లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ద లెబ్రెరి అఫ్ కాఒంగ్రెస్, వాసిగ్ట్న్
లాక్ కాంట్రాక్షన్

లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ అమెరికాలో అతి ప్రాచీన ప్రభుత్వ సాంస్కృతిక సంస్థ. ఈ సంస్థ శాసనసభ (కాంగ్రెస్) కు పరిశోధనా విభాగముగా కూడా పని చేస్తోంది. 130 మిలియన్ వస్తువుల ఊండే 530 మైళ్ళు విస్తరించే పుస్తకాల అరలు కల ఈ సంస్థ ప్రపంచములో అతి పెద్ద గ్రంథాలయం కూడా. ఈ వస్తు సముదాయము లలో 29 మిలియన్ పుస్తకములు మరియి ఇతర్ అచ్చు ప్రతులు, 2.7 మిలియన్ శబ్ద గ్రహణాఅలు (రికార్డింగులు), 12 మిలియన్ ఫొటో లు, 4.8 మిలియన్ మ్యాపులు, 58 మిలియన్ చేతి వ్రాత పుస్తకాలు ఉన్నాయి.

ఈ లైబ్రరీ బృహత్కార్యములు

  • వనరులను కాంగ్రెస్ కు, ప్రజలకు ఆందుబాటులో, ఉపయోగకరముగా ఉంచుట
  • సార్వత్రిక సముదాయమైన జ్ఞానమును సృజనాత్మకతను భావి తరములకు ఆందించుట

సభ్యత్వము[మార్చు]

ఈ లైబ్రరీ సామాన్య ప్రజలకు విద్యా విషయక పరిశోధనలకు, సందర్శకుల పర్యాటనలకు రోజూ తెరచి ఊండును. 18 సంవత్సరములు నిండిన వారు ఎవరైనా 'రీడరు గుర్తింపు కార్డు' పొంది రీడింగు రూములు, సముదాయము లను వీక్షించవచ్చును. కాని శాసనసభ సభ్యులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వారి స్టాఫ్, కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఉద్యోగులు మాత్రమే పుస్తకాలను బయటకి తీసుకు వెళ్ళగలరు.

ఆమెరికాలో మిగతా గ్రంథాలయాలు ఇక్కడ నుండి 'ఆంతర గ్రంథాలయ ఋణము' (Inter-library loan) తీసుకొనవచ్చును.

వనరులు[మార్చు]