లారిక్ ఆమ్లం
మూస:Chembox IUPACNameమూస:Chembox PubChemమూస:Chembox Odourమూస:Chembox BoilingPtమూస:Chembox RefractIndexమూస:Chembox Viscosityమూస:Chembox NFPAమూస:Chembox FlashPtమూస:Chembox Other
| లారిక్ ఆమ్లం | |
|---|---|
| ఇతర పేర్లు | n-Dodecanoic acid; Dodecylic acid; Dodecoic acid;
Laurostearic acid; Vulvic acid; 1-Undecanecarboxylic acid; Duodecylic acid; |
| Identifiers | |
| CAS number | [143-07-7] |
| రసాయన ధర్మాలు | |
| Molecular formula | C12H24O2 |
| Molar mass | 200.31776 |
| స్వరూపం | తెల్లని పొడి |
| సాంద్రత | 0.880 g/cm3 |
| ద్రవీభవణ స్థానం |
43.2 °C[1] |
| నీటిలో ద్రావణీయత | insoluble |
| ప్రమాదాలు | |
| మూస:Chembox verificationExcept where noted otherwise, data are given for materials in their standard state (at 25 °C, 100 kPa) | |
| Infobox references | |
లారిక్ ఆమ్లం (Lauric acid or Dodecanoic acid) ఒక సంతృప్త కొవ్వు ఆమ్లం (Saturated fatty acid). దీనిలో 12 కార్బను మూలకాలు వుండి, తెల్లనిపిండి మాదిరిగా సబ్బువాసననిస్తుంది.
అణుఫార్ములా: CH3(CH2)10COOH
లారిక్ ఆమ్లం లక్షణాల పట్టిక
| లక్షణము | విలువలమితి |
| మొలారు భారం | 200.31776 |
| సపోనిఫికెసను సంఖ్య | 253-287 |
| భాష్పపీడనం | 0.000661mm/Hg |
| భాష్పసాంద్రత | 6.91(Air=1) |
| వక్రీభవనసూచిక | 1.423 |
| మరుగు ఉష్ణొగ్రత | 298.90C |
| సాంద్రత | 0.880 g/cm3 |
| ద్రవీభవన ఉష్ణోగ్రత | 43.20C |
లారిక్‌ఆమ్లం అధికమొత్తంలో కొబ్బరినూనె మరియు పామ్‌కెర్నల్ నూనెలో వుండును.ఈఆమ్లం లారెల్‌కుటుంబానికి(Laureceae)చెందిన లారెసియవిత్తనంలో(laurus nobilis) ఈ కొవ్వుఆమ్లంను మొదటగా 1849లో మరిస్సొన్.ట్టి. గుర్తించడం వలన లారిక్‌ఆసిడనే పేరువచ్చినది.ఎక్కువకాలం పాడవ్వకుండ నిల్వవుండెగుణంకల్గివున్నది.పామెటిక్ మరియు స్టియరిక్ సంతృప్త ఆమ్లాల తరువాత ఎక్కువగా నూనెలలోవుండు సంతృప్త అమ్లం లారిక్‌ఆసిడ్.దాల్చినచెక్కనూనెలో కూడ 75-80% వరకు లారిక్ ఆమ్లం వున్నది.అంబెల్లిఫెర కుటుంబమొక్కలవిత్తననూనెలో కూడ ఈకొవ్వు ఆమ్లం వునికిని గుర్తించడం జరిగినది.కొబ్బరినూనె మరియు పామ్‌కెర్నల్‌నూనెలలో 45-60% వరకు వున్నది.తల్లిపాలలో(5.8%పాలలోని కొవ్వులో),ఆవుపాలలో2.2%,మరియు మేకపాలలో4.5% వరకు లారిక్ ఆమ్లం వున్నది. బాబాస్సు (Babassu)బట్టరులో కూడా 40-50% వరకు లారిక్ ఆమ్లంవున్నది.పోకచెక్క(Betel nut)లో9.0%,ఖర్జురపునట్‌లో 2-5%,వైల్డ్‌నట్‌మెగ్(virola surinamensis)లో7-11.5%,
ఉపయోగాలు [మార్చు]
- లారిక్ ఆమ్లం వైరస్‌ల పైనున్న లిపిడ్ పొరలను కరగించి, నాశనంచెయ్యు శక్తివున్నట్లు గుర్తించారు. మనిలాలోని సాన్‌లాజారొ (san lazaro)వైద్యశాలలో HIV రోగులమీద కొబ్బరినూనెను, మోనొలారెల్‌ను ఉపయోగించి చూశారు. రోగులలో వైరసు ప్రభావత్రీవత తగ్గినట్లు గుర్తించారు. డా.మారి ఇనిగ్ (Dr.Mary eing)నిర్వహించిన పరిశోధనలోకూడా మోనొలారెలుకు యాంటి వైరల్, యాంటిబాక్టిరియల్, యాంటిఫంగల్ గుణాలున్నట్లు తెలినది. యాంటి బయాటిక్ గుణాలుకూడా వున్నాయి.
- తల్లిపాలలోని లారిక్ ఆమ్లం (మొనో లారెన్) పసిపిల్లలో వైరల్, మరియు బాక్టియాల నుండి ప్రతినిరోధకశక్తి నిస్తుంది. మొనోలారెన్ పేరుమీద మందులు మార్కెట్‌లో వున్నాయి.
- చిన్నపిల్లల సబ్బుల తయారి, షాంపోల తయారిలో,లారిక్ ట్రైగ్లిసెరైడ్‌ను మర్గరినుల తయారిలో, గ్రీజులతయారిలో ఆడెస్సివ్స్ తయారిలోని వాడెదరు. యాంటిమైక్రొబియల్ గుణాలలుండటం వలన ఆయింట్మెంట్‌లలో వాడెదరు.
- బైండరుగా, ఎమల్సిఫైయరుగా, అంటి కేకింగ్ ఏజంటుగా పనిచేయును.
- కాస్మోటిక్స్‌ల తయారిలో కూడా వినియోగిస్తారు.
- కేరళలో లారిక్ ఆమ్లంను 50% మించి కలిగివున్న కొబ్బరినూనెను స్నానంకు ఒకగంట ముందు వళ్లంత రుద్దుకుని ఆతరువాత స్నానం చేస్తారు.
- జీర్ణవ్యవస్థలో లారిక్ ఆమ్లం మోనోలారెల్ గా రూపాంతరం చెందుతుంది.
మూలాలు [మార్చు]
|
|||||