రైల్వే కోడూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కోడూరు
—  మండలం  —
వైఎస్ఆర్ జిల్లా పటములో కోడూరు మండలం యొక్క స్థానము
వైఎస్ఆర్ జిల్లా పటములో కోడూరు మండలం యొక్క స్థానము
కోడూరు is located in ఆంధ్ర ప్రదేశ్
కోడూరు
ఆంధ్రప్రదేశ్ పటములో కోడూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 13°56′28″N 79°20′52″E / 13.941231°N 79.347868°E / 13.941231; 79.347868
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్
మండల కేంద్రము కోడూరు
గ్రామాలు 14
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 79,517
 - పురుషులు 40,109
 - స్త్రీలు 39,408
అక్షరాస్యత (2001)
 - మొత్తం 61.47%
 - పురుషులు 72.82%
 - స్త్రీలు 49.96%
పిన్ కోడ్ 516101


కోడూరు లేదా రైల్వే కోడూరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 516 101., ఎస్.టి.డి.కోడ్ = 08566.

వైఎస్ఆర్ జిల్లాలో కోడూరు పేరుతో రెండు మండలాలు ఉన్నాయి.అయోమయ నివృత్తి కొరకు, ఒకటి బద్వేలు సమీపములో ఉన్నందును దానిని బి.కోడూరు గాను, ఇంకో ప్రాంతములో రైల్వే సౌకర్యం ఉన్నందున రైల్వే కోడూరు గానూ పిలుస్తారు. ఈ ప్రాంతము మామిడి పంటకు ప్రసిద్ది గాంచినది. రైల్వే సౌకర్యం కూడ ఉండటంతో ఇక్కడ పెద్ద ఎత్తున మామిడి క్రయ విక్రయాలు జరుగుతాయి. స్వతంత్రమునకు పూర్వము ఈ గ్రామంలో కడప జిల్లాలోనే మొదటిసారిగా రైలు బండి ఆగడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ గ్రామం పేరును కోడూరు నుండి రైల్వే కోడూరు గా మార్చారు. ఈ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో తిరుపతి మరియు 100 కిలోమీటర్ల దూరంలో చెన్నై ఉండటంతో మంచి వ్యాపారకేంద్రంగా విరాజిల్లుతోంది.

  • 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ తిప్పన కృష్ణయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
  • మండలంలోని గుండాలకోన క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. భక్తుల సౌకర్యంకోసం వై.కోట నుండి ప్రత్యేకంగా బస్సులు నడుపుతారు. [2]
  • రైల్వే కోడూరులో ప్రతి సంవత్సరం ఫాల్గుణ కృష్ణ చతుర్దశి (ఉగాది ముందురోజు) రోజున సాయంత్రం, పార్వతీసమేత పరమేశ్వరుడు, చంద్రప్రభ వాహనంపై పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చును. ఈ కార్యక్రమం కోసం ఆలయకమిటీవారు పుష్పరథం ఏర్పాటుచేసెదరు. ఆదిదంపతులకు గ్రామస్థులు, నీరాజనాలు సమర్పించెదరు. [3]


శాసనసభ నియోజకవర్గం[మార్చు]

గ్రామాలు[మార్చు]

మూలములు[మార్చు]

  1. ఈనాడు కడప; జనవరి-7,2014; 5వ పేజీ.

[2] ఈనాడు కడప; 2014,ఫిబ్రవరి-25; 3వ పేజీ. [3] ఈనాడు కడప; 2014,ఏప్రిల్-1, 5వ పేజీ.