రోగ నిర్ధారణ పరీక్ష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ర్యాపిడ్ పాయింట్ ఆఫ్ కేర్ సిఫీలిస్ టెస్ట్

అనారోగ్యం లేదా గాయలు జరిగినపుడు వైద్యుడిని సంప్రదిస్తే,వైద్యుడు  ఆరోగ్య చూడటానికి వ్యాధిగ్రస్తుని ఏవైనా  రోగనిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తాడు. ఈ విధంగా   వైద్య రోగనిర్ధారణ పరీక్షలలో రోగులలో అనారోగ్యం / వ్యాధి ఉనికిని లేదా లేకపోవడాన్ని నిర్ధారించడానికి వైద్యులు అనేక రకాల శారీరక పరీక్షలు - ఇన్వాసివ్, నాన్ ఇన్వాసివ్ రెండూ ఉంటాయ.ఈ రోగ నిర్ధారణ పరీక్షలు రోగుల ఆరోగ్య  సమస్యల నుంచి  వీలైనంత త్వరగా కోలుకోవడానికి అనుమతించే సమర్థవంతమైన చికిత్సా ప్రణాళికలను రూపొందించడానికి వైద్యులకు ఖచ్చితమైన, సమర్థవంతమైన రోగనిర్ధారణ విధానాలు అతి  కీలకం గా భావించవచ్చును. . ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్వచించినట్లుగా ప్రస్తుతం 113 ముఖ్యమైన రోగనిర్ధారణ పరీక్షలు ఉన్నాయి, ఈ పరీక్షలు  రోగనిర్ధారణ పరీక్షలు, చికిత్సఫలితాలతో ను రోగుల ఆరోగ్యాలను  మెరుగుపరచడంలో సహాయపడతాయని వైద్యులు ఆశిస్తున్నారు.[1]

  • రోగ నిర్ధారణ పరీక్ష అనగ రోగికి ఫలాన వ్యాధి వచ్చింది అని కచ్చితమైన వైద్యపర ధృవీకరణ.
  • సాధారణంగా ఈ రకంగా ధృవీకరణ చేయడానికి శాస్త్రీయమైన వైద్య పరీక్షలు చేసి ఫలితాల ఆధారంగా నిర్ణయిస్తారు.
  • ఉదాహరణకు: రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, మొదలగునవి.
  • COVID-19 పరీక్ష కోసం నాసోఫారింజియల్ శ్వాబ్ ప్రదర్శన
    COVID-19 పరీక్ష కోసం నాసోఫారింజియల్ శ్వాబ్ ప్రదర్శన
  • గొంతు శుభ్రముపరచు ప్రదర్శన
    గొంతు శుభ్రముపరచు ప్రదర్శన

అవలోకనం[మార్చు]

  • రోగనిర్ధారణ పరీక్షల తో  వ్యక్తులలో ఉన్న వారి   పరిస్థితి, వ్యాధి లేదా అనారోగ్యాన్ని నిర్ధారించడానికి నిర్వహించే ఏదైనా రకమైన రోగనిర్ధారణ పరీక్షలు వైద్యులు  రోగికి సూచించడం జరుగుతుంది. ఈ రకమైన రోగ నిర్ధారణ పరీక్షలలో డయాగ్నొస్టిక్ స్క్రీనింగ్ లో రోగనిర్ధారణ పరీక్షలకు భిన్నంగా ఉంటుంది, ఈ పరీక్ష తో  ఎటువంటి లక్షణాలను ప్రదర్శించని ఆరోగ్యకరమైన వ్యక్తులలో ప్రారంభము కాని వ్యాధి లేదా ప్రమాద కారకాలను గుర్తించడానికి  ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. మరియొక రోగనిర్ధారణ పరీక్షలు ఇన్వాసివ్, నాన్ ఇన్వాసివ్ ఉంటాయి.  ఇన్వాసివ్ పరీక్ష లో  చర్మంలనికి పంపే రోగనిర్ధారణ సాధనాలు  చొచ్చుకుపోవడం లేదా శరీరంలోకి పంపడం జరుగుతుంది. అయితే నాన్ ఇన్వాసివ్ పరీక్షలలో  చర్మాన్నికోయడం కాని లేదా శరీరంలోనికి రోగపరీక్ష సాధనాలు పంపడం జరుగదు. రోగనిర్ధారణ పరీక్షల ఉదాహరణలలో బయాప్సీ- పరీక్ష కోసం తీసుకున్న కణజాలం  నమూనా,కొలొనోస్కోపీ - ప్రేగు లోపల చూడటానికి పాయువులోకి చొప్పించిన గొట్టం,సిటి స్కాన్ పరీక్షలో  శరీరం లోపల వివరణాత్మక చిత్రాలను సృష్టించడానికి ఉపయోగించే ఎక్స్- రే కిరణాలు,వినికిడి పరీక్షలో వ్యాధిగ్రస్తునికి చెవికి హెడ్ ఫోన్ లు పెట్టడం,  వివిధ వాల్యూమ్లలో శబ్దాన్ని విన్నప్పుడు రోగి ప్రతిస్పందించడం, అల్ట్రాసౌండ్ పరీక్షలో  శరీరానికి వ్యతిరేకంగా నొక్కబడిన ధ్వని తరంగాలను ఉపయోగించి,శరీరం లోపల నిజ-సమయ చిత్రాలు తీయడం జరుగుతుంది, రక్త పరీక్షల వంటివి కూడా ఉంటాయి.[2]

తెలంగాణ రాష్టం[మార్చు]

తెలంగాణ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌లో 57రకాల ఉచిత పరీక్షలు చేస్తున్నారు. ఒక్కో సెంటర్‌లో నిత్యం 250మందికి ఉచితంగా రోగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖాన ఆవరణలోని తెలంగాణ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌లో రెండు గంటల్లో రక్తపరీక్షల రిపోర్టు ఆన్‌లైన్‌లో రోగులకు అందిస్తున్నారు. థైరాయిడ్‌, హెమటాలజీ, బయాకెమిస్ట్రీ అనలైజర్‌, మూత్ర పరీక్షలు, మైక్రో బయోలాజికల్‌, లివర్‌ ఫంక్షనింగ్‌, డెంగ్యూ, చికెన్‌ గున్యా, లిపిడ్‌ ప్రొఫెల్‌ (గుండె సంబంధిత) కిడ్నీ, కంప్లీట్‌ బ్లడ్‌ ఫిక్చర్‌(సీబీపీ) బ్యాక్టీరియా అన్ని రకాలకు సంబందించిన పరీక్షలు ఇక్కడ చేయడం జరుగుతుంది.

డయాగ్నొస్టిక్‌ సెంటర్‌లో ప్రభుత్వ వైద్యులు రోగికి పరీక్షలు రోగ నిర్ధారణకు కావాలని చెప్పినపుడు మాత్రమే డయాగ్నొస్టిక్‌ సెంటర్‌లో పరీక్షలు చేస్తారు. ఇక్కడ నేరుగా ఎవరికీ రక్త పరీక్షలు చేయడం ఉండదు. మండల పరిధిలోని ప్రభుత్వ దవాఖానల నుంచి వచ్చే శాంపిల్‌ను పరీక్ష చేసి ఆన్‌లైన్‌ ద్వారా రిపోర్టు పంపిస్తారు. వివిధ రకాల జబ్బులతో బాధపడే వారు వైద్యుల సలహా మేరకు రక్త పరీక్షలు అవసరం ఉన్న వారు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ( పీహెచ్‌సీ), 30 పడకల దవాఖాన, పట్టణ ప్రాంత ఆరోగ్య కేంద్రం (అర్బన్‌ పీహెచ్‌సీ) కు వెళ్లి శాంపిల్‌ ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లా ప్రధాన దవాఖానల్లో అందుబాటులో లేని పరీక్షలను మాత్రమే డయాగ్నొస్టిక్‌ సెంటర్‌లో చేస్తారు. క్లస్టర్‌ పరిధిలోని పీహెచ్‌సీల నుంచి రక్త నమూనాలను ఇక్కడకు ప్రత్యేక వాహనంలో తరలించి పరీక్ష చేస్తారు. రక్త పరీక్షల నిర్ధారణ అయిన వెంటనే ఆన్‌లైన్‌లో రిపోర్టు అందిస్తారు. ఫలితాల వివరాలు సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు చేరవేయడం, బాధితుల సెల్‌ఫోన్‌కు సమాచారం పరీక్షల సమాచారం ఇవ్వడం జరుగుతుంది, అవసరమైతే బాధితుల సెల్‌ద్వారా ఫలితాల రిపోర్టు ప్రింట్‌ తీసుకునే అవకాశం ఉంది.[3]

డ్రోన్ ల వాడకం[మార్చు]

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  రాష్ట్రము లోని ప్రజల ముందుస్తు రోగ నిర్ధారణ పరీక్షల నిమితం డ్రోన్ ల ద్వారా గ్రామీణ ప్రజలకు చేయాలని నిర్ణయించుకున్నది. గ్రామీణ   ప్రాంతాలలో రక్తపరీక్షలు చేసిన తర్వాత అవి డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ కు తీసుకరావడానికి ఆలస్యం కావడంతో రోగికి సంబంధించిన ఫలితాలను తెల్సుకోవడానికి ఆలస్యం అవుతుంది,ఈ జాప్య నివారణకు డ్రోన్ లను వినియోగించుకుని వాటి ద్వారా నమూనాలు డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ కు చేరవేస్తే ,పరీక్షల ఫలితాలు తొందరగా తెలుసుకోవడం సులభం అవుతుందని భావిస్తూ ఈ సేవలను వినియోగం చేయాలని నిర్ణయించారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ఏర్పాటుతో ఉచిత వైద్య పరీక్షలను నిర్వహిస్తూ ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం చిత్త శుద్ధిగా అమలు అయితే ఆరోగ్యమే మహాభాగ్యం సామెత నిజం అవుతుంది, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి.[4]

ఇవి కూడా చదవండి[మార్చు]

ప్రపంచ ఆరోగ్య సంస్థ

బస్తీ దవాఖాన

మూలాలు[మార్చు]

  1. "What Are Medical Diagnostic Tests". OakBend Medical Center (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-10-13. Archived from the original on 2023-04-08. Retrieved 2023-04-08.
  2. "What Are Diagnostic Tests?". myGP (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2023-04-08.
  3. telugu, NT News (2021-07-12). "రోగ నిర్ధారణ పరీక్షలతో చేయూత". www.ntnews.com. Retrieved 2023-04-11.
  4. "రోగ నిర్ధారణ పరీక్షలకు డ్రోన్‌ సహకారం". EENADU. Retrieved 2023-04-11.