లక్నో

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?लखनऊ
لکھنؤ

లక్నో
ఉత్తర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 26°51′38″N 80°54′57″E / 26.860556°N 80.915833°E / 26.860556; 80.915833
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
2,345 కి.మీ² (905 sq mi)
• 123 మీ (404 అడుగులు)
జిల్లా(లు) లక్నో జిల్లా
జనాభా
జనసాంద్రత
2 (2006)
• 331/కి.మీ² (857/చ.మై)
భాష(లు) హిందీ, ఉర్దూ
మేయర్ దినేష్ శర్మ
జిల్లా న్యాయమూర్తి చంద్రభాను
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను
UN/LOCODE
వాహనం

• 226 xxx
• +522
• INLKO
• UP-32
వెబ్‌సైటు: lucknow.nic.in


లక్నో Lucknow , (హిందీ लखनऊ), (ఉర్దూ لکھنؤ ]], ఉత్తరప్రదేశ్ రాజధాని. ఉత్తరప్రదేశ్ అధిక జనసాంద్రత గలిగిన రాష్ట్రంగా గుర్తింపబడినది. 2006 గణాంకాల ప్రకారం లక్నో జనాభా 25,41,101.[1]

అవధ్ ప్రాంతములో వున్నది, ఇది మిశ్రమ సాంస్కృతిక కేంద్రం. సభామర్యాదలు, అందమైన తోటలు, కవిత్వం, సంగీతం మరియు షియా నవాబుల చక్కటి ఆహార వంటకాలు ఇటు భారతదేశం లోనే గాక ఆసియా లోనే ప్రసిధ్ధి. లక్నేకు 'నవాబుల నగరం' అనేపేరు. 'తూర్పు స్వర్ణ నగరం', 'షీరాజ్-ఎ-హింద్', మరియు 'భారాతీయ కాన్ స్టాంటి నోపిల్ అనే పేర్లు కూడా కలవు.

ఉత్తరప్రదేశ్ రాజధాని నగం లక్నో. లక్నో మహానగరం లక్నో జిల్లా మరియు లక్నో డివిషన్ కేంద్రంగా ఉన్నది. లక్నో పలు సస్కృతుల సమ్మేళనంగా ఉంటుంది. నవాబు పాలనలో ప్రధాన కేంద్రమైన లక్నో 18-19శతాబ్దాలలో సాసాంస్కృతిక మరియు కళలకు కేంద్రంగా భాసిల్లింది. ప్రస్థుతం లక్నో విద్య, వాణిజ్యం, విమాన సేవలు, ఆర్ధిక, ఔషధీయ, సాంకేతిక, డిజైన్, సాంస్కృతిక, పర్యాటక, సంగీతం, మరియు కవిత్వంలకు కేంద్రగా మారింది. భారతదేశంలో వేగవంతంగా ఉపాధికల్పించే నగరాలలో లక్నో 6వ స్థానంలో ఉన్నది. భరతదేశ మహానగరాలలో లక్నో 11వ స్థానంగా ఉండగా, మద్య ఉత్తర భారతంలో రెండవ స్థానంలో (ప్రధమ స్థానంలో డిల్లీ ఉంది) ఉండగా, ఉత్తరప్రదేశం రాష్ట్రంలో ప్రధమస్థానంలో ఉంది.

లక్నో నగరం సముద్రమట్టానికి 123.45 మీటర్ల ఎత్తులో ఉన్నది. లక్నో నగరవైశాల్యం 689.1 చదరపు కిలోమీటర్లు. నగరానికి తూర్పుదిక్కులో బారబంకి జిల్లా ఉంది, పడమర దిక్కున వున్నా జిల్లా ఉంది, దక్షిణ ప్రాంతంలో రీబరేలీ ఉండగా ఉత్తరదిక్కున హర్దోయి మరియు సితాపూర్ జిల్లాలు ఉన్నాయి. గోమతీ నది వాయవ్యనగరాలలో లక్నో ఒకటి. నగరమద్యంలో నుండి గోమతీ నది ప్రవహిస్తున్నది. భారతదేశంలోని ఏప్రాంతం నుండి అయినా లక్నో నగరాన్ని వాయు, రైలు మరియు రహదారి మార్గాలలో సులువుగా చేరుకోవచ్చు. లక్నో నేరుగా కొత్తఢిల్లీ, పాట్నా, కొలకత్తా, ముంబై, వారణాసి, బెంగుళూరు, తిరువనంతపురం మరియు ఇతర ప్రధాన నగరాలతో అమౌసీ విమానాశ్రయం ద్వారా అనుసంధానించబడి ఉంది. లక్నో విమానాశ్రయానికి అంతర్జాతీయ అంతస్థు ఇవ్వడానికి యూనియన్ కాబినెట్ అంగీకరించింది. అన్ని విధాల వాతావరణ పరిస్థితులకు లక్నో విమానాశ్రయం అనుకూలంగా ఉన్నది. విమానాశ్రయం 50 విమానాలు నిలుపగల సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్థుతం లక్నో విమానాశ్రయం నుండి ఎయిర్ భారతదేశం, జెట్, GoAir, ఇండిగో మరియు స్పైస్జెట్ లక్నో నుండి మరియు దేశీయ విమానాలు ప్రయాణ సేవలందిస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ రాజధానిగా లక్నో నగరంలో విధాన్ సభ, హైకోర్ట్ (అలహాబాదు శాఖ) మరియు పలు ప్రభుత్వ కార్యాలయాలు సంస్థలు ఉన్నాయి. 1963 మే మాసంలో లక్నో సెంట్రల్ కమాండ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ ప్రధానకేంద్రంగా ఉంది. మునుపు లక్నో ఈస్ట్రన్ కమాండ్ ప్రధాన కేంద్రంగా ఉన్నది. లక్నో నగరంలో ఐ.ఐ.ఎం. లక్నో, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, టాక్సికాలజీ రీసెర్చ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్, నేషనల్ బోటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, IET లక్నో, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ, మెడికల్ సైన్సెస్ సంజయ్ మహాత్మా గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ మరియు కింగ్ జార్జ్ మెడికల్ కాలేజ్ వంటి పలు విద్యా సంస్థలు ఉన్నాయి. లక్నో నగరంలో కథక్, ఖాయల్, నవాబ్స్ మరియు సంప్రదాయ సంగీతం మొదలైన జాతీయ గుర్తింపు పొందిన సాంస్కృతిక మరియు సాంఘిక సంస్థలు ఉన్నాయి. బ్రిటిష్ పాప్ స్టార్ క్లిఫ్ రిచర్డ్ పుట్టిన ఊరు ఇదే. గొప్ప భారతీయ సంగీతకారుడైన నౌషాదీ అలీ, భారతీయ నేపథ్యగాయకుడైన తాలత్ మహమ్మద్, హిందీనాటక ఉద్యమకారుడు మరియు భరతేందు అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ వ్యవస్థాపకుడు అయిన రాజ్ బిసరాయ్, చలంచిత్ర నిర్మాత అయిన ముజాఫిర్ అలీ మరియు ది శర్మా ఇండియా పరివార్ స్థాపకుడు మరియు ఛైర్మన్ అయిన శుభ్రతా రాయ్ లకు నివాస నగరం ఇదే. లక్నోతో సంబంధబంధవ్యాలున్న ప్రాజాదరణ పొందిన కవి కైయిఫ్ ఆజ్మీ, జావేద్ అలీ, ఈ నగరంలో తన జీవితంలో నిర్మాణాత్మక కాలాన్ని గడిపిన జావేద్ అక్తర్ మరియు భారతదేశ ప్రధానమంత్రులలో ఒకడైన అటల్ బిహారీ వాజ్పాయ్ మొదలైన వారు. వీరు తమజీవితంలో కొంతకాలం ఈ నగరంలోనే గడిపారు. లక్నో ప్రామాణిక భాష హిందీ. అయినప్పటికీ లక్నో నగరంలో సాధారణంగా మాట్లాడబడుతున్న భాష సమాకాలీన హిందూస్థానీ. అంతర్జాతీయ ఐక్యత, బ్రిటిష్ వారసత్వం మరియు కామంవెల్త్ సంప్రదాయం ప్రభావం కారణంగా ప్రాధాన్యత సంతరించుకున్న ఆగ్లభాష కూడా నగరంలో విస్తారంగా మాట్లాడబడుతూ వ్యాపారంలో మరియు పాలనా నిర్వహణలో అధికంగా వాడబడుతుంది. ఉర్దూ భాష ఉన్నత వర్గాల చేత సంరక్షించబడుతూ రాజకుటుంబంలో సభ్యత్వం కలిగి ఉంది. ఉర్దూ అధికంగా కవిత్వంలో మరియు ప్రభుత్వ గుర్తులలో వాడబడుతూ లక్నో సస్కృతి మరియు సంప్రదాయాలకు గుర్తుగా ప్రభుత్వం చేత రక్షించబడుతూ ఉంది. నగరం పలు చక్రవర్తుల పాలనా ప్రభావంతో రూపుదిద్దుకున్నది. నేచురల్ ఇంపీరియల్ వంటి ప్రాంతాలు లక్నోకు నవాబుల నగరమని మరోపేరు తీసుకు వచ్చింది. అలాగే లక్నో భారతదేశ స్వర్ణనగరమని షిరాజ్-ఎ-హింద్ మరియు తూర్పు కాన్స్టాంటినోపుల్ కీర్తించబడింది.

సమాజంలో మర్యాద మరియు ఆధునిక అరుదైన స్థాయి కలిగిన సంప్రదాయాలకు లక్నో చాలా ప్రసిద్ధి చెందింది. ఇది సాంస్కృతిక మనోజ్ఞతను లేదా స్మారక లక్నో "అనేక అధ్బుతమైన నగరం" చేయడానికి ఇక్కడ భద్రపరచబడి ఉంటాయి. [17] లక్నో మరియు న్యూ ఢిల్లీ మధ్య దూరం 498 km మరియు అది, రైలు ద్వారా 7 గంటల 5 గంటల 20 నిమిషాలు పడుతుంది న్యూఢిల్లీ నుండి లక్నో చేరుకోవడానికి గాలి ద్వారా రహదారి & 45 నిమిషాల.

చరిత్ర[మార్చు]

లక్నో అనేపేరు పురాణపురుషుడు, కావ్య ఇతిహాసాల నాయకుడు , సూర్యవంశ జాతకుడు అయిన శ్రీరామచంద్రుని తమ్ముడైన లక్ష్మణుడి వలన వచ్చింది. అన్న అయిన శ్రీరాముని ఆఙ మీద లక్ష్మణుడు ప్రస్థుత లక్ష్మణ్ తిలాను రాజధానిగా చేసుకుని నగరానికి లక్ష్మణ్‌పురా లేక లఖన్‌పురా అని నామకరణం చేయబడింది. అయినప్పటికీ ఈ విషయం హిందువులు మరియు ముస్లిముల మద్య తీవ్రమైన చర్చనీయాంశం అయింది. ముస్లిం అల్పసంఖ్యాకులు ఈ నగరాన్ని నుక్లో మార్చగా. అయినప్పటికీ కాలక్రమేణా నగరం పేరు లక్నౌగా మారగా బ్రిటిష్ ప్రభుత్వం ఆ పేరును లక్నో అని పిలువసాగారు.

అవధ్ భారతదేశపు ధాన్యాగారంగా గుర్తింపు పొందింది. గంగా మరియు యమునా సారవంతమైన మైదానాన్ని వ్యూహాత్మకంగా కృషిచేసి పుష్కలమైన పంటలను ఇచ్చే పంటభూమి డోయబ్‌గా మార్చబడింది. మరాఠీలు, బ్రిటిష్ మరియు ఆఫ్గన్ నుండి వస్తున్న బెదిరింపులను ఎదుర్కొంటూ స్వతంత్రంగా మనగలిగిన సంపన్న రాజ్యమే అవధ్. 1350 నుండి అవధ్ లోని కొంత భూభాగం మరియు లక్నో డిల్లీ సుల్తానులు, షర్‌క్వి సుల్తానులు, మొగల్ సాంరాజ్యం, అవధ్ నవాబులు ఈస్టిండియా కంపెనీ మరియు బ్రిటిష్ పాలనలో భాగమైంది. 1857 లో భారతస్వాతంత్రోద్యమంలో లక్నో ఒక కేంద్రంగా మారి భారతస్వాతంత్ర సమరంలో చురుకుగా భాగస్వామ్యం వహించింది. అలాగే ఉత్తర భారతంలో ప్రముఖనగరంగా రూపుదాల్చింది. 1719 వరకు అవధ్ సుభాహ్ మొగల్ భూభాగంలో ఒక ప్రాంతంగా ఉంటూ చక్రవర్తి నియమించిన గవర్నర్ పాలనలో ఉంటూ వచ్చింది. 1722లో సాదత్ ఖాన్ మరియు బర్‌హన్-ఉల్-ముల్క్ అనిపిలువబడిన సాహసుడు అవధ్ నిజాముగా నియమించబడ్డాడు. సాదత్ ఖాన్ తన రాజ్యసభను లక్నో సమీపంలోని ఫైజాబాదు వద్ద నిర్మించాడు.

84 సంవత్సరాల కాలం (1394-1478) వరకు అవధ్ షరాకీ సల్తనత్ యిన జౌన్‌పూరులో భాంగంగా ఉంటూ వచ్చింది. 1555 నాటికి మొగల్ చక్రవర్తి హుమాయూన్ సాంరాజ్యంలో అవధ్ ఒక భాగమైంది. జహంగీర్ పాలనాకాలంలో అవధ్‌లో హుమాయూన్ అభిమాన పాత్రుడైన పండితుడైన షేక్ అబ్దులు రహీం కొంత భూభాగాన్ని బహుమతిగా ఇచ్చాడు. తరువాత షేక్ అబ్దులు రహీం తనకివ్వబడిన భూమిలో మచ్చి భవనం నిర్మించాడు. తరువాత ఈ భవనం షేక్ అబ్దులు రహీం వంశస్థులైన షేక్ జాడేస్ అధికారపీఠంగా చేసుకుని ఈ భుభాగాన్ని తన స్వాధీనంలోకి తీసుకువచ్చాడు. మొగల్ చక్రవర్తులు పాలనా వ్యవహారాలలో రాజప్రతినిధులు రాజ్యమంతా నియమించారు. రవాణాసదుపాయలు మరియు సమాచార అందుబాటు లోపాల కారణంగా రాజప్రతినిధులు వారు భూభాగాలకు స్వతంత్ర రాజులుగా వ్యవహరించసాగారు. అవధ్ నవాబు లక్నోను వారి భూభానికి రాజధానిగా చేసుకున్నారు. లక్నో నగరం ఉత్తరభారతదేశానికి సాంస్కృతిక కేంద్రంగా మారింది. నబాబుల జీవనశైలి ప్రత్యేక గుర్తింపు పొందుతూ వారి కళాపోషణలో భాగంగా సంగీతం మరియు నృత్యం వర్ధిల్లాయి. అలాగే పలు స్మారక భవనాలు నిర్మించబడ్డాయి. ప్రస్థుతం స్మారక నిర్మాణాలకు బారా ఇమాంబారా , చోటా ఇమాంబారా మరియు రూమి దర్వాజా ముఖ్యమైన ఉదాహరణలు. నవాబుపాలనలో వెలుగుచూసిన రచనలలో ముఖ్యమైనది సాంస్కృతిక సమైక్యతను ప్రతిబింబించే గంగా యమునా తెహ్జీబ్ (సంస్కృతి) ఒకటి.

మొగలు సాంరాజ్య పతనంతో అవధ్ వంటి పలు స్వతంత్ర రాజ్యాలు తలెత్తాయి. మూడవ నవాబైన షుజా-ఉద్-దౌలాను బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ నవాబు ఫ్యూజిటివ్ సాయంతో పడగొట్టారు. బక్సర్ యుద్ధంలో ఈస్టిండియా కంపనీ మూడవ నవాబైన షుజా-ఉద్-దౌలాను పూర్తిగా ఓడించిన తరువాత అత్యధికంగా మూల్యం చెల్లించిన నవాబు తనరాజ్యంలోని భూభాగం బ్రిటిష్ పాలకుల పరం చేయవలసిన పరిస్థితి ఎదురైంది. నాలుగవ నవాబైన ఆసఫ్-ఉద్-దుల్లా పాలనా కాలంలో లక్నో మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది. 1775 లో నవాబు తనరాజధానిని లక్నో నుండి ఫిజియాబాదుకు మార్చాడు. 1773 లో బ్రిటిష్ ఒక రెసిడెంటును ఏర్పాటుచేసి ఈ భూభాగంలో అధికభాగం తమ ఆధీనంలోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ ఆవధ్ రాజ్యాన్ని పూర్తిగా స్వాధీనపరవుకోవడానికి మరాఠీయులతో ముఖాముఖి ఎదుర్కొనడానికి అలాగే మొగల్ సాంరాజ్య అవశేధాలను స్వాఫ్హీనపరచుకోవడానికి వెనుకంజ వేసారు. 1778లో ఐదవ నవాబు వాజిర్ ఆలి తనప్రజలు మరియు బ్రిటిష్ ప్రభుత్వం చేత నిర్లక్ష్యం చేయబడి బలవంతంగా గద్దె దిగవలసిన పరిస్థుతి ఎదుర్కొన్నాడు. తరువాత బ్రిటిష్ ప్రభుత్వం సాదత్ ఆలీ ఖాన్ సింహాసనం అధిష్ఠించడానికి సహకరించారు. సాదత్ ఆలిఖాన్ ఒక బొమ్మ రాజుగా వ్యవహరించి ఒప్పందం ద్వారా 1801లో అవధ్ రాజ్యంలో సగభాగాన్ని బ్రిటిష్ ఈస్టిండియా కంపనీ పరం చేసాడు. అలాగే సాదత్ ఆలీఖాన్ తనసైన్యంలో సగానికి పైగా అత్యంత ఖరీదైన బ్రిటిష్ సైన్యానికి వదిలివేసాడు. ఈ ఒప్పందం ఫలితంగా బ్రిటిష్ ఈస్టిండియా కంపనీ అవధ్ ను మార్గం చేసుకుని మొగల్ సాంరాజ్యంలోకి ప్రవేశించడానికి మార్గం సుగమం అయింది. అయినప్పటికీ అవధ్ 1819 వరకు మొగలు సాంరాజ్యంలో భాగంగానే ఉంది. 1801 ఒప్పందం బ్రిటిష్ ప్రభుత్వానికి అత్యంత ప్రయోజనకరంగా మారింది. బ్రిటిష్ ప్రభుత్వం విస్తారమైన అవధ్ సంపదలను ౠణాలరూపంలో వాడుకోసాగారు. బ్రిటిష్ ప్రభుత్వం అదనంగా తమ నిర్వహణలో ఉన్న అవధ్ సైన్యాలను ప్రయోజనకరంగా ఉపయోగించుకున్నారు. క్రమంగా నవాబులు డాబు దర్పం చూపించే లాంచనప్రాయమైన రాజులుగా మారారు. వారికి ఈ భూభాగం మీద స్వలపమైన అధికారం మరియు పలుకుబడి మాత్రమే మిగిలాయి. అయినప్పటికీ 19వ శతాబ్ద మద్య కాలానికి బ్రిటిష్ ప్రభుత్వానికి నవాబుల మీద అసహనం అధికం కావడంతో అవధ్ భూభాగం మీద నేరుగా అధికారం చేయాలని నిర్ణయించారు.

1856 లో ఈస్టిండియా కంపనీ ముందు తన సైన్యాలను సరిహద్దులకు పంపింది అప్పటి వజీద్ ఆలీ షాహును నిర్బంధంలో ఉంచి తరువాత ఈస్టిండియా కంపెనీ కొలకత్తాకు తరలించింది. 1857లో జరిగిన తిరుగుబాటు తరువాత వజీద్ ఆలీ షాహు బీగం హజారత్ మహల్ కుమారుడు 14 సంవత్సరాల వస్యసున్న బిర్జిస్ క్వాద్రా సింహాసనాధిష్టుడయ్యాడై హెంరీ లారెంస్ చేత వధించబడ్డాడు. తిరుగుబాటు నిష్ఫలం కావడంతో బీగం హజారత్ మహల్ మరియు ఇతర తిరుగుబాటు నాయకులు నేపాలుకు శరణార్ధులుగా చేరారు.

1857లో భారతీయ తిరుగుబాటు (భారతస్వాతంత్ర సమరంలో ఇదే మొదటిదని భావించబడుతుంది) లో అవధ్ రాజ్యం నుండి కంపనీ కొరకు నియమించబడిన సైనికులు ప్రధానపాత్ర వహించి తమలో దాగి ఉన్న దేశభక్తిని చాటుకున్నారు. తిరుగుబాటుదారులు అవధ్‌ను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. 18 మాసాల అనతరం అవధ్ భూభాగాన్ని లక్నోతో సహా తిరిగి బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. ప్రస్థుతం షహీద్ స్మారక్ వద్ద శిధిలాలను సందర్శించి 1857 తిరుగుబాటు గురించి తెలుసుకోవచ్చు. తిరిగి చీఫ్ కమీషనరుగా ఊధ్ నియమించబడ్డాడు. 1887లో నార్త్‌వెస్టరన్ భూభాగం మరియు చీఫ్ కమీషనర్ కార్యాలయాలు ఒకటిగా చేయబడ్డాయి. ఈ భూభాగానికి 1902లో యునైటెడ్ ప్రొవింస్ ఆఫ్ ఆగ్రా మరియు ఓధ్ అని సరికొత్త నామకరణం చెయ్యబడింది. చీఫ్ కమీషనరును వెనుకకు తీసుకున్న తరువాత ఓధ్ కొంత స్వతంత్రగా వ్యవహరించడానికి వీలైంది.

ఖిలాఫత్ ఉద్యమానికి లక్నోలో చురుకైన మద్దతు ఇచ్చి స్వాతంత్రోద్యమానికి సమైక్య వేదికను రూపొందించింది. లక్నో లోని ఫిరంగి మహల్‌కి చెందిన మౌలానా అబ్దుల్ చురుకుగా భాగస్వామ్యం వహించి అలాగే మహాత్మాగాంధి మరియు మౌలానా మొహమ్మద్ అలి లకు స్వాతంత్ర్య సమరంలో సహకరించాడు. 1775 నుండి లక్నో ఓధ్ రాజధానిగా ఉన్న లక్నో 2,64,049 జనసంఖ్యతో యునైటెడ్ ప్రొవింస్ ఆఫ్ ఆగ్రా మరియు ఒధ్‌తో కలిసిపోయింది. అయినప్పటికీ ఈ ప్రాంతానికి 1920 వరకు రాజధానిగా ఉంది. 1947లో స్వాతంత్ర్యం లభించిన తరువాత లక్నో ఉత్తరప్రదేశ్ రాజధానిగా ఉన్నది.

భౌగోళికం[మార్చు]

గంగామైదానం మధ్యలో ఉన్న కారణంగా లక్నో పరిసర పట్టణాలు మరియు గ్రామాలతో పరివేష్ఠితమై ఉంది. లక్నో న్నగరం చుట్టూ మలీహాబాదు, టూ కాకోరి, మోహన్లాల్ గంజ్, గోసెయిన్ గంజ్, చింహాట్, ఇతౌంజ పట్టణాలు ఉన్నాయి. నగరానికి తూర్పు దిశగా బారాబంకి జిల్లా, పడమరదిశగా, ఉన్నావ్ జిల్లా, దక్షిణదిశలో రాయ్ బరేలీ జిల్లా మరియు ఉత్తర దిశగా సీతాపూర్ మరియు హర్దోయీ ఉన్నాయి. భౌగోళికంకా నగరం మధ్యగా ప్రవహిస్తూ ఉన్న గోమతీ నది నగరాన్ని ట్రాంస్ -గోమతీ మరియు సిస్-గోమతీ అన్న రెండుభాగాలుగా విభజిస్తూ ఉంది.

వాతావరణం[మార్చు]

లక్నో నగరంలో చలిగా ఉండే నులివెచ్చని " ఆర్ద్ర ఉపఉష్ణమండల " వాతావరణం ఉంటుంది. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు పొడిగా ఉండే శీతాకాలం, ఏప్రిల్ నుండి జూన్ వరకు పొడి వేడి వేసవి ఉంటుంది. లక్నో నగరంలో నైరుతి రుతుపవన గాలులు నుండి లభించే వర్షపాతం 896.2 మిల్లీమీటర్లు ఉంటుంది సగటున వర్షపాతం 35.28 . వర్షాకాలం జూన్ మధ్యభాగం నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉంటుంది.. అప్పుడప్పుడు వర్షపాతం జనవరి లో ఉంటుంది. శీతాకాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 25 ° సెంటీగ్రేడ్ (77 ° ఫారెన్ హీట్) మరియు కనీసం 3 ° సెంటీగ్రేడ్ (37 ° ఫారెన్ హీట్)నుండి 7 °సెంటీగ్రేడ్ (45 °ఫారెన్ హీట్ ) ఉంటుంది. పొగమంచు డిసెంబర్ చివరి నుండి చాలా సాధారణంగా ఉంటుంది . వేసవి చాలా ఉష్ణోగ్రతలు 40 ° సెంటీగ్రేడ్ (104 ° ఫారెన్ హీట్) నుండి 45°సెంటీగ్రేడ్ (113 °ఫారెన్ హీట్ ) వరకు ఉంటుంది. సరాసరి ఘరిష్ఠ ఉష్ణోగ్రత పరిధిలో, 30 (డిగ్రీ సెల్సియస్) యొక్క అధిక లో సగటు అత్యధిక. ఉంటాయి జనవరి 9 న, 2013 లక్నో -0.7 దాని ఉష్ణోగ్రత ° (31 ° ఫారెన్ హీట్)నమోదైంది. 49 సంవత్సరాలలో నమోదైన అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత ఇదే.

వృక్షజాలం మరియు జంతుజాలం[మార్చు]

లక్నోలో అతి కొద్దిగా మాత్రమే అరణ్యప్రాంతం ఉంది. ఉత్తరప్రదేశ్ సరాసరి అరణ్యప్రాంతం 7% ఉండగా లక్నోలో అరణ్యప్రాంతం 4.66% మాత్రమే ఉంది. జిల్లాలో అరణ్యప్రాంతం నిర్లక్ష్యం చాఏయబడి ఉంది. లక్నోలో షిషమ్, దక్, మహుయా, బాబుల్, వేప, పీపాల్, అశోక్, ఖాజుర్, మామిడి మరియు గౌలర్ చెట్లు పెరుగుతుంటాయి. మాలిహాబాదులో ప్రత్యేకమైన దాషేరీ మామిడి పండ్లు పండుతాయి. ఇక్కడి నుండి మామిడి పండ్లు ఎగుమతి చేయబడ్డాయి. లక్నోలో ప్రధాన పంటలుగా గోధుమలు, వడ్లు, చెరుకు, ఆవాలు, ఆవాల, ఉర్లగడ్డలు మరియు కాలిఫ్లవర్, కేబేజ్, టొమాటో, వంకాయలు మొదలైన కూరగాయలు మొక్కలు పండున్నాయి. నగర జూలాజికల్ పార్క్ లక్నో జూ నుండి కృష్ణజింకలను తీసుకువచ్చి పెంచాలని ప్రయత్నిస్తుంది.

జనసంఖ్య[మార్చు]

2011 అధికారిక గణాంకాలు లక్నో జనసంఖ్య 60,00,455. వీరిలో పురుషుల సంఖ్య 31,80,455 ఉండగా స్త్రీలు 28,20,000.2001 గణాంకాలకంటే 2011 నాటికి జాసంఖ్య 37.14% అధికమైంది. 2011 గణాంకాలు లక్నో జనసాంద్రత ఒక చదరపు మైలుకు 1,815. 2001 జనసాంద్రత 1,443. లక్నో నగర వైశాల్యం 2,528. 2011 గణాకాలను అనుసరించి స్త్రీ పుషుల నిష్పత్తి 906:1000. అక్షరాశ్యత శాతం 79.33%. 2001 అక్షరాశ్యత శాతం 68.71%. పురుషులలో అక్షరాశ్యులు 32,26,214. స్త్రీలలో అక్షరాశ్యులు 14,27,037. 1991 అక్షరాశ్యతతో పోల్చిచూసినటైతే 2011 నాటికి చక్కటి అభివృద్ధి సాగింది. ఉపాధి శాతం 32.24%. పని చేస్తున్న స్త్రీల శాతం 5.6%.

నిర్మాణశైలి[మార్చు]

మొగలు నవాబులు భవననిర్మాణశైలిని లక్నో స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రయోగాత్మకంగా పరిశోధిస్తుంది. మొగలు స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మొగల్ నిర్మాణాలను పరిరక్షించడానికి సరికొత్త వ్యూహాలను చేపట్టడానికి ప్రయత్నిస్తుంది.

 • ఈ భవనాలలో మసీదులు, ఇమాంబరాలు మరియు ఇస్లామిక్ పుణ్యక్షేత్రాలు మరియు ఉద్యానవనాలు, బరదారీలు, రాజభవన సముదాయాలు మతాతేతర నిర్మాణాలు ఉన్నాయి.

లక్నోలోని ప్రత్యేక భవనాలు:-

 • భవనాల ప్రధానద్వారాల మీద అలంకారయుతంగా చేప మరియు ఇతర కళాత్మక వస్తువుల చేత అలంకరించబడి ఉన్నాయి.
 • చెత్తర్ మంజిల్ వద్ద గొడుగులను ఉపయోగించడం.
 • 12 ప్రవేశద్వారాలు కలిగిన బార్‌ద్వారి.
 • రూమి దర్వాజా.
 • సికందర్ బాగ్ వంటి ఉద్యానవనాలు.
 • అసలీ ఇంబారా వంటి విలువైన దర్బారులు.
 • ది లాబిర్య్ంత్ భుల్‌భులియాన్.
 • తెహ్ ఖానాలు .

ది బారా ఇమాంబారా, చోటా ఇమాంబరా మరియు రూమీ దర్వాజా నవాబుల మొగలు మరియు టర్కిష్ నిర్మాణశైలికి నిదర్శనాలు. కొత్త భవనాలు కూడా స్థంభాలు , డోములు మరియు ఇతర అలకరణ వస్తువులతో అలంకరించబడతాయి. రాత్రి వేళలలో అవి అనేక వర్ణాలతో చక్కగా వెలుగుతూ ఆకర్షణీయంగా కనబడతాయి. నగరం లోని ప్రధాన మార్కెట్ అయిన హజారర్గంజ్ పాకొత్తల మేలుకయికలతో ఊహాత్మకంగా నిర్మించబడింది.

నగర పాలన[మార్చు]

ఉత్తరప్రదేశ్ రాజకీయ మరియు పాలనా కేంద్రం లక్నో. లక్నో నగరం నుండి శాసనసభకు అలాగే విధాన్ సభకు సభ్యులు ఎన్నిక చేయబడతారు. లక్నో నగరం నుండి పార్లమెణ్టుకు ఇద్దరు సభ్యులు ఎన్నిక చేయబడతారు. మూహన్‌లాల్‌గంజ్ నుండి ఒకరు మరియు లక్న్ ఉండి ఒకరు ఎన్నిక చేయబడతారు. 2012లో రాష్ట్ర ముఖ్యాంత్రిగా అక్షయయాదవ్ ఎన్నికచేయబడ్డాడు.

లక్నో ఐ.ఎ.ఎస్. అధికారిగా నియమించబడిన మెజిస్ట్రేట్ న్యాయపరిధిలో ఉంది. కలెక్టర్లు పన్ను వసూలు మరియు మరియు ప్రభుత్వ ఆస్థుల నిర్వహణ వ్యవహాలకు బాధ్యత వహిస్తాడు. అలాగే ఎన్నికల నిర్వహణా బాధ్యతలను కలెక్ట్రేట్ నిర్వహిస్తుంది. అలాగే నగరంలో చట్టం పరిరక్షణ బాధ్యతను కూడా కలెక్ట్రేట్ గమనిస్తుంది. ముంసిపల్ కమీషనర్ నిర్వహణలో నగరపాలనావ్యవహారాలు లక్నో ముంసిపల్ బాధ్యత వహిస్తుంది. కార్పొరేషన్ కొరకు నగరంలోని వార్డుల నుండి ఎన్నిక చెయ్యబడిన కౌంసిలర్లు తమకు అధ్యక్షుడుగా మేయరును ఎన్నుకుంటారు. కమీషనర్ ప్రతి ఒక్క వార్డు నిర్వహణా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటాడు.

లక్నో డెప్యూటీ ఐ.పి.ఎస్ అధికారి అయిన ఇంస్పెక్టర్ ఆధ్వర్యంలో పొలీస్ దళం రక్షణ వ్యవహారాలు నిర్వహిస్తుంది. హోం మినిస్ట్రీ అధికార పరిధిలో పోలీస్ తమ బాధ్యతలను నిర్వహిస్తుంది. నగరం పలు పూలీస్ జోంస్‌గా విభజించబడింది. లక్నో పోలీస్ లో భాగంగా ట్రాఫిక్ పోలీస్ పాక్షికంగా స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. లక్నో అగ్నిమాపకదళం చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. చీఫ్ ఫైర్ ఆఫీసర్ అధికార పరిధిలో దెప్యూటీ ఫైర్ ఆఫీసర్లు మరియు డివిషనల్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తారు, గరప్రధానులలలో ఒకడైన అటల్ బిహారీ వాజ్పాయ్ లక్నో నుండి పార్లమెంటుకు ఎన్నిక చేయబడ్డాడు.

ఆర్ధికం[మార్చు]

లక్నో ప్రజలలో అత్యధికులు ప్రభుత్వం కార్యాలయాలద్వారా ఉపాధి పొందుతున్నారు. మిగిలిన భారతీయ రాష్ట్ర రాజధానులకంటే లక్నోలో బృహత్తర పరిశ్రమలు తక్కుగా ఉన్నాయి. సమీపకాలంలో ఐ.టి రంగం , మరియు మెడికల్ / బయో టెక్నాలజీ తయారీ మరియు ప్రోసెసింగ్ ద్వారా నగరానికి అధికంగా ఆదాయం లభిస్తుంది. 2010 అక్టోబర్ లో సి.ఐ.ఐ మరియు ఇ.డి.ఐ.ఐ మొదలైన సంస్థలు నగరంలో వాణిజ్యాఅభివృద్ధి కొరకు కృషిచేస్తున్నాయి. అధికంగా ఉపాధి కల్పిస్తున్న భారతీయ నగరాలలో లక్ణో నగరం 6వ స్థానంలో ఉంది. లక్నో క్రమంగా ఐ.టి రంగంలో ఇతర నగారల పోటీలో స్తిరంగా నిలుస్తుంది.

హస్థకళా వస్తు తయారీకి లక్నో చాలా ప్రసిద్ధం. రాష్ట్రంలో ఎగుమతి చేయబడుతున్న హస్థకళా వస్తువులలో 60% లక్నో నుండి ఎగుమతి కావడం విశేషం. లక్నో నుండి ఎగుమతి ఔతున్న ప్రధానవస్తువులు పాలరాతి ఉత్పత్తులు, హస్థకళా తయారీలు, కళాఖండాలు మరియు నగలు, వస్త్రాలు, విద్యుత్ పరికరాలు, సాఫ్ట్‌వేర్ పరికరాలు, కంప్యూటర్, అప్పారెల్, ఇత్తడి కళాఖండాలు, పట్టు, తోలు, మరియు తోలు వస్తువులు, గ్లాసు వస్తువులు, కళా వస్తువులు, రసాయనికాలు మొదలైనవి. విద్యుత్ ఉత్పత్తి, రహదారి నిర్మాణం మరియు నిర్వహణ, ఎక్స్‌ప్రెస్ మార్గాలు మరియు విద్యా సంస్థల స్థాపన కొరకు లక్నో నగరం ప్రైవేట్ మరియు ప్రభుత్వభాగస్వాములను ప్రోత్సహిస్తుంది.

విద్య[మార్చు]

లక్నో నగరంలో 68 ప్రాధమిక పాఠశాలలు ఉన్నాయి. అధింగా విద్యాసంస్థలున్న నగరాలలో లక్నో ఒకటి. నగరంలో 7 విశ్వవిద్యాలయాలు, 1 సాంకేతిక విశ్వవిద్యాలయం మరియు అధిక సంఖ్యలో పాలిటెక్నిక్ ఇంస్టిట్యూట్లు, ఇంజనీరింగ్ ఇంస్టిట్యూట్లు మరియు పారిశ్రామిక శిక్షణా సంస్థలు ఉన్నాయి. అలాగే సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్, సెంట్రల్ గ్లాస్ అండ్ సెరామిక్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్, సెంట్రల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ మెడిసనల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్, ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ , సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్, సంజయ్ గాంధి పోస్ట్ గ్రాజ్యుయేట్ ఇంస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైంసెస్ అండ్ కింగ్ జార్జ్ మెడికల్ కాలేజ్ మొదలైన రీసెర్చ్ కేంద్రాలు లక్నోలో ఉన్నాయి. లక్నోలో ప్రసిద్ధి చెందిన ఐ.ఐ.ఎం. లక్నో మేనేజ్మెంట్ సంస్థ, భరతదేశంలోని లా స్కూల్స్‌లో ఒకటి ఔఇన డాక్టర్ రాం మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్శిటీ, యు.పి. సైనిక్ స్కూలు లా మార్టినియర్ కాలేజ్ మరియు మరియు సిటీ మాంటెస్సరీ స్కూలు ఉన్నాయి.

సంస్కృతి[మార్చు]

లక్నోలో కొంతమంది ప్రజలు ఇప్పటికీ అత్యున్నత ఆచారవ్యవహారాలు పాటిస్తున్నారు. అత్యున్నత సంస్కృతి కలిగిన ఇరువర్గాలు ఇరుగుపొరున నివసిస్తూ అందరికీ అనుకూలమైన ఒకభాషా మాధ్యమం లో మాట్లాడుకుంటూ ఒకరి మనోభావాలు ఒకరు పంచుకుంటూ జీవించడం అపురూపమని చెప్పవచ్చు. పలు సంస్కృతిక ఆచారాలు సంప్రదాయాలలో ఒకరితో ఒకరు మారిపడి ఉన్నప్పటికీ సమైక్యంగా జీవిస్తూ లక్నో చరిత్ర సృష్టిస్తుంది. మతబేధాలు పాటించక సమానంగా పాలనసాగించిన అవధ్ నవాబులకే ఈ ఘనత దక్కుతుంది. అవధ్ నవాబులు తాజీవితాలలో ప్రతి అడుగు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తూ ప్రజల ఆచారావ్యవహారాలను వారి వారి ఆసక్తికి తగినట్లు జరుపుకునేలా సహకరించి ఈ సంప్రదాయ సమైక్యతకు కారణం అయ్యారు. సులేమాన్ మియాన్ అని ప్రఖ్యాతి చెందిన మహ్ముదాబాదు రాజా సాహెబ్ ఈ భుభాగంలో వర్ధిల్లుతున్న గొప్ప సాంప్రదాయాలకు జీవించిఉన్న ఉదాహరణగా ఉన్నాడు. వి.ఎస్ నైపౌల్, డాల్రింపుల్ మరియు పలువురు రచియితలు తమ రచనలద్వారా రాజా సాహెబ్‌ను ప్రశశించి వ్రాసారు.

ఉర్ధూ సాహిత్యం[మార్చు]

 • లక్నో మర్సియా నిగారి వంటి వంటి ఉర్ధూ సాహిత్యానికి పుట్టిల్లు.
 • ముహమ్మద్ పవక్త మనుమడైన హజారత్ ఇమాం హుసైన్ బలిదానం స్మృత్యర్ధం రచించబడినదే మర్సియా.
 • మీర్ అనీస్ మరియు దబీర్ లు ప్రఖ్యాతి చెందిన మర్సియాలోని చాలాభాగం రచించారు. ఉర్ధూ సాహిత్యచరిత్రలో ప్రసిద్ధిచెందిన మర్సియా మరియు అజాదారీ సంఘటనలు ఇప్పటికీ మొహరం సమయంలో పఠించబడుతున్నాయి.
 • ఉర్ధూ కవిత్వ సస్కృతి ఇప్పటికీ ప్రజాదరణ చూరగొంటున్నది. ఓధ్ నవాబుల చరిత్రను తెలిపే అజాదారి లక్నో ప్రజల మన్ననలను అందుకున్నది. ఓధ్ నవాబు మొహరం మరియు అందులోని మతపరమైన సంఘటనలకు చాలా గౌరవం ఇచ్చాడు. భారతదేశంలోని పలు కవిసమ్మేళనాకు లక్నో ప్రధాన వేదికగా ఉంది.

సమీపకాల కవులు:-

 • డాక్టర్ సురేద్ర కౌర్ ప్రీత్.
 • కాజిం జార్‌వాలి.
 • సర్వర్ నవాబు సర్వర్.
 • కియాం నక్వి జైసి.
 • నవాబ్ బాకర్ అలీ ఖాన్ " రావిష్ లఖ్నవి".
 • సర్రర్ లక్నోవి.
 • షౌక్ లక్నోవి.
 • అస్లాం తాబ.
 • షరీబ్ కౌసర్ అల్వి " షరీబ్ కాక్రో" .
 • లక్నో ప్రజలు ప్రత్యేకంగా ముస్లిం ప్రజలకు ఉర్ధూ భాష మహత్యం మరియు సౌందర్యం బాగా తెలుసు. లక్నో నగరం ఉర్ధూసాహిత్యానికి ప్రత్యేక గుర్తింపు పొదింది.

భాష మరియు సాహిత్యం[మార్చు]

ముస్లిం సస్కృతీవైభవం విలసిల్లిన అంతర్జాతీయ నగరాలలో లక్నో నగరం ఒకటి. సమగ్ర ముస్లిం మతసంస్కృతిలో భాగమైన పురాణ కవిత్వం అందించిన మీర్ అనిస్ మరియు మిర్జా డాబీర్ వంటి ఇద్దరు ఉర్ధూ కవులు పుట్టిన నగరం లక్నో. వీరు రచించిన మర్సియా ఇమాం హుసైన్ బలిదానం సంఘటనను కీంద్రీకరించి ఉంటుంది. కర్బాలా యుద్ధసమయంలో జరుగున ఈ సంఘటన మొహరం సమయంలో స్మరించబడుతుంది.

దినసరి జీవితంలో లక్నో ప్రజలు పరస్పరం హింది మరియు ఆంగ్లభాషలో మాట్లాడుకుంటారు. నగరానికి విచ్చేసే అయిథులు లక్నో వారి భాష మర్యాదతో కూడిన ఉన్నతస్థాయి భాష అని అభిప్రాయపడుతున్నారు. సమీపకాలంగా ప్రభుత్వం ఉర్ధూ భాషకు ప్రోత్సాహం అందిస్తుంది. ఘోరక్ పూర్ జైలులో బ్రిటిష్ వారిచేత ఉరితీయబడిన గొప్ప కవి అయున రాం ప్రసాద్ బిస్మిల్ లక్నో సంస్కృతిచేత విపరీతంగా ప్రభావితుడై ఆవిషయం తనకవిత్వంలో పలుమార్లు ప్రస్తావించాడు. సమీపనగరాలైన కాకోరీ, డారీబాదు, తాహ్సీల్, ఫతేపూర్, బారబంకీ, రుదౌలి మలిహాబాదు పట్టణాలు కూడా మొహ్సిన్, కకొర్వి, బరబంక్వి మరియు జోష్ మలిహాబాదు వంటి ప్రఖ్యాత ఉర్ధూ కవిత్వం మరియు సాహిత్యాలకు వేదికలయ్యాయి. 1857 నాటి తిరుగుబాటు ఉద్యమం నేపథ్యంగా వ్రాయబడిన 1857 తిరుగుబాటు యొక్క 150వ సంవత్సరం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. 1857లో లక్నోవాసి వ్రాసిన మొదటి ఆంగ్లనవల రికాల్సిట్రాంస్.

ఆహారసంస్కృతి[మార్చు]

అవధ్ భూభాగనికి ప్రత్యేకమైన నవాబీ శైలి ఆహారసంస్కృతి ఉంది. అవధ్ భుభాగంలో గుర్తింపు పొందిన ఆహారాలు పలురకాల బిర్యానీలు, కబాబులు మరియు బ్రెడ్డు రకాలు. కబాబులు కూడా వివిధ రకాలుగా తయారు చేయబడతాయి. వాటిలో కసోరీ కబాబు, ష్యామీ కబాబు, పాటిల్ కీ కబాబు, ఘుత్వా కబాబు, మరియు సీఖ్ కబాబు అనేవి వాడుకలో ఉన్న కబాబు రకాలు. గిల్వాటి కబాబు మరియు కకోరీ కబాబులు ఆహారప్రియుల మనసుచూరగొన్న కబాబులు. లక్నో రివాడీ స్వీటు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగినది.

అవఫ్హి ఆహారసంస్కృతిలో భాగమైన మృదువైన మాంసంతో తయారు చేయబడిన తందూరి కబాబు లక్నో వాసుల ఆదరణ పొందినది. గొర్రెపిల్ల మాంసానికి 160 మసాలాలు చేర్చి తయారుచేయబడుతుందని అనుకుంటున్నారు. యోగర్ట్, గరం మసాలా, తురిమిన అల్లం, నలుగకొట్టిన అల్లం, యాలుక పొడి, లవంగాల పొడి, కరిగిన నెయ్యి, ఎండబెట్టిన పుదీనా, రింగులుగా కత్తిరించిన చిన్న ఎర్రగడ్డలు, వినిగర్, చక్కెర, నిమ్మకాయ మొదలైనవి. చౌక్ ప్రాంతంలో లభిస్తున్న ఆహారాలలో ప్రత్యేకమైనది ప్రజాదరణ కలిగినది 100 సంవత్సరాల చరిత్ర ఉన్న తందూరి కబాబు మాత్రమే. తందూరి కబాబు ఒకే మనిషి తయారుచేయబడుతుంది. ఇందులో వాడే మాసాలాలను రహస్యంగా కాపాడుతున్నారు. తందూరి కబాబు తయారీలో కుటుంబం లోని స్త్రీలు కూడా పాల్గొంటారు.

మొహరం[మార్చు]

లక్నో షీ ఇజానికి గుర్తింపు పొందింది. షీ ఇజం అంటే షియా సంస్కృతి సంక్షిప్తరూపం. ఇది మొహరం మరియు అజ్దారీ ఉద్యమంతో సంబంధం ఉన్నది. హిందువులతో సహా అన్ని మతాలకు చెందిన వారు మొహరం ప్రత్యేకంగా ఇమాం హుసైన్ స్మారకార్ధం జరుపుకుంటున్న 10వ మొహరం ఉత్సవాలను గమనిస్తూ ఉంటారు. 1400 సంవత్సరాల ముందు కర్బాలా ఇరాక్ యాజీద్ సైన్యాలు ఇమాం హుసైన్ మరియు అతని కుటుంబంలో వారిని అషుర దినం నాడు వధించి మిగిలిన కుటుంబసభ్యులను వారిని ఖైదుచేసారు. లక్నోలో జరపబడే ఊరేగింపు చాలా ప్రాముఖ్యత కలిగినది. ఈ ఉత్సవాలను అవధ్ నవాబుల సమయంలో ప్రారంభించారు. మజాలిసెస్, ఊరేగింపులు అరియు ఇతర ఆచారాలు షియా సంప్రదాయానికి చెందిన ప్రజలు హుసైన్ (అజ్దారీ) ని ఆరాధిస్తూ నిర్వహిస్తుంటారు.

షాహి జరిహ్, జాలూస్-ఎ-మెహుంద్,ఆలమ్-ఇ-అషుర మరియు చప్ తాజియా షియా సంప్రదాయ ప్రజల అత్యుత్సాహంగా జరుపుకునే ప్రత్యేక ఉత్సవాలు. అవధ్ నవాబుల కాలంలో ఆరంభించబడిన ఈ ఉత్సవాలు 1977 వరకు నిరాటకంగా నిర్వహించబడుతున్నాయి. తరువాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అజదారీ ఉత్సవాలు మరియు ఊరేగింపులు బహిరంగంగా జరపడాన్ని నిషేధం విధించింది. తరువాత 20 సంవత్సరాల ఉత్సవాలు ఊరేగింపులు కూటములు ప్రైవేట్ మరియు మతపరమైన తాల్‌కటోరా కర్బాలా, ఇమాంబరా అసిఫి (బరా ఇమాంబరా) హసినాబాదు (చోటా ఇమాంబరా), డార్ఘ్ హజారత్ అబ్బాస్, షాహ్ నజ్జాబ్, ఇమాంబరా ఘుఫ్రాన్ మరియు మాబ్ వంటి ప్రదేశాలలో నిర్వహించబడ్డాయు. ప్రస్థుతం 900 షియా ఉత్సవాలలో 9 ఉత్సవాలను ఫెస్టివల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది షియాస్‌లో నమోదు చేసి జరపడానికి అనుమతి లభిస్తుంది.

నృత్యం నాటకం మరియు కళలు[మార్చు]

భారతీయ సంప్రదాయ నృత్యాలలో ఒకటి అయిన కథక్ లక్నో నగరంలోనే రూపుదిద్దుకుంది. అవధ్ రాజ్యానికి చివరి నవాబు అయిన వాజిద్ ఆలీ షాహ్ కథక్ నృత్యానికి అత్యంత అభిమాని మరియు కథక్ నాట్యంలో నిష్ణాతుడు అన్నది విశేషం. లచ్చు మహరాజ్, అచ్చచ్చన్ మహరాజ్, షాంబూ మహరాజ్ మరియు బిర్జూ మహరాజ్ మొదలైన వారు ఈ నృత్యం సజీవంగా సాగడానికి సహకరించారు.

 • ప్రముఖ ఘజల్ గాయకుడు బేగం అక్తర్ పుట్టిన ప్రదేశం ఇదే. ఆమె ఘజల్ సంగీతానికి మార్గదర్శకత్వం వహించి ఘజల్ సంగీతాన్ని ఊహించని ఎత్తులకు తీసుకువెళ్ళింది. ఆమెకు ఖ్యాతి తీసుకువచ్చిన ప్రముఖ గీతం "ఏ మొహబ్బత్ తేరే అంజాం పే రోనా ఆయా".
 • ప్రఖ్యాత సంగీత కళాకారుడైన పండిత్ విష్ణు నారాయణ్ ఙాపకార్ధం లక్నో లోని ది మ్యూజిక్ ఇంస్టిట్యూట్ యూనివర్సిటీకి భాత్కండే మ్యూజిక్ ఇంస్టిట్యూట్ యూనివర్సిటీ అని నామకరణం చేయబడింది. శ్రీలంకా, నేపాల్ మరియు ఇతర దేశాల నుండి భాత్కండే మ్యూజిక్ ఇంస్టిట్యూట్ యూనివర్సిటీలో సగీతం లేక నృత్యం అభ్యదించడానికి వస్తూ ఉంటారు.
 • లక్నో నగరంలో వికాస్ ఖండ్-1 లోని గోమతీ నగరులో భరతేందు అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ అఆర్ట్స్ (బి.ఎన్.ఎ) (భరతేందు నాట్య అకాడమీ అని కూడా పిలుస్తుంటారు) లో అనే నాటకశిక్షణా సంస్థ ఉంది. 1977 నుండి ఇది స్వతంత్ర నాటక పాఠశాలగా మారింది.
 • ప్రభుత్వ సంస్థలే కాక లక్నోలో ప్రవేట్ సంస్థలకు చెందిన ఐ.పిటి.ఎ, ధియేటర్ ఆర్ట్స్ అర్క్ షాప్ (టి.ఎ.డబల్యూ), దర్పణ్, మంచ్‌క్రితి మరియు అతిపెద్ద యువబృందాలకు ప్రోత్సాహం అందిస్తున్న జోష్ మొదలైనవి ఉన్నాయి. జోష్ ధియేటర్ సాధారణంగా యువతకు మరియు బాలబాలికలకు నాటకశిక్షణ, వర్క్ షాపులు మరియు ఏక్టివిటీ నిర్వహిస్తున్నారు. లక్నో నౌషద్ ఆలీ, తాలత్ మొహమ్మద్, అనుప్ జలోటా మరియు బాబా సెహగల్ వంటి సంగీత నక్షత్రాలను చలనచిత్ర నగరానికి అందించింది. బ్రిటిష్ పాప్ స్టార్ సర్ క్లిఫ్ రిచర్డ్ కు పుట్టిన నగరం ఇదే.

చనలచిత్రాలకు ప్రేరణ[మార్చు]

హిందీ చిత్రసిమకు ప్రేరణ కలిగించిన భారతీయ నగరాలలో లక్నో ఒకటి. మక్‌రూహ్ సుల్తాన్‌పురి, కైఫీ ఆజ్మీ, జావేద్ అక్తర్, హిమాంశు శర్మ, ఇక్రం అక్తర్( రెడీ, థాంక్యూ నో ప్రాబ్లం), అలీ రాజా, భగవతీ చరణ్ వర్మ, కుముద్ నగర్, డాక్టర్ అచలా నగర్, వజాహత్ మిర్జా(మదర్ ఇండియా మరియు గంగా జమునా రచయిత), అంరిత్‌లాల్ నగర్, అలి సరదార్ జఫ్రీ, కె.పి సక్సేనా మరియు ప్రఖ్యాత సంగీత దర్శకుడు నౌషద్ అలీ వంటి పాటల రచయితలు, మాటల రచయితలు మరియు సంగీత దర్శకులను హిందీ చలనచిత్ర సీమకు అందించిన ఘనత లక్నోనగరానికి దక్కింది. ప్రముఖ బాలీవుడ్ మరియు బెంగాలీ చలనచిత్ర నటుడు సన్యాల్ కుటుంబానికి చెందిన పహాడీ సన్యాల్ లక్నో నగరానికి చెందిన వాడే. అదనంగా పలు హిందీ చానచిత్రాలకు లక్నో నేపథ్యంగా ఉన్నది. ఉదారహరణగా శశికపూర్ జనూన్, ముజాఫర్ అలిస్ ఉంరావ్ జాన్ మరియు గామన్, సత్యజిత్ రాయ్ యొక్క సత్రంజ్ కె ఖిలాడీ, ఇస్మాలీ మర్చంట్స్ షేక్స్పియర్ విల్లా, పి.ఎ.ఎ,షీర్ చలనచిత్రాలలో కొంతభాగం లక్నోలో చిత్రీకరించబడ్డాయి.

మనీష్ జా వ్రాసి దర్శకత్వం వహించిన చలనచిత్రం అనవర్ లో సిద్ధార్ధ్ కొయిరాలా మరియు మనీషా కొయిరాలాలను లక్నో మరియు కకోరీ మరియు బక్షి కా తాలబ్ వంటి చుట్టుపక్కల పరిసరాలలో చిత్రీకరించారు. హోటెల్ రూమీ దర్వాజా (రామన్ గేట్) దృశ్యాలను " తను వెడ్స్ మను " చిత్రంలో చిత్రీకరించారు. లేడీస్ వి.ఎస్ రికీ బహి, బుల్లెట్, రాజా, ఇషాక్వాడే మరియు డాబాంగ్ 2 లను లక్నో మరియు పరిసర ప్రాంతాలలో చిత్రీకరించారు. బాబర్ చిత్రంలో కొన్ని దృశ్యాలు లక్నోలో చిత్రీకరించారు.

మాద్య మం[మార్చు]

స్థానిక ఛానళ్లలో[మార్చు]

లక్నో లో అనేక స్థానిక చానెల్ ఉన్నాయి. వాటిలో చానళ్ళలో ఉదయం సమయాలలో చలనచిత్రాలు సాయంత్రం సమయాలలో వార్తలు మరియు విద్యా కార్యక్రమాలను ప్రసారం చేస్తుంటాయి. హుసైని ఛానల్ ముస్లిం మతం జనాభా అనువు అయిన కార్యక్రమాలు ప్రసారం చేస్తుంటాయి. టి.వి చానెల్స్ ఉన్నాయి. అన్ని ఛానెల్లు స్థానిక కేబుల్ ఆపరేటర్ల చేత నడుపబడుతున్నాయి.

ప్రెస్[మార్చు]

జర్నలిజానికి లక్నో చారిత్రాత్మకంగా ప్రధాన కేంద్రంగా ఉంది. 1865 లో స్థాపించబడిన "పయనీర్", కార్యాచరణ భారతదేశంలో ప్రచురించబడిన పత్రికలలో రెండవ ప్రాచీన ఆంగ్ల భాషావార్తాపత్రిక. "నేషనల్ హెరాల్డ్", ను రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు భారతదేశం యొక్క మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించారు . ఈ వార్తాపత్రిక లక్నో నుండి ప్రచురించబడింది మరియు మణికొండ చలపతి రావ్ ద్వారా సవరించబడింది.

నగరం యొక్క ప్రముఖ ఆంగ్ల దినపత్రికలు " ఇండియన్ టైమ్స్" , టైమ్స్ ', నార్త్ ఇండియా హిందూస్థాన్ టైమ్స్, పయనీర్ మరియు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మొదలైనవి. హిందీ మరియు ఉర్దూ లో అనేక దినపత్రికలు నగరం లో ప్రచురించబడుతున్నాయి. హిందీ పత్రికలు మధ్య దైనిక్ జాగరణ్, అమర్ ఉజాలా, దైనిక్ హిందూస్తాన్, రాష్ట్రీయ సహారా, జన్సత్తా, ఐ నెక్స్ట్ మరియు స్వతంత్ర భారత్ మొదలైనవి. ప్రధాన ఉర్దూ పత్రికలు రోజానమా రాష్ట్రీయ సహారా, సహాఫత్ , అవధ్ నామా, క్వామీ ఖబ్రెయిన్, ఆగ్, రోజ్నామా, ఉర్దూ, శుభనామా ఉర్దూ మరియు జవేజా డైలీ మొదలైనవి. లక్నోలో ది ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మరియు యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా కార్యాలయాలు ఉన్నాయి. అన్ని ప్రధాన భారతీయ వార్తాపత్రికలు లక్నో లో ప్రతినిధులు మరియు స్ట్రింజర్స్ కలిగి ఉన్నాయి.

రేడియో[మార్చు]

అన్ని భారతదేశం రేడియో ప్రారంభ స్టేషన్లు ఒకటి కొంతకాలంగా కోసం లక్నో లో కార్యాచరణ ఉంది. 2000 లో లక్నో లో ఎఫ్.ఎం రేడియో ప్రసారాలు ప్రారంభించారు. నేడు నగరంలో ఎఫ్.ఎం రేడియో స్టేషన్లు ప్రసారాలను అందిస్తున్నాయి.

 • రేడియో సిటీ 91.1 ఎం.హెచ్.జెడ్.
 • రెడ్ FM 93.5 ఎం.హెచ్.జెడ్.
 • రేడియో మిర్చి 98.3 ఎం.హెచ్.జెడ్.
 • AIR FM రైన్బో 100.7 ఎం.హెచ్.జెడ్.
 • గ్యాన్ వాణి 105,6 ఎం.ఎచ్.జెడ్. (విద్యా)
 • సి.ఎం.ఎస్ ఎఫ్.ఎం 90.4 ఎం.హెచ్.జెడ్. (విద్యా)

ఇంటర్నెట్[మార్చు]

నగరం బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ మరియు వీడియో కాన్ఫరెన్స్ లాంటి సౌకర్యాలను కలిగి ఉంది. బి.ఎస్.ఎన్.ఎల్ , భారతి ఎయిర్టెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా కమ్యూనికేషన్స్, ఎయిర్సెల్, టికొన , హాత్వే & ఎస్.టి.పి.ఐ వంటి ప్రధాన సంస్థలు, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ అందించడానికి విస్తృత మౌలిక వసతులు కలిగి ఉంది.

ప్రముఖులు[మార్చు]

 • Kalbe జావాద్, షియా నాయకుడు
 • హమీదుల్లా మీర్జా, భారతీయ న్యాయవేత్త బేగ్
 • ఆసిఫ్ ఖాన్, భారత షాయర్
 • సలీం కిద్వాయి ప్రొఫెసర్ మరియు రచయిత
 • క్లిఫ్ రిచర్డ్, బ్రిటిష్ పాప్ గాయకుడు
 • ముజాఫార్ ఆలీ, వెటరన్ సినిమా మేకర్
 • జగదీష్ మహాత్మా గాంధీ, వివరాలు మరియు పారిశ్రామికవేత్త
 • సుబ్రత రాయ్, పారిశ్రామికవేత్త
 • జావేద్ అఖ్తర్, గేయరచయిత మరియు కథా
 • వజాహత్ మీర్జా, స్క్రీన్ రైటర్, యొక్క సంభాషణ రచయిత & డైరెక్టర్
 • నౌషాద్ ఆలీ, కంపోజర్ మరియు సంగీత దర్శకుడు
 • నరేష్ ట్రెహాన్ , హృద్రోగ
 • జయబాధురిని బచ్చన్, నటి
 • బిరిజు మహారాజ్, కథక్ డాన్సర్
 • నాదిరా బాబర్, నాటక
 • మీర్ టఖీ మీర్, కవి
 • నూర్ జహాన్

చూడవలసిన ప్రదేశాలు[మార్చు]

 • బారా ఇమాంబరా
 • చోటాఇమాంబరా
 • రూమి దర్వాజా
 • షా నజాఫ్ ఇమాంబరా
 • హజ్రత్ అబ్బాస్ యొక్క దర్గా
 • దిల్కుష ప్యాలెస్
 • దయానత్ -ఉద్-దౌలా యొక్క కర్బాలా
 • మీర్ ఏనీస్ యొక్క మక్బారా
 • సిబ్తైనాబాదు ఇమాంబరా (అమ్జాద్ ఆలీ షా మక్బారా)
 • అయిన రౌజా కజ్మియాన్
 • రెసిడెన్సీ
 • తల్కాటొర కర్బాలా
 • భూల్ భులయ్యా (లాబ్రింత్)

ప్రత్యేక ఉత్సవాలు[మార్చు]

చుప్ తేజియా[మార్చు]

చుప్ తేజియా పేరు మీద జరపబడే ఊరేగింపు ఇతర భారతీయ నగరాలలో విస్తరించడానికి ముందే లక్నో నగరంలో ప్రారంభించబడింది. బహు బీగం వంశస్థుడైన నవాబు అహమ్మద్ ఆలి ఖాన్ సహూకత్ యార్ జంగ్ చేత చుప్ తేరా ఊరేగింపులు ఆరంభించబడ్డాయి. లక్నోలో అనుమతించబడిన 9 ఊరేగింపులలో ఇది ఒకటి. అలాగే లక్నోలో నిర్వహించబడుతున్న అజదారి ఊరేగింపులలో ఇది ప్రముఖమైనది.

చెహ్లం (20 సఫర్) రోజున నిర్వహించే తేజియా ఊరేగింపులను పందొమ్మిదో శతాబ్దంలో నవాబ్ మియా కుటుంబం చెహ్లం 18వ రోజుకు మార్చారు. రబీ 8 'అల్-అవ్వల్. రబీ 8 ఉదయం ఈ సంతాప ఊరేగింపు' అల్-అవ్వల్, ఆలం, జారీ మరియు తేజియా విక్టోరియా వీధి లోని ఇమాంబరా నజీమ్ సాహెబ్ భవనం నుండి ప్రారంభమై పూర్తి నిశ్శబ్ధంగా కదులుతూ పటానియా కాజ్మియాన్ గుండా భారీ బ్లాక్ తాజియా పాతిపెట్టిన కర్బాలా, వద్ద ఆగిపోతుంది అయితే మే 1969 26 న ఈ ఊరేగింపులో ఉద్రిక్తలు తీవ్రమై ఘర్షణలు మరియు హత్యల చోటుచేసుకున్నాయి. మరొక సంఘటనలో తర్వాత ఒక షియా బయటపడి చుప్ తేజియా ఆలం ఊరేగింపు పుల్ గులాం సున్నీ మొహల్లాస్ ఊరేగింపును శాంతియుతంగా జరుపుతూ మొహమ్మద్ నగర్ చేరుకున్న తరుణంలో హఠాత్తుగా ఒక సున్ని మసీదు నుంచి ఇటుక-విసిరిన సంఘటన జరిగింది.

నౌరుజ్[మార్చు]

12వ షియా తరువాత ఇస్మియాలిస్,అలావిటీస్ మరియు అలెవిస్ నౌరిజ్ దినం అత్యంత ఆరాధనతో నిర్వహించారు. త్వెల్వర్ షియా ముస్లిం పండితులైన అబ్దుల్-క్వాసిం అల్ ఖొయీ, ఇమాం ఖోమేని మరియు అలీ ఆల్ సిస్తానీ మొదలైన వారు నవాజ్ పడిపోయిన రోజున ఉపవాసదినంగా ఆచరించాలని ప్రతిపాదించారు. ఈ సంఘటన జరిగిన క్రీ.పూ మార్చ్ 21 షియా ముస్లిములకు ప్రధానమైన రోజుగా మారింది.

షాపింగ్ షాపింగ్ సెంటర్లు[మార్చు]

లక్నో ప్రాధాన్యతలలో షాపింగ్ సెంటర్లు మరియు మార్కెట్/ బజార్లు ఒకటి. లక్నో నగరం మద్యభాగంలో ఉన్న హజరత్ గంజ్(హిందీ: हज़रतगंज, ఉర్ధూ: حضرتگںج) నగరంలో షాపింగ్ ప్రాంతాలలో ప్రధానమైనది. ఇక్కడ వ్యాపారం ప్రాధాన్యత కలిగిన బజార్లతో షాపింగ్ కాంప్లెక్సెస్, రెస్టారెంట్లు, హోటేల్స్, ధియేటర్లు మరియు కార్యాలయాలు కూడా ఉన్నాయి. లక్నో షాపింగులో మద్యయుగపు నవాబుల సంస్కృతితో గట్టి సంబంధం కలిగి ఉంటుంది. లక్నో నూలు వస్త్రాల తయారీ మరియు పురాతకాల చికంకారీ వర్క్‌కు సుప్రసిద్ధం. లక్నో సెంట్లు భారతదేశంలో ప్రఖ్యాతి వహించాయి. ప్రధాన షాపింగ్ మార్కెట్ అయిన హజరత్ గంజ్, యాహియా గంజ్, అమీనాబాదు, కపూర్‌తలా, జనపథ్, చౌక్, భూత్నాథ్ & గోమతీ నగర్ మొదలైనవి. లక్నో రత్నాలు మరియు ఆభరణాలకు దుకాణాలకు కూడా ప్రసిద్ధి.

షాపిన్ సెంటర్ల జాబితా[మార్చు]

 • షహరా గంజ్ హజరత్ గంజ్.
 • ఫన్ రిపబ్లిక్ గోమతీ నగర్ .
 • వేవ్ గోమతీ నగర్.
 • ఫీనిక్స్ కాన్పూర్ రోడ్
 • రిజ్వాన్ మాల్ (ఎస్సార్) రాజాజీ పురం.
 • గార్డెన్స్ గల్లెరియా జాతీయ రహదారి 24బి.
 • ఫెలిక్స్ స్క్వేర్ షుషాంత్ గోల్ఫ్ నగరాన్ని
 • భారతి వాల్ మార్ట్ అమర్ సహీద్ మార్గం
 • తాజ్ రెసిడెన్సీ దగ్గర రివర్సైడ్ హోటల్
 • నెలవంక అంసాల్ ఎ.పి.ఐ

చికెంకారీ మరియు ఇతర ఎంబ్రాయిడరీ కళ[మార్చు]

Lucknow is known for the embroidery works like chikankari, zari, zardozi, kamdani, gota making (goldlace weaving), etc. Chikankari is a famous and popular embroidery work that is known all over India. The 400-year old art of Chikan embroidery in its present form was developed on Lucknow and it is the only place to preserve this art to this day; in other places this craft is extinct. It is mainly practiced in and around Lucknow, famed for its tehzeeb or refined style of behaviour where chikan reached its most elaborate and distinctive form. Chikankari is famous as 'shadow work' and is a very delicate and artistic hand embroidery done using white thread on fine white cotton cloth usually fine muslin or chiffons. Sometimes yellowish muga silk was also used in addition to the white thread. The work is done on topis (caps), kurtas, saris, cogds (a kind of scarf) and other outfits. There are number of tales narrate about the birth and development of this subtle art. The word chikan itself is said to have been derived from the Persian word chakeen meaning embroidery or designs. Abdul Halim Sharar, a novelist and historian, in his book 'Lucknow: the Last Phase of an Oriental Culture', says that "chikan embroidery became popular during the time of Nazir Ud Din Haidar in the second quarter of the 19th century when in a mohalla in Daliganj, Lucknow, Bade Miya Zazira designed the first piece of chikan embroidery on an angarkhan (waistcoat) and showed it to the Badshah, who was delighted and paid him generously for it."[58] During the first half of the 19th century a school of chikankari developed in Lucknow with its own unique style and aesthetic. It is an intricate embroidery involving 38 types of stitches (morri, katao, and bakhia) produced on textiles. Lucknow has lost most of its old culture and etiquette, celebrations and processions, it is the chikan industry which was almost unknown in the nawabi has not only survived but is in flourishing state, to-day and is destined to last long. Chikankari industry has grown to great proportions within the last 20 years due to increasing demand within and foreign countries, chikan craft has become an important industry of Lucknow and Awadh. About 2500 entrepreneurs are engaged in manufacturing the chikan for local, national and international market. Lucknow is the largest exporter of Chikan embroidery garments. The four kinds of chikan work in Lucknow are: katao, where minute patterns of different materials are sewn into the muslin; murri, where designs are embossed upon the muslin with the use of thread ; phanda, a design made of thread in chain stitich; and jali kholna, in which individual threads are carefully removed from material and re-used in the same place to form design. As the ultimate proof of recognition, Geographical Indication Registry (GIR) accorded the Geographical Indication (GI) status for chikankari in December 2008, which recognized Lucknow as an exclusive hub of chikankari.[59] Lucknow has also a name for other forms of embroidery. Gold and silver embroidery is executed with a variety of tinsels, such as salma, ghizai, sitara, kamdani, and kalabatun. Lucknow's zardozi and kamdani work is quite popular, and for decades, dazzled the courts of the Nawabs of Oudh. Zardozi and kamdani are the two variants of gold and silver embroidery work being carried out in Lucknow. The essential difference is that kamdani is work done with gold or silver thread (fir) and Zardozi done with salma and sitara, also zardozi is heavy and elaborate and the kamdani is lighter and simpler. The well-known kamdani work is similar to chikan but is done in gold and silver threads on white cloth. Kamdani is done with flattened silver or gilt wire on lighter materials. The needle is threaded with ordinary thread which is doubled, the two ends being secured with a knot. In Lucknow, zardozi and chikan were co-existent, but more or less in parallel. Zardozi is the name given to heavy embroidery on silk fabric in raised silver and gold thread. The fabric is stretched in a frame and the design traced. The zardozi of Lucknow is of a bareek or fine variety, however it is the quicker zari work that is more popular. In 2013 the GIR accorded the GI registration to the Lucknow Zardozi – the world renowned textile embroidery from Lucknow. The Zardozi products manufactured in areas in Lucknow and six surrounding districts of Barabanki, Unnao, Sitapur, Rae Bareli, Hardoi and Amethi became a brand and can carry a registered logo to confirm their authenticity.[60] The principal kinds of lace made at Lucknow from gold and silver wire are called lachka, kalabatu, and lais. In lachka the warp is of silver-gilt strips, woven with a woof of silk; it is often stamped with patterns in high relief. Kalabatu consists of strips of gilded silver twisted spirally round threads of yellow silk and then woven into ribbon. In lais the warp is of silk and the woof of the wire. Lucknow is also famous for gota (gold lace) and kinari (silver lace). Gota work involves placing woven gold cloth onto other fabric to create different surface textures. Kinari is the fringed or tasselled border decorations. The weaving of gota gota and kinari is still done in Lucknow. Chowk area of Lucknow still houses the exotic crafts of Lucknow such as making of warq, itra, zarda, chikan, kamdani, zari, gota, kinari etc.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "World Gazette". Archived from the original on 2013-01-05. Retrieved 2006-09-29. 

బయటి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=లక్నో&oldid=1420566" నుండి వెలికితీశారు