లాగోస్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Lagos
Èkó
Lagos Island as seen from the harbour near Victoria Island.

Flag

Seal
City of Lagos showing main urban areas
[[file:మూస:Location map Nigeria|300px|లాగోస్ is located in మూస:Location map Nigeria]]<div style="position: absolute; top: సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను%; left: సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను%; height: 0; width: 0; margin: 0; padding: 0;">
[[File:మూస:Location map Nigeria|6x6px|Lagos|link=|alt=]]
<div style="font-size: 90%; line-height: 110%; position: relative; top: -1.5em; width: 6em; సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను">Lagos
Lagos shown within Nigeria
Coordinates: 6°27′11″N 3°23′45″E / 6.45306°N 3.39583°E / 6.45306; 3.39583
Country  Nigeria
State Lagos State
LGA Lagos Island
Area[1]
 • Urban 999.6
జనాభా (2006 census, preliminary)[2]
 • City 7
 • జనసాంద్రత 7.9
 • Urban 7
టైమ్‌జోన్ WAT (UTC+1)
వెబ్‌సైటు http://www.lagosstate.gov.ng/

లాగోస్ (pronounced /ˈleɪɡɒs/, లేదా /ˈlɑːɡoʊs/ విదేశం లేదా యోరుబా భాషలో Èkó ) అనేది నైజీరియాలో ఒక నౌకాశ్రయం మరియు అత్యధిక జనాభా గల పట్టణ ప్రాంతం. ఇది ప్రస్తుతం ఆఫ్రికాలో అత్యధిక జనాభా గల నగరాల్లో కైరో తరువాత, రెండో స్థానంలో ఉంది, ఆఫ్రికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో రెండో స్థానంలో (UN-HABITAT, 2008) మరియు ప్రపంచంలో ఏడో స్థానంలో ఉంది.[3]

నైజీరియా మాజీ రాజధానిగా ఉన్న లాగోస్ సముద్రపు పాయలు చేత వేరుచేయబడుతున్న లాగోస్ ద్వీపం వంటి ద్వీపాల్లో కేంద్రీకృతమై ఉన్న ఒక భారీ మహానగర ప్రాంతం, ఈ లాగోస్ ద్వీపం లాగోస్ మడుగు యొక్క నైరుతీ ద్వారం శివారుగా ఉంది, ఇది బార్ బీచ్ వంటి పొడవైన ఇసుక దిన్నెలతో అట్లాంటిక్ మహాసముద్రం నుంచి రక్షణ పొందుతుంది, లాగోస్ ద్వారం యొక్క తూర్పు నుంచి పశ్చిమంవైపుకు విస్తరించివున్న బార్ బీచ్ యొక్క పొడవు 100 కి.మీ ఉంటుంది. ప్రారంభం నుంచి లాగోస్ నగరం మడుగు (లాగూన్)కు పశ్చిమంవైపు ఉన్న ప్రధాన భూభాగంపై విస్తరిస్తోంది, ఐకెజా మరియు అజెజ్‌లతోపాటు, ఇప్పుడు ఈ ప్రాంతంలో పట్టణ విస్తరణ లాగోస్ ద్వీపానికి పశ్చిమంవైపున 40 కి.మీ.పైగా విస్తరించి ఉంది. ఐకోరోడు, ఏప్ మరియు బాగాడ్రీ వంటివి లాగోస్ శివారు ప్రాంతాలుగా ఉన్నాయి, స్థానిక ప్రభుత్వంలో మండళ్ల సంఖ్యను 57కు చేర్చేందుకు ఇటీవల మరిన్ని స్థానిక మండళ్లను సృష్టించారు. ఈ నగరం నైజీరియా దేశ ఆర్థిక రాజధానిగా ఉంది.

చరిత్ర[మార్చు]

దస్త్రం:Lagsunrise.jpg
సూర్యోదయ సమయంలో లాగోస్ ద్వీప ఆకాశహర్మాలు
విక్టోరియా ద్వీపం వీధి దృశ్యం.

లాగోస్ మొదట ఎకోలుగా పిలువబడిన అవోరీ పౌరుల యొక్క ఒక యోరుబా స్థిరనివాసంగా ఉంది. లాగోస్ గురించి మాట్లాడే సందర్భంలో యొరుబా భాషలో ఇప్పటికీ ఎకో అనే పేరును ఉపయోగిస్తారు, అయితే యొరుబా భాషలో ఈ పేరు ఎన్నడూ లేకపోవడం గమనార్హం. ప్రస్తుత రోజు లాగోస్ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో అవోరీ పౌరులు నివసిస్తున్నారు, ఓగున్ నది వెంబడి ఐషెరీ నుంచి వీరు ఈ ప్రాంతానికి వలసవచ్చారు. చరిత్రలో, ఈ ప్రాంతంలో స్థిరపడిన అనేక యుద్ధ జాతి సమూహాలకు ఇది నివాసంగా ఉంది. ప్రారంభ స్థిరనివాసాల ఏర్పాటు చేస్తున్నప్పుడు, బెనిన్ సామ్రాజ్యం కూడా కొంత కాలం ఈ ప్రాంతాన్ని పాలించింది.[4]

పోర్చుగీసు అన్వేషకుడు రూయ్ డి సెక్వీరా 1472లో ఈ ప్రాంతాన్ని సందర్శించాడు, నగర పరిసరాల్లోని ప్రాంతానికి లాగో డి కురామో అనే పేరుపెట్టాడు; ఇదిలా ఉంటే వాస్తవానికి ప్రస్తుత పేరుకు పోర్చీగీసు భాషలో "సరస్సులు" అనే అర్థం వస్తుంది. మరో వివరణ ఏమిటంటే, పోర్చుగల్‌లోని లాగోస్ అనే సముద్రతీర పట్టణం పేరుమీదగా లాగోస్ నగరానికి ఈ పేరు పెట్టినట్లు భావనలు ఉన్నాయి, పోర్చుగల్‌లోని లాగోస్ పట్టణం ఆ సమయంలో ఆఫ్రికా తీరానికి వెళ్లే పోర్చుగీసు అన్వేషక బృందాలకు ప్రధాన కేంద్రంగా ఉంది మరియు పోర్చుగల్‌లో లాగోస్ నగరానికి ఆ పేరును లాటిన్ పదం లాకోబ్రిగా నుంచి స్వీకరించారు.

1404-1889 మధ్యకాలంలో ఈ నగరం బానిస వాణిజ్యానికి ఒక ప్రధాన కేంద్రంగా సేవలు అందించింది, లాగోస్ ఒబాగా పిలువబడిన యోరుబా రాజులు దీనిని పాలించారు. 1841లో ఒబా అకిటోయె లాగోస్ సింహాసనాన్ని అధిష్టించాడు, ఆయన బానిస వాణిజ్యాన్ని నిషేధించేందుకు ప్రయత్నించాడు. లాగోస్ వ్యాపారులు, ముఖ్యంగా మేడమ్ టినుబు ఈ నిషేధంపై అభ్యంతరం వ్యక్తం చేశారు, రాజును సింహాసనం నుంచి తొలగించి, అతని సోదరుడు ఒబా కాసోకోకు పట్టం కట్టారు.

ప్రవాసంలోకి వెళ్లిపోయిన ఒబా అకిటోయె బ్రిటీష్‌వారిని కలుసుకున్నాడు, 1807లో బానిస వాణిజ్యాన్ని బ్రిటీష్‌వారు నిషేధించారు, వారి సాయంతో అతను తిరిగి సింహాసనాన్ని దక్కించుకున్నాడు. 1851లో అతను లాగోస్ ఒబాను పునఃస్థాపించాడు.

లాగోస్ అధికారికంగా 1861లో ఒక బ్రిటీష్ వలసరాజ్యంగా స్వీకరించబడింది. ఈ పరిణామం బానిస వాణిజ్యాన్ని అణిచివేయడం మరియు పామ్ మరియు ఇతర వాణిజ్యాలపై బ్రిటీష్‌వారి నియంత్రణను ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతంపై ద్వంద్వ ప్రభావం చూపింది.[5]

ఆధునిక నైజీరియా యొక్క మిగిలిన ప్రాంతాన్ని 1887లో స్వాధీనం చేసుకున్నారు, 1914లో వలసరాజ్యం మరియు నైజీరియా సంరక్షిత రాజ్యాన్ని ఏర్పాటు చేసినప్పుడు లాగోస్‌ను దీని రాజధానిగా ప్రకటించారు. బ్రిటన్ నుంచి 1960లో నైజీరియా స్వాతంత్ర్యం పొందిన తరువాత కూడా ఇది రాజధానిగా కొనసాగింది.

నైజీరియా పౌర యుద్ధం లేదా బైఫ్రాన్ యుద్ధానికి ముందు నైజీరియా యొక్క ఆర్థిక విజృంభణ ఫలితంగా 1960వ మరియు 1970వ దశకాలవ్యాప్తంగా లాగోస్ వేగంగా అభివృద్ధి చెందింది. లాగోస్ నగరం 1914 నుంచి 1991 వరకు నైజీరియా రాజధానిగా ఉంది. ప్రత్యేక ప్రయోజనం కోసం నిర్మించిన అబుజా నగరం వద్ద సమాఖ్య రాజధాని ప్రాంతం ఏర్పాటు చేసినప్పుడు లాగోస్ రాజధాని హోదాను తొలగించారు. నవంబరు 14, 1991న, అధ్యక్ష మరియు ఇతర సమాఖ్య ప్రభుత్వ కార్యకలాప కేంద్రాలు కొత్త రాజధాని నగరం అబుజాకు తరలించబడ్డాయి. అయితే, అబుజా నిర్మాణంలోనే ఉండటంతో, అనేక ప్రభుత్వ కేంద్రాలు తాత్కాలికంగా లాగోస్‌లోనే నిర్వహించబడ్డాయి.

భౌగోళిక స్థితి[మార్చు]

లాగోస్ ప్రధాన భూభాగం[మార్చు]

దస్త్రం:Lagos naija.JPG
సముద్రం నుంచి లాగోస్ ద్వీప దృశ్యం.

అధిక జనాభా ప్రధాన భూభాగంలో నివసిస్తుంది, ఎక్కువ పరిశ్రమలు కూడా ఇక్కడే ఉన్నాయి. సంగీతం మరియు రాత్రిజీవితానికి లాగోస్ బాగా ప్రసిద్ధి చెందింది, వీటికి సంబంధించిన కేంద్రాలు యాబా మరియు సురులెర్ పరిసరాల్లో ఉన్నాయి, అయితే ఇటీవల సంవత్సరాల్లో ద్వీపంపై, ముఖ్యంగా విక్టోరియా ద్వీపంపై నైట్ క్లబ్‌లు ఎక్కువగా ఏర్పాటు చేయబడ్డాయి, ప్రస్తుతం విక్టోరియా ద్వీపం రాత్రివినోదాలకు ప్రధాన ఆకర్షణగా గుర్తించబడుతుంది. లాగోస్ ప్రధాన భూభాగ జిల్లాలు ఎబ్యుట్-మెటా, సురులెర్, యాబా (ఇక్కడే లాగోస్ విశ్వవిద్యాలయం ఉంది) మరియు ఐకెజా: ఐకెజాలో ముర్తాలా ముహమ్మెద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు లాగోస్ రాష్ట్ర రాజధాని ఉన్నాయి.

ఐకోయి ప్రాంతం మరియు విక్టోరియా ఐల్యాండ్‌కు వెళ్లే వంతెన

గ్రేటర్ లాగోస్ ప్రాంతంలో ముషిన్, మేరీల్యాండ్, సోమోలు, ఓషోదీ, ఓవోరోన్‌సాకీ, ఐసోలో, ఇకోటున్, ఏజెజ్, ఐజు ఐషాగా, ఎగ్బెడా, కెటు, బారిగా, ఐపాజా, మరియు ఇజిగ్బోలు భాగంగా ఉన్నాయి.

దస్త్రం:Lagsunrize.JPG
సూర్యాస్తమయం సమయంలో విక్టోరియా దీవి వీధి దృశ్యం.

నైరుతీ నైజీరియా ప్రాంతంలో గినీ సింధుశాఖలోని అట్లాంటిక్ తీరంపై, నైజెర్ నది డెల్టా ప్రాంతానికి పశ్చిమంగా, 3° 24' E (తూర్పు) రేఖాంశం మరియు 6° 27' N (ఉత్తర) అక్షాంశంపై లాగోస్ నగరం ఉంది. పశ్చిమ ఆఫ్రికా తీరంలో అధిక వర్షపాతం నమోదయ్యే ఈ ప్రాంతంలో, సముద్రంలోకి ప్రవహించే నదులు పొడవైన తీరప్రాంత ఇసుక దిన్నెలను లేదా ఇసుక దీవుల వెనుక లాగోస్ మడుగు వంటి బురదతో నిండిన మడుగులను సృష్టించాయి. కొన్ని నదులు తీరానికి కొంతదూరం సమాంతరంగా ప్రవహించి ఇసుక దిన్నెల గుండా సముద్రంలో కలుస్తున్నాయి, దీనికి బడాగ్రీ మడుగు ప్రవాహం ఒక ఉదాహరణ. లాగోస్ మడుగులో రెండు ప్రధాన పట్టణ ద్వీపాలు లాగోస్ ద్వీపం మరియు విక్టోరియా ద్వీపం ఉన్నాయి. అట్లాంటిక్ సముద్రంలోకి ప్రవహించే మడుగు ప్రధాన మార్గం చేత ఈ ద్వీపాలు ప్రధాన భూభాగంతో వేరుచేయబడుతున్నాయి, ఈ మడుగు ప్రధాన మార్గంపైనే లాగోస్ నౌకాశ్రయం ఉంది. ఈ ద్వీపాలు ఒకదానికొకటి వివిధ పరిమాణాల్లోని నీటి పాయలతో వేరుచేయబడుతున్నాయి, ఇవి వంతెనలతో లాగోస్ ద్వీపానికి అనుసంధానం చేయబడి ఉన్నాయి. అయితే కొన్ని పాయల్లోని అతికొద్ది భాగాలు ఇసుకతో నిండివున్నాయి, వీటిపై నిర్మాణాలు ఉన్నాయి.

లాగోస్ ద్వీపాలు[మార్చు]

లాగోస్ ద్వీపం[మార్చు]

లాగోస్ ద్వీపంలో ప్రధాన వ్యాపార జిల్లా ఉంది. ఈ జిల్లా ఆకాశహర్మాలకు ప్రసిద్ధి. నగరంలోని అతిపెద్ద టోకు వ్యాపారకేంద్రాలు (ప్రసిద్ధ ఇడుమోటా మరియు బాలోగన్ మార్కెట్‌ల వంటివి) ఈ ద్వీపంలోనే ఉన్నాయి. నేషనల్ మ్యూజియం ఆఫ్ నైజీరియా, సెంట్రల్ మసీదు, గ్లోవర్ మెమోరియల్ హాల్, క్రైస్ట్స్ క్యాథడ్రల్ (CMS) మరియు ఒబా రాజభవనం తదితరాలను కూడా ఇక్కడ చూడవచ్చు. గతంలో నిరుపయోగంగా ఉన్నప్పటికీ, ద్వీపంలోని టినుబు కూడలికి చారిత్రక ప్రాధాన్యత ఉంది; 1914లో నైజీరియాను ఏర్పాటు చేసేందుకు ఉత్తర మరియు దక్షిణ సంరక్షిత రాజ్యాలను ఏకం చేసిన సందర్భానికి గుర్తుగా ఇక్కడ విలీనీకరణ వేడుక జరిగింది.

దస్త్రం:Lagcourt.jpg
ఐకోయిలో లాగోస్ కోర్టు నివాస సముదాయాలు.

ఐకోయి[మార్చు]

ఐకోయి లాగోస్ ద్వీపం యొక్క తూర్పు అర్ధ భాగంపై ఉంది, ఈ రెండు ప్రాంతాలు పూడ్చిన ఒక పల్లపు ప్రాంతంతో కలపబడుతున్నాయి. పైవ్ కౌరీ క్రీక్‌పై నిర్మించిన ఒక ప్రధాన రోడ్డు వంతెనతో ఐకోయి ప్రాంతం విక్టోరియా ద్వీపంతో కూడా అనుసంధానం చేయబడివుంది.

నైజీరియా సమాఖ్య ప్రభుత్వ ప్రధాన కార్యాలయం మరియు పాత సమాఖ్య సచివాలయ సముదాయంతోపాటు అనేక ఇతర ప్రభుత్వ భవనాలు ఐకోయిలో ఉన్నాయి. ఈ సముదాయం ప్రస్తుతం పునరుద్ధరించబడివుంది. ఐకోయిలో సైనిక మరియు పోలీసు స్థావరాలతోపాటు, పటిష్ట భద్రత గల కారాగారం మరియు నైజీరియా సమాఖ్య హైకోర్టు కూడా ఉన్నాయి.

అనేక హోటళ్లు, నైట్ క్లబ్‌లు మరియు వినోద పార్కు మరియు ఆఫ్రికాలోని అతిపెద్ద గోల్ఫ్ ‌కోర్సుల్లో ఒకటి ఐకోయిలో ఉన్నాయి.

మొదట ఒక మధ్య తరగతి ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో, ఇటీవల సంవత్సరాల్లో ఎగువ మధ్య తరగతి నుంచి సంపన్న తరగతి పౌరుల విలాసవంతమైన నివాసాలు కనిపిస్తున్నాయి.

ఐకోయిలో వ్యాపార కార్యకలాపాలు కూడా సాగుతున్నాయి, పెరుగుతున్న కార్యాలయాలు, బ్యాంకులు మరియు వ్యాపార సముదాయాలను ఇక్కడ గుర్తించవచ్చు. వ్యాపార కేంద్రాలు నైరుతీ, SW ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయి.

దస్త్రం:Lagap.jpg
విక్టోరియా ద్వీపంలోని నివాస సముదాయాలు

విక్టోరియా ద్వీపం[మార్చు]

లాగోస్ ద్వీపానికి దక్షిణంవైపున విక్టోరియా ద్వీపం ఉంది, ఇవి రెండు అనుసంధానించబడివున్నాయి. ఇక్కడ బాగా ఖరీదైన స్థిరాస్తులు ఉన్నాయి మరియు ఈ కారణంగా, అనేక కొత్త విలాసవంతమైన నివాసాలు మరియు నివాస సముదాయాలు ఇక్కడ అన్నిచోట్లా విస్తరిస్తున్నాయి. ఐకోయితో కలిపి, విక్టోరియా ద్వీపం లాగోస్ శివారుల్లో ఒక ప్రధాన ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది, ఈ ప్రాంతం అనేక వ్యాపార జిల్లాల అభివృద్ధికి తోడ్పడుతుంది. అట్లాంటిక్‌వైపు దీని యొక్క సముద్ర తీరంలో పర్యావరణం కోసం పునర్నిర్మించిన బార్ బీచ్ ఉంది.

ఐడో ద్వీపం[మార్చు]

లాగోస్ ద్వీపం నుంచి మడుగు యొక్క ప్రధాన మార్గానికి అడ్డంగా ఐడో అని పిలిచే ఒక చిన్న ద్వీపం ఉంది. ఐడో ఒక రైల్‌రోడ్ టెర్మినస్‌గా ఉంది, ఇది ప్రధాన భూభాగానికి సమీపంలో ఉంది. ఇది ఇప్పుడు ఒక ద్వీపకల్పం మాదిరిగా ప్రధాన భూభాగానికి అనుసంధానించబడివుంది.

మూడు ప్రధాన వంతెనలు ప్రధాన భూభాగంతో ఈ దీవిని కలుపుతున్నాయి. వాటిలో మొదటిది కార్టెర్ వంతెన, ఇది ఐడో ద్వీపం నుంచి ప్రారంభమవుతుంది, రెండోవది ఎకో వంతెన (గతంలో దీనిని రెండో మెయిల్‌ల్యాండ్ బ్రిడ్జ్‌గా పిలిచేవారు) మరియు మరో దాని పేరు మూడో మెయిల్‌ల్యాండ్ వంతెన- ఈ రహదారి లాగోస్ మడుగు గుండా జనసమ్మర్థం ఉన్న ప్రధాన భూభాగ శివారులకు వెళుతుంది.

శీతోష్ణస్థితి[మార్చు]

Lagos
Climate chart (explanation)
J F M A M J J A S O N D
 
 
13
 
31
25
 
 
41
 
32
26
 
 
84
 
32
27
 
 
146
 
31
26
 
 
202
 
29
25
 
 
316
 
28
24
 
 
243
 
28
24
 
 
122
 
28
24
 
 
160
 
28
24
 
 
125
 
30
24
 
 
40
 
31
25
 
 
15
 
31
25
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
Source: [6]

లాగోస్‌లో ఉష్ణమండల సవన్నా వాతావరణం (కోపెన్ వాతావరణ వర్గీకరణ Aw) ఉంటుంది, మిగిలిన దక్షిణ నైజీరియాలో కూడా ఇటువంటి వాతావరణాన్నే చూడవచ్చు. ఇక్కడ రెండు ప్రధాన వర్ష రుతువులు ఉన్నాయి, భారీస్థాయిలో వర్షాలు ఏప్రిల్ నుంచి జులై వరకు కురుస్తాయి, అక్టోబరు నుంచి నవంబరు వరకు బలహీనమైన వర్షపాతం నమోదవుతుంది. ఆగస్టు మరియు సెప్టెంబరు మాసాల్లో తక్కువ రోజులపాటు పొడి వాతావరణం ఉంటుంది, డిసెంబరు నుంచి మార్చి వరకు సుదీర్ఘ పొడి వాతావరణాన్ని గుర్తించవచ్చు. మే మరియు జులై మధ్యకాలంలో నెలసరి వర్షపాతం సగటున 300 మిల్లీమీటర్ల (mm) (12 అంగుళాలు (in))కుపైగా, ఆగస్టు మరియు సెప్టెంబరు మధ్యకాలంలో 75 mm (3 అంగుళాలు) మరియు జనవరిలో కనిష్టంగా 35 mm (1.5 అంగుళాలు) వర్షపాతం నమోదవుతుంది. నగరంలో ప్రధాన పొడి (వేసవి) కాలంలో సహారా ఎడారి నుంచి దుమ్ముతో కూడిన గాలులు వీస్తుంటాయి, డిసెంబరు మరియు ఫిబ్రవరి ప్రారంభ కాలం మధ్యలో ఈ గాలుల తీవ్రత బలంగా ఉంటుంది. నగరంలో జనవరిలో 27 °C (79 °F), జులైలో 25 °C (77 °F) సగటు ఉష్ణోగ్రత నమోదవుతుంది. సగటున బాగా ఎండలు కాసే నెల మార్చి; ఈ నెలలో సగటు ఉష్ణోగ్రత 29 °C (84 °F) వద్ద ఉంటుంది; బాగా చల్లగా ఉండే నెల జులై.[7]

పాలన మరియు జనాభా వివరాలు[మార్చు]

లాగోస్ మహానగర ప్రాంతంలోని 16 LGAలను సూచించే పటం.లాగోస్ మహానగర ప్రాంతం ఒక గణాంక ప్రాంతం మాత్రమే, ఇది లాగోస్ రాష్ట్రం మాదిరిగా ఇది ఒక పరిపాలక ప్రాంతం కాదు.లాగోస్ రాష్ట్రంలో పటంలో చూపించిన విధంగా 16 LGAలు మరియు 4 ఇతర పెద్ద LGAలు ఉన్నాయి.
లాగోస్ మహానగరంలో 16 LGAలు
స్థానిక ప్రభుత్వ ప్రాంతం (LGA) భూభాగ వైశాల్యం [1]
(km² (చదరపు కి.మీలలో)
జనాభా [2]
(2006 జనాభా లెక్కలు)
జనసాంద్రత
(ప్రతి km² (చ.కిమీ))
ఏజెజ్ 11.2 459,939 41,071
ఏజిరోమీ-ఐఫెలడున్ 12.3 684,105 55,474
అలీమోషో 185.2 1,277,714 6,899
అమువో-ఓడోఫిన్ 134.6 318,166 2,364
అపాపా
(లాగోస్ ప్రధాన నౌకాశ్రయం ఇక్కడే ఉంది)
26.7 217,362 8,153
ఎటి-ఓసా
(లాగోస్‌లో అతిపెద్ద వ్యాపార కేంద్రాలు మరియు విక్టోరియా ద్వీపం మరియు ఐకోయి ప్రాంతా ఉన్నత వర్గ పౌరులు దీని పరిధిలోకి వస్తాయి, నైజీరియా సమాఖ్య ప్రభుత్వానికి గతంలో కేంద్రంగా ఉంది)
192.3 287,785 1,496
ఐఫాకో-ఐజైయ్ 26.6 427,878 16,078
ఐకెజా 46.2 313,196 6,785
కోసోఫ్ 81.4 665,393 8,174
లాగోస్ ద్వీపం
(లాగోస్ పట్టణ పరిధి యొక్క చారిత్రక కేంద్రం మరియు వ్యాపార మూలకేంద్రంగా ఉంది)
8.7 209,437 24,182
లాగోస్ మెయిన్‌ల్యాండ్ 19.5 317,720 16,322
ముషిన్ 17,5 633,009 36,213
ఓజో 158.2 598,071 3,781
ఓషోడీ-ఐసోలో 44.8 621,509 13,886
సోమోలు (లేదా షోమోలు) 11.6 402,673 34,862
సురులెర్ 23.0 503,975 21,912
లాగోస్ మహానగరం 999.6 7,937,932 7,941
దస్త్రం:Lagos overview.jpg
లాగోస్ ఆకాశహర్మం

పరిపాలనపరంగా, లాగోస్ మున్సిపాలిటీ కాదు, అందువలన దీనికి నగరవ్యాప్త పాలక యంత్రాంగం లేదు. లాగోస్ మున్సిపాలిటీ కేవలం లాగోస్ ద్వీపం, ఐకోయి మరియు విక్టోరియా ద్వీపాన్ని మరియు కొంత ప్రధాన భూభాగ ప్రదేశాన్ని మాత్రమే కలిగివుంది, దీనిని ఒకప్పుడు లాగోస్ నగర మండలి (LCC) నిర్వహించేది, అయితే ఇది 1976లో రద్దు చేయబడింది, అనంతరం నగరం అనేక స్థానిక ప్రభుత్వ ప్రాంతాలుగా విభజించబడింది (వీటిలో ముఖ్యమైనవి లాగోస్ ఐల్యాండ్ LGA, లాగోస్ మెయిన్‌ల్యాండ్ LGA మరియు ఎటి-ఓసా LGAలుగా విభజించబడింది). మరోవైపు లాగోస్ మున్సిపాలిటీ పరిధిదాటి ఉన్న మెయిన్‌ల్యాండ్ (ప్రధాన భూభాగం) ప్రాంతంలో ముషిన్, ఐకెజా మరియు ఏజెజ్ వంటి అనేక విడి పట్టణాలు మరియు స్థిరనివాసాలు నగర పరిధిలోకి తీసుకొచ్చారు. 1970వ దశకపు నైజీరియా చమురు విప్లవం సందర్భంగా లాగోస్‌లో జనాభా భారీగా పెరిగిపోయింది, ఈ సమయంలో అదుపులేని ఆర్థికాభివృద్ధి మరియు భారీస్థాయిలో గ్రామీణుల వలసలు జరిగాయి. శివారు పట్టణాలు మరియు స్థిరనివాసాలు వేగంగా అభివృద్ధి చెందేందుకు ఈ పరిణామాలు తోడ్పడ్డాయి, దీంతో ప్రస్తుతం కనిపిస్తున్న గ్రేటర్ లాగోస్ మహానగర ప్రాంతం సృష్టించబడింది. లాగోస్ చరిత్ర LGAల యొక్క ప్రణాళికల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది, వాటిని ఏర్పాటు చేయడం వెనుక ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపులను చూడవచ్చు.

ప్రస్తుతం, లాగోస్ అనే పదాన్ని తరచుగా నైజీరియాలో "మెట్రోపాలిటన్ లాగోస్" అని పిలిచే పట్టణ ప్రాంతాన్ని సూచించేందుకు ఉపయోగిస్తున్నారు, దీనిలో లాగోస్ మాజీ మున్సిపాలిటీ యొక్క రెండు ద్వీపాలు మరియు ప్రధాన భూభాగ శివారు ప్రాంతాలు భాగంగా ఉన్నాయి. రోడ్డు, రవాణా, విద్యుత్, నీరు, ఆరోగ్యం మరియు విద్యలతోపాటు పలు సౌకర్యాలను అందించే బాధ్యత లాగోస్ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. మెట్రోపాలిటన్ లాగోస్ (ఒక గణాంక విభాగంగా, ఒక పాలనా విభాగంగా కాకుండా) ప్రాంతం లాగోస్ రాష్ట్రంలోని మొత్తం 20 LGAల్లో 16 LGAలలో విస్తరివుంచివుంది మరియు లాగోస్ రాష్ట్రంలోని 88% జనాభా ఇక్కడ నివసిస్తుంది మరియు పాక్షిక-గ్రామీణ ప్రాంతాలు కూడా దీనిలో ఉన్నాయి. లాగోస్ నగరంలో గణనీయమైన సంఖ్యలో ఆకాశహర్మాలు ఉన్నాయి. ఎత్తైన భవనాల్లో ఎక్కువ భాగం ప్రధాన పట్టణ మధ్య వ్యాపార జిల్లాలో కేంద్రీకృతమై ఉన్నాయి.

లాగోస్ నైజీరియా మాజీ రాజధాని నగరంగా ఉంది, అయితే తరువాత దేశ రాజధాని అబుజాకు మార్చబడింది. 1976నాటి నౌ యాక్ట్ నెం.6 ద్వారా రాజధానిని మార్చే నిర్ణయం తీసుకోబడినప్పటికీ, డిసెంబరు 12, 1991న అబుజా అధికారికంగా దేశ రాజధాని హోదా పొందింది.

దస్త్రం:Union bank.jpg
యూనియన్ బ్యాంక్, ఇది నైజీరియాలోని ఒక ప్రధాన బ్యాంకుల్లో ఒకటి.

లాగోస్ రాష్ట్ర న్యాయవ్యవస్థ యొక్క హైకోర్టు లాగోస్ నగరంలోనే ఉంది, లాగోస్ ద్వీపంలోని వలసరాజ్యకాలంనాటి ఒక పురాతన భవనంలో ఇది నిర్వహించబడుతుంది.[8]

లాగోస్ జనాభా వివరాలు[మార్చు]

నైజీరియా 2006 జాతీయ జనాభా లెక్కలు ప్రకారం మహానగర ప్రాంత జనసంఖ్య 7,937,932 వద్ద ఉన్నప్పటికీ, UN మరియు ఇతర జనాభా కేంద్రాలు మరియు ప్రపంచవ్యాప్త సంస్థలు సూచించే అంచనాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. లాగోస్ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిన లాగోస్ రాష్ట్రం యొక్క జనాభా వివరాల ప్రకారం ఇక్కడ 17,553,924 మంది పౌరులు నివసిస్తున్నారు. లాగోస్ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక ప్రణాళిక కోసం వేసిన లెక్కలు ఆధారంగా ఈ సంఖ్యను గుర్తించడం జరిగింది, దీని ప్రకారం లాగోస్ రాష్ట్రం మొత్తం జనాభాలో 88% మంది లాగోస్ మహానగర ప్రాంతంలో నివసిస్తున్నారు కాబట్టి, ఈ నగర జనాభా 15.5 మిలియన్ల వద్ద ఉండవచ్చని అంచనా వేశారు.[9] లాగోస్ పట్టణ పరిధికి సంబంధించిన జనాభా అంచనాలను 2003లో UN సంస్థలు బాగా తగ్గించాయనే వాస్తవాన్ని లాగోస్ రాష్ట్ర దాచిపెట్టిందనే వాస్తవాన్ని లాగోస్ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలపై ఒక జవాబు[10] ధ్రువీకరించింది. జాతీయ గుర్తింపు కార్డు పథకం మరియు INEC యొక్క 2003 ఓటర్ల నమోదు గణాంకాలు రూపంలో ఇప్పటికే ప్రజా వేదికపై ఉన్న రెండు అత్యంత ముఖ్యమైన మరియు మెరుగైన ప్రాతినిధ్య మరియు ఆధారపడదగిన ద్వితీయ సమాచార వివరాలను పరిగణనలోకి తీసుకోవడంలో ఇది విఫలమైంది. INEC ఇటీవల విడుదల చేసిన 2007 ఓటర్ల నమోదు గణాంకాలు తదుపరి జనాభా లెక్కల ఫలితాలను విడుదల చేసే ప్రయత్నాల్లో ఒక భాగం మరియు అంతేకాకుండా అనిర్దిష్ట అంశాలు లేకుండా సమగ్ర, వాస్తవమైన మరియు ఆమోదయోగ్యమైన జనాభా లెక్కలను విడుదల చేయాలనుకుంటున్నారు. లాగోస్ రాష్ట్రం యొక్క తాత్కాలిక జనాభా సంఖ్య 9,013,534 మాత్రమే, ముందుగా చెప్పినట్లుగా 17,553,924 కాదు.

2006 జనాభా లెక్కల యొక్క అధికారిక ఫలితాలు ప్రకారం, లాగోస్ మహానగర ప్రాంతంలో 8,048,430 మంది పౌరులు నివసిస్తున్నారు.[2] ముందుగా ఊహించిన దాని కంటే ఈ సంఖ్య తక్కువగా ఉంది, నైజీరియాలో ఇదొక వివాదం దృష్టించింది. మధ్య స్థానిక ప్రభుత్వ ప్రాంతం మరియు లాగోస్ మహానగర చారిత్రక కేంద్రమైన లాగోస్ ద్వీపంలో 2006 జనాభా లెక్కల ప్రకారం 212,700 మంది పౌరులు నివసిస్తున్నారు.[11]

లాగోస్ రాష్ట్ర అధికారిక యంత్రాంగం 2006 జనాభా లెక్కలపై విమర్శులు గుప్పించింది, రాష్ట్రంలో జనాభాను సరిగా లెక్కించలేదని నైజీరియా జాతీయ జనాభా సంఘంపై ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను జాతీయ జనాభా సంఘం ఖండించింది.[12][13]

అనేక అంచనాలు ప్రకారం లాగోస్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. లాగోస్‌లో ప్రస్తుతం ప్రతి ఏడాదికి సుమారుగా 275,000 మేర జనాభా సంఖ్య పెరుగుతుంది. 1999లో ఐక్యరాజ్యసమితి, లాగోస్ మహానగర ప్రాంతంలో 2010నాటికి 20 మిలియన్లకుపైగా పౌరులు నివసిస్తుంటారని, తద్వారా ప్రపంచంలో జనాభాపరంగా మొదటి పది అతిపెద్ద నగరాల్లో ఒకటిగా నిలుస్తుందని అంచనా వేసింది, ఈ నగరంలో 1950లో 290,000 మంది పౌరులు మాత్రమే నివసిస్తుండటం గమనార్హం.

లాగోస్‌లో నివసించే పౌరుల మధ్య సంపద పంపిణీలో భారీ అసమానతలు ఉన్నాయి. ఈ పరిధి బాగా ధనిక స్థాయి నుంచి అతి పేద స్థాయి వరకు ఉంటుంది. నైజీరియా మరియు దాని వెలుపల ప్రాంతాల నుంచి అనేక మంది యువకులను మరియు అనేక కుటుంబాలను లాగోస్ ఆకర్షించింది.

ఆర్థిక వ్యవస్థ[మార్చు]

లాగోస్‌లో మార్కెట్

నైజీరియాలో లాగోస్ అత్యంత సంపన్న నగరం, దేశంలో ఎక్కువ సంపద మరియు ఆర్థిక కార్యకలాపం ఇక్కడే కేంద్రీకృతమైవుంది. ఎక్కువ వాణిజ్య మరియు ఆర్థిక కార్యకలాపాలు ద్వీపంలోని మధ్య వ్యాపార జిల్లా నుంచి నిర్వహించబడుతున్నాయి. దేశంలో ఎక్కువ వాణిజ్య బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు మరియు ప్రధాన సంస్థల ప్రధాన కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. నైజీరియా మరియు ఆఫ్రికాలోని మిగిలిన నగరాలతో పోలిస్తే ఉన్నతమైన జీవన ప్రమాణాలు కలిగివున్న నగరాల్లో లాగోస్ ఒకటి.

దస్త్రం:Lagos cbd.jpg
లాగోస్ మధ్య వ్యాపార జిల్లా

లాగోస్ నౌకాశ్రయం నైజీరియాలో ప్రధాన ఓడరేవుగా మరియు ఆఫ్రికాలో అతిపెద్ద మరియు అత్యంత రద్దీగల ఓడరేవుల్లో ఒకటిగా గుర్తించబడుతుంది. దీనిని నైజీరియన్ పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తుంది, ఇది మూడు భాగాలుగా విభజించబడివుంది; అవి లాగోస్ పోర్ట్, లాగోస్ ద్వీపం పక్కన ఉన్న ప్రధాన కాలువపై ఉంది, అపాపా పోర్ట్ (కంటైనర్ టెర్మినల్ ఇక్కడ ఉంది), టిన్ క్యాన్ పోర్ట్, చివరి రెండు ఓడరేవులు బడాగ్రే పాయపై ఉన్నాయి, ఇది పశ్చిమం నుంచి లాగోస్ హార్బర్ గుండా ప్రవహిస్తుంది.[14] నౌకాశ్రయంలో ఒక రైల్‌హెడ్ ఉంది.

ఈ నౌకాశ్రయం నుంచి ముడి చమురు ఎగుమతులు పెరుగుతున్నాయి, 1997 మరియు 2000 మధ్యకాలాన్ని ఈ ఎగుమతుల పరిమాణం పెరుగుదలకు ఉదాహరణగా చెప్పవచ్చు.[15] చమురు మరియు పెట్రోలియం ఉత్పత్తులు నైజీరియా మొత్తం GDPలో 20% ఆదాయాన్ని మరియు విదేశీ మారకంలో 90% ఆదాయాన్ని సృష్టిస్తున్నాయి.[16]

రవాణా[మార్చు]

మూడో మెయిన్‌ల్యాండ్ వంతెన
దస్త్రం:Lagbus.jpg
లాగోస్ BRT బస్ స్టాప్.

రహదారులు[మార్చు]

పశ్చిమ ఆఫ్రికాలో అతిపెద్ద మరియు అత్యంత విశాలమైన రోడ్డు వ్యవస్థలు లాగోస్‌లో ఉన్నాయి.

లాగోస్‌లో ఉపపట్టణ మార్గాలు మరియు ఫెర్రీ సేవలు కూడా ఉన్నాయి. రద్దీ వేళల్లో రహదారులపై వాహనాల రాకపోకలు స్తంభిస్తుంటాయి, దీనికి నగర భౌగోళిక స్వరూపం కూడా ఒక ప్రధాన కారణంగా ఉండగా, విపరీతమైన జనాభా వృద్ధి ఇతర కారణాల్లో ఒకటి. లాగోస్ అనేక రహదారులు మరియు వంతెనల ద్వారా అనుసంధానం చేయబడివుంది.

లాగోస్‌లో స్థానిక రోడ్లలో కొన్నింటిని మెరుగ్గా నిర్వహిస్తుండగా, మరికొన్ని అధ్వాన్నమైన స్థితిలో ఉన్నాయి. అనేక స్వేచ్ఛారహదారులను మెరుగ్గా నిర్వహిస్తున్నారు. లాగోస్-ఐబాడాన్ ఎక్స్‌ప్రెస్‌వే మరియు లాగోస్- అబెయోకుటా ఎక్స్‌ప్రెస్‌వేలు నగర ఉత్తర ప్రాంతంలో ప్రధాన రహదారులుగా ఉన్నాయి, ఇవి వరుసగా ఓయో రాష్ట్రం మరియు ఓగున్ రాష్ట్రాలకు అంతరాష్ట్ర రహదారులుగా సేవలు అందిస్తున్నాయి. పశ్చిమంవైపు రద్దీగా ఉండే లాగోస్-బడాగ్రే ఎక్స్‌ప్రెస్‌వే ఫెస్టివల్ టౌన్ వంటి శివారు పట్టణాలను అనుసంధానం చేస్తుంది, 1977 ఫెస్టివల్ ఆఫ్ బ్లాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ 77కు ఈ ఫెస్టివల్ టౌన్ ఆతిథ్యం ఇచ్చింది.

దస్త్రం:Lagbuss.jpg
లాగోస్ ద్వీపంలోని టఫావా బెలావా స్క్వేర్ వద్ద ఐకోరోడు రోడ్డుకు వెళ్లే లాగోస్ బస్ ట్రాన్సిట్ సిస్టమ్ బస్సులు

BRT (లాగ్‌బస్‌)[మార్చు]

రాష్ట్రంలో రవాణా సమస్యలను పరిష్కరించేందుకు ఇటీవల లాగోస్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (LAMATA) సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. బస్ రాపిడ్ ట్రాన్సిట్ పథకాన్ని జూన్ 4, 2006న ప్రారంభించారు.[17]

లాగోస్ రాష్ట్రం ఇటీవల BRT (బస్ రాపిట్ ట్రాన్సిట్) వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది; మొదటి దశ ఫిబ్రవరి 2008లో పూర్తయింది. దీనిని ప్రాథమికంగా ఎనిమిది మార్గాల్లో నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు, నగరం గుండా ప్రత్యేకంగా రూపొందించిన BRT మార్గాల్లో ఈ వ్యవస్థను నడుపుతారు, భవిష్యత్‌లో మిగిలిన మార్గాల్లో కూడా ఈ బస్సులను నడిపే ఆలోచన ఉంది. లాగోస్ BRT మొదటి దశ 12 మైళ్ల పొడవు కలిగివుంది, ఐకోరోడు రోడ్డు మరియు ఫున్షో విలియమ్స్ ఎవెన్యూ గుండా CMS వరకు దీనిని నడుపుతున్నారు. కొన్నివారాలపాటు ప్రయోగాత్మక నిర్వహణ తరువాత, మార్చి 17, 2008న ప్రణాళికల కంటే ఎనిమిది నెలలు ముందుగా దీని నిర్వహణ ప్రారంభించబడింది.

బాగా రద్దీగా ఉండే సమయాల్లో ప్రతి గంటకు ప్రతి దిశలోనూ ఈ వ్యవస్థ 10,000 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుందని అంచనా వేయబడింది. LAMATA BRT కారిడార్ పొడవు సుమారుగా 22 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వ్యవస్థను NURTW కోఆపరేటివ్ (నైజీరియన్ యూనియన్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్) మరియు లాగోస్ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ కంపెనీ లాగ్‌బస్ అనే రెండు సంస్థలు నిర్వహిస్తున్నాయి, 12 మైళ్ల పొడవున్న CMS BRT లైట్ సిస్టమ్ మొదటి దశ అమలకు లాగ్‌బస్ 180 అధిక సామర్థ్య బస్సులను సరఫరా చేసింది.

అంతర్జాతీయ రహదారులు[మార్చు]

ఒక వాణిజ్య కేంద్రంగా, నౌకాశ్రయంగా మరియు వ్యూహాత్మక స్థానం కారణంగా లాగోస్‌లో మూడు ట్రాన్స్ ఆఫ్రికన్ హైవే మార్గాల చివరి బిందువుగా ఉంది, ఈ మార్గాలు నైజీరియా జాతీయ రహదారులను ఉపయోగించుకుంటున్నాయి:


రైలు (లాగోస్ లైట్ రైల్)[మార్చు]

లాగోస్ మహానగర ప్రాంతం గుండా ప్రయాణించే ప్రతిపాదిత రైల్వే లేను నిర్మాణంలో ఉంది, దీని నిర్మాణాన్ని 2012నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఫెర్రీలు[మార్చు]

లాగోస్ స్టేట్ ఫెర్రీ సర్వీసెస్ కార్పొరేషన్ కొన్ని మార్గాల్లో పడవలు నడుపుతుంది, ఉదాహరణకు లాగోస్ ద్వీపం మరియు ప్రధాన భూభాగం మధ్య ఫెర్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి, ఈ మార్గాల్లో ఆధునిక పడవలు నడుపుతున్నారు. మడుగు మరియు కొన్ని పాయల్లో ప్రైవేట్ బోట్లు ప్రయాణిక సేవల కోసం అప్పుడప్పుడు నడపబడుతున్నాయి. 1Qలో అనేక మార్గాల్లో ఫెర్రీ సేవలు చేపట్టే అవకాశం ఉంది.

విమానాశ్రయాలు[మార్చు]

లాగోస్‌లో ముర్తాలా మొహమ్మెద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, ఆఫ్రికాలోని అతిపెద్ద విమానాశ్రయాల్లో ఇది కూడా ఒకటి, నైజీరియా రాకపోకలకు ప్రయాణికులు ఎక్కువగా ఈ విమానాశ్రయాన్నే ఉపయోగిస్తున్నారు. ఈ విమానాశ్రయం నగర ఉత్తర శివారు ఐకెజాలో ఉంది, దీనిలో దేశీయ మరియు అంతర్జాతీయ టెర్మినళ్లు ఉన్నాయి. 2008లో 5.1 మిలియన్ల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయాన్ని ఉపయోగించారు, నైజీరియాలో యాభై శాతం విమానాల రాకపోకలు దీని గుండానే జరుగుతున్నాయి. ముర్తాలా మొహమ్మెద్ విమానాశ్రయాన్ని ఉపయోగించే అంతర్జాతీయ ప్రయాణికుల్లో ఎక్కువ మంది విదేశాల నుంచి ఇక్కడకు వచ్చే లేదా వెళ్లేవారు ఉంటారు.[18] విమానాశ్రయాన్ని ఇటీవల ఆధునికీకరించారు, దీనిలో ఒక కొత్త టెర్మినల్ నిర్మించడం జరిగింది.

సంస్కృతి[మార్చు]

సంగీతం & చలనచిత్ర పరిశ్రమ[మార్చు]

సంగీతానికి ఆఫ్రికా ఖండంలో లాగోస్ నగరం బాగా ప్రసిద్ధిగాంచింది. లాగోస్‌లో అనేక రకాల సంగీత శైలులు పుట్టాయి, వీటిలో నైజీరియా శైలి హిప్‌హాప్ (నైజా హిప్‌హాప్), హైలైఫ్, జుజు, ఫుజీ, మరియు ఆఫ్రోబీట్ ముఖ్యమైనవి.

దస్త్రం:Nat thrater.jpg
నేషనల్ ఆర్ట్స్ థియేటర్
దస్త్రం:Supereagle.jpg
నైజీరియన్ సూపర్ ఈగిల్స్

నైజీరియా చలనచిత్ర పరిశ్రమకు లాగోస్ ప్రధాన కేంద్రంగా ఉంది, దీనిని తరచుగా 'నాలీవుడ్'గా సూచిస్తారు. లాగోస్ ద్వీపంలోని ఐడుమోటా మార్కెట్ ప్రధాన పంపిణీ కేంద్రంగా ఉంది. లాగోస్‌లోని ఫెస్టాక్ ప్రాంతంలో అనేక చలనచిత్రాలను చిత్రీకరించారు.

చలనచిత్ర పరిశ్రమలో సినిమాలకు క్రమక్రమంగా మద్దతుదారులు తగ్గిపోతున్నారు. యోరుబా-భాషా చిత్రాలను ఎక్కువ మంది చూస్తుంటారు, తరువాత భారతీయ చిత్రాలకు ఎక్కువ ఆదరణ ఉంది. పశ్చిమ దేశాలకు చెందిన చలనచిత్రాలను సుదీర్గకాలంపాటు, ముఖ్యంగా యోరుబా-భాషా చిత్రాలతోపాటు ఇక్కడ ప్రదర్శించలేదు. ఆంగ్ల భాషా చిత్రాలను ప్రధానంగా ఐగ్బోస్ నియంత్రిస్తుంటారు, వీటికి బాగా ఆదరణ ఉంటుంది, ఇవి స్టూడియోల నుంచి నేరుగా మార్కెట్‌లోకి వస్తుంటాయి.

ఐగాన్ములో నేషనల్ ఆర్ట్స్ థియేటర్ ఉంది - నైజీరియాలో ఇది ఒక ప్రధాన ప్రదర్శన కళల కేంద్రంగా ఉంది.

క్రీడ[మార్చు]

ప్రపంచంలోని ఇతర ప్రధాన నగరాలు మాదిరిగా, లాగోస్‌లో కూడా అత్యంత ప్రజాదరణ ఉన్న క్రీడ ఫుట్‌బాల్. ఇక్కడ ఉన్న ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్‌ల పేర్లు జూలియస్ బెర్గెర్ FC, ఫస్ట్ బ్యాంక్ మరియు స్టేషనరీ స్టోర్స్.

సూపర్ ఈగిల్స్‌ గా కూడా గుర్తించే నైజీరియా జాతీయ ఫుట్‌బాల్ జట్టు తమ సొంత మ్యాచ్‌లను ఒకప్పుడు లాగోస్‌లోని సురులెర్‌లో ఉన్న నేషనల్ స్టేడియంలో ఆడేది; అయితే ఈ జట్టు ఇప్పుడు ఎక్కువ మ్యాచ్‌లను అబుజాలోని పెద్ద మరియు కొత్త అబుజా నేషనల్ స్టేడియంలో ఆడుతుంది, ఇది ఇప్పుడు సూపర్ ఈగిల్స్‌కు ప్రాథమిక స్టేడియంగా ఉంది.[19][20]

దస్త్రం:Lagbeach.jpg
లాగోస్‌లోని లెక్కీ బీచ్
దస్త్రం:Laghotel.jpg
విక్టోరియా ద్వీపంలో ఎకో హోటల్ మరియు స్యూట్స్.


పర్యాటకం [మార్చు]

గవర్నర్ రాజీ బాబాటుండ్ ఫాషోలా నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన ఆధునికీకరణ ప్రాజెక్టు ఫలితంగా, ప్రపంచంలో మరియు ఆఫ్రికాలో ఒక అతిపెద్ద నగరంగా ఉన్న లాగోస్ క్రమక్రమంగా ఒక ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా మారుతుంది. ఒక ప్రపంచ శ్రేణి నగరంగా లాగోస్‌ను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. 2009 ఏప్రిల్ 25న జరిగిన ఇయో కార్నివల్ నిర్వహణతో ప్రపంచ శ్రేణి నగర హోదా దిశగా ఒక అడుగు పడింది. ప్రస్తుతం లాగోస్ ఒక వ్యాపార-ప్రధాన మరియు వేగంగా విస్తరిస్తున్న సమూహా కేంద్రంగా ఉంది. లాగోస్ యొక్క అట్లాంటిక్ తీరంలో అనేక ఇసుక బీచ్‌లు ఉన్నాయి. వీటిలో రెండు ప్రసిద్ధ బీచ్‌లు బార్ బీచ్ మరియు లెక్కీ బీచ్. ఇదిలా ఉంటే జనవరి 2009లో, ఒక ప్రైవేట్ యాజమాన్య జూ ఒకటి లాగోస్‌లోని ఎప్ ప్రాంతంలో ప్రారంభమైంది, ఆఫ్రికాకు చెందిన అనేక జంతువులను దీనిలో ఉంచారు.లాగోస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పూర్తిగా మద్దతు ఇస్తుంది. మూడు నక్షత్రాల నుంచి ఐదు నక్షత్రాల హోటళ్ల వరకు అనేక రకాల హోటళ్లు లాగోస్ నగరంలో ఉన్నాయి. నగరంలోని కొన్ని ప్రసిద్ధ హోటళ్లలో షెరటాన్ హోటల్ అండ్ టవర్స్, ఫెడరల్ ప్యాలస్ హోటల్, ఐకోయి హోటల్, సోఫీటెల్ లాగోస్ మూర్‌హౌస్ ఇకోయీ, ఎకో హోటల్స్ అండ్ స్యూట్స్, ది AHI రెసిడెన్స్ మరియు ది పామ్‌వ్యూ మనార్. నైజీరియా యొక్క సంపన్న సంస్కృతి, వినోద దృశ్యాలు మరియు లాగోస్ నగరంలో కనిపించే జీవకళకు సందర్శకులు ఎక్కువగా ఆకర్షించబడుతున్నారు. ఓబా ప్యాలస్, నేషనల్ మ్యూజియం, ఫెలా ఆలయం మరియు బీచ్ రిసార్టులు ఇక్కడ ప్రధాన పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి.

విద్య[మార్చు]

లాగోస్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పాఠశాలలను నిర్వహిస్తుంది.[21] ఇక్కడ విద్యా వ్యవస్థ 6-3-3-4 విధానంలో ఉంటుంది, ఇది దేశవ్యాప్తంగా ఆచరణలో ఉంది (అనేక ఇతర ECOWAS దేశాల్లో కూడా). విద్యా వ్యవస్థలో ప్రాథమిక, జూనియర్ సెకండరీ స్కూల్ (JSS) మరియు సీనియర్ సెకండరీ స్కూల్ (SSS) మరియు విశ్వవిద్యాలయ స్థాయిలు ఉంటాయి. బాలలందరికీ ప్రాథమిక విద్యను అందిస్తారు, ఇప్పుడు మొదటి తొమ్మిద సంవత్సరాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.

లాగోస్‌లో ఏడు[citation needed] సెకండరీ పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు ఇతర వృత్తివిద్యా సంస్థలు ఉన్నాయి, ఇవి ప్రభుత్వ లేదా ప్రైవేట్ యాజమాన్యాల నియంత్రణలో ఉన్నాయి.

పాలిటెక్నిక్ సంస్థలు[మార్చు]

  • యాబా కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ (YABATECH) : దీనిని 1934లో స్థాపించారు, ఈ కళాశాల నైజీరియాలో మొట్టమొదటి మరియు ఆఫ్రికాలో మూడో ఉన్నత విద్యా సంస్థ కావడం గమనార్హం. ఈ కళాశాల సంస్కృతి మరియు వారసత్వ కేంద్రంగా ఉంది. ప్రస్తుతం దీనిలో 16,000 మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు.
  • లాగోస్ స్టేట్ పాలిటెక్నిక్ అనేది ఒక పాలిటెక్నిక్ విద్యా సంస్థ, దీనిలో ప్రైవేట్ పాలిటెక్నిక్‌తోపాటు 6 పాఠశాలలకుపైగా ఉన్నాయి, దీనిని 25 ఏళ్ల క్రితం స్థాపించారు. దీని ప్రధాన క్యాంపస్ ఐకోరోడులోని షాగాము రోడ్డుపై ఉంది.
  • లాగోస్ సిటీ పాలిటెక్నిక్, ఐకెజా - ఇది నైజీరియాలో మొట్టమొదటి ప్రైవేట్ పాలిటెక్నిక్‌గా ఉంది. దీనిని 1990లో స్థాపించారు. ఎంజర్ బాబాటుండే ఓడుఫువా దీని వ్యవస్థాపకుడు. ఎంజర్ ఓడుఫువా ఓగున్ రాష్ట్రంలోని ఐజెబు నార్త్ ఈస్ట్ లోకల్ గవర్నమెంట్ ఏరియాలోని (I.N.E.L.G) ఓకె-అయ్ ప్రాంతానికి చెందినవాడు.
  • గ్రేస్ పాలిటెక్నిక్
  • వోలెక్స్ పాలిటెక్నిక్
  • ఫెడరల్ కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ అండ్ మెరైన్ టెక్నాలజీ అనేది ఒక మోనోటెక్నిక్ విద్యా సంస్థ, ఫిషరీస్ టెక్నాలజీ, జనరల్ సైన్స్, మెరైన్ ఇంజనీరింగ్ మరియు నాటికల్ సైన్స్ కోర్సులను అందిస్తుంది.

విశ్వవిద్యాలయాలు[మార్చు]

దస్త్రం:Unilag.jpg
లాగోస్ విశ్వవిద్యాలయం
  • పాన్-ఆఫ్రికన్ విశ్వవిద్యాలయం, ఇది ప్రధానంగా ఒక వ్యాపార పాఠశాల, ఇది రెండు MBA కోర్సులు అందిస్తుంది. దీనిని 1996లో స్థాపించారు, 2002లో విశ్వవిద్యాలయ హోదా కల్పించబడింది, దీనిలో లాగోస్ బిజినెస్ స్కూల్ అండ్ ఆఫ్ ఎంటర్‌ప్రైజ్ డెవెలప్‌మెంట్ సర్వీసెస్ అనే విద్యా సంస్థ ఉంది. కళా అధ్యయనంపై కూడా ఈ విశ్వవిద్యాలయం కోర్సులు అందిస్తుంది.
  • లాగోస్ విశ్వవిద్యాలయం (UNILAG) 1962 నుంచి ఒక అతిపెద్ద విద్యా సంస్థగా గుర్తింపు పొందింది, దీనిలో 35,000 మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. దీనిలో 13 విభాగాలు ఉన్నాయి మరియు 4000 మందికిపైగా సిబ్బంది పనిచేస్తున్నారు.[22]
  • లాగోస్ రాష్ట్ర విశ్వవిద్యాలయం (LASU) అనేది ఒక బహుళ-క్యాంపస్ విశ్వవిద్యాలయం, దీనిని 1984లో స్థాపించారు, దీనిని లాగోస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రధాన క్యాంపస్ ఓజూలోని లాగోస్-బడాగ్రే ఎక్స్‌ప్రెస్‌వేపై ఉంది.
  • నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ, నైజీరియాలో ఇది మొట్టమొదటి ఓపెన్ యూనివర్శిటీగా గుర్తింపు పొందింది, ఇది లాగోస్, విక్టోరియా ద్వీపంలోని అహ్మదు బెల్లా రోడ్డుపై ఉంది.
  • లాగోస్ స్టేట్ కాలేజ్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీ (LASCOHET) యాబా- అనేది ఒక చిన్న విద్యా సంస్థ, హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్, ఫార్మసిస్ట్ టెక్నిషియన్, మెడికల్ లాబోరేటరీ టెక్నిషియన్, కమ్యూనిటీ హెల్త్ ఎక్స్‌టెన్షన్ వర్కర్ మరియు ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ టెక్నాలజీ వంటి ఆరోగ్య కోర్సులను అందిస్తుంది, ఇది కూడా యాబాలో ఉంది.
  • లాగోస్ స్టేట్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్, (LASUCOM), ఐకెజా
  • లాగోస్ యూనివర్శిటీ టీచింగ్ హాస్పటల్ (LUTH), ఐడి-అరబా-ముషిన్, లాగోస్.

కొత్త జిల్లాలు[మార్చు]

ఎకో అట్లాంటిక్ సిటీ[మార్చు]

ఎకో అట్లాంటిక్ సిటీ అనేది ఒక ప్రతిపాదిత 21వ శతాబ్దపు నగరం, దీనిని నిర్మించాల్సి ఉంది, అట్లాంటిక్ మహాసముద్రం నుంచి తిరిగి పొందిన భూమిపై దీనిని నిర్మించాలనుకుంటున్నారు. ఇప్పటికే, ఎక్కువ శాతం భూభాగాన్ని సేకరించడం జరిగింది. ప్రతిపాదిత అభివృద్ధి ప్రాజెక్టును 400,000 నివాసులను మరియు ద్వీపానికి రోజూ వచ్చివెళ్లే 250,000 ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని చేపట్టారు. ఈ ప్రాజెక్టు 1950వ మరియు 1960వ దశకాల స్థాయికి తీరాన్ని పునరుద్ధరించేందుకు ఉద్దేశించబడింది, కోత కారణంగా జరిగిన నష్టాన్ని దీనితో సవరించాలనుకుంటున్నారు.[23]

ముఖ్యమైన వ్యక్తులు[మార్చు]

ప్రధాన వ్యాసం : లాగోస్‌కు చెందిన వ్యక్తులు
  • వోకల్ స్లెండెర్ లేదా ఎరిక్

గమనికలు మరియు సూచనలు[మార్చు]

  1. 1.0 1.1 Summing the 16 LGAs making up Metropolitan Lagos (Agege, Ajeromi-Ifelodun, Alimosho, Amuwo-Odofin, Apapa, Eti-Osa, Ifako-Ijaiye, Ikeja, Kosofe, Lagos Island, Lagos Mainland, Mushin, Ojo, Oshodi-Isolo, Shomolu, Surulere) as per:
    The Nigeria Congress. "Administrative Levels - Lagos State". Retrieved 2007-06-29. 
  2. 2.0 2.1 2.2 Summing the 16 LGAs making up Metropolitan Lagos (Agege, Ajeromi-Ifelodun, Alimosho, Amuwo-Odofin, Apapa, Eti-Osa, Ifako-Ijaiye, Ikeja, Kosofe, Lagos Island, Lagos Mainland, Mushin, Ojo, Oshodi-Isolo, Shomolu, Surulere) as per:
    Federal Republic of Nigeria Official Gazette (15 May 2007). "Legal Notice on Publication of the Details of the Breakdown of the National and State Provisional Totals 2006 Census" (PDF). Retrieved 2007-06-29. [dead link]
  3. వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ అండ్ అర్బన్ ఏరియాస్ ఫ్రమ్ 2006 టు 2020, బై CityMayors.com
  4. "The Origin of Eko (Lagos)". Edo Nation. Retrieved 2010-06-02. 
  5. [http://apps.atlantaga.gov/sister/lagos/nigeria/lagos.html "ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ లాగోస్ స్టేట్." జార్జియాలోని అట్లాంటా నగర వెబ్‌సైట్ - సోదరి నగరం, 24/7/07.
  6. "LagosIkeja, Nigeria: Climate, Global Warming, and Daylight Charts and Data". LagosIkeja, Nigeria: Climate-charts.com. Retrieved 2010-06-02. 
  7. "Weather Centre - World Weather - Average Conditions - Lagos". BBC. Retrieved 2010-06-02. 
  8. లాగోస్ న్యాయవ్యవస్థ
  9. http://www.nigerianmuse.com/20070207234037zg/important_documents/Lagos_Census_Affairs
  10. "NATIONAL POPULATION COMMISSION - MISUNDERSTANDING, MISPERCEPTION AND MISREPRESENTATION OF CENSUS 2006 A REJOINDER TO THE PUBLICATION - “The Falsification of Lagos Census Figure” by Lagos State Government". Economicconfidential.com. Retrieved 2010-06-02. 
  11. Federal Republic of Nigeria Official Gazette (2 February 2009, Volume 96, Number 2). "Legal Notice on Publication of the Details of the Breakdown of the National and State Official Totals 2006 Census" (PDF). Retrieved 2007-06-29.  , www.population.gov.ng}
  12. Obasola, Kemi (2007-02-05). "Lagos rejects population commission's figures". The Punch (Punch Nigeria Limited, via Biafra Nigeria World News). Retrieved 2007-12-11. 
  13. Government of Nigeria, National Population Commission (8 February 2007). "Lagos State Claim on the Provisional Result of the 2006 Census is Unfounded" (PDF). Retrieved 2007-06-29. 
  14. "OT Africa Line - Nigeria Page". Otal.com. 2007-02-01. Retrieved 2010-06-02. 
  15. "OT Africa Line - Lagos Port Statistics" (PDF). Retrieved 2010-06-02. 
  16. CIA World Factbook - Nigeria
  17. . ఎబౌట్.లాగోస్ స్టేట్ అఫీషియల్ వెబ్‌సైట్
  18. Federal Airports Authority of Nigeria. "Data & Statistics". Retrieved 2008-03-11. 
  19. "Nigeria". World Stadiums. Retrieved 2010-06-02. 
  20. http://www.rsssf.com/tablesn/nig-intres.html
  21. ఎడ్యుకేషన్
  22. యూనివర్శిటీ ఆఫ్ లాగోస్ అఫీషియల్ వెబ్‌సైట్
  23. Elumoye, Deji (2007-09-26). "'Eko Atlantic City Underway'". Thisday (via allAfrica.com) (AllAfrica Global Media). Retrieved 2008-02-04. 

లాగోస్‌మెట్ లాగోస్ మెట్రోపాలిటన్ కమ్యూనిటీ, నైజీరియా

వీటిని కూడా చూడండి[మార్చు]

Lua error in package.lua at line 80: module `Module:Portal/images/n' not found.

బాహ్య లింకులు[మార్చు]

{{{1}}} గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

Wiktionary-logo-en.png [[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు నిర్వచనాలు]] విక్క్షనరీ నుండి
Wikibooks-logo.svg [[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg [[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోటు నుండి
Wikisource-logo.svg [[wikisource:Special:Search/{{{1}}}|మూల పుస్తకాల నుండి]] వికి మూల పుస్తకాల నుండి
Commons-logo.svg [[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు మరియు మాద్యమము]] చిత్రాలు మరియు మాద్యమము నుండి
Wikinews-logo.png [[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి

ప్రభుత్వం
వార్తలు
ఇతరాలు
Articles Related to Lagos

మూస:Yoruba topics

Gnome-globe.svg Geographic locale

Lat. and Long. 6°27′11″N 3°23′45″W / 6.45306°N 3.39583°W / 6.45306; -3.39583

మూస:All-Africa Games Host Cities మూస:World's most populated urban areas

"http://te.wikipedia.org/w/index.php?title=లాగోస్&oldid=1207104" నుండి వెలికితీశారు