లక్ష్మీనివాసం

వికీపీడియా నుండి
లక్ష్మీనివాసం ([[తెలుగు_సినిమాలు_|]])
Lakshminivasam.jpg
దర్శకత్వం వి.మధుసూదనరావు
నిర్మాణం టి.గోవిందరాజన్
తారాగణం ఎస్.వి.రంగారావు,
అంజలీదేవి,
కృష్ణ,
శోభన్ బాబు,
వాణిశ్రీ,
భారతి
పద్మనాభం
సంగీతం కె.వి.మహదేవన్
సంభాషణలు ఆరుద్ర
నిర్మాణ సంస్థ వీనస్ కంబైన్స్
భాష తెలుగు

సినిమా కి వ్యాకరణం లేదని,విభిన్న కథాంశంతో విజయవంతమైన చిత్రాలు నిర్మించడం సుసాధ్యమవుతుందని, కథే చిత్రవిజయానికి దోహద పడుతుందని నిరూపించిన చిత్రం లక్ష్మీనివాసం. వినోదంతో సందేశాన్ని అందించింది ఈ చిత్రం. వయసు మళ్లిన ముఖ్య వ్యాపారి రంగయ్య పాత్రనే కథానాయకునపాత్ర కాగా, ఈ సినిమా నిర్మాణ కాలంలో వర్ధమాన నటులుగా పేర్కనదగ్గ నటులు (తదుపరి కాలంలో నిన్నటి తరం ప్రఖ్యాతనాయకులు) ఇతర పాత్రలు పోషించారు. ఇటువంటి కథను తెరకెక్కించాలనుకొన్న దర్శక నిర్మాత ల ధైర్యాన్ని అభినందనీయం. ఇది కథ పట్ల వారికి గల నమ్మకం, వారి మీద వారికి గల ఆత్మవిశ్వాసానికి ప్రతీక.

విషయ సూచిక

[మార్చు] చిత్రకథ

షాపుకారు రంగయ్య (ఎస్.వి.రంగారావు) వ్యాపారి లక్షాధికారి. భార్య (అంజలీ దేవి) మహిళా సంఘాద్యక్షురాలు. గొప్ప కోసం డబ్బుని నీళ్లలా ఖర్చుపెడుతుంది. పెద్దకొడుకు (కృష్ణ) బి.కాం. (ఆనర్స్) గ్రాడ్యుయేట్. సినిమా టిక్కెట్లు దొరక లేదని తదుపరి ఆటకు సినిమా ధియేటర్ కెపాసిటీ టిక్కెట్లు మొత్తం కొని స్నేహితులతో సినిమా చూసేటంత విలాస వంతుడు. రెండవ కొడుకు (పద్మనాభం) నాటకాల రాయుడు. అతడే నాటకం కంపెనీ నడుపుతూ తండ్రి సంపాదన తగలేస్తూ ఉంటాడు. కూతరు (భారతి) తల్లి పోకడలను పుణికి పుచ్చుకుంది. అతని వద్ద పని చేసిన గోపాలం (నాగయ్య) కు రంగయ్య అంటే ఆరాధనా భావం. అతడి కొడుకు(శోభన్ బాబు) కూతురు (వాణిశ్రీ) లను పధ్ధతిగా, భాద్యత యుతంగా పెంచాడు. రంగయ్యకు వ్యాపారంలో నష్టం వస్తుంది. దివాళా తీసే పరిస్ధిత వస్తుంది. కొడుకులు, కూతురు తండ్రిని నిందించి ఉన్న చరాస్తులను పంచుకొని అప్పుల భాద్యత తీసుకోరు. అప్పులకు ఇంటిని స్ధిరాస్తిని గోపాలం స్వాధీనం చేసుకుంటాడు. వ్యాపారం మొదలు పెట్టిన పెద్దకొడుకు వ్యాపార మెలకువలు తెలియక దివాళా తీస్తాడు. అతడి ద్వారా పబ్బం గడుపుకున్న స్నేహితులు ముఖం చాటేస్తారు. రెండవవాడు తన వాటా గా వచ్చిన డబ్బు నాటకం కంపెనీ లో ఖర్చు పెట్టి గోళీ సోడాలు అమ్ముకునే స్ధితి కి వస్తాడు. కూతురు ఓ మోసగాడి (రామ్మోహన్) వలలో పడుతుంది. రంగయ్య భార్యతో సహా ఒక పాడు బడిన గుడిలో తల దాచుకుంటూ ప్రకృతి సిధ్దంగా లభించే చీపుర్లు, ఆకులు శ్రమ పెట్టుబడిగా మళ్లీ మొదటినుండి ప్రారంభించి చిగురు తొడుగుతాడు. పనీ పాటాలేక దుర్వ్యసనాల పాలిట పడ్డ వారికి ఒక దారి చూపుతూ తనతో పాటు పదిమందికి చేదోడు వాదోడు గా ఉండి తిరిగి డబ్బు సంపాదిస్తాడు. తమ ఈ పరిస్ధితికి గోపాలమే కారణమని కొడుకులు కూతురు గోపాలం ఇంటికి వెళతారు. అక్కడ రంగయ్య భార్యఉండి వ్యాపారంలో నష్టం లేదని అప్పులనగానే భయపడి కవరు తీసుకోలేదని కవరులో నిజానికి ఆస్తుల వివరాలు ఉన్నాయని చెప్పి గోపాలం కొడుకు కూతురు రంగయ్య కొడుకు కూతుర్లు డబ్బు వృధా చేసుకోకుండా కాపాడేరని తెలుసుకుంటారు. రంగయ్య పెద్దకొడుకుకు గోపాలం కూతురుని, రెండో కొడుకుకు ఇది వరకే నాటకం లోవేషం ఆశ చూపి తల్లిని చేసిన యవతి (విజయలలిత)ను, కూతురు కు గోపాలం కొడుకుతో వివాహం జరుగి కథ సుఖాంతం అవుతుంది.

[మార్చు] పాటలు

  1. ఇల్లే కోవెల చల్లని వలపే దేవత ఇల్లు వలపు నోచిన వనితే - ఎస్. జానకి
  2. ఓహొ ఊరించే అమ్మాయీ నేనేమి చేసేది అందాల కన్నులు - పి.బి. శ్రీనివాస్, సుశీల
  3. గువ్వలాంటి చిన్నది తారాజువ్వలాంటి చిన్నది వెతుక్కుని వస్తే - సుశీల
  4. చెయ్యి చెయ్యి కలుపు చెంప చెక్కిలి కలుపు కేరింతలతో - పి.బి.శ్రీనివాస్,సుశీల
  5. ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనట - ఘంటసాల - రచన: ఆరుద్ర
  6. నవ్వు నవ్వించు ఆ నవ్వులు పండించు ఊహూ నా ఊహలు - సుశీల
  7. లక్ష్మీ నివాస నిరవర్జ్య గుణైక సింధో ( సుప్రభాతం) - ఘంటసాల
  8. లక్ష్మీ నివాస నిరవర్జ్య గుణైక సింధో ( సుప్రభాతం) - ఘంటసాల బృందం
  9. సోడా సోడా జిల్ జిల్ సోడా సోడా సోడా ఆంధ్ర సోడా గోలి సోడా - పిఠాపు

[మార్చు] ప్రసిద్ధమైన పాట ఇది

రచయిత : ఆరుద్ర  ; సంగీతం : కె.వి.మహదేవన్ ; గాయకుడు : ఘంటసాల

ధనమేరా అన్నిటికి మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం
మానవుడే ధనమన్నది సృజియించెనురా
దానికి తానే తెలియని దాసుడాయెరా
ధనలక్ష్మిని అదుపులోన పెట్టిన వాడే
గుణవంతుడు, బలవంతుడు, భగవంతుడురా


ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
కొండలైన కరిగిపోవు కుర్చుని తింటే
అయ్యో! కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే


కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండలో ధనమున్నదిరా
శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం
ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం

[మార్చు] మూలాలు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె