రేఖాచిత్రం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
లియొనార్డో డావిన్సి యొక్క రేఖాచిత్రం

రేఖాచిత్రం (ఆంగ్లం:Drawing) అనునది వివిధ రకాల చిత్రకళకి సంబంధించిన పరికరాలని ఉపయోగించి ద్విపరిమాణపు మాధ్యమం (two dimensional medium) పై చిత్రాన్ని ఏర్పరచే ఒక దృశ్య కళ. గ్రాఫైట్ పెన్సిళ్ళు, కలం మరియు సిరా, కుంచెలు, మైనపు పెన్సిళ్ళు, రంగు పెన్సిళ్ళు, కాల్చిన బొగ్గు, ఇరేజర్లు, మార్కర్లు, స్టైలస్ లు, సిల్వర్ పాయింట్ వంటి ప్రత్యేక లోహాలు వంటి పరికరాలని రేఖాచిత్రాలకి ఉపయోగించటం జరుగుతుంది. రేఖాచిత్రాలని చిత్రీకరించే కళాకారులని ఆంగ్లంలో డ్రాఫ్ట్స్ మెన్ (Draftsman) గా వ్యవహరిస్తారు.

ఒక ఉపరితలం పై కావలసినంత పదార్థాన్ని విడుదల చేయటం వలన ఆ ఉపరితలంపై కంటికి కనబడేలా గుర్తు ఏర్పడుతుంది. ఉపరితలాలుగా అట్ట, ప్లాస్టిక్, తోలు, వస్త్రం, రాత బల్ల లు చిత్రలేఖనానికి విరివిగా ఉపయోగించిననూ, కాగితమే చిత్రలేఖనానికి ప్రధానాధారంగా వ్యవహరించినది. మొత్తం మానవ చరిత్రలో రేఖాచిత్ర మాధ్యమం ప్రముఖ మరియు ప్రాథమిక ప్రజాభిప్రాయాన్ని వెలిబుచ్చటానికి ఉపయోగపడినది. ఆలోచనలను, ఉద్దేశ్యాలను, భావాలను వ్యక్తీకరించటానికి రేఖాచిత్రం అత్యంత సరళమైన మరియు సమర్థవంతమైన సాధనంగా ఉపయోగపడినది. కావలసిన పరికరాలు విరివిగా లభ్యమవటంతో రేఖాచిత్రకళ అతి సాధారణ కళల్లో ఒకటిగా అవతరించినది.

అవలోకనం[మార్చు]

రేఖాచిత్రకళ, దృశ్యకళలలో అతి ప్రాముఖ్యత పొందిన వ్యక్తీకరణ రూపం. అనేక గీతలతో బాటు గా వివిధ తీవ్రతలు గల ఛాయలతో కంటికి కనబడే ప్రపంచాన్ని ఒక ఉపరితలంపై ప్రతిబింబజేస్తుంది. సాంప్రదాయిక రేఖాచిత్రకళ ఏకవర్ణంలో గానీ, లేదా చాలా తక్కువగా బహువర్ణాలలో గానీ ఉండగా, ఆధునిక రేఖాచిత్రకళ చిత్రకళకి ధీటుగానో లేక రెంటికీ ఉన్న సరిహద్దులని చెరిపేసే విధంగానో ఉన్నది. పాశ్చాత్య పరిభాషలో రేఖాచిత్రకళకీ, చిత్రకళకీ దాదాపు ఒకే రకమైన పరికరాలు వినియోగించిననూ ఈ పదాల వాడుకలో తేడాలు కలవు. పాశ్చాత్య పరిభాష ప్రకారం, రంగులని అద్దకుండా కేవలం గీతలతో వేయబడే చిత్రాలని రేఖాచిత్రంగానూ, రేఖాచిత్రాలకి రంగులని అద్దటం చిత్రకళ గానూ వ్యవహరిస్తారు.

రేఖాచిత్రకళ అన్వేషణాత్మక, పరిశీలనాత్మక, సమస్యాపూరణం చేసే, కూర్పు గల ఒక కళ. రేఖాచిత్రాలు తరచుగా అస్పష్టంగా, చాలా అయోమయంగా ఉంటాయి. వీటిని కళాభ్యాసానికి వినియోగిస్తారు.

రేఖాచిత్రకళలో అనేక వర్గాలు కలవు. ఫిగర్ డ్రాయింగ్, కార్టూనింగ్, డూడ్లింగ్ మరియు షేడింగ్. రేఖాచిత్రకళలో లైన్ డ్రాయింగ్, స్టిప్లింగ్, షేడింగ్ మరియు ట్రేసింగ్ వంటి అనేక పద్ధతులు కూడా కలవు.

త్వరగా వేయబడిన, పూర్తి చేయబడని రేఖాచిత్రాన్ని స్కెచ్ (చిత్తు నమూనా) అని వ్యవహరిస్తారు.

కట్టడాలని నిర్మించే ముందు వాటి ప్రణాళికల సాంకేతిక రేఖాచిత్రాల ద్వారా చిత్రీకరిస్తారు.

చరిత్ర[మార్చు]

భావవ్యక్తీకరణ రూపాలుగా రేఖాచిత్రాలు లిఖితపూర్వక భావ వ్యక్తీకరణకంటే మునుపే రేఖాచిత్రాల ద్వారా భావ వ్యక్తీకరణ కలదు. కావున భావ వ్యక్తీకరణలో రేఖాచిత్రాలే ప్రాచీనమైనవి. మానవజాతికి వ్రాత తెలియక ముందు రేఖాచిత్రాల ద్వారా భావ వ్యక్తీకరణ ప్రత్యేకమైనదిగా గుర్తించబడినది. 30,000 సంవత్సరాల క్రితమే మానవుడు గుహలలోను మరియు రాతి పై రేఖాచిత్రాలని సృష్టించాడు. పిక్టోగ్రామ్స్ అనబడు ఈ రేఖాచిత్రాలు పలు వస్తువులను మరియు నైరూప్య భావాలను ప్రతిబింబింపజేశాయి. చరిత్రపూర్వ సమయానికి చెందిన ఈ చిత్తునమూనాలు మరియు చిత్రకళని శైలీకృతం మరియు సరళతరం చేయబడటంతోనే ఈ నాటి లిఖితపూర్వక భాషలు అవతరించాయి.

కళలలో రేఖాచిత్రాలు రేఖాచిత్రాలు సృజనాత్మకతకి అద్దం పడటం వలన కళాప్రపంచంలో ఇవి ప్రాముఖ్యతని సంతరించుకొన్నవి. చరిత్రలో అధికభాగం రేఖాచిత్రాలు కళాత్మక ఆచరణకి పునాదులుగా నిలిచాయి. కలపతో చేయబడ్డ పలకలను రేఖాచిత్రకారులు మొదట్లో వాడేవారు. 14వ శతాబ్దంలో కాగితం విరివిగా లభించటంతో దాని వాడకం పెరిగినది. ఈ కాలంలో రేఖాచిత్రాలు ఆలోచనలకి, దర్యాప్తులకి, నటనలో ఉపయోగించేవారు. రేఖాచిత్రాలు కళాత్మకంగా వర్థిల్లుతున్న కాలంలో జ్యామితి మరియు తత్త్వం యొక్క ప్రభావం అధికంగా కలిగిన, వాస్తవిక ప్రాతినిధ్యపు లక్షణాలని ప్రదర్శించే రినైసెన్స్ కళా ఉద్యమం ఉద్భవించినది.

ఫోటోగ్రఫి వినియోగం విస్తారం అవటంతో రేఖాచిత్రాల వాడుకలో మార్పు వచ్చినది.

కళల వెలుపల రేఖాచిత్రాలు రేఖాచిత్రాలు కళామాధ్యమంగా విస్తారంగా వాడబడిననూ, ఇవి కళలకి మాత్రమే పరిమితం కాలేదు. కాగితం విరివిగా లభ్యం కాని కాలమైన 12వ శతాబ్దంలో సాధువులు ఐరోపా ఖండంలో అతి క్లిష్టమైన రేఖాచిత్రాలు జంతువుల చర్మం నుండి తయారు చేయబడే తోలు పై చిత్రీకరించేవారు. విఙాన శాస్త్రంలో, వైఙానిక ఆవిష్కరణలకి, పలు విషయాలని అర్థమయ్యేలా వివరించటానికి ఉపయోగిస్తారు. 1616 లో ఖగోళ శాస్త్రవేత్త అయిన గెలీలియో గెలీలీ చంద్రుని యొక్క పరిమాణ క్రమాన్ని అర్థమయ్యేలా వివరించేందుకు రేఖాచిత్రాలనే వాడాడు. ఖండాల రూపాలని వివరించేందుకు భూగోళ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ వెజెనర్ 1924 లో రేఖాచిత్రాలని వాడాడు.

ప్రముఖ రేఖాచిత్రకారులు[మార్చు]

 • లియొనార్డో డావిన్సి
 • ఆల్బ్రెచ్ట్ డ్యూరర్
 • మైఖెలేంజిలో
 • రఫాయిల్
 • క్లౌడె లోరియన్
 • నికోలాస్ పౌసిన్
 • రెంబ్రాండ్ట్ హార్మెన్స్జూన్ వాన్ రిజ్న్
 • గ్యువర్సినో
 • పీటర్ పాల్ రూబెన్స్
 • జీన్-హోనోరె ఫ్రాగొనార్డ్
 • గియోవాన్ని బాట్టిస్టా టీపోలో
 • ఆంటోయ్నే వాట్టెయు
 • కేథె కోల్విట్జ్
 • మ్యాక్స్ బెక్మన్
 • జీన్ డుబుఫె
 • జార్జ్ గ్రోస్జ్
 • ఎగాన్ షీలే
 • ఆర్షీలే గోర్కే
 • పాల్ క్లీ
 • ఆస్కార్ కోకోష్కా
 • ఆల్ఫోన్సె మూచా
 • ఎం సీ ఎషర్
 • ఆండ్రీ మ్యాసన్
 • జూలిస్ పాసిన్
 • ప్యాబ్లో పికాసో

పరికరాలు[మార్చు]

సిరా, వర్ణ పదార్థాలను మాధ్యమంగా ఉపరితలం పై రేఖాచిత్రాన్ని గీస్తారు. చాలా మటుకు రేఖాచిత్ర పరికరాలు పొడి పదార్థాలు (గ్రాఫైట్, చార్కోల్, పేస్టెల్స్, కాంటీ, సిల్వర్ పాయింట్) గా ఉంటాయి. మార్కర్ మరియు కలంలో ద్రవపదార్థాలు కూడా పరికరాలు ఉపయోగించబడతాయి. పొడిగా ఉండే రంగు పెన్సిళ్ళతో ముందుగా రేఖాచిత్రాన్ని పూర్తి చేసి తర్వాత కుంచెతో తడిని అద్దటంతో చిత్రంలో కొన్ని కళాత్మక ప్రభావాలని తీసుకురావచ్చును. బహు అరుదుగా కంటికి కనబడని సిరాతో కూడా చిత్రకారులు రేఖాచిత్రాలని గీసారు. వెండి మరియు సీసం తో చేసిన ఫలకాల పై కొన్ని రేఖాచిత్రాలు ఉన్ననూ, వీటి కంటే అరుదుగా స్వర్ణం, రాగి, కాంస్యం, కంచు మరియు తగరపు ఫలకాల పై కూడా అతి అరుదైన రేఖాచిత్రాలు కలవు.

కాగితం వివిధ పరిమాణాలలో మరియు నాణ్యతలలో లభిస్తుంది. తయారీ విధానం, రంగు, ఆమ్ల గుణం, తడి తగిలినా పటుత్వం కోల్పోకుండా ఉండే గుణం లో వీటిలో భేదాలు ఉంటాయి. నునుపైన కాగితం సూక్ష్మ వివరాలను చిత్రీకరించటానికి ఉపయోగపడగా, కరకుగా ఉండే కాగితం చిత్రీకరణకి ఉపయోగించే పదార్థాలని ఒడిసి పట్టుకొంటుంది. అందుకే వర్ణవైరుధ్యం లో స్పష్టతని తీసుకురావటానికి ముతక కాగితాన్నే వినియోగిస్తారు.

వార్తాపత్రికలు, టైపింగు కాగితం వంటి దళసరి కాగితాలు నమూనా చిత్రపటాలని చిత్రీకరించటానికి, అసలైన చిత్రపటాలని ఎలా గీయాలో అధ్యయనం చేయటానికి ఉపయోగిస్తారు. పాక్షిక పారదర్శకంగా ఉండే ట్రేస్ పేపర్ (Trace Paper) ని ఉపయోగించి, ఒక చిత్రపటంలోని చిత్రాన్ని మరొక చిత్రపటం లోనికి తీసుకెళ్ళటానికి వినియోగిస్తారు. కార్ట్రిడ్జ్ పేపర్ (రెండు అట్టల మధ్య బైండింగ్ చేయబడిన చార్ట్ పేపర్లు)ని రేఖాచిత్రాలకి విరివిగా వినియోగిస్తారు. బ్రిస్టల్ బోర్డ్ లు మరియు ఇంకనూ ఎక్కువ ఆమ్లరహిత బోర్డులు నునుపైన ఫినిషింగ్ తో సూక్ష్మ వివరాలని చిత్రీకరించటానికి, తడి మాధ్యమాలు (సిరా,వాటర్ కలర్ మరియు తైల వర్ణాలు) తగిలిననూ చెక్కు చెదరకుండా ఉంటాయి. జంతు చర్మాలు అత్యంత నునుపుగా ఉండి అతి సూక్ష్మ వివరాలని చిత్రీకరించటానికి అనుకూలిస్తుంది. సిరాతో చిత్రపటాలని చిత్రీకరించటానికి ప్రత్యేకమైన వాటర్ కలర్ పేపర్ కూడా లభ్యం.

సాంకేతిక అంశాలు[మార్చు]

లక్షణము[మార్చు]

రూపం మరియు సమతౌల్యం[మార్చు]

కోణం[మార్చు]

కళాత్మకత[మార్చు]

ప్రక్రియ[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]