రెండవ హరిహర రాయలు
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| విజయ నగర రాజులు |
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
రెండవ హరిహర రాయలు, మొదటి బుక్క రాయలు మరణానంతరము 1377లో సింహాసమునకు వచ్చాడు.
విషయ సూచిక |
సామంత రాజ్యాల పునరాధీనము చేసుకొనుట[మార్చు]
మొదటి బుక్క రాయలు కుమారుడైన కంప రాయలే ఈ పేరుతో రాజ్యమునకు అధిపతి అయినాడని ఓ అభిప్రాయము. ఇతను రాగానే చేసిన మొదటి పని, తన తండ్రి గారి కాలములో సామంతులుగా నియమితులైన అనేక రాజ బంధువులను స్వతంత్రులు కావాలెననెడి అభిలాషనుండి మరల్చి, వారిని తొలగించి, తన పుత్రులను నియమించినాడు. ఉదయగిరి కి దేవ రాయలును, మధుర ప్రాంతములకు విరూపాక్ష రాయలును అధికారులుగా నియమించినాడు.
బిరుదులు[మార్చు]
యుద్దములు[మార్చు]
మొదటి తరం విజయనగర రాజులకు బహుమనీ సుల్తానులతో యుద్దాలు తప్పలేదు. రెండవ తరం రాజులకు గజపతులతోనూ, నాలుగు బహుమనీ సుల్తాను శాఖలతోనూ యుద్దాలు తప్పలేదు. 1378 నందు బహుమనీ సుల్తాను ముజాహిద్ షా దారుణంగా హత్యచేయబడినాడు. బహుమనీ రాజ్యం అంతఃకలహాలకు ఆలవాలమయినది. 1378 నందే రెండవ మహమ్మద్ షా సింహాసనము అధిస్టించినాడు. ఇతను శాంతిశీలుడు. ఈ కాలములో దక్షిణభారతదేశములందు పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి. కొండవీడు రెడ్డిరాజ్యమున పెదకోమటి వేమారెడ్డి, కుమార గిరి రెడ్డి, కాటయవేమా రెడ్డి ల మధ్య తరచూ యుద్దములు జరుగుతుండేవి. ఇదే సమయములో రేచర్ల పద్మనాయకులు బహుమనీ సుల్తానులతో స్నేహం చేసుకొని విజయనగర, కొండవీడు రాజ్యములను ఆక్రమించాలని పథకం రూపొందించినారు. ఇటువంటి పరిస్థితులలో రెండవ హరిహర రాయలు కొండవీడు రాజ్యమందున్న శ్రీశైలం ప్రాంతమును ఆక్రమించినారు. కానీ కాటయవేమా రెడ్డి విజయనగర సేనలను ఎదుర్కొని ఓడించినాడు. హరిహర రాయలు కాటయవేమునితో సంధిచేసుకొని అతని కొడుకు కాటయకూ తన కూతురు లక్ష్మి కి వివాహం జరిపించినాడు.
మోటుపల్లి యుద్దం[మార్చు]
హరి హర రాయలు కుమారుడైన దేవ రాయలు ఉదయగిరి అధిపతి . ఆతడు సైన్యముతో మోటుపల్లి రేవును ఆక్రమించినాడు. తరువాత కొండవీడు రాజ్యముపైకి హరిహర రాయలు చౌండసేనాని ని పంపించినాడు. ఇదే సమయంలో కొండవీడును కుమారగిరి రెడ్డి నుండి స్వాధీనము చేసుకున్న పెదకోటి వేమా రెడ్డి విజయనగర సైనికులను కొండవీడు భూబాగాలనుండి తరిమివేశాడు.
పద్మనాయకులతో యుద్దములు[మార్చు]
మొదటి దండయాత్ర[మార్చు]
హరిహర రాయలు పద్మనాయకులపైకి తన పెద్ద కుమారుడూ, యువరాజు అయిన రెండవ బుక్కరాయలును పంపించినాడు, ఈ యుద్దములో సాళువ రామదేవుడు అను యోధుడు చాలా ప్రముఖ పాత్ర వహించినాడు. ఈ దండయాత్రను ఎదుర్కోవడంలో పద్మనాయక ప్రభువులకు బహుమనీ సుల్తానులు సహాయం చేసినారు. కొత్తకొండ ప్రాంతమున జరిగిన పోరాటంలో సాళువ రామదేవుడు ప్రాణాలకు తెగించి పోరాడి, చివరకు తన ప్రాణాలు అర్పించినాడు. రెండవ బుక్క రాయలు ఓటమిభారంతో విజయనగరం తిరిగి వచ్చినాడు.
రెండవ దండయాత్ర[మార్చు]
1397లో మరలా రెండవ హరిహర రాయలు, గండదండాధీశుడు వంటి అనేక వీరులను, పెద్ద సైన్యమును, తోడుగా ఇచ్చి యువరాజు రెండవ బుక్క రాయలును మరల పద్మనాయకులు పైకి దండయాత్రకు పంపించినాడు. ఇదే సమయలో [[దేవరాయలు] మరికొంత సైన్యముతో అలంపురం పైకి దండెత్తినాడు. ఈ దండయాత్రలను పద్మనాయకులు, బహుమనీల సహయంతో ఎదుర్కోవాలని చూసినారు, కానీ విజయనగర రాజ సైనికులు కృష్ణా నది ఉత్తరభాగమున ఉన్న పానుగల్లు కోటను ముట్టడించి వశము చేసుకున్నారు, అలాగే చౌల్ దాలోల్ ప్రాంతమును విజయనగర సైనికులు సాధించినారు.
సింహళ దేశ విజయ యాత్ర[మార్చు]
విరూపాక్ష రాయలు గొప్ప నావికా సైన్యమును అభివృద్దిచేసి సింహళ ద్వీపముపైకి దండయాత్రచేసి విజయం సాధించి సింహళ రాజునుండి కప్పమును తీసుకోని వచ్చినాడు. ఈ విజయము చాలా ముఖ్యమైనది. ఎందుకంటే భారత దేశ చరిత్రలో ఓ అపవాదు ఉన్నది, కేవలము బ్రిటీషువారికి మాత్రమే నావికాదళము కలదు అని. కానీ దానికంటే ఎంతో ముందే భారతదేశ ప్రభువులు చక్కని నావికాదళమును రూపొందించినారు.
కొండవీడు యుద్దాలు[మార్చు]
పైన చెప్పుకున్నటుల కొండవీడు విషయములలోనూ, వారి అంతఃకలహాలలోనూ విజయనగరరాజులు జోక్యము చేసుకున్నారు. కొన్ని ప్రాంతములు ఆక్రమించ ప్రయత్నించినారు. చివరకు కాటయ వేమా రెడ్డి వీరికి సహాయము చేసినాడు.
కరువు[మార్చు]
ఈ రాజు పరిపాలనా కలమున దేశమునందు గొప్ప కరువు ఏర్పడినట్లు తెలుస్తున్నది
గురువు[మార్చు]
వీరికి కూడా విద్యారణ స్వామివారే గురువుగా ఉన్నారు. అంతే కాకుండా వీరే మంత్రిగా ఉన్నారు కూడా!
ఇతని వారసుడు[మార్చు]
నియమాల ప్రాకారం ఇతని పెద్ద కుమారుడైన రెండవ బుక్క రాయలు ఇతని తరువాత రాజు కావలెను, కానీ అప్పటికే గొప్ప సైన్యము కలవాడూ, సింహళమును జయించినవాడు అయిన విరూపాక్ష రాయలు సింహాసనము బలవంతముగా ఎక్కి, ఒక సంవత్సరము పాలించినాడు, కానీ రెండవ బుక్క రాయలు తన విధేయులతోనూ, సామంతులతోనూ వచ్చి సింహాసనం స్వాధీనం చేసుకున్నాడు, కానీ ఇతను కూడా సంవత్సరమే పాలించినాడు. తరువాత దేవరాయలు ఉదయగిరి దుర్గము నుండి సైన్యముతో వచ్చి సింహాసనం అధిష్టించి, 16 సంవత్సరములు మరణము వరకూ విజయవంతమైన పరిపాలన చేసినాడు
| ఇంతకు ముందు ఉన్నవారు: మొదటి బుక్క రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1377 — 1404 |
తరువాత వచ్చినవారు: విరూపాక్ష రాయలు |