రేగు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రేగు
Ziziphus zizyphus shrub
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
విభాగం: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియోప్సిడా
క్రమం: Rosales
కుటుంబం: రామ్నేసి
జాతి: జిజిఫస్
Tourn. ex లి.
జాతులు

See text

రేగు ఒక పండ్ల చెట్టు.[1] ఇది జిజిఫస్ ప్రజాతికి చెందినది. ఇందులో 40 జాతుల పొదలు మరియు చిన్న చెట్లు రామ్నేసి (Rhamnaceae) కుటుంబంలో వర్గీకరించబడ్డాయి. ఇవి ఉష్ణ మండలం అంతటా విస్తరించాయి. వీని ఆకులు ఆల్టర్నేట్ పద్ధతిలో ఏర్పడి 2–7 cm (0.79–2.76 in) పొడవు ఉంటాయి. వీని పుష్పాలు చిన్నవిగా పసుపు-ఆకుపచ్చ రంగులో ఉంటాయి. రేగు పండు 1–5 cm (0.39–1.97 in) పొడవుగా ఉండి, డ్రూప్ జాతికి చెందినది. ఇవి పసుపు-కాఫీ రంగు, ఎరుపు లేదా నలుపు రంగులో గుండ్రంగా ఉంటాయి. ఇవి తినడానికి తియ్యగా చిన్న పులుపు రుచితో ఉంటాయి. రేగు పండ్లు వాటి పరిమాణము, రంగు, రుచి ని బట్టి సుమారు తొంబై రకాలున్నాయి. సాధారణంగా మనకు కనుపించేవి రెండు రకాలు. ఒకరకం కొంచెం ఎరుపు రంగు కలిగి గుండ్రంగా వుంటాయి. వీటిలో గుజ్జు తక్కువగా వుండి గింజ పెద్దవిగా వుంటాయి. తినడానికి ఇవి కొంత పులుపు దనం తియ్యదనం కలిసి బా వుంటాయి. రెండో రకం కోలగా వుండి పెద్దవిగా వుంటాయి. వీటి రంగు కూడ చిన్న వాటి లాగె వుంటుంది. కండ ఎక్కువగా వుండి కొరికి తినడానికి బాగా వుంటాయి. ఇవి కొంత తీపిదనం కలిగి కమ్మగా చాల బాగ వుంటాయి. వీటినే పెద్ద రేగు లేదా గంగ రేగు అంటారు.

  • ఔషద గుణాలు.

రేగు పండులో ఔషద గుణాలు చాల వున్నాయి. వీటిని తింటే కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తికి చాల మంచిది. గొంతు నొప్పిని,ఆస్తమాని కండరాల నెప్పిని తగ్గించే గుణం దీనిలో వుంది. రేగు పందు గింజ చాల గట్టిగా వుంటుంది. వీటిని పొడి చేసి నూనెతో కలిపి రాసు కుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రేగు చెట్టు బెరడును నీళ్లలో మరిగించి డికాక్షన్ గా తాగితే నీళ్ల విరేచనాలకు బలేబాగ పని చేస్తుంది. కొన్ని ప్రాంతాలలో రేగు పండ్ల గుజ్జుతో వడియాలు పెట్టుకుంటారు.

  • గంగరేగు : n. A species of jujube tree with bright yellow fruit. Zizyphus jujuba. పెద్దరేగు.
Fresh jujube fruits.

మరికొంత సమాచారం[మార్చు]

అదొక పండు. పుల్లపుల్లగా, తియ్యతియ్యగా వుంటుంది. దాని పేరు వినగానే నోరూరిపోతుంది. దాన్ని చూస్తే చాలు నోట్లో లాలాజలం రెడీ అవుతుంది. ఇంతకీ అదేం పండో చెప్పుకోండి?! య్యస్‌. మీ ఊహ సరైనదే. అది రేగుపండు. బండిమీద రేగుపళ్లు కనిపించాయంటే చాలు కొని తినాల్సిందే అనిపించక మానదు. సంక్రాంతి సందర్భంగా రేగుపళ్ల గురించిన గుప్పెడు కబుర్లు ఏరుకుందామా! మీకు తెలీనిదేముంది చెప్పండి! సంక్రాంతి ఎప్పుడొస్తుందా? చంటోడికి/చంటిదానికి భోగిపళ్లు ఎప్పుడెప్పుడు పోద్దామా అని ఎదురుచూసేవాళ్లు ఎందరో! రేగుపండును భానుడికి చిహ్నంగా భావిస్తారు. అందుకే పిల్లలు భోగభాగ్యాలతో తులతూగాలని ఈ పండ్లను పోస్తారు. భోగినాడు పోస్తారు కాబట్టి వీటిని భోగిపండ్లు పంటారు. రేగు పళ్లకు రకరకాల పేర్లున్నాయి. వీటిని జిజిఫుస్‌ మారిటియానా, నార్‌కెలి కల్‌, బెర్‌, బోరీ, బోర్‌, బెరి అని వివిధ రకాలుగా వివిధ ప్రాంతాలలో పిలుస్తారు. ఈ చెట్లు త్వరగా పెరుగుతాయి. మూడు సంవత్సరాల్లోనే పండ్లనిస్తాయి.

ఎన్ని రకాలుగా తినొచ్చో...

ఎండిన పండ్లను స్నాక్స్‌లాగా, టీ తాగేప్పుడు తీసుకుంటారు. రేగిపళ్ల గుజ్జుతో టీ కూడా చేస్తారు. రేగు పళ్లతో జ్యూస్‌, వెనిగార్‌లను కూడా తయారుచేస్తారు. పశ్చిమ బెంగాల్‌లో, బంగ్లాదేశ్‌లో వీటితో పచ్చడి చేసుకుంటారు. చైనీయులు వీటితో వైన్‌ను కూడా తయారుచేస్తారు. వారు బెరుజు అనే ద్రవంలో వాటిని నిలవ చేస్తారు. అలా అవి మూడు నాలుగు నెలల వరకు తాజాగా ఉంటాయి. రేగు పళ్లను ఎండబెట్టి వాటిలోని విత్తనాలు తీసి చింతకాయలు, ఎర్రని పచ్చిమిరపకాయలు, ఉప్పు, బెల్లం వేసి దంచుతారు. దీన్ని భోజనంతో కలిపి తింటారు. వీటితో వడియాలు కూడా చేస్తారు. రేగుపళ్లలో మంచి పోషకాలే కాక 'సి' విటమిన్‌ సమృద్ధిగా ఉంటుంది. జామకాయ తరువాత ఎక్కువగా ఇందులోనే ఉంటుంది. మనదేశంలో ఎక్కువగా వీటిని నేరుగా తింటారు. వీటితో రేగు తాండ్ర కూడా చేసుకుంటారు. ఒంటెలు, మేకలు, ఇతర పశువులకు వీటి ఆకులు మంచి పోషకాహారం. ఇండోనేషియన్లు ఆకులతో కూర చేసుకుని తింటారట.

ఇదో నమ్మకం

ఈ పండ్ల తియ్యటి వాసనకు టీనేజ్‌ వాళ్లు ప్రేమలో పడతారట. అందుకే హిమాలయ, కారకోరమ్‌ ప్రాంతాలలోని పురుషులు స్త్రీలను ఆకర్షిండానికి పూత ఉన్న రేగు కొమ్మను టోపీల మీద పెట్టుకుంటారు. అంతేకాదు గర్భధారణ శక్తిని పెంచుతుందని చైనీయులు తమ పడకగదిలో రేగు పండ్లను, ఆక్రోటు కాయలను పెట్టుకుంటారు. భూటాన్‌లో సువాసన కోసం ఇళ్లలో సాహిత్య సంకలనం లాగా ఉపయోగిస్తారు. వాటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల కీటకాలు రావట.

రేగు సాగు

భారతదేశంలో 90 రకాలకు పైగా రేగుపళ్లను సాగుచేస్తున్నారు. ఒక చోట మొలిచిన రేగు పళ్ల చెట్టును ఇంకో చోట నాటితే అవి బతకవు. అందుకే ముందుగా ఎక్కడ వెయ్యదలచుకుంటే అక్కడ విత్తనాలను పెట్టాలి. మనదేశంలో ఈ పండ్లు అక్టోబర్‌ ప్రారంభంలో, ఇతర ప్రాంతాలలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో వస్తాయి. మనదేశంలో సంవత్సరానికి ఒక్కో చెట్టు 5,000 నుండి 10,000 పండ్లను ఇస్తుంది. అంటు కట్టిన చెట్లైతే 30,000 వరకూ ఇస్తాయి. ప్రత్యేకంగా సాగు చేస్తే అధిక ఉత్పత్తిని సాధించవచ్చు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలలో వీటి సాగు చేస్తారు.

వినాయకచవితి రోజు వక్రదంతుడికి రేగు ఆకులను సమర్పిస్తారు.

ఔషధకారి

రేగు పండు చూడ్డానికి చిన్నగా వుంటుందికానీ...ఎన్ని సంగతులున్నాయో. పచ్చిగా వున్నప్పుడు ఆకుపచ్చ రంగులో వున్నా...పక్వానికొచ్చాక రంగు మారుతుంది. పసుపు, ఆ పై ఎరుపు రంగుకు వస్తుంది. మన దేశంలో 90 రకాల రేగుపండ్లను పండిస్తున్నారు. ఇది మంచి ఔషధకారి.

  • చేతి నిండుగా రేగుపండ్లను ఒక అరలీటరు నీళ్లలో వేసి అవి సగం అయ్యే వరకు మరగనివ్వాలి. దానికి పంచదార కానీ తేనె గానీ కలిపి దానిని రోజూ పడుకోబోయే ముందు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తంలోకి గ్లుంటామిక్‌ ఆమ్లం ఎక్కువగా విడుదలై మెదడు బాగా పనిచేయడానికి ఉపకరిస్తుంది.
  • రేగు పండ్లు తరచూ జ్వరం, జలుబు రాకుండా చేస్తాయి. శూలనొప్పి, డయేరియా, రక్త విరేచనాలను అరికట్టడానికి రేగి చెట్టు బెరడును ఉపయోగిస్తారు. బెరడు కషాయం మలబద్ధకానికి బాగా పనిచేస్తుంది. రేగు ఆకులను నూరి దాన్ని కురుపులు వంటి వాటి మీద రాసుకుంటే త్వరగా నయమవుతాయి.
  • రేగు పండు తీయని పండే కాదు మంచి హెర్బల్‌ మందుగా కూడా పనిచేస్తుంది.
  • ఇవి బరువు పెరగడంలో, కండరాలకు బలాన్నివ్వడంలో, శారీరక శక్తినివ్వడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.
  • కాలేయం పనిని మరింత చురుకు చేయడానికి చైనీయులు ప్రత్యేకంగా రేగిపండ్లతో చేసినా టానిక్‌ను ఎంచుకుంటారు.
  • ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని జపనీయుల పరిశోధనలో తేలింది. ఇవి విరుగుడుగా, కఫోత్సారకంగా, మూత్ర స్రావకానికి ప్రేరకంగా ఉపయోగపడుతుంది.
  • అంతేకాదు బాధానివారిణి, క్యాన్సర్‌ వ్యతిరేకి, ఉపశమనకారి. ఇది రక్తాన్ని శభ్రం చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఆకలి లేమి, *క్తహీనత, నీరసం, గొంతునొప్పి, శ్వాసనాళాల వాపు, విసుగు, హిస్టీరియా వంటి వాటి నివారణా మందులలో దీన్ని వాడతారు.
  • విత్తనాలు కూడా అనేక ఔషధగుణాలను కలిగి ఉంటాయి. నిద్రలేమి నివారణకు విత్తనాలను వాడతారు. అజీర్తిని అరికట్టడంలో దాని వేర్లను ఉపయోగిస్తారు.
  • వేర్లను పొడి చేసి పాత గాయాలకు పెడితే త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఆకులు జ్వరసంహారిగా ఉపయోగపడతాయి.
  • వెంట్రుకలు పెరగడానికి రేగుపండ్లు దోహదం చేస్తాయి. వేళ్లతో, బెరడుతో చేసిన రసం కీళ్లవాతానికి బాగా పనిచేస్తుంది.
  • అయితే ఎక్కువ తీసుకుంటే ప్రమాదం. పూలతో చేసిన కషాయం ఐ లోషన్‌గా ఉపయోగపడుతుంది.
  • ఇది 5 నుండి 10 మీటర్ల పొడవు వరకు పెరిగే ఆకురాల్చే చెట్టు లేదా పొద. మంచి పండ్లను ఇవ్వడానికి దీనికి ఎక్కువగా నీరు అవసరమైనా అధిక ఉష్ణ్రోగ్రతను, అతి శీతలాన్ని కూడా తట్టుకుంటుంది. 7-13 డిగ్రీల సెల్సియస్‌ల నుండి 50 డిగ్రీల వరకు ఈ చెట్లు తట్టుకుంటాయి. చైనీయులు, కొరియన్లు వత్తిడి తగ్గించడానికి సాంప్రదాయక మందులలో వీటిని వాడతారు. చైనీయులు వీటిని 'హోంగ్‌ జావో లేదా హెయి జావో' అని అంటారు.

పోషకాలు

100 గ్రాముల తాజా రేగు పండ్లలో

కార్బో హైడ్రేట్లు - 17 గ్రా

చక్కెర - 5.4 నుండి 10.5 గ్రా

కొవ్వు పదార్థం - 0.07గ్రా

పీచు పదార్థం - 0.60గ్రా

ప్రోటీన్లు - 0.8 గ్రా

నీరు - 81.6 - 83. 0 గ్రా

తయామిన్‌(బి1 విటమిన్‌) - 0.02 నుండి 0.024 మిగ్రా(2శాతం)

రైబోఫ్లేవిన్‌(బి2) - 0.02 నుండి 0.038 మి.గ్రా(3శాతం)

నియాసిన్‌(బి3) - 0.7 నుండి 0.873 మి.గ్రా(5 శాతం)

కాల్షియం - 25.6 మి.గ్రా(3 శాతం)

ఇనుము - 0.76 నుండి 1.8 మిగ్రా

ఫాస్పరస్‌ - 26.8 మిగ్రా ఉంటాయి.

కొన్ని జాతులు[మార్చు]

గ్యాలరీ[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Sunset Western Garden Book, 1995:606–607
  2. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; GRINSpecies అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
"http://te.wikipedia.org/w/index.php?title=రేగు&oldid=1206415" నుండి వెలికితీశారు