ల్యూకోప్లాకియా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Leukoplakia
Classification and external resources
Leukoplakia02-04-06.jpg
The white lesion is an example of leukoplakia.
ICD-10 K13.2, N48.0, N88.0, N89.4, N90.4
ICD-9 528.6, 530.83, 607.0, 622.2, 623.1, 624.0
DiseasesDB 7438
MedlinePlus 001046
MeSH D007971

ల్యూకోప్లాకియా అనేది కెరటోసిస్(చర్మం మందంగా తయారుఅవుట) మచ్చలను వివరించుటకు ఉపయోగించు ఒక వైద్య పరి భాషా పదం[1] . ఇది నోటి లోపల జిగటగా ఉండే పొర మీద తెల్లని మచ్చల [2] వలె అంటుకుని ఉన్నట్లుగా కనిపిస్తుంది, నాలుక మీదే కాకుండా జీర్ణ-కోశ నాళం, మూత్ర నాళం మరియు జనేంద్రియాల వంటి ఇతర భాగాల మీద కూడా ఉంటాయి. వైద్య పరంగా ఇది చాల అస్థిరంగా ఉంటుంది. ల్యూకోప్లాకియా అనేది ఒక ప్రత్యేకమైన రోగం కాదు, కాని రోగానిర్ధారణలో అస్పష్టంగా ఉన్నప్పుడు నిర్ధారించరు.[3] కాన్డిడియాసిస్ లేదా లిచెన్ ప్లానస్ వంటి సారూప్యమైన తెల్లని క్షతాలు ఏర్పరిచే రోగాలకు దీనికి చాలా తేడా ఉంటుంది.

దీనిని కొన్ని సమయాలలో కాన్సర్ కు ముందస్తు సూచన అని వివరిస్తారు.[4]. ఇది పొగ త్రాగటం మీద కూడా ఆధారపడి ఉంటుంది.[1]

పొగాకుని పీల్చిన లేదా నమిలిన కూడా వస్తుంది, దీనిని ఈ వ్యాధి యొక్క వ్యాప్తిలో ముఖ్యమైన అపరాధిగా చెప్పవచ్చు. (1998-2010 మయో ఫౌండేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (MFMER).

"కాన్దిడాల్ ల్యూకోప్లాకియా" అనేది కొన్ని సమయాలలో కొన్ని ప్రత్యేక రకాల నోటి కాన్డిడియాసిస్ ని వివరించుటకు ఉపయోగిస్తారు.[5]

"ల్యూకోప్లాకియా" అనే పదమును ఎక్కువగా నోటి యొక్క స్థితులను వివరించుటకు ఉపయోగిస్తున్నప్పటికీ, దీనిని మూత్ర నాళం మరియు జనేంద్రియాల స్థితుల గురించి వివరించుటకు కూడా ఉపయోగిస్తారు[1].

సంభవం మరియు ప్రాబల్యం[మార్చు]

ల్యుకోప్లాకిక్ క్షతాలు ప్రపంచ జనాభాలో దాదాపు 3% మందిలో గమనించారు. ఎరిత్రోప్లాకియా వలె, ల్యూకోప్లాకియా సాధారణంగా 40 మరియు 70 సంవత్సారాల వయస్సు ఉండే వారిలో 2:1 నిష్పత్తి పురుష ప్రాధాన్యంలో గమనించారు.

కారణాలు[మార్చు]

ల్యూకోప్లాకియా ప్రధానంగా పొగాకుని ఉపయోగించుట మూలంగా వస్తుంది. దీని వ్యాప్తికి కారణమయ్యే ఇతర ఎతియోలాజికల్(జబ్బు ఏ కారణంగా వచ్చింది నిర్ణయించుట) కారకాలు HPV లు, కాండిడా అల్బికాన్స్ మరియు ఇంకా మధ్యం. అదే సమయంలో ల్యూకోప్లాకియా ఉన్న రోగులలో సీరం స్థాయిలు విటమిన్ A,B-12,C & ఫోలిక్ ఆమ్లంలలో తక్కువగా ఉంటాయి అని భారతదేశంలో జరిపిన ఒక అధ్యయనంలో కనుగొన్నారు. ఎక్కువగా కార్సినోజెన్స్ మూలంగా జిగటగా ఉండే పొర మీద దీర్ఘ కాలంగా చికాకు పెట్టుట మూలంగా జరుగుతుంది.[citation needed] రక్తమూలం, లేదా సాంగినేరియా(ఎండిపోయిన రక్త మూలం) ల్యూకోప్లాకియాకు సంబంధించి ఉంటుంది అని కూడా నమ్ముతారు.[6]

5% to 25% ల్యూకోప్లాకియాలు కాన్సర్ తొలి దశ గాయాలు; కాబట్టి అన్ని ల్యూకోప్లాకియాలు దంత వైద్యులు మరియు సాధారణ వైద్యులు దీనిని కాన్సర్ తొలిదశ గానే పరిగణించి ఆ కణజాలం నుండి చిన్న పొరను తొలగించి సూక్ష్మదర్శిని పరీక్షలకు పంపుతారు. HIV వంటి అంటురోగం మరియు రోగ నిరోధక శక్తిని తగ్గించే తీవ్రమైన రోగాలకు సంబంధించిన హైరి ల్యూకోప్లాకియా HIV తో కలిసి ఉన్నప్పుడు లింఫ్ గ్రంధులలో వ్యాపించే కాన్సర్ వ్యాప్తికి కారణం అవుతుంది.

చికిత్స[మార్చు]

ల్యూకోప్లాకియా చికిత్సలో ముఖ్యంగా పరిత్యజించాల్సిన కారకాలు — పొగాకును ఉపయోగించుట, పొగ త్రాగుట, తమలపాకులను నములటను విడిచి పెట్టుట, మధ్యం నుండి దూరంగా ఉండుట— మరియు దీర్ఘ కాలంగా చికాకు పెట్టే వాటిని విడిచి పెట్టుట, ఉదాహరణకు పదునుగా ఉండే దంతముల చివరలు. బయాప్సి(శరీర జీవ కణజాలం నుండి ఒక చిన్న భాగాన్ని తొలగించి పరీక్షించుట) ని చెయ్యాలి, మరియు ఒకవేళ కాన్సర్ తొలి దశ మార్పులు లేదా కాన్సర్ ని కాని గుర్తించినట్లైతే ఆ గాయాలను లేదా క్షతాలకు శస్త్రచికిత్స ద్వారా చికిత్స అందించాలి.

బీటా-కేరోటిన్ ని నోటి ద్వారా తీసుకోవటం వలన నోటి ల్యూకోప్లాకియాతో బాధ పడుతున్న రోగులకు ఉపశాంతి కలుగుతుంది. ఏ ఫలితాలను నిర్ధారించుటకు ఇంకా పరిశోధనలు చెయ్యాల్సిన అవసరం ఉంది.[7]

వీటిని కూడా చూడండి[మార్చు]

  • టైలోసిస్ మరియు ఎసోఫజీల్ కార్సినోమాతో ల్యూకోప్లాకియా
  • ప్రొలిఫెరేటివ్ వెర్రుకస్ ల్యూకోప్లాకియా
  • చర్మ సంబంధమైన పరిస్థితుల జాబితా

సూచనలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 అండర్ వుడ్. జనరల్ అండ్ సిస్టమాటిక్ పథాలోజి. 4th ప్రచురణ ఎడిన్బర్గ్ , లండన్: చర్చిల్ లివింగ్స్టన్ 2004
  2. మూస:DorlandsDict
  3. Mishra M, Mohanty J, Sengupta S, Tripathy S (2005). "Epidemiological and clinicopathological study of oral leukoplakia". Indian J Dermatol Venereol Leprol 71 (3): 161–5. doi:10.4103/0378-6323.16229. PMID 16394403. 
  4. Ishida K, Ito S, Wada N, et al (2007). "Nuclear localization of beta-catenin involved in precancerous change in oral leukoplakia". Mol. Cancer 6: 62. doi:10.1186/1476-4598-6-62. PMC 2140063. PMID 17922924. 
  5. Sitheeque MA, Samaranayake LP (2003). "Chronic hyperplastic candidiasis/candidiasis (candidal leukoplakia)". Crit. Rev. Oral Biol. Med. 14 (4): 253–67. doi:10.1177/154411130301400403. PMID 12907694. 
  6. అమెరికన్ అకాడెమి అఫ్ ఓరల్ అండ్ మాగ్జిల్లోఫెషియాల్ పథాలజీ అందించిన ల్యూకోప్లాకియా, (pdf రూపం) డిసెంబర్ 19, 2006 న పేజి తెరువబడినది.
  7. http://www.mayoclinic.com/health/beta-carotene/NS_patient-betacarotene

బాహ్య లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూస:Diseases of the skin and appendages by morphology మూస:Oral pathology మూస:Tumors of lip, oral cavity and pharynx మూస:Diseases of the pelvis and genitals