లిడోకెయిన్
వికీపీడియా నుండి
లిడోకెయిన్ (Lidocaine or Lignocaine) ఒక విధమైన మందు. దీనిని సామాన్యంగా ఒక చిన్న ప్రాంతంలో తిమ్మిరి ఎక్కించడానికి ఇంజెక్షన్ గా ఉపయోగిస్తారు. ఇది దంత వైద్య చికిత్స మరియు చిన్న శస్త్రచికిత్సల కోసం విస్తృతంగా వినియోగంలో ఉన్నది. కొన్ని రకాల లయకు సంబంధించిన గుండె జబ్బులలో కూడా వాడతారు.