వడదెబ్బ
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
వడదెబ్బ (Heat stroke) ఎండాకాలంలో సంభవించే వ్యాధి. పరిసరాలలోని అధిక ఉష్ణోగ్రతకు గురికావడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణ సరిగా పనిచేయక చెమట పోయడం ఆగి, ఉష్ణోగ్రత అధికమై ఇతర లక్షణాలతో బాటు మూర్ఛ, మరణం సంభవిస్తాయి.
[మార్చు] వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు
- ఎండలో ఎక్కువగా తిరగరాదు. అవరసమై వెళ్ళవలిస్తే నెత్తికి గొడుగు లేదా టోపీ రక్షణగా వాడాలి
- తగినన్ని నీళ్ళు తాగాలి.
- వేసవికాలంలో వదులైన నూలు దుస్తులు ధరించాలి.
- కారం, మసాలా పదార్థాలు తినడం తగ్గించాలి
[మార్చు] వడదెబ్బ తగిలినపుడు పాటించవలసిన నియమాలు
- రోగిని నీడపట్టున చేర్చాలి. దుస్తులను వదులుగా చేసి తడిగుడ్డ తో ఒళ్ళంతా తుడవాలి
- రోగికి తగినంత గాలి ఆడేటట్లు చేయాలి. రోగి చుట్టూ గుమిగూడకూడదు.
- వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి
[మార్చు] మూలాలు
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమీ, హైదరాబాదు.