నందమూరి లక్ష్మీపార్వతి

వికీపీడియా నుండి
(లక్ష్మీపార్వతి నుండి దారిమార్పు చెందింది)

లక్ష్మీపార్వతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రెండవ భార్యగా ప్రసిద్ధురాలు. 10 అగస్తు 1962న జన్మించింది. తెలుగులో రచయిత మరియు తెలుగుదేశం పార్టీ అభిమానురాలైన లక్ష్మీపార్వతి తన భర్త వీరగంధం సుబ్బారావుతో కలిసి 1985లో ఎన్టీ రామారావు జీవితచరిత్ర వ్రాసే ఉద్దేశముతో ఆయన్ను కలుసుకున్నది. పట్టుదలతో ప్రయత్నించి రామారావు నుండి జీవితచరిత్ర వ్రాయటానికి అనుమతి సంపాదించి 1987లో రామారావు ఇంట్లోనే నివసించే అవకాశాన్ని పొందింది.[1] లక్ష్మీపార్వతి ఎన్టీ రామారావు జీవితచరిత్రను వ్రాసే సమయంలో రామారావుకు సన్నిహితమై 1993లో వివాహం చేసుకున్నది.

ఈమె తొలి భర్త హరికథా కళాకారుడు వీరగంధం సుబ్బారావుతో ఒక కొడుకు (కోటేశ్వర ప్రసాద్) ఉన్నాడు. ఈమె మొదటి భర్తనుండి ఏప్రిల్ 15, 1993న గుంటూరు జిల్లా నరసరావుపేట కోర్టులో విడాకులు తీసుకున్నది.[2] 1993, సెప్టెంబరు 10న రామారావు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించినట్టు ప్రకటించాడు. ఆ మర్నాడు సెప్టెంబరు 11న తిరుపతిలో సాంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగింది. ఎన్టీ రామారావు మరణానంతరము ఆయన జీవితచరిత్రను "ఎదురులేని మనిషి" అన్న పేరుతో 2004లో విడుదలచేసింది.

[మార్చు] మూలాలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె