు కారణమవుతుంది. ఈ జలుబు రైనోవైరస్‌లు, కరోనా వైరస్‌లు, లేదా బ్యాక్టీరియల్ సినుసైటిస్ వంటివాటి వల్ల వస్తుంది. రైనోరియా, గొంతు వాపు (పారింగిటిస్), దగ్గు, ముక్కు దిబ్బడ, కాస్త తలనొప్పి వంటివి సాధారణ జలుబు లక్షణాలు.
వోసోమోటార్ రినైటిస్ [మార్చు]
నాన్ అలెర్జిక్ రినైటిస్ ముక్కు కారడాన్ని సూచిస్తుంది. ఇది అలర్జీ వల్ల వచ్చేది కాదు. అలర్జీకి సబంధం లేని రినైటిస్‌ను నాన్ ఇన్‌ఫ్లమేటరీ, లేదా ఇన్‌ఫ్లమేటరీ రినైటిస్‌గా విభజించవచ్చు. నాన్ ఇన్‌ఫ్లమేటరీ, నాన్ అలెర్జిక్ రినైటిస్‌లలో చాలా సాధారణంగా కన్పించే రకాన్ని కొన్నిసార్లు వాసోమోటార్ రినైటిస్[3] అనే అలర్జీగా పొరబడుతుంటారు. ఇందులో వాసనలు, విష వాయువులు, పొగ, దుమ్ము, ఉష్ణోగ్రతలో మార్పుల వంటి నాన్ అలెర్జిక్ ట్రిగ్గర్లు రినైటిస్‌కు దారి తీస్తాయి. ఈ రినైటిస్ గురించి తెలియాల్సింది ఇంకా చాలా ఉంది. కానీ ఈ నాన్ అలెర్జిక్ ట్రిగ్గర్లు ముక్కు గోడల్లో రక్త కణాల విస్తరణకు కారణమవుతాయని, అది వాపుకు, జలుబు వంటివాటికి దారి తీస్తుందని భావిస్తున్నారు. వాసోమోటార్ రినైటిస్ అలెర్జిక్ రినైటిస్‌తో పాటుగా కూడా రావచ్చు. అలాంటప్పుడు దాన్ని మిశ్రమ రినైటిస్‌గా పిలుస్తారు. (మిడిల్టన్ అలెర్జీ ప్రిన్సిపుల్స్ అండ్ ప్రాక్టీస్, ఏడో ముద్రణ). వాసోమోటార్ రినైటిస్ విజ్ఞాన శాస్త్రం (పాథాలజీ) న్యూరోజనిక్ ఇన్‌ఫ్లమేషన్ పీఎంఐడీ 18651116తో కూడుకుని ఉన్నట్టుగా కన్పిస్తుంది. మనిషి దీన్నింకా పూర్తిస్థాయిలో అర్థం చేసుకోలేదు. దీనిపై మరింత పరిశోధనలు జరగాల్సి ఉంది. వాసోమోటార్ రినైటిస్ పురుషుల కంటే మహిళల్లో మరింత ఎక్కువగా కన్పిస్తున్నట్టు తోస్తుంది. ఇందులో హార్మోన్ల పాత్ర ఉందని కొందరు పరిశోధకుల నమ్మకం. సాధారణంగా 20 ఏళ్లు దాటిన వారిలో ఇది ఎక్కువగా కన్పిస్తుంది. ఏ వయసులోనైనా దాడి చేసే అలెర్జిక్ రినైటిస్‌కు ఇది విరుద్ధం. వాసోమోటార్ రినైటిస్ బాధితుల్లో ఏడాది పొడవునా వ్యాధి లక్షణాలు కన్పిస్తుంటాయి. అయితే వాతావరణ మార్పులు శరవేగంగా చోటుచేసుకునే వసంత, శరదృతువుల్లో ఇవి మరీ పెరిగిపోతాయి.[4] యునైటెడ్ స్టేట్స్ లోనే దాదాపుగా 1.7 కోట్ల మంది పౌరులు వాసోమోటార్ రినైటిస్ బారిన పడ్డట్టు అంచనా. ఈ అలెర్జిక్, మిశ్రమ, వాసోమోటార్ రినైటిస్ వ్యాధులపై యాంటీహిస్టమైన్ అజెలస్టైన్ సమర్థంగా పని చేస్తుందని తేలింది.[5] ముక్కులోకి స్ప్రే రూపంలో తీసుకునే ఫూస్టికాసోన్ ప్రొపియోనేట్‌ను కూడా ఈ వ్యాధి లక్షణాలను తగ్గించే చికిత్సలో విరివిగా వాడతారు.
అలెర్జిక్ [మార్చు]
రోగ నిరోధక శక్తి అంతంతమాత్రంగా ఉన్న బాధితుడు పోలెన్, లేదా దుమ్ము వంటి అలెర్జెన్‌ను లోనికి పీల్చుకున్నప్పుడు అలెర్జిక్ రినైటిస్, లేదా హే ఫీవర్ వస్తుంది. ఇది ఒంట్లో యాంటీబాడీల ఉత్పత్తిని పెంచేస్తుంది. ఈ యాంటీబాడీలు చాలావరకు హిస్టమైన్లుండే మాస్ట్ కణాలతో బంధం ఏర్పరచుకుంటాయి. పొలెన్, దుమ్ము, హిస్టమైన్ (ఇతర రసాయనాల) ద్వారా ప్రభావిమైనప్పుడు ఈ మాస్ట్ కణాలు విడుదలవుతాయి. ఇది దురద, వాపు, శ్లేష్మం ఉత్పత్తి వంటివాటికి దారితీస్తుంది. ఈ లక్షణాల తీవ్రత వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంటుంది. బాగా సున్నితంగా ఉండే వ్యక్తుల్లో హైవ్స్, దురద వంటివి కన్పించవచ్చు. కలుషిత గాలిలో ఉండే క్లోరిన్, డిటర్జెంట్ల వంటి రసాయనాలు సాధారణ పరిస్థితుల్లోనైతే ఏమీ చేయవు. కానీ ఇలాంటప్పుడు మాత్రం పరిస్థితిని అవే చాలా తీవ్రతరం చేస్తాయి.
కంటి పై పొర ఉబ్బడం, చర్మం కందడం, ఎర్రబారడం, కనురెప్పలు ఉబ్బడం, దిగువ కనురెప్పలోని రకతనాళాలు నిశ్చలమవడం, ముక్కు దిగువ భాగంలో ముడతలు, ముక్కు టర్బినేట్స్‌లో వాపు, చెవుల్లో నిశ్చలత వంటివి అలెర్జిక్ రినైటిస్ ఉండే వ్యక్తుల్లో సాధారణంగా కన్పించే శారీరక లక్షణాల్లో కొన్ని.[6]
రినైటిస్ మెడికమెంటోసా [మార్చు]
సమయోచితమైన (టోపికల్) ఉపశమనకారులను (డీకంజెస్టాంట్స్) ఎక్కువగా వాడటం వల్ల ముక్కు ప్రాంతంలో ఏర్పడే రీ బున్ద్ ముక్కు దిబ్బడే రినైటిస్ మెడికమెంటోసా. (ఉదాహరణకు ఆక్జీమెటాజలైన్, పెనీలెప్రైన్, గ్జైలోమెటాజలైన్, నాపాజలైన్ వంటి ముక్కు స్ప్రేల వాడకం). ఇవన్నీ ముక్కు చివర్లలోని రక్తనాళాలను అణగ్గొడతాయి.
అట్రోఫిక్ రినైటిస్ [మార్చు]
ముకస్ మెంబ్రేన్, గ్రంథుల్లో క్షీణత రూపంలో వచ్చే దీర్ఘకాలిక రినైటిస్
రినైటిస్ సిక్కా [మార్చు]
ముకస్ మెంబ్రేన్ దీర్ఘకాలికంగా పొడిబారడం
హైపర్‌ట్రోఫిక్ రినైటిస్ [మార్చు]
ముకస్ మెంబ్రేన్ శాశ్వతంగా చిక్కబడటంతో పాటుగా ఉండే దీర్ఘకాలిక రినైటిస్
పాలీపొయస్ రినైటిస్ [మార్చు]
ముక్కు కుహరంలోని పాలిప్స్‌కు సంబంధమున్న దీర్ఘకాలిక రినైటిస్
నిర్వహణ [మార్చు]
రినైటిస్ చికిత్స నిర్వహణ కింది కారణాలపై ఆధారపడి ఉంటుంది.
సూచనలు [మార్చు]
- ↑ "Rhinitis and quality of life".
- ↑ అలెర్జిక్
- ↑ http://www.nlm.nih.gov/medlineplus/ency/article/001648.htm వాసోమోటార్ రినైటిస్ మేడిలైన్ ప్లస్
- ↑ Patricia W. Wheeler, M.D. and Stephen F. Wheeler, M.D. ""Vasomotor Rhinitis" American Family Physician". Retrieved 2009-03-10.
- ↑ Bernstein JA (October 2007). "Azelastine hydrochloride: a review of pharmacology, pharmacokinetics, clinical efficacy and tolerability". Curr Med Res Opin 23 (10): 2441–52. DOI:10.1185/030079907X226302. PMID 17723160.
- ↑ వాలెట్ ఆర్‌ఎస్.ఫారెన్‌హోల్జ్ జేఎం. అలెర్జిక్ రినైటిస్: అప్‌డేట్ ఆన్ డయాగ్నసిస్. సలహాదారు 2009;49:610-613
బాహ్య లింకులు [మార్చు]
- రినైటిస్ ఎట్ సెంటర్స్ ఫర్ క్రానిక్ నాజల్ అండ్ సినస్ డిస్ఫంక్షన్
- సైనస్ ఇన్ఫెక్షన్ అండ్ అలెర్జిక్ రినైటిస్
- స్పెషలిస్ట్ లైబ్రరీ ఫర్ ఈఎన్టీ అండ్ ఆడియాలజీ హే ఫీవర్ రీసోర్సెస్ _ ఆన్లైన్ లైబ్రరీ ఆఫ్ హై క్వాలిటీ రీసెర్చ్ ఆన్ హే ఫీవర్ అండ్ అదర్ ఈఎన్టీ డిజార్డర్స్
- డైలీ పోలెన్ కౌంట్ ఇన్ ద యూఎస్ఏ
- ఇన్ఫర్మేషన్ ఆన్ హే ఫీవర్ అండ్ చిల్డ్రన్ ఫ్రమ్ సియాటెల్ చిల్డ్రన్స్ హాస్పిటల్
మూస:Inflammation మూస:Respiratory pathology మూస:Allergic conditions