Coordinates: 16°08′23″N 80°55′08″E / 16.139620°N 80.919027°E / 16.139620; 80.919027

వక్కలగడ్డ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వక్కలగడ్డ
—  రెవెన్యూ గ్రామం  —
వక్కలగడ్డ is located in Andhra Pradesh
వక్కలగడ్డ
వక్కలగడ్డ
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°08′23″N 80°55′08″E / 16.139620°N 80.919027°E / 16.139620; 80.919027
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం చల్లపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి పరిశె మల్లేశ్వరి
జనాభా (2011)
 - మొత్తం 3,012
 - పురుషులు 1,491
 - స్త్రీలు 1,521
 - గృహాల సంఖ్య 985
పిన్ కోడ్ 521126
ఎస్.టి.డి కోడ్ 08671

వక్కలగడ్డ, కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన చల్లపల్లి నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మచిలీపట్నం నుండి 29 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 985 ఇళ్లతో, 3012 జనాభాతో 774 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1491, ఆడవారి సంఖ్య 1521. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1254 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 55. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589749.[1]

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో చిట్టూర్పు, పురిటిగడ్డ, వెలివోలు, యార్లగడ్డ, నడకుదురు గ్రామాలు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి చల్లపల్లిలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల చల్లపల్లిలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల విజయవాడలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు మచిలీపట్నంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల చల్లపల్లిలోను, అనియత విద్యా కేంద్రం మచిలీపట్నంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడ లోనూ ఉన్నాయి. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

  1. ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేయుచున్ మల్లుపెద్ది శివరాం ప్రసాదు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత. వీరు ఈ మధ్యనే పదవీ విరమణ చేశారు. [4]
  2. ఈ పాఠశాలలో చదువుచున్న విద్యార్థులు, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి సైన్సు ఫెయిర్ లలో పాల్గొని, పాఠశాల కీర్తి ప్రతిష్ఠలు ఎగురవేస్తూ, పలు బహుమతులు అందుకుంటున్నారు.
  3. ఈ పాఠశాలలో చదువుచున్న కుంపటి లావణ్య, కొడాలి గోవర్ధని అను విద్యార్థినులు అండర్-14 విభాగంలోనూ, వీర్ల శిరీష, పేటేటి కుసుమ అను విద్యార్థినులు అండర్-17 విభాగంలోనూ, రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైనారు. వీరు 26, సెప్టెంబరు-2014న అనంతపురంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు.
  4. ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న మట్టా స్వాతి అను విద్యార్థిని, రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అండర్-14 విభాగంలో ఎంపికైనది. పాఠశాల క్రీడా విభాగం ఆధ్వర్యంలో, 2014, అక్టోబరు-15న కాటూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో క్రీడాకారుల ఎంపికను నిర్వహించగా, ఆ పోటీలలో ఈమె విశేష ప్రతిభ కనబరచి, త్వరలో అనంతపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనది.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

వక్కలగడ్డలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

వక్కలగడ్డలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

వక్కలగడ్డలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 127 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 646 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 646 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

వక్కలగడ్డలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.ఊరచెరువు:- ఈ గ్రామంలోని ఊరచెరువు మూడున్నర ఎకరాలలో విస్తరించియున్నది.

  • కాలువలు: 646 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

వక్కలగడ్డలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, చెరకు, మినుము

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

బియ్యం

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[2]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

చల్లపల్లి మండలం[మార్చు]

చల్లపల్లి మండలంలోని చల్లపల్లి, చిడెపూడి, పాగోలు , నడకుదురు, నిమ్మగడ్డ, యార్లగడ్డ, వక్కలగడ్డ, వెలివోలు, పురిటిగడ్డ, లక్ష్మీపురం, గ్రామాలు ఉన్నాయి.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

రక్షిత మంచినీటి పథకం:- ఈ గ్రామంలోని 90,000 లీటర్ల సామర్ధ్యం గల రక్షిత మంచినీటి పథకం ద్వారా గ్రామప్రజల త్రాగునీటి అవసరాలు తీర్చుచున్నారు. [14]

వక్కలగడ్డ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (P.A.C.S)[మార్చు]

ఈ సంఘం నకు, ఉత్తమ సహకార సంఘం పురస్కారం లభించింది. సహకారసంఘ వారోత్సవాలను పురస్కరించుకొని, రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రైతులకు వ్యవసాయ రుణాలను ఇస్తూ, క్రమబద్ధంగా వసూలుచేసి, సంఘాలను లాభాలబాటలో నడిపిన, ఆరు సంఘాలను ఉత్తమ సంఘాలుగా ఎంపికచేసి, రాష్ట్రప్రభుత్వం పురస్కారాలను ప్రదానం చేసింది. కోస్తాంధ్రలో ప్రకటించిన రెండు సంఘాలలో, వక్కలగడ్డ సంఘం ఒకటి. ఇటీవల రంగారెడ్డి జిల్లా కందుకూరులో జరిగిన భారత సహకార 60వ వారోత్సవాల సందర్భంగా, సహకార శాఖా మంత్రి శ్రీ కాసు వెంకటకృష్ణా రెడ్డి, హోంశాఖ మాజీ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి లద్వారా వక్కలగడ్డ సంఘం అధ్యక్షుడు శ్రీ హనుమానుల సురేంద్రనాధ బెనర్జీ, ఈ పురస్కారం అందుకున్నారు. [3]

ఈ సంఘం లాభాల బాటలో నడుస్తూ, వాణిజ్య బ్యాంకులతో పోటీ పడుచున్నది. 1978 నుండి సంఘం నకు, వచ్చిన నికర లాభాలను మహాజనసభలో ఆమోదించి, డివిడెండ్లను పంపిణీచేస్తున్నారు. 1939లో ప్రారంభమైన ఈ సంఘం, ఇప్పటికి 75 సంవత్సరాలు పూరిచేసుకొన్న సందర్భంగా, 2014,సెప్టెంబరు-28న వజ్రోత్సవాలను నిర్వహించారు. [11]

పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం[మార్చు]

అంగనవాడీ కేంద్రాలు - 4[మార్చు]

కమలానెహ్రూ మహిళామండలి[మార్చు]

ఈ మండలి ఆధ్వర్యంలోని మధురం ఫుడ్స్ నిర్వహణ అద్భుతంగా ఉంది.

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. ఈ గ్రామ పంచాయతీ 1957,సెప్టెంబరు-23వ తేదీనాడు ఏర్పడినది. [13]
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి పరిశే మల్లేశ్వరి, 501 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. శ్రీ దాసరి విఠల్ ఉప సర్పంచిగా ఎన్నికైనారు. [2]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ సీతా,రామ,లక్ష్మణ, ఆంజనేయస్వామి వార్ల ఆలయం[మార్చు]

ఈ ఆలయాన్ని 1923 లో నిర్మించారు. ఆనాటి నుండి, ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే వార్షికోత్సవానికి, భద్రాచలం నుండి వేదపండితులు వచ్చి, ప్రత్యేక పూజలు నిర్వర్తించుచున్నారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, ఆ రోజున స్వామివారికి అభిషేక పూజలు, సహస్ర కుంకుమార్చన, విష్ణు, లలిత సహస్రనామార్చన, ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. ఈ రామాలయ 90వ వార్షికోత్సవాలు, 2014,ఏప్రిల్-5, శనివారం రోజున ఘనంగా నిర్వహించారు. [7]&[8]

శ్రీ డిల్లీ భోగాలమ్మ తల్లి ఆలయం[మార్చు]

శ్రావణమాసాన్ని పురస్కరించుకొని 2014, ఆగష్టు-17, ఆదివారం నాడు, అమ్మవారి జాతరమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వక్కలగడ్డలో పాతూరి వంశస్తుల ఇలవేలుపు అయిన డిల్లీ భోగాలమ్మ తల్లి జాతరను, పాతూరి మారుతీరామరాజు, లక్ష్మీరాజ్యం దంపతులు ప్రారంభించారు. అమ్మవారి కలశాన్ని వీరకత్తులు, వీరతాళ్ళతో, డప్పువాయిద్యాలతో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారికి నిండుబిందెలతో వారపోస్తూ, పసుపు, కుంకుమలు సమర్పించుకొని తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. [9]

గ్రామ విశేషాలు[మార్చు]

శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం:- తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధిలో, హిందూ ధర్మ పరిషత్తు ఆధ్వర్యంలో, అఖండ హరినామ సకీర్తనలో పాల్గొనేటందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం వారి నుండి ఈ సమాజం వారికి ఆహ్వానం అందినది. [15] ఈ గ్రామానికి చెందిన శ్రీ పరిశే మొళి పదవ తరగతి తరువాత ఐ.టి.ఐ.వరకు మాత్రమే చదివినా, గ్రామంలో ఇనుపముక్కలతో గొలుసుకట్టుగా చేసి, మొక్కల సంరక్షణకు ఉపయోగించే మెష్ (Tree guards) లను తయారుచేసే ఒక చిన్న పరిశ్రమ స్థాపించి తనకు జీవనోపాధితోపాటు, 12 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. ఈ మెష్ లను చుట్టు ప్రక్కల మండలాలలోని వారికి సరఫరా చేస్తున్నాడు. [16]

వక్కలగడ్డ గ్రామానికి చెందిన బెజవాడ ఆశ్లేష్‌కుమార్ అను విద్యార్థిది ఒక పేద కుటుంబం. అతని తల్లి పనికి వెళితేనే ఇల్లు గడిచేది. విజయవాడలోని కూలర్స్ తయారుచేసే దుకాణలో పనిచేయుచూ, ఆమె తన ఇద్దరు కుమారులనూ చదివించుచున్నది. మేనమామ మధుసూదనరావు వీరికి అండగా నిలుచుచున్నారు. ఈ విద్యార్థి, డి.ఫార్మసీ పరీక్షలో ఉత్తీర్ణుడై, ఏ.పీ.ఈసెట్ పరీక్ష వ్రాయగా, 5-10-2020న ప్రకటించిన పరీక్షా ఫలితాలలో, ఇతడు రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంక్ సాధించాడు. [17]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3109.[3] ఇందులో పురుషుల సంఖ్య 1538, స్త్రీల సంఖ్య 1571, గ్రామంలో నివాస గృహాలు 934 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 774 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-09.

వెలుపలి లింకులు[మార్చు]