లేజర్ హెయిర్ రిమూవల్
లేజర్ ద్వారా ఎపిలేషన్ అనేది ప్రయోగాత్మకంగా 20 ఏళ్ల పాటు పరిశీలించాక, 1970ల మధ్య కాలంలో అది వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చింది. ఇంటెన్స్ పల్స్‌డ్ లైట్ (IPL) ఎపిలేటర్స్ అనేవి సాంకేతికంగా లేజర్ కావు, పూర్తి స్పెక్ట్రమ్ లైట్‌ను ఇచ్చే జెనాన్ ఫ్లాష్ దీపాలు మాత్రమే. లేజర్ మరియు లైట్ ఆధారిత పద్దతులను, కొన్నిసార్లు ఫోటోథ్రిచియాలసిస్ లేదా ఫోటోఎపిలేషన్ అని పిలుస్తారు. ఇప్పుడు వీటిని చాలా సహజంగా లేజర్ హెయిర్ రిమూవల్ అని పేర్కొంటున్నారు. 1998లో మాసాచుషెట్స్ జనరల్ హాస్పిటల్‌లోని ఒక బృందం లేజర్ హెయిర్ రిమూవల్ గురించి తొలుత వచ్చిన వ్యాసాలను రచించింది.[1][2]
లేజర్ హెయిర్ రిమూవల్ యొక్క సామర్ధ్యం ఇప్పుడు సాధారణంగా డెర్మటాలజీ కమ్యూనిటీలో అంగీకరించబడింది మరియు లేజర్ హెయిర్ రిమూవల్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. లేజర్ హెయిర్ రిమూవల్ పద్దతులు, భద్రత, మరియు సామర్ధ్యం గురించి అనేక సమీక్షలు డెర్మటాలజీ సాహిత్యంలో ప్రచురించబడ్డాయి.[3]
విషయ సూచిక |
[మార్చు] చర్యల యొక్క మెకానిజమ్
లేజర్ హెయిర్ రిమూవల్ వెనక ఉన్న ప్రాథమిక సిద్ధాంతం సెలక్టివ్ పోటోథెర్మోలిసిస్ (SPTL) .[4] హీటింగ్ డార్క్ టార్గెట్ అంశం (మీలెనిన్) వల్ల లేజర్స్ స్థానికంగా నష్టం కలిగిస్తాయి. జుట్టు పెరుగుదల ఉన్న ప్రాంతంలో (ది ఫొలిసిల్), తప్ప మిగితా ప్రాంతంలో చర్మాన్ని వేడి చేయకూడదు. డార్క్ అంశాలు కాంతిని త్వరగా గ్రహిస్తాయి. కాబట్టి చర్మంలో ఉన్న డార్క్ పదార్ధాలు భారీ సంఖ్యలో లేజర్ శక్తిని గ్రహిస్తాయి. (కాకపోతే లోపల ఉన్న మరింత వేగం మరియు సాంద్రతను బట్టి). ఈ డార్క్ టార్గెట్ అంశము లేదా క్రోమోపోర్ సహజంగా ఏర్పడుతుంది లేదా కృత్రిమంగా ఏర్పాటు చేయబడుతుంది.
హెయిర్ రిమూవల్ లేజర్స్ ప్రత్యేకంగా మెలనిన్‌ను లక్ష్యంగా చేసుకుంటాయి:
- మెలనిన్ ను హెయిర్ రిమూవల్ లేజర్ యొక్క ప్రాథమిక క్రోమోఫోర్‌గా పరిగణించాలి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్నవి ఇవే. మెలనిన్ సాధారణంగా చర్మంలో ఏర్పడుతుంది.(ఇది చర్మానికి మరియు జట్టుకు రంగును ఇస్తుంది). జట్టులో రెండు రకాల మెలనిన్‌లు ఉంటాయి: యూమెలనిన్ (ఇది జట్టుకు గోధుమ లేదా నల్ల రంగును ఇస్తుంది), మరియు ఫియోమెలనిన్ (ఇది జట్టుకు బంగారు లేదా ఎర్ర రంగును ఇస్తుంది). లేజర్ కాంతి యొక్క ఫోటాన్స్ ప్రత్యేకంగా గ్రహించబడడం వల్ల, నల్ల లేదా గోధుమ రంగులో ఉన్న జట్టు మాత్రమే తొలగించబడుతుంది.
లేజర్ వర్క్స్ డార్క్ కోర్స్ జట్టుకు ఉత్తమం. లేత రంగు చర్మం మరియు ముదురు రంగు జట్టు అనేది సరిగ్గా సరిపోయే కాంబినేషన్, కానీ కొత్త లేజర్స్ ఇప్పుడు ముదురు నలుపు జట్టు, ముదురు రంగు చర్మం ఉన్న రోగులకు కూడా చికిత్స అందించేందుకు వినియోగిస్తున్నారు.[5]
హెయిర్ రిమూవల్ లేజర్స్ 1997 నుంచి వినియోగంలో ఉన్నాయి. వీటిని శాశ్వత వెంట్రుకల తగ్గింపు కొరకు యునైటెడ్ స్టేట్స్‌లోని ఫుడ్ మరియు డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ((FDA) ఆమోదం పొందింది.[6] శాశ్వత వెంట్రుకల తొలగింపును దీర్ఘకాలంలో నిర్వచించారు. చికిత్స ప్రారంభించిన తర్వాత, తిరిగి పెరిగే వెంట్రుకల సంఖ్య తగ్గిపోవాలి. కానీ అనేక మంది రోగులు తాము చికిత్స తీసుకున్న తర్వాత, తిరిగి అక్కడ వెంట్రుకలు పెరగడాన్ని గుర్తించారు. లేజర్ హెయిర్ రిమూవల్ దాని యొక్క వేగం మరియు సామర్ధ్యం వల్ల బాగా ప్రాచుర్యం సంపాదించింది. అయితే దీని పనితీరు లేజర్ ఆపరేటర్ యొక్క సామర్ధ్యం మరియు అనుభవం మీద ఆధారపడి ఉంటుంది మరియు క్లినిక్‌లలో అందుబాటులో ఉన్న విభిన్న లేజర్ సాంకేతిక వ్యవస్థ దానిని పాటించే పద్దతి పై ఆధారపడి ఉంటుంది. కొన్నింటిలో టచ్‌అప్ చికిత్స సరిపోతుంది, ముఖ్యంగా పెద్ద ప్రాంతాల్లో, ప్రాథమికంగా 3 నుంచి 8 చికిత్సలు తీసుకున్న తర్వాత ఇది అవసరం అవుతుంది. కొంతమంది నాన్ రెస్పాండర్స్‌ను కూడా గమనించడం జరిగింది. అయితే ఇది నిర్ధారించబడలేదు మరియు దీనికి కారణాలు కూడా తెలియరాలేదు. ఇందులో అధిక శాతం లేజర్ ఆపరేటర్లలో నైపుణ్యం లేక మరియు మిషన్ యొక్క సెట్టింగ్స్‌ను వారు సరిగా ఉపయోగించక ఇలా జరుగుతోంది.[7]
[మార్చు] ఎలక్ట్రాలసిస్‌లతో పోలిక
దాదాపు 135 ఏళ్లకు పైగా ఉపయోగిస్తున్న మరొక హెయిర్ రిమూవల్ పద్దతి ఎలక్ట్రాలసిస్.[8] ఆ సమయంలో ఇదొక్కటే అందుబాటులో ఉన్న మంచి శాశ్వత చికిత్స. FDA ప్రస్తుతం శాశ్వత వెంట్రుకల తొలగింపు పదాన్ని ఎలక్ట్రాలసిస్ కొరకు మాత్రమే అనుమతించింది. లేజర్ ఎపిలేషన్ మాదిరిగా కాకుండా, అన్ని రంగుల వెంట్రుకల పై ఎలక్ట్రాలసిస్ సమర్ధంగా పని చేస్తుంది.
టర్కీలోని అంకారాలోని ASVAK లేజర్ సెంటర్‌లో 2000లో నిర్వహించిన అధ్యయనంలో 12 మంది రోగుల పై అలెగ్జాండ్రైట్ లేజర్‌ను మరియు ఎలక్ట్రాలిసిస్‌ను పరీక్షించారు. ఇందులో లేజర్ పద్దతి 60 సార్లు అధిక వేగంతో ప్రభావం చూపుతుందని, తక్కువ నొప్పితో, ఎలక్ట్రాలిసిస్‌తో పోలిస్తే మరింత నమ్మదగినదిగా గుర్తించారు.[9]
[మార్చు] ఫలితం పై ప్రభావం చూపే లేజర్ పారామీటర్స్
లేజర్ శక్తి యొక్క అనేక వేవ్‌లెంగ్త్‌ను వెంట్రుకల తొలగింపులో ఉపయోగిస్తారు. ఇందులో కనిపించే కాంతి నుంచి ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్ వరకూ అనేకం ఉంటాయి. ఈ లేజర్స్ సాధారణంగా లేజింగ్ మీడియమ్‌ను ఉపయోగించి వేవ్‌లెంగ్త్‌ను సృష్టించడం ద్వారా నిర్వచించడ్డాయి. (దీనిని నానోమీటర్స్‌లో (nm)కొలుస్తారు).
| ఆర్గాన్: 488 nm (ముదురు ఆకాశ నీలం) లేదా 514.5 nm (సియాన్) (జుట్టు తొలగింపు కోసం ఎక్కువ కాలం ఉపయోగించలేదు) |
| రూబి లేజర్: 694.3 nm (ఆరెంజ్ రెడ్) (జుట్టు తొలగింపు కోసం ఎక్కువ కాలం ఉపయోగించలేదు; చాలా లేత రంగు చర్మం ఉన్న పేషంట్లకు మాత్రమే ఇది రక్షణాత్మకం)[10] |
| అలెగ్జాండ్రైట్: 755 nm (ఎరుపు) (లేత రంగు చర్మం కొరకు పూర్తి సమర్ధవంతమైనది. ముదురు రంగు చర్మం యొక్క సమర్ధమైన అమరికల కొరకు మాత్రం అంత రక్షణాత్మకం కాదు) |
| పల్స్‌డ్ డియోడ్ ఏరే: 810 nm (ఇన్‌ఫ్రారెడ్‌కు దగ్గరగా) (లేత రంగు నుంచి మధ్యమ రకపు చర్మాల కొరకు ఉపయోగిస్తారు) |
| Nd:YAG laser: 1064 nm (ఇన్‌ఫ్రారెడ్‌కు చేరువలో) (ముదురు రకం చర్మానికి శిక్షణ కోసం ఉపయోగిస్తారు. ఇది అన్ని రకాల చర్మాలకూ ఉపయోగపడతుంది.) |
పల్స్ వెడల్పు కూడా ఒక ముఖ్యముగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం. పెద్ద పల్స్ వెడల్సు కూడా ముదురు రంగు చర్మానికి సురక్షితం. కానీ చిన్న పల్స్ వెడల్పులు వెంట్రుకల ఫోలికల్స్‌ను పని చేయకుండా చేయడంలో సమర్ధంగా పని చేస్తాయి.[citation needed] రిపిటీషన్ రేట్ అనేది కొనసాగే ప్రభావాన్ని కలిగి ఉంటుంది, ఇది థర్మల్ రిలాక్సేషన్ సమయం పై ఆధారపడి ఉంటుంది.[citation needed] రెండు లేదా మూడు పల్స్‌లను ఒకేసారి లక్ష్యంగా చేసి షూటింగ్ జరుపుతున్నప్పుడు, పల్స్‌ల మధ్య నిర్దేశిత ఆలస్యం అనేది ఒక ప్రాంతాన్ని వేడెక్కించి మెరుగుపరచడానికి మంచి అవకాశాన్ని కలిగిస్తుంది. ఇది ప్రతి చికిత్సలో కిల్‌రేట్‌ను పెంచే అవకాశం ఉంది.
స్పాట్ పరిమాణం లేదా లేజర్ కిరణం యొక్క వెడల్పు చికిత్సలో ప్రభావం చూపుతాయి. సిద్దాంతపరంగా అసలైన కిరణం యొక్క వెడల్పు, సాధారణ వెడల్పు కంటే నాలుగు రెట్టు అధికంగా ఉంటుంది. ఎందుకంటే లక్ష్యం చాలా లోపలకు ఉంటుంది. జుట్టును తొలగించే లేజర్స్ వేలి కొన (8 నుంచి 18 mm) పరిమాణంలో స్పాట్ పరిమాణాన్ని కలిగి ఉంటాయి. లేజర్ స్పాట్ పరిమాణాలు లేజర్ కాంతి అధికంగా చొచ్చుకుపోవటానికి, చికిత్సను వేగంగా, సమర్ధవంతంగా చేయడానికి ఉపకరిస్తాయి.
ఫ్లూయెన్స్ లేదా శక్తి స్థాయి ముఖ్యమైన పరిగణనలోకి తీసుకునే మరొక అంశం. ఫ్లూయెన్స్‌ను జోల్స్ పర్ స్క్వేర్ సెంటీమీటర్ (J/cm²)లో కొలుస్తారు. వీటిని అత్యధిక సెట్టింగులలో ఉంచి చికిత్స చేయడం అవసరం. ఫొలికల్స్‌ను వేడెక్కిండం ద్వారా, అవసరమైనంత మేరకు తయారవుతున్న చర్మాన్ని నిర్వీర్యం చేస్తారు.
ఎపిడెర్మల్ కూలింగ్స్ అనేవి అత్యధిక ఫ్లూయెన్స్‌ను ఎంచుకోవడం ద్వారా ప్రత్యేకించి ముదురు రంగు చర్మం ఉన్న వారిలో నొప్పిని మరియు సైడ్ ఎఫెక్ట్‌లను తగ్గిస్తాయి. మూడు రకాల కూలింగ్‌లు అభివృద్ధి చేయబడ్డాయి:
- కాంటాక్ట్ కూలింగ్: ఒక విండో ద్వారా నీటిని సర్క్యులేట్ చేస్తూ లేదా ఇతర అంతర్గత కూలంట్‌ల ద్వారా చేస్తారు.
- క్రయోజెన్ స్ప్రే: లేజర్ పల్స్‌కు ముందు లేదా తర్వాత వెంటనే చర్మం మీదకు నేరుగా స్ప్రే చేస్తారు.
- ఎయిర్ కూలింగ్: చల్లటి గాలిని -34 డిగ్రీల చ వద్ద (జిమ్మర్ క్రోయో 5 యూనిట్లు) పంపుతారు.
[మార్చు] సెషన్ల సంఖ్య
వివిధ రకాల చికిత్సలను (సంక్లిష్టంగా 8 నుంచి 12 వారాల వ్యవధిలో 6 నుంచి 8) దీర్ఘకాలంలో వెంట్రుకలను తగ్గించడానికి చర్మం మరియు జట్టు యొక్క రంగు ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రస్తుత పారామీటర్ల ప్రకారం ఒక సిరీస్ యొక్క చికిత్సలను 8 నుంచి 12 వారాలుగా, ప్రతి ప్రాంతంలో జట్టు ఉన్న స్థితి ఆధారంగా నిర్ణయిస్తున్నారు.[11]
ఎన్ని సెషన్లు ఉండాలనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. శరీరంలో ఏ భాగానికి చికిత్స చేస్తున్నారు, చర్మం రంగు, జట్టు యొక్క పరిస్థితి, హిర్సుటిజమ్‌కు కారణాలు మరియు లింగాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. లైట్ చర్మం మీద కోర్స్ డార్క్ జట్టు ఉంటే చికిత్స చేయడం చాలా సులభం. ముదురు రంగు చర్మం మీద ఉన్న జట్టుకు చికిత్స చేయడం చాలా కష్టం. పలుచని జట్టు అనేది కొన్నిసార్లు మాత్రమే ప్రభావం చూపుతుంది. నిర్దేశిత ప్రాంతాల (మగవారి మొహాలు)లో ఎక్కువ చికిత్సల ద్వారా కావలసిన ఫలితాన్ని పొందుతారు. దీనికి అదనంగా, అనేక దశలలో వెంట్రుకల పెరుగుతాయి కాబట్టి (అనాజెన్, టెలోజెన్, కాటాజెన్) మరియు లేజర్ కేవలం పెరుగుతున్న ఫోలికల్స్ పై మాత్రమే ప్రభావం (అనాజెన్) చూపుతాయి, అన్ని దశలలో జుట్టును చంపటానికి అనేక సెషన్స్ అవసరం అవుతాయి.
ఇక్కడ గుర్తుంచువలసిన ముఖ్య అంశం, లేజర్ లేత రంగు వెంట్రుకల విషయంలో సరిగా పనిచేయదు మరియు ఏదైనా రంగుకు సంబంధించిన ఫైన్ మరియు వెల్లస్ వెంట్రుకలలో (పీచ్‌ఫజ్)కూడా సరిగా పనిచేయదు.
[మార్చు] సెషన్ల మధ్య విరామాలు
సాధారణంగా చికిత్స 8 నుంచి 12 వారాలకు విస్తరించబడినప్పుడు, శరీరం యొక్క భాగం మరియు ఆ ప్రాంతంలోని వెంట్రుకల సైకిల్ పొడవు మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, సాధారణంగా మొహానికి తరచుగా చికిత్స చేస్తే 3 నుంచి 4 వారాలు సరిపోతుంది. కానీ కాళ్లకు తరచుగా చేయాల్సిన చికిత్సలు తక్కువ పడతాయి.
ఆర్బిట్రేటరీ షెడ్యూల్‌ను అనుసరించే కంటే, చికిత్స ద్వారా వెంట్రుకల రూపం మారడం కొరకు ఎదురుచూడటం మంచిది. ఒకోసారి ఇది 2 నుంచి 3 వారాల్లోనే పూర్తవుతుంది మరియు హెయిర్ ఫ్రీ కాలం పూర్తయ్యాక మళ్లీ ఎంత కాలానికి వెంట్రుకలు పెరుగుతున్నాయనేది పరిశీలించాలి. దీనిని బట్టి మరొక చికిత్స అవసరమో లేదో చూసుకోవాలి.[12] ఒకవేళ మూడు వారాలలోపు జట్టు పూర్తిగా పోకపోతే టచ్‌అప్ చేయించుకోవడం మంచిది.
[మార్చు] ఇతర ఉపయోగాలు
హెయిర్ రిమూవల్ లేజర్స్ సూడోఫొలిక్యులిటీస్ బార్‌బే చికిత్సలోనూ సమర్ధంగా పని చేస్తాయి. (సాధారణంగా దీనిని ఇన్‌గ్రోన్ హెయిర్స్ లేదా షేవింగ్ బంప్స్ అంటారు). ముదురు రంగు చర్మం ఉన్న రోగులలో, నల్ల జుట్టు ఉంటే, అనుభవమున్న ప్రాక్టీస్నర్ లాంగ్ పల్స్‌డ్ Nd:YAG లేజర్‌ను కూలింగ్ టిప్‌తో సురక్షితంగా, ప్రభావవంతంగా ఉపయోగించడం చేస్తారు.
ఇటీవల నివేదించబడిన దాని ప్రకారం, ఇది పిలోనిడాల్ సిస్ట్స్‌లకు చేసే చికిత్సలో కూడా బాగా సహాయకారిగా ఉంటుంది. వారు లోపల పెరిగిన వెంట్రుకలను తొలగించినందున, అది నలకల యొక్క చర్యలను, కాంజినెంటర్ మాలడిలో తొలగిస్తుంది.
[మార్చు] సైడ్ ఎఫెక్ట్స్ మరియు ప్రమాదాలు
కొన్ని సాధారణ సైడ్ ఎఫెక్ట్‌లు లేజర్ హెయిర్ ట్రీట్‌మెంట్ సమయంలో ఏర్పడతాయి. ఇందులో దురదు, ఎర్రగా కావడం మరియు చికిత్స ఇచ్చిన ప్రాంతంలో వాపు రావడం లాంటిది ఉంటాయి. ఈ సైడ్ ఎఫెక్ట్‌లు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండవు. చికిత్స సమయలో కొంత నొప్పి పుట్టడాన్ని కూడా మనం గమనించవచ్చు. అనేక క్లినిక్‌లలో తిమ్మిరి ఇచ్చే క్రీమ్‌లు అందుబాటులో ఉంటాయి. సాధారణంగా వీటిని అదనపు ధరతో ఇస్తారు. చికిత్స తర్వాత ఆ ప్రాంతంలో ఐసింగ్ చేయడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్‌లను వేగంగా తగ్గించవచ్చు.
