వటపత్రశాయికి వరహాల లాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వటపత్రశాయికి వరహాల లాలి స్వాతి ముత్యం సినిమా కోసం సి.నారాయణ రెడ్డి రచించిన లాలి పాట. దీనిని పి.సుశీల మధురంగా గానం చేయగా ఇళయరాజా సంగీతాన్ని అందించారు. దర్శకుడు కె.విశ్వనాథ్ ఈ పాటను రాధిక మీద చిత్రీకరించారు.

నేపథ్యం[మార్చు]

భర్తను పోగొట్టుకున్న కథానాయిక (రాధిక) కు ఒక బాబు ఉంటాడు. ఆ అబ్బాయికి స్నానం చేయించి ఊయల్లో వేసి జోలపాడి నిద్ర పుచ్చే సన్నివేశం లో ఈ పాటను సందర్భోచితంగా ఉంటుంది.

పాట[మార్చు]

పల్లవి :

వటపత్ర శాయికి వరహాల లాలి

రాజీవ నేత్రునికి రతనాల లాలి | | వటపత్రశాయికి | |

మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి

జగమేలు స్వామికి పగడాల లాలి | | వటపత్రశాయికి | |


చరణం 1 :

కల్యాణ రామునికి కౌసల్య లాలి

యదువంశ విభునికి యశోద లాలి

కరిరాజ ముఖునికి గిరితనయ లాలి

పరమాంశభవునికి పరమాత్మ లాలి | | వటపత్రశాయికి | |


చరణం 2 :

అలమేలు పతికి అన్నమయ్య లాలి

కోదండరామునికి గోపయ్య లాలి

శ్యామలాంగునికి శ్యామయ్య లాలి

ఆగమనుతునికి త్యాగయ్య లాలి | | వటపత్రశాయికి | |

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]