రౌడీ రాముడు కొంటె కృష్ణుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రౌడీ రాముడు కొంటె కృష్ణుడు
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం నందమూరి తారక రామారావు
కథ జంధ్యాల
సత్యానంద్
చిత్రానువాదం కె.రాఘవేంద్రరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
నందమూరి బాలకృష్ణ,
రాజ్యలక్ష్మి,
చలపతిరావు
సంభాషణలు జంధ్యాల
ఛాయాగ్రహణం కె.ఎస్. ప్రకాష్
కూర్పు రవి
నిర్మాణ సంస్థ రామకృష్ణా సినీ స్టూడియోస్
విడుదల తేదీ ఆగస్టు 15, 1980
భాష తెలుగు

రౌడీ రాముడు కొంటె కృష్ణుడు 1980 లో వచ్చిన తెలుగు యాక్షన్ చిత్రం, ఎన్‌టి రామారావు తన రామకృష్ణ సినీ స్టూడియోస్ నిర్మాణ సంస్థ‌లో, కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మించాడు. ఇందులో ఎన్‌టి రామారావు, నందమూరి బాలకృష్ణ, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించగా, చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[1]

కథ[మార్చు]

ఈ చిత్రం భాజీ ప్రసాద్ (రావు గోపాలరావు) పై ప్రారంభమవుతుంది. అతడు గౌరవనీయమైన వ్యక్తిగా భావించే భయంకరమైన నేరగాడు. అతని అనుచరుడు గిరి (నూతన్ ప్రసాద్) ఒక జిత్తులమారి నక్క, దుర్మార్గుడు. ఎల్లప్పుడూ అతన్ని డబుల్ క్రాస్ చెయ్యడానికి ప్రయత్నిస్తూంటాడు.. వారిద్దరూ ఇద్దరు డబుల్ ఏజెంట్లు - కవల సోదరులు సత్యం & నారాయణ (సత్యనారాయణ) లను - నిర్వహిస్తూంటారు. రాము (ఎన్.టి.రామారావు) ధైర్యవంతుడు, డబ్బు కోసం ఎంత రిస్కైనా చేస్తాడు. ఒకసారి, అతను ఒక చిన్న దొంగ ముత్యం (శ్రీదేవి) తో పరిచయమై ఆమెతో ప్రేమలో పడతాడు. సమాంతరంగా, ఈ యువకుడు కృష్ణ (నందమూరి బాలకృష్ణ) ఒక బ్యాంకులో గుమస్తాగా పనిచేస్తూంటాడు. తన తల్లి (పుష్పలత) తో కలిసి ఉంటాడు. భాజీ ప్రసాద్ మేనకోడలు లక్ష్మి (రాజలక్ష్మి) ని ప్రేమిస్తాడు. తరువాత, రాము & కృష్ణ రెండుసార్లు చిత్రమైన పరిస్థితులలో కలుసుకుని మంచి స్నేహితులు అవుతారు. ఇంతలో, భాజీ ప్రసాద్‌కు హిమాలయాల వద్ద ఉన్న ఒక పురాతన నిధి గురించి తెలుస్తుంది. పురావస్తు శాస్త్రవేత్త హరగోపాల్ (చలపతి రావు) దాని మార్గ పటాన్ని తయారు చేసుకున్నాడు. గిరికి దాని సంగతి తెలిసి దాన్ని సంపాదించే పన్నాగం పన్నుతాడు. వారు హరగోపాల్‌ను కొట్టడానికి ముందు, అతను కృష్ణ పనిచేసే బ్యాంకు లాకర్‌లో మ్యాప్‌ను భద్రపరుస్తాడు. అదే సమయంలో, భాజీ ప్రసాద్ కృష్ణ, లక్ష్మిల ప్రేమ వ్యవహారం తెలుసుకుంటాడు. భాజీ ప్రసాద్ వాళ్ళ ప్రేమకూ లాకరులోని మ్యాపుకూ ముడిపెడతాడు. కృష్ణ అందుకు తిరస్కరించగా, భాజీ ప్రసాద్ అతడి తల్లిని నిర్బంధించగా, చేసేది లేక అతడు మ్యాప్‌ను దొంగిలిస్తాడు. అదే సమయంలో, గిరి కూడా దాడిని ప్లాన్ చేస్తాడు, అయితే, కృష్ణ తన స్నేహితుడు రంగా (లక్ష్మీకాంత్) వద్ద పటాన్ని దాచేస్తాడు. దాన్ని గుర్తించి, బ్లాక్‌గార్డ్‌లు రంగాను చంపుతారు కాని మ్యాప్‌ ఎక్కడుందో కనుక్కోలేకపోతారు.

కృష్ణపై నేరారోపణ జరిగి శిక్ష వేస్తారు. కానీ, భాజీ ప్రసాద్ అతన్ని తిరిగి తనవైపుకు తెచ్చుకోవాలనుకుంటాడు. ఆ పని అతను రాముకు అప్పజెబుతాడు. రాముకు ఏదో సందేహాస్పదంగా అనిపిస్తుంది గానీ, అతను కృష్ణను తప్పించి రహస్యంగా దాచిపెడతాడు. తరువాత, వారు సొంత సోదరులమనొ తెలుసుకుంటారు. చివరికి, వారు పటాన్ని సంపాదించుకుంటారు. కానీ, లక్ష్మిని బలవంతం చేయడం ద్వారా భాజీ ప్రసాద్ దానిని తిరిగి సంపాదిస్తాడు.

ఇక, మోసగాళ్ళు నిధి కోసం తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. సత్యం & నారాయణ ఒకే మనిషిగా, సత్యనారాయణగా కనిపిస్తారు.అంతకు ముందే, రాము కృష్ణలు గైడ్ల వేషంలో వారిని వెంబడిస్తారు. సాహసోపేత పర్యటన చేసిన తరువాత వారు నిధిని చేరుకుంటారు. చివరికి, రాము కృష్ణలు దుష్టులను అడ్డుకుని, నిధిని ప్రభుత్వానికి అప్పగిస్తారు. చివరగా, రాము & ముత్యం, కృష్ణ & లక్ష్మి ల పెళ్ళిళ్ళతో సినిమా ముగుస్తుంది.

తారాగణం[మార్చు]

సాంకేతిక సిబ్బంది[మార్చు]

పాటలు[మార్చు]

వేటూరి సుందరరామమూర్తి రాసిన పాటలకు చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. EMI కొలంబియా ఆడియో కంపెనీ సంగీతాన్ని విడుదల చేసింది.

సం పాట గాయనీ గాయకులు నిడివి
1 "ఓహ్ మై డార్లింగ్" ఎస్పీ బాలు, పి.సుశీల 4:13
2 "కొంటె కోరికుంది" మాధవపెద్ది రమేష్, పి. సుశీల 4:15
3 "పప్పులో ఉప్పు" ఎస్పీ బాలు, పి.సుశీల 4:20
4 "జింగల జంజామ్" ఎస్పీ బాలు, పి.సుశీల 4:50
5 "అపూర్వ సహోదరులం" ఎస్పీ బాలు, మాధవపెద్ది రమేష్ 3:35
6 "అమ్మో ఇధే మేనకా" ఎస్పీ బాలు, మాధవపెద్ది రమేష్, పి.సుశీల 5:30
7 "శీతాకాలం వచ్చింది" ఎస్పీ బాలు, పి.సుశీల 3:52

మూలాలు[మార్చు]

  1. "Heading". Nth Wall. Archived from the original on 2015-01-28. Retrieved 2020-08-11.