లెవీ స్ట్రాస్ అండ్ కో.

వికీపీడియా నుండి
లెవీ స్ట్రాస్ అండ్ కో
Founded 1853 (1853)
వ్యవస్థాపకు(లు) లెవీ స్ట్రాస్
ప్రధానకార్యాలయం సాన్ ఫ్రాన్సిస్కో, క్యాలిఫోర్నియా, అమెరికా
Area served ప్రపంచవ్యాప్తం
కీలక వ్యక్తులు రిచార్డ్ ఎల్. కాఫ్ మన్ Chairman of the Board
జాన్ ఆండర్సన్ President and CEO
లెవీ క్రాక్ నెల్
పరిశ్రమ వస్త్రాలు
ఉత్పత్తులు జీన్స్
యాజమాని లెవీ స్ట్రాస్ వంశీకులు
ఉద్యోగులు 11,400 (2008)[1]
విభాగాలు లెవీస్, డాకర్స్, సిగ్నేచర్.
వెబ్‌సైటు [1]

విషయ సూచిక

[మార్చు] సంస్థ

లెవీ స్ట్రాస్ అండ్ కో. డెనిం జీన్స్ లను తయారు చేసే ఒక ప్రైవేటు సంస్థ. 1853 లో లెవీ స్ట్రాస్ బవేరియా రాజ్యానికి చెందిన ఫ్రాంకోనియాలోని బుట్టెన్ హైం నుండి క్యాలిఫోర్నియా లోని సాన్ ఫ్రాన్సిస్కో కి వచ్చి తన సోదరుడు నిర్వహిస్తున్న వ్యాపారాన్ని పడమటి సముద్ర తీరాన నెలకొల్పు సందర్భంలో స్థాపింపబడినది. 1870 లలోనే డెనిం ఓవరాల్ లను రూపొందించినప్పటికీ, ఆధునికీ జీన్స్ 1920 వరకు రూపొందించబడలేదు. లెవీ స్ట్రాస్ యొక్క నలుగురు మేనల్లుళ్ళచే ప్రస్తుతం నిర్వహింపబడుతున్నది.

ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న లెవీ స్ట్రాస్ మూడు విభాగాలుగా పని చేస్తుంది. సాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా లెవీ స్ట్రాస్ అమెరికా, బ్రసెల్స్ కేంద్రంగా లెవీ స్ట్రాస్ యూరోప్, మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా, సింగపూర్ కేంద్రంగా ఏషియా పసిఫిక్ డివిజన్. ప్రపంచవ్యాప్తంగా 10,500 మంది పని చేస్తున్న లెవీ స్ట్రాస్ రివెట్ లు వేసిన డెనిం జీన్స్ కి పెట్టింది పేరు.

1960, 70 లలో బ్లూ జీన్స్ కి ఉన్న ఆదరణ సంస్థ బాగా వృద్ధి చెందటానికి దోహదపడినది. జె. వాల్టర్ హాస్ సీనియర్, పీటర్ హాస్ సీనియర్, పాల్ గ్లాస్కో మరియు జార్జ్ పి. సింప్కిన్స్ సీనియర్ ల నాయకత్వంలో గ్రేట్ వెస్టర్న్ గార్మెంట్ కో.(GWG)అను కెనెడియన్ సంస్థను కైవసం చేసుకోవటంతో బాటు సరిక్రొత్త ఫ్యాషన్లు, మాడళ్ళను (స్టోన్ వాష్ లాంటివి) పరిచయం చేశాయి. ఇప్పటికి కూడా లెవిస్ స్టోన్ వాష్ లలో GWG సాంకేతికతనే ఉపయోగించటం విశేషం.

[మార్చు] భారతదేశంలో ఫిట్టింగ్ స్టయిల్ లు

[మార్చు] పురుషులకు

  • 511: హై రైజ్, రిలాక్స్డ్ లెగ్, స్ట్రెయిట్ బాటం
  • 531: మిడ్, టైట్, స్ట్రెయిట్
  • 541: లో, టైట్, స్ట్రెయిట్
  • 504: లో, స్లిం, స్లిం
  • 517: లో, టైట్, బూట్ కట్

[మార్చు] స్త్రీలకు

  • 596: లో, స్లిం, న్యారో
  • 595: మిడ్, స్లిం, న్యారో
  • 594: హై, స్ట్రెయిట్
  • 599: హై, టైట్

[మార్చు] భారతదేశంలో లెవీ ఉత్పత్తుల తయారీదారులు

[మార్చు] ఇవి కూడా చూడండి


ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు