వనపర్తి
| ?వనపర్తి మండలం మహబూబ్ నగర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | వనపర్తి |
| జిల్లా(లు) | మహబూబ్ నగర్ |
| గ్రామాలు | 19 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
88,100 (2001) • 45040 • 43060 • 56.38 • 67.16 • 45.14 |
వనపర్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు పట్టణము. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రముఖ పట్టణాలలో ఒకటి. 2001 జనాభా లెక్కల ప్రకారము ఈ పట్టణ జనాభా 50,262. జనాభా ప్రకారము ఈ పట్టణము జిల్లాలో మహబూబ్ నగర్, గద్వాల తరువాత మూడవ స్థానం ఆక్రమిస్తుంది.
విషయ సూచిక |
[మార్చు] రవాణా సదుపాయాలు
మహబూబ్ నగర్ జిల్లాలోనే తొలిసారిగా ఏర్పాటైన బస్సు డీపో వనపర్తిలో ఉంది. వనపర్తి సంస్థానాధీశుల కోరిక మేరకు నిజాం ప్రభుత్వం ఇక్కడ బస్సు డీపోను ఏర్పాటు చేసింది. ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషన్ లేదు. దగ్గరలో మదనాపురం రైల్వే స్టేషన్ వరకు పోవడానికి బస్సు సౌకర్యం ఉంది.
[మార్చు] సంస్థానాధీశుల చరిత్ర
- ప్రధాన వ్యాసం: వనపర్తి సంస్థానము
నిజాం పరిపాలనలో వనపర్తి సంస్థానం ప్రముఖ స్థానం ఆక్రమించింది. వనపర్తి సంస్థానం వైశాల్యం 450 చ.మై.తో 124 గ్రామాలతో కొనసాగింది. ఈ సంస్థానానికి పెబ్బేరు మండలంలోని సూగూరును తొలి రాజధానిగా పరిపాలన కొనసాగించినారు. ప్రారంభంలో సూగూరు సంస్తానంగా వ్యవహరించబడింది. సంస్థానాన్ని పరిపాలించిన మొదటి రామక్రిష్ణా రావు సూగూరు నుంచి తన రాజధానిని వనపర్తికి మార్చడం వలన వనపర్తిని సంస్థానంగా పరిగణించారు. ఈ సంస్థానాధీశుల ఇంటిపేరు జనుంపల్లి. ఈ వంశానికి మూలపురుషుడు వీరక్రిష్ణ భూపతి, వీరిని వీర క్రిష్ణా రెడ్డి అని కూడా సంభోదించేవారు. వనపర్తి సంస్థానాదీశుల తొలి నివాసం కర్నూలు జిల్లా నంధ్యాల తాలూకా జనుంపల్లి గ్రామం. జనుంపల్లి నుంచి పానుగల్ పరిధి ఉన్న పాతపల్లి గ్రామానికి వలస వచ్చి సూగూరు సంస్థానాధీశులుగా వ్యవహరించారని చరిత్ర చెబుతుంది.
వీర క్రిష్ణ భూపతికి నాలుగవ తరం వారసుడు వేముడి వెంకటరెడ్డి. ఇతడు యుద్దవిధ్యలలో ఆరితేరినవాదిగా చెబుతారు. గోలుకొండ సైన్యం దండెత్తిన సమయంలో వేముడి వెంకట్ రెడ్డి 10,000 సైన్యంతో వెళ్ళి యుద్దం చేసారు. సూగూరు సంస్థానానికి అనుభందంగా మరికొన్ని గ్రామాలను ఖుతుబ్ షా నుండి పొందినట్లు తెలుస్తుంది. వెంకట్ రెడ్డి కుమారుడు గోపాల రాయలు. వనపర్తి సంస్థానాదీశులలో 'బహిరి' అనే బిరుదును పొందినట్లు తెలుస్తుంది. క్రీ.శ. 1637లో గోపాలరాయుడు దివంగతుడైనట్లు తెలుస్తుంది. గోపాల రాయలుకు మగ సంతతి లేనందున సవాయి వెంకట రెడ్డిని దత్తత తీసుకున్నారు. సంస్థాన ఆదాయం సరిపోక రుణాలు చేసి ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు. నిజాంకు చెల్లించాల్సిన కప్పంను చెల్లించనందున ఇతడు నిజాం సైన్యంతో పోరాడి అపజయం పొంది క్రీ.శ. 1711లో ఆత్మహత్య చేసుకున్నట్లు చరిత్ర చెబుతుంది.
వనపర్తి సంస్థానం ఏలిన వారిలో మొదటి రామక్రిష్ణా రావు దాయాదుల కుట్రతో నిజాం ప్రభువు చెరసాలలో మూడు సం.లు గడిపాడు. చివరకు నిజాం రామక్రిష్ణా రావుకు విముక్తి కలిగించారు. నిజాం నుండి క్రీ.శ. 1817లో రాజా బహద్దూర్ బిరుదును బహూకరించారు. రామక్రిష్ణా రావు దత్త పుత్రుడు మొదతి రామేశ్వర్ రావు గద్వాల సంస్థాన పాలన భాద్యతలు స్వీకరించిన పిదప ప్రజలకు అనేక సదుపాయాలు కల్పించారు. క్రీ.శ. 1861లో రాజా రామేశ్వర్ రావు సేవలకు గాను కరవాలం, పిస్తోలు, రైఫిలు వంటి ఆయుధాలను బ్రిటిషు వారు, నిజాం ప్రభువులు బహూకరించినట్లు తెలుస్తుంది.
రాజా రామేశ్వర్ రావు దత్త పుత్రుడు రాజా రామ క్రిష్ణ రాయలు. ఇతడు అకస్మాత్తుగా మ్రుత్యు వాత పడ్డాడు. రెండవ రామేశ్వర రావు దత్త పుత్రుడుగా వచ్చి పాలన భాద్యతలను స్వీకరించారు. ఇతడు సమర్థుదుగా, పరిపాలనా దక్షుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక ప్రజాహిత కార్య క్రమాలతో పాటు వ్యవసాయ అభివృద్దికి చెరువులు, కుంటలు, బావులు అనేకం త్రవ్వించారు. రాజా రామేశ్వర్ రావుకు ఇద్దరు కుమారులు శ్రీ క్రిష్ణ దేవరాయలు, శ్రీ రామ దేవరాయలు. మునగాల సంస్థానాదీశుడగు రాజా నాయని వెంకట రంగారావు బహద్దూర్ కూతురు సరళాదేవిని శ్రీ క్రిