రేడియోనిక్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Radionic instruments

రేడియోనిక్స్ (ఆంగ్లం: Radionics) రోగిని చూడకుండానే అతడికి లేక ఆమెకు చెందిన ఏదైనా ఒక వస్తువు సహాయంతో రోగి ఎంత దూరంలో ఉన్నప్పటికీ చికిత్స చేసే విధానం. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌లో డాక్టర్‌ కొమరవోలు వెంకట సుబ్బారావు అనే ఒక చికిత్సకుడు ఈ విధానంలో విశేషమైన అనుభవం సంపాదించారు. ఆర్మీలో పనిచేసి, తొంభై సంవత్సరాలకు పైగా జీవించిన డాక్టర్‌ సుబ్బారావు 21వ శతాబ్దం మొదలైన తరువాత కాలధర్మం చెందారు. రేడియోనిక్స్‌ వేరు, రేడియెస్తీషియా (Radiesthesia) వేరు. రేడియెస్తీషియా అంటే రోగి శరీరం మీదుగా చేతులను కదుపుతూ జబ్బును గుర్తించడం. కొందరు చికిత్సకులు చేతికి బదులు లోలకాన్ని ఉపయోగిస్తారు.