అవసరం లేని సైడ్ ఎఫెక్ట్‌లు, హైపో లేదా హెపర్ పిగ్మెంటేషన్ లేదా, కొన్ని కేసులలో చర్మం మంట పుట్టడం లాంటివాటిని, లేజర్‌సెట్టింగ్‌లలో మార్పులు చేయడం ద్వారా ఆపవచ్చు.[13] చర్మం కాలిపోయే ప్రమాదం లేదా చర్మం డిస్‌క్లోరేషన్ ప్రమాదం,[14] హైపోపిగ్మెంటేషన్ (తెల్ల మచ్చల), యాక్నే యొక్క ఫ్లార్, ఫాలికల్ చుట్టూ వాపు రావడం, స్కాబ్ ఏర్పడటం, పురుపురా మరియు ఇన్‌ఫెక్షన్‌ల యొక్క ప్రమాదం ఉంటుంది. ఈ ప్రమాదాలను సరైన లేజర్ పద్దతిలో చికిత్స చేయడం ద్వారా అడ్డుకోవచ్చు మరియు వ్యక్తి చర్మం రకాన్ని బట్టి చికిత్స చేస్తే ఇలాంటివి వచ్చే అవకాశం లేదు.
కొందరు రోగులలో అలర్జీ ద్వారా సైడ్ ఎఫెక్ట్‌లు ఉంటాయి. కొన్ని లేజర్ రకాలలో హెయిర్ రిమూవల్ జెల్ వాడటం లేదా క్రీమ్‌లను వాడటం వల్ల ఇది వస్తుంది. ఒకవేళ ఇలాంటి అలర్జీ సంబంధింత సైడ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు వైద్యుడిని సంబంధించి దానికి సంబంధించిన చికిత్సను తీసుకోవాలి.
[మార్చు] వీటిని కూడా చూడండి
- జుట్టు తొలగింపు
[మార్చు] సూచనలు
- ↑ డియెరిక్స్, సి.ఇ., ఎట్ ఆల్., శాశ్వతంగా జట్టు తొలగింపు, సాధారణ మోడ్ రూబి లేజర్ ద్వారా. ఆర్చ్ డెర్మాటాల్, 1998. 124 (7): పి. 837-42.
- ↑ గోల్డ్ ఎమ్‌హెచ్. అవసరం లేని జట్టు తొలగింపు కొరకు లేజర్స్ మరియు వెలుగు సోర్సులు.క్లిన్ డెర్మటాల్. 2007 సెప్టెంబరు -అక్టోబరు; 25 (5): 443 - 53
- ↑ ఎరెమియా, ఎస్,. ఎట్‌ఆల్., లేజర్ హెయిర్ రిమూవల్ : దీర్ఘకాలిక ఫలితాలు, 755 nm అలెగ్జాడ్రైట్ లేజర్‌తో. డెర్మటాల్ సర్జ్ 2001. 27 (11) : పి 920-4.
- ↑ ప్రత్యేకించిన లైట్ మరియు పల్స్ వేవ్‌లెంగ్త్ యొక్క మ్యాచింగ్, ఆప్టిమల్ ప్రభావాన్ని సాధించే సమయం, ఒక టిష్యూను చుట్టూ ఉన్న టిష్యూలపై తక్కువ ప్రభావం చూపించేలా సరిజేయడం.
- ↑ FDA.gov
- ↑ FDA.gov
- ↑ Hairtell.com
- ↑ మైకెల్ సిఇ. ట్రిచియాసిస్ మరియు డిషిచియాసిస్; రాడికల్ చికిత్సలో మెరుగుపడిన పద్దతి. సెయింట్ లూయిస్ క్లినికల్ రికార్డు, 1875; 2: 145-148.
- ↑ Görgü M, Aslan G, Aköz T, Erdoğan B (January 2000). "Comparison of alexandrite laser and electrolysis for hair removal". Dermatol Surgery 26 (1): 37–41. DOI:10.1046/j.1524-4725.2000.99104.x. PMID 10632684.
- ↑ Hairtell.com
- ↑ Hairtell.com
- ↑ Laserhairremoval.com
- ↑ లేజర్ హెయిర్ రిమూవల్ కాంప్లికేషన్స్
- ↑ లేజర్ హెయిర్ రిమూవల్ ముందు లేదా తర్వాత సన్‌బాత్ చేయవచ్చా?