వంశీ

వికీపీడియా నుండి



వంశీ తెలుగు సినిమా దర్శకుడు మరియు రచయిత. అసలు పేరు జె.వి.కె. నారాయణ రాజు (కాని ఇంకొన్ని సమాచారం ప్రకారం ఆయన పేరు నల్లమిల్లి వంశి అని కూడా అంటుంటారు) ఈయన సినిమాల కధలు సహజంగా ఉంటూ పల్లె అందాలను ఆవిష్కరిస్తుంటాయి.

విషయ సూచిక

బాల్యం [మార్చు]

వంశీ తూర్పు గోదావరి జిల్లా, అనపర్తికి దగ్గరలో ఉన్నbalabadrapuram lo putti పసలపూడి అనే గ్రామంలో prigadu పుట్టి పెరిగాడు.

కెరీర్ [మార్చు]

తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యమైన శంకరాభరణం సినిమాకు వంశీ సహాయ దర్శకుడిగా వ్యవహరించాడు. దర్శకుడిగా ఆయన మొదటి సినిమా 1982లో చిరంజీవి, సుహాసిని,రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రధారులుగా నటించిన మంచు పల్లకి అనే సినిమా. ఈ సినిమాకు యండమూరి వీరేంద్రనాథ్ రచయిత. యండమూరి, చిరంజీవి కలయికలో వచ్చిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

1984 లో ఆయన రూపొందించిన సితార సినిమా విమర్శకుల మన్ననలనందుకుంది. ఇదే సినిమాతో భానుప్రియ తెలుగు సినిమాకు కథానాయికగా పరిచయమైంది. ఆయన రూపొందించిన చాలా వరకు సినిమాలకు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు.

వంశీ దర్శకత్వం వహించిన అనేక తెలుగు సినిమాలలో ప్రస్పుటంగా కనిపించే అంశములు కామెడీ మరియు తెలుగువారి వ్యావహారిక పద్ధతులు. గోదావరి పట్ల వంశీకి వున్న ప్రేమ అంతా ఇంతా కానిది. ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక పాత్ర గోదావరి జిల్లాతో సబంధముండి వుంటుంది.

అవార్డుల సినిమాలు [మార్చు]

వంశీ సినిమాల జాబితా [మార్చు]

  1. మంచు పల్లకి
  2. ఆలాపన
  3. అన్వేషణ
  4. సితార
  5. లేడీస్ టైలర్
  6. ప్రేమించు పెళ్ళాడు
  7. డిటెక్టివ్ నారద
  8. లాయర్ సుహాసిని
  9. మహర్షి
  10. చెట్టు క్రింద ప్లీడర్
  11. స్వర కల్పన
  12. శ్రీ కనకమహలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్
  13. ఏప్రిల్ 1 విడుదల
  14. లింగబాబు లవ్ స్టోరి
  15. జోకర్
  16. ప్రేమ ‍‍& కో
  17. వైఫ్ ఆఫ్ వి.వరప్రసాద్
  18. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు
  19. దొంగ రాముడు అండ్ పార్టి
  20. కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను
  21. అనుమానాస్పదం
  22. గోపి గోపిక గోదావరి
  23. సరదాగా కాసేపు

రచనలు [మార్చు]

  • మా పసలపూడి కధలు
  • రవ్వలకొండ
  • గాలికొండాపురం రైల్వే గేట్
  • మా దిగువ గోదావరి కథలు
  • ఆకుపచ్చని జ్ఞాపకం
  • వంశీకి నచ్చిన కథలు
  • ఆనాటి వాన చినుకులు
  • గోకులంలో రాధ
  • మంచు పల్లకి
  • వెన్నెల బొమ్మ
  • వెండితెర నవలలు
"http://te.wikipedia.org/w/index.php?title=వంశీ&oldid=822554" నుండి వెలికితీశారు