లతా మంగేష్కర్

వికీపీడియా నుండి

లతా మంగేష్కర్
Lata Mangeskar.jpg
పూర్వరంగ సమాచారం
జన్మనామం లతా మంగేష్కర్
జననం సెప్టెంబర్ 28 1929 (1929-09-28) (వయసు 80)
ఇండోర్, మధ్యప్రదేశ్
ప్రాంతము మహారాష్ట్ర
సంగీత రీతి హిందీ సినిమా రంగం హిందీ సినీ సంగీతం (నేపథ్య గాయని), భారతీయ శాస్త్రీయ సంగీతము
వృత్తి గాయని
వాయిద్యం నేపథ్య గాయిని
క్రియాశీలక సంవత్సరాలు 1942 - ప్రస్తుతము

లతా మంగేష్కర్ (మరాఠీ భాష : लता मंगेशकर ), జననం సెప్టెంబరు 28, 1929) ప్రఖ్యాతిగాంచిన హిందీ సినిమారంగ నేపథ్యగాయిని. 1942లో తన కళాప్రయాణం ప్రారంభమయినది(మహల్ సినిమాలో 'ఆయెగా ఆయెగా ఆయెగా ఆనేవాలా' పాటతో), అది నేటికినీ సచేతనంగా వున్నది. ఈమె 980 సినిమాలను తన గానంతో అలంకరించింది. దాదాపు 20 భాషలలో పాటలు పాడిన ఘటికురాలు. ఈమె సోదరి ఆషా భోంస్లే. లతాకు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి సత్కరించింది. హిందీ సినీపాటల గాయని అంటే మొదట లతా పేరే స్ఫురణకొస్తుంది. హిందీపాటలపై, హిందీసినీ జగత్తుపై ఆమె వేసిన ముద్ర అలాంటిది.


ఈమె పాడిన కొన్ని మధురమైన హిందీ పాటలు:

  • అయ్ మేరె వతన్ కే లోగో, జరా ఆంఖ్ మేఁ భర్ లో పానీ, జో షహీద్ హువే హైఁ ఉన్కీ, జరా యాద్ కరో ఖుర్బానీ
  • ఛోడ్ దే సారీ దునియా కిసీ కే లియే, యే మునాసిబ్ నహీఁ ఆద్‌మీ కే లియే
  • నా కొఈ ఉమంగ్ హై, నా కొఈ తరంగ్ హై, మెరీ జిందగీ హై క్యా, ఏ కటీ పతంగ్ హై
  • జబ్ భీ జీ చాహే నయీ దునియా, బసాలేతే హైఁ లోగ్, ఏక్ చెహ్రే పే కయీ చెహ్రే లగాలేతె హైఁ లోగ్

విషయ సూచిక

[మార్చు] వీడియోలు

[మార్చు] పురస్కారాలు

భారత ప్రభుత్వం నుండి అన్ని అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదయిన గాయకురాలు.ప్రముఖ శాస్రీయ గాయకురాలు ఎం.ఎస్. సుబ్బలక్ష్మి తరువాత ఇటువంటి ఘనత సాధించిన విశిష్ట వ్యక్తి ఈమె ఒక్కరే కావటం గమానార్హం.

సంవత్సరం పురస్కారం చిత్రం పురస్కారం పేరు బహుకరించింది ఇతర వివరాలు
2001
Bharataratna award.jpg
భారతరత్న[1] భారత ప్రభుత్వం బిస్మిల్లా ఖాన్ తోకలిపి అప్పటి రాష్ట్రపతి కే.ఆర్.నారాయణన్ చేతులమీదుగా స్వీకారం.
1999
Padma vibhushan award.jpg
పద్మవిభూషణ్[2] భారత ప్రభుత్వం
1969
Padma bhushan award.jpg
పద్మభూషణ్[3] భారత ప్రభుత్వం
2006 ది లీజియన్ అఫ్ హానర్[4] ఫ్రాన్స్ ప్రభుత్వం

[మార్చు] బయటి లింకులు

[మార్చు] ఇవికూడా చూడండి

[మార్చు] మూలాలు

  1. భారతరత్న పురస్కారం గ్రహీతల శీర్షిక క్రింద లతా మంగేష్కర్ జులై 25,2008 న సేకరించబడినది.
  2. పద్మవిభూషణ్ పురస్కారం గ్రహీతల శీర్షిక క్రింద లతా మంగేష్కర్ జులై 25,2008 న సేకరించబడినది.
  3. పద్మభూషణ్ పురస్కారం గ్రహీతల శీర్షిక క్రింద లతా మంగేష్కర్ జులై 25,2008 న సేకరించబడినది.
  4. France to honour Lata Mangeshkarశీర్షిక క్రింద జులై 25,2008 న సేకరించబడినది.
పేజీకి సంభందించిన లింకులు