Coordinates: 16°00′00″N 80°48′00″E / 16.000°N 80.8°E / 16.000; 80.8

లంకెవానిదిబ్బ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లంకెవానిదిబ్బ
—  రెవెన్యూయేతర గ్రామం  —
లంకెవానిదిబ్బ is located in Andhra Pradesh
లంకెవానిదిబ్బ
లంకెవానిదిబ్బ
అక్షాంశరేఖాంశాలు: 16°00′00″N 80°48′00″E / 16.000°N 80.8°E / 16.000; 80.8
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం రేపల్లె
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522265
ఎస్.టి.డి కోడ్

లంకెవానిదిబ్బ,, గుంటూరు జిల్లాలోని రేపల్లె మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం మండల కేంద్రమైన రేపల్లె నుండి 28 కి.మీ దూరంలో ఉంటుంది.కృష్ణా నది తీరప్రాంతమైన ఈ గ్రామం మండలానికి చివరి గ్రామంగా పేర్కొనవచ్చు.దీని తరువాత దాదాపు 5 కీ.మీ దూరంలో బంగాళఖాతం సముద్రం ఉంటుంది.కృష్ణానది సాగర సంగమాలలో హంసలదీవి, సంగమేశ్వరం, జింకపాలెం లతో పాటుగా లంకెవానిదిబ్బ వద్ద కూడా పెనుమూడి-పులిగడ్డ వద్ద చీలిన కృష్ణానది పాయలలో ఒకటి ఇక్కడ కలుస్తుంది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

ప్రభుత్వ ఉన్నత పాఠశాల[మార్చు]

  • ఈ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేవు. సక్సెస్ పాఠశాల కావడంతో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలలో విద్యాబోధన చేసేటందుకు 10 గదులు అవసరం. 2010లో రాష్ట్రీయ మాధ్యమిక సర్వ శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణానికి రు. 31.31 లక్షల నిధులు మంజూరయినవి. 2012లో భవన నిర్మాణం ప్రారంభమయినది. ఇంతవరకు పూర్తి కాలేదు. నిర్మాణం పూర్తి చేయడానికి ఇంకనూ రు. 15 లక్షలు అవసరమని తెలియుచున్నది.
  • 2014-15 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థులు అందరూ ఉత్తీర్ణులై, 100% ఉత్తీర్ణత సాధించారు. ఐదుగురు విద్యార్థులు 9 జి.పి.య్యే. సాధించారు.
  • ఈ పాఠశాలలో చదువుచున్న నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైనారు. 2015, సెప్టెంబరు-23న గుంటూరులో నిర్వహించిన పోటీలలో అండర్-17 విభాగంలో 10వ తరగతి విద్యార్థులు నజీన్, నవీన్ కుమార్, 9వ తరగతి విద్యార్థి ప్రదీప్ ప్రథమస్థానంలో నిలిచారు. అండర్-14 విభాగంలో అరవ తరగతి విద్యార్థి రవికుమార్ ప్రథస్థానంలో నిలిచారు. ఈ విద్యార్థులు నలుగురూ, అక్టోబరు-2015లో చిత్తూరులో నిర్వహించు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు.

మౌలిక సదుపాయాలు[మార్చు]

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.

తుఫాను రక్షిత కేంద్రం[మార్చు]

గ్రామపంచాయతీ[మార్చు]

ఈ గ్రామపంచాయతీకి 1953 నుండి ఇప్పటివరకూ, ఎన్నికలు జరుగలేదు. స్థానిక పెద్దలు రచ్చబండవద్ద కూర్చుని, పలువురి అభిప్రాయాలు సేకరించి, ఎన్నుకుంటారు. తొలిసారిగా తమ్ము వెంకటసుబ్బయ్య, బొమ్మిడి సముద్రాలు (25ఏళ్ళు), కొక్కిలిగడ్డ వెంకటేశ్వరరావు (19ఏళ్ళు), విశ్వనాధపల్లి వీరరాఘవయ్య (5ఏళ్ళు), సర్పంచిలుగా ఏకగ్రీవంగా ఎన్నికై పాలన చేశారు.