లక్షద్వీపములు
లక్షద్వీపములు భారత దేశములోని అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతము. ఈ దీవుల యొక్క భూ వైశాల్యము మొత్తము 32 చదరపు కి.మీ, అరేబియా సముద్రములో, కేరళ తీరమునుండి 200 నుండి 300 కిలోమీటర్ల దూరములో ఉన్నవి. ఈ దీవులలో పది దీవులు మాత్రమే జనావసము ఉన్న దీవులు. మిగిలిన 17 నిర్జనమైన దీవులు. ఇవేకాక ఇంకా లెక్కలోకి తీసుకోని ఎన్నో చిన్న దీపఖండములు ఉన్నవి.
జనావాసమైన దీవులు:
కవరత్తి (రాజధాని నగరమైన, కవరత్తి ఇక్కడే ఉన్నది), ఆగట్టి, మినీకాయ్ మరియు అమిని ప్రధానమైన దీవులు. 2001 నాటి జనాభా లెక్కల ప్రకారము ఈ కేంద్రపాలిత ప్రాంతము యొక్క మొత్తము జనాభా 60,595. ఆగట్టిలో ఒక విమానాశ్రయము ఉన్నది. ఇక్కడికి కొచ్చిన్ నుండి నేరుగా విమాన సౌకర్యము కలదు.
1973 వరకు, ఈ దీవుల సమూహము ఆంగ్లీకరించిన లక్కదీవ్స్ అనే పేరుతో పిలవబడేది. (సంస్కృతములో మాలద్వీపము అని పేరున్న మాల్దీవ్స్ తో పోల్చండి).
ఈ దీవుల యొక్క ప్రజలు మళయాళము యొక్క మాండలికమును మాట్లాడతారు. దాదాపు మొత్తము జనాభా ముస్లిం మతస్తులు. తమ పూర్వీకులు ఒక పెద్ద తూఫాను వలన సముద్రములో ఈ దీవులకు కొట్టుకువచ్చిన కొందరు వర్తకులని ఇక్కడి వాసుల నమ్మకము.
విషయ సూచిక |
నామ చరిత్ర [మార్చు]
లక్షద్వీపాలు అంటే లక్ష అనే సంఖ్య అధారితంగా వచ్చిన పేరు. భారతదేశంలో అతిస్వల్ప జనసంఖ్య కలిగిన కేంద్రపాలిత ప్రాంతం.
చరిత్ర [మార్చు]
లక్ష ద్వీపముల గురించిన ప్రస్థావన మొట్టమొదటిగా తమిళ సాహిత్యమైన పురనానూరు లో ఉంది. ఇది పురాతన ద్రవిడదేశంలో ఒక భాగంగా ఉండేది. సంగకాల తమిళ సాహిత్య పరిశోధనలో ఈ ప్రాంతం చేర దేశ ఆధీనంలో ఉండేదని కనిగొనబడింది. 7వ శతాబ్ధంలో పల్లవుల వ్రాలలో ఈ ద్వీపాలు పల్లవసామ్రాజ్యా ఆధీనంలో ఉన్నట్లు ప్రస్థావించబడింది. కేరళదేశపు చివరిరాజైన చేరమాన్ పెరుమాళ్ సమంలో ఈ ద్వీపాలకు సంబంధించిన మొట్టమొదటి ఒప్పదం జరిగినట్లు ప్రాంతీయ సంప్రదాయాలు, చరిత్ర మరియు విశేషాలు తెలియజేస్తున్నాయి. ఈ ద్వీపసముదాయంలో అతిపురాతనంగా నివసించిన ద్వీపాలు వరుసగా అమిని, కల్పేని, ఆండ్రాట్ట్, కవరాట్టి మరియు అగాట్టి. లక్షద్వీప నివాసులు మొదట హిందువులుగా ఉండి తరువాత క్రీ శ 14వ శతాబ్ధంలో ఇస్లామ్ మతస్థులుగా మారారు. ఏదిఏమైనప్పటికి సమీపకాలంలో జరిగిన పురాతత్వ పరిశోధనలలో క్రీ శ 6-7 శతాబ్ధముల మద్య కాలములో బౌద్ధులతో ఒక ఒప్పాందం జరిగినట్లు ధృవీకరించబడింది. ఇక్కడ ప్రాబల్యమున్న సంప్రదాయాననుసరించి ఏ.డి 661 లో ఉబైదుల్లా అను అరబ్‌దేశీయుడు లక్షద్వీపాలకు ఇస్లామ్ మతాన్ని తీసువచ్చాడని భావించబడుతుంది. ఆయన సమాధి ఆండ్రాట్ట్ ద్వీపములో ఉంది. సమాధి మీద ఏ.డి 756 తారీఖు వేసి ఉంది. 11వ శతాబ్ధంలో ద్వీపవాసులు చోళ రాజుల పాలనలోకి వచ్చారు. 17వ శతాబ్ధంలో ఈ ద్వీపాలు అలి రాజ్య (అరక్కల్ బీవి ఆఫ్ కానూరు)ఆధీనంలోకి వచ్చింది. దీనిని ఆమెకు కొలాతిరీలు బహుమతిగా ఇచ్చారు. పోర్చుగీసు వారు దీనిని స్వాధీనపరచుకొని కొబ్బరి పీచు ఉత్పత్తిని చేపట్టి ద్వీపవాసులు వారిని తరిమి కొట్టే వరకు ఉతప్పత్తిని కొనసాగించారు. ద్వీపవాసులు అరబ్ పర్యాటకుడు ఇబ్న్ బటువా గురించిన క్ధలను గొప్పగా వివరిస్తుంటారు.
1787 లో అమిందివి ద్వీపసముదాయం(ఆమిని, కాడ్మట్, కిల్తాన్, చెట్లత్ మరియు బిత్రా)టిప్పు సుల్తాన్ అధీనంలోకి వచ్చాయి. మూడవ ఆంగ్లో- మైసూరు యుద్ధం తరువాత ఈ ద్వీపాలు దక్షిణ కన్నడదేశంతో ఆంగ్లేయుల ఆధీనంలోకి వచ్చాయి. మిగిలిన ద్వీపాలు కన్ననూరుకు చెందిన అరక్కల్ కుంటుంబంలో స్వాధీనంలో సామంతరాజ్యంగా ఉంటూ వచ్చింది. కప్పం కట్ట లేదన్న నెపంతో బ్రిటన్ ఈ ద్వీపసముదాయాలను తన ఆధీనంలోకి తీసుకుంది. బ్రిటిష్ కాలంలో ఈ ద్వీపాలు మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన మలబారు జిల్లాకు చెంది ఉన్నాయి.
స్వతంత్ర భారతం [మార్చు]
1947 ఆగస్ట్ 15 న భారతదేశానికి స్వతత్రం వచ్చిన కొద్ది రోజుల అనంతరమే భారతదేశానికి దూరంగా నివసిస్తున్న ఈ ద్వీపవాసులకు దేశస్వాతంత్రం గురించిన సమాచారం తెలిసింది. నిజానికి సవ్తంత్రం రావడాని కి ఒక మాసం మునుపే మద్రాసు ప్రెసిడెన్సీ భారతదేశ స్వాధీనంలోకి వచ్చినప్పుడే లక్షద్వీపములూ దానంటదే భారతదేశస్వాధీనంలోకి వచ్చాయి. ముస్లిమ్ జనాభా అధికంగా ఉన్న కారణంగా ఈ ద్వీపసమూహాలను పాకిస్థాన్ తన స్వాధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించింది. అప్పటి ఉపప్రధాని అలాగే రక్షణమంత్రి అయిన ఉక్కుమనిషి అనిపించుకున్న సర్ధార్ వల్లాభాయ్ పటేల్ చేత పంపబడిన రాయల్ ఇండియన్ నేవీ లక్షద్వీపములకు చేరుకుని భారతదేశీయ జండాను లక్షద్వీపములో నాటి ఈ ద్వీపాల మీద భారతదేశ అధీనాన్ని ధృవపరిచి పాకిస్థాన్ చర్యలకు అడ్డుక్సట్టవేసారు. భారతీయ యుద్ధనౌక చేరుకునే సమయంలో లక్షద్వీపాలకు సమీపంలో ఉన్న పాకిస్థానుకు చెందిన రాయల్ పాకిస్థాన్ నేవీ కి చెందిన యుద్ధనౌక వెనుదిరిగి కరాచీకి చేరుకుంది. 1956లో అధికంగా మళయాళీలు నివసిస్తున్న ఈ ద్వీపాలను స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ ఏక్ట్ అధారంగా ప్రధాన భూభాగం నుండి వేరు చేయబడి కొత్తగా ఒక యూనియన్‌గా రూపొందించబడ్డాయి.
భౌగోళికం [మార్చు]
లక్షద్వీపాలు 12 పగడపు దీవులు, మూడు సముద్రాంతర్గత దిబ్బలు, ఐదు సముద్రంలో మునిగిన తీరాలు కలిగి ముప్పై తొమ్మిది ద్వీపాలు అతిస్వల్ప ద్వీపసముదాయాలు కలిగిన ద్వీపాలతో నిండిన సముద్రము. దిబ్బలు కూడా పగడపు దీవులే అయినప్పటికీ తీరాలు పూర్తిగా సముద్రంలో మునిగి వృక్షజాలం ఏమీలేని ఇసుక దిబ్బలే. మునిగిన తీరాలు పగడపు రాళ్ళతో నిండి ఉన్నాయి. అన్ని పగడపు రాళ్ళు అగ్నేయ, ఈశాన్య తీరాలలో చాలా వరకు తూర్పుతీరంలో ఆవృతమై ఉన్నాయి. అధికముగా మునిగి ఉన్న దిబ్బలు పడమటి దిశగా మడుగులతో నిండి ఉన్నాయి. ఈ ద్వీపాలలో 10 మానవ నివాసిత ద్వీపాలు. 17 మానవరహిత ద్వీపాలు, అతి చిన్న ద్వీప సముదాయాలు వీటి సమీపంలో ఉన్నాయి, 4 కొత్తగా ఏర్పడిన ద్వీపాలు మరియు ఐదు మునుగిన దిబ్బలు. వీటిలో ప్రధాన దీవి అయిన కరావట్టిలో లక్షద్వీప రాజధని నగరం అయిన కరావట్టి నగరం ఉంది ఈ ద్వీపంతో ఆగట్టి, మినికాయ్ మరియు ఆమ్ని దీవుల మొత్తం జనాభా 2011 జనభా గణాంకాలను అనుసరించి 60, 595. ఆగట్టిలో ఉన్న విమానాశ్రయం నుండి కేరళా లోని కొచ్చిన్ లేక ఎర్నాకుళం వరకు నేరుగా వెళ్ళే విమానాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణీకులు ఈ ద్వీపాలను సందర్శించడానికి అనుమతి లేదు. ప్రస్తుత భారతదేశ మద్యపాన చట్టలను అనుసరించి లక్షద్వీప ద్వీపసముద్రములో మద్యపానము ఒక్క బెంగారామ్ ద్వీపంలో తప్ప మిగిలిన అన్ని ద్వీపాలలో నిషేధించబడింది.
భారతీయ పగడపు దీవులు [మార్చు]
ది ఆమ్ని గ్రూప్ ద్వీపాలు (ఈ బృందంలో ఆమ్ని, కెల్టాన్, చెట్లత్, కడ్మాట్, బిత్రా మరియు పెరుమాళ్) మరియు లక్షద్వీప దీవులు (వీటిలో ఆండ్రోత్, కల్పేని, పిట్టి మరియు సుహేలి) ఈ రెండింటి మద్య సముద్రాంతభాగ సంబంధం ఉంది. 200 కిలోమీటర్ల వెడల్పైన నైన్ డిగ్రీ కెనాల్ దక్షిణ భాగంలో ఉన్న మినికాన్ ద్వీపంతో ఉన్న ద్వీపాలన్నీ పగడపు రాళ్ళతో నిర్మితమై అలాగే పగడపు దిబ్బలతో భారతీయ పగడపు దీవులుగా ప్రసిద్ధి చెందాయి. ఈ ద్వీపాలన్నీ పగడపు రాళ్ళతో నిండి తీరానికి సమీపంలో ఉన్నాయి. ఉత్తరంగా ఉన్న రెండు తీరాలు ఈ గ్రూప్ ద్వీపాలలో చేర్చబడ లేదు.
- ఆంగ్రియా తీరం.
- ఆడాస్ తీరం.
రాజకీయాలు [మార్చు]
లద్వీపాలన్నీ కలసి ఒక భారతీయజిల్లాగా రూపొందింది. కేంద్రప్రభుత్వం నియమించిన ప్రతినిధి నిర్వహణలో ఈ భారతీయ కేంద్రపాలిత ప్రాంతం పాలించబడుతుంది. ఈ కేంద్రపాలిత ప్రాంతం కొస్చిన్ లోని కేరళా హై కోర్ట్ న్యాయవ్యవస్థకు చెంది ఉన్నది. ఈ ప్రదేశం మొత్తం ఒక లోకసభ సభ్యుడిని ఎన్నికచేస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ప్రాంతీయ ఎన్నికలు నిర్వహించబడడం లేదు. అయినప్పటికీ నిర్వాహము పంచాయితీ రాజ్‌తో చేరిన టూ-టైర్ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తుంది. లక్షద్వీపాలలో 10 ఐలాండ్ కౌన్సిల్స్ పని చేస్తున్నాయి. వీటిలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 79.
జనాభా వివరణలు [మార్చు]
2011 జనభాగణన అనుసరించి లక్షద్వీప జనసంఖ్య 64,429. మార్షల్ ద్వీపవాసులకు ఇది సరాసరి జన సంఖ్య. 640 భారతీయ శ్రేణులలో లక్షద్వీప జనసంఖ్య 627వ శ్రేణిలో ఉంది. ఈ జిలా జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 2,013. లక్షద్వీప వైశాల్యం 5,210 చదరపు మైళ్ళు. ఈ దశాబ్ధపు (2001-2011) జనసంఖ్య వృద్ధిరేటు 6.23%. లక్షద్వీప స్త్రీపురుష నిష్పత్తి 946:1000. అక్షరాస్యత 92.28%.
భాషలు [మార్చు]
లక్షద్వీపాల భాషలు మలయాళము, జెసేరీ (ద్వీప్ భాషా). ఉత్తర ద్వీపవాసులు వారి వ్యాపార సమయాలలో తమిళం మరియు అరబిక్ ప్రభావిత మళయాళ యాసతో మాట్లాడుతుంటారు. దక్షిణ ప్రాంత మినికాయ్ ప్రజలు మహ్ల్ భాషను మాట్లాడతారు. ఇది మాల్దీవులలో మాట్లాడే దివేహి భాషకు కొంతమార్పిడి చెందిన భాష. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో మళయాళ అక్షరాలతో కూడిన మళయాళ భాష అధికారిక భాషగా పరిచయము చేయబడింది. సమీపకాలముగా ఈ భాకు అరబిక్ ఒక విధమైన అక్షరాలను వాడుతున్నారు. ఈ విధానాన్ని భారతప్రభుత్వం కొనసాగిస్తుంది. మహ్ల్ భాషా ప్రభావితమైన మినికాయ్ ద్వీపంతో సహా లక్షద్వీపాల మద్య అనుసంధిక భాషగా మళయాళ భాషను వాడుతుంటారు.
సంస్కృతి [మార్చు]
లక్ష ద్వీపవాసులు సాంస్కృతింగా కేరళా సముద్రతీర ప్రాంత ప్రజలను పోలి ఉంటారు. అలాగే అరబ్ వ్యాపారులచేత ప్రభావితులై ఉంటారు. దక్షిణ ప్రంతంలో ఉన్న అలాగే ద్వితీయస్థానంలో ఉన్న మినికాయ్ వాసులైన దివేహీలు ఇక్కడి స్థానికులుగా భావించబడుతున్నారు. ఈ దివేహీ సమూహాలు మరియు ఉప దివేహీలు కొన్ని సందర్భాలలో మహ్లాస్. దేశీయంగా జనాభాపరంగా అధికులు సున్నీ ముస్లీములు. మినికాయ్ వాసులు తప్ప మిగిలిన దివి లేక ఆమ్నిదివీలు. లక్షద్వీపవాసులు సాంస్కృతిక సమూహాలు 84.33% మలయాళీలు మరియు 15,67% మహ్లాస్.
జీవావరణశాస్త్రం [మార్చు]
లక్షద్వీప సముద్రతీర ప్రాంతాలు మాల్ద్వీవులకు చాగోస్ దీవులను పోలి ఉంటుంది. లక్షద్వీప మడుగులు, కొండపగుళ్ళు, సముద్రతీరాలు పలు విధముల సముద్రతీర జీవజాలానికి విలసిల్లడానికి అనుకూల వాతావరణం కలిగి ఉంటుంది. వీటిలో జీవమున్న పగడపు కొండలు, సముద్రపు అర్చిన్స్, సముద్రపు పాచి, సముద్రపు దోసకాయలు, నక్షత్ర చేపలు, కఒరీలు, క్లామ్స్, మరియు అక్టోపసులు ఉంటాయి. సీతాకోక చేపల వంటి అనేకరకాల చేపలు మొరే ఈల్స్ మరియు లాగూన్ (మడుగు) ట్రిగ్గర్ ఫిష్ అలాగే మరికొన్ని ఉన్నాయి. నివాసయోగ్యం కాని చర్బానియన్, బైరమ్‌గోర్ కొండ పగులు మరియు పెరుమాల్ పార్ అలాగే పిట్టీ పాల్ ద్వీపం మొదలైనవి సముద్రపు టర్టిల్స్ మరియు బ్రౌన్ నొడ్డీ, లెసర్ క్రెస్టెడ్ టర్న్ మరియు గ్రేటర్ క్రెస్టెడ్ టర్నులు మొదలైన సముద్రపు పలు పక్షులు సంతానోత్పత్తి కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. పలురకములైన ట్యూనా, వాహూ మరియు స్వోర్డ్ ఫిష్(కత్తి చేపలు), డాల్ఫిన్స్ వంటివి ఈ ద్వీపతీర సముద్రంలో సాధారణంగా కనిపిస్తుంటాయి. సుహేలీ పార్ వద్ద ఉన్న సముద్రతీర ప్రాణిల పుష్కలత కారణంగా ఈ ప్రాంతాన్ని మేరిన్ నేషనల్ పార్క్ గా ప్రకటించబడింది.
ఆర్ధిక రంగం [మార్చు]
లక్షద్వీప జాతీయ ఉత్పత్తి ప్రస్తుత విలువలలో 60 మిలియన్ల అమెరికా డాలర్లు. లక్షద్వీపములో కొంత ఆర్ధిక అసమానలు ఉన్నాయి. దారిద్యరేఖకు దిగువన కొంత మంది ప్రజలు ఉన్నారు. కొబ్బరిపీచు ఉత్పత్తి మరియు పీచుతో చేయబడే ఉత్పత్తులు ఇక్కడి ప్రధాన ఆదాయ వనరులు. ఇక్కడ 5 కాయిర్ ఫైబర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. 5 ఉత్పత్తి వివరణ కేంద్రాలు మరియు ఏడు ఫైబర్ కర్లింగ్ యూనిట్స్ ప్రభుత్వం చేత నడపబడుతున్నాయి. ఈ కేంద్రాలు కాయిర్ ఫైబర్ కర్లింగ్ , కాయిర్ యార్న్ మరియు కారిడార్ ఉత్పత్తి చేస్తున్నాయి.
పర్యాటక రంగం [మార్చు]
ఇక్కడి ప్రశాంత వాతావరణానికి శాస్త్రీయ పరిశోధనలకు అనువైన సముద్రతీలాల వలన లక్షద్వీఅపములు భారతీయులకు 1974 నుండి ప్రముఖ పర్యాటక ఆకర్షణ కలిగి ఉంది. పర్యాటకరంగం లక్షద్వీపాలకు గుర్తించతగినంత ఆదాయాన్ని ఇస్తుంది. పర్యాటకరంగం నుండి వచ్చే ఆదాయం క్రమంగా అభివృద్ధిచెందుతూ ఉంది. స్థలాభావంచేత ఈ ద్వీపాలలో ఫ్యాక్టరీలు నడపడానికి వీలు కాదు కనుక ప్రభుత్వంకూడా పర్యాటకరంగాన్ని ప్రోత్సహిస్తుంది. బంగరమ్ మరియు కడమట్ ద్వీపాలు పర్యాటకులను ఆకర్షించడంలో ప్రత్యేకత కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ పర్యాటకుల ప్రత్యేక ఆకర్షణగా బంగరమ్ ద్వీపం తీర్చిదిద్దబడుతుంది. సముద్రతీర వృక్షసంపద పర్యాటకులకు కనువిందు చేస్తున్నది. నీటి క్రీడలు స్కూబాడైవింగ్, విండ్ సర్ఫింగ్, స్నార్క్లింగ్, సర్ఫింగ్, కయాకింగ్, కేనోయింగ్, వాటర్ స్కీయింగ్, యాచ్టింగ్ మరియు ధైర్యసాహసాలతో కూడుకున్న సముద్రంలో నైట్ వాయేజ్ వంటి జలక్రీడలు పర్యాటక ఆకర్ష్ణలో ప్రబలమైనవి. సముద్రం పూర్తిగా ఉగ్రరూపం ధరించే నైరుతీ ఋతుపవన కాలంలో తప్ప సంవత్సరమంతా పర్యాటనకు అనుకూలమే.
జాలర్లు [మార్చు]
ఇతర ఉత్పత్తులు [మార్చు]
వ్యవసాయం [మార్చు]
ప్రయాణ సదుపాయాలు [మార్చు]
బయటి లింకులు [మార్చు]
|
|
|
|---|---|
| రాష్ట్రాలు | ఆంధ్ర ప్రదేశ్ · అరుణాచల్ ప్రదేశ్ · అసోం · బీహార్ · ఛత్తీస్‌గఢ్ · గోవా · గుజరాత్ · హర్యానా · హిమాచల్ ప్రదేశ్ · జమ్మూ కాశ్మీరు · జార్ఖండ్ · కర్ణాటక · కేరళ · మధ్య ప్రదేశ్ · మహారాష్ట్ర · మణిపూర్ · మేఘాలయ · మిజోరాం · నాగాలాండ్ · ఒరిస్సా · పంజాబ్ · రాజస్థాన్ · సిక్కిం · తమిళనాడు · త్రిపుర · ఉత్తరాంచల్ · ఉత్తర ప్రదేశ్ · పశ్చిమ బెంగాల్ |
| కేంద్రపాలిత ప్రాంతములు | అండమాన్ నికోబార్ దీవులు · చండీగఢ్ · దాద్రా నగరు హవేలీ · డామన్ డయ్యు · లక్షద్వీపములు · పుదుచ్చేరి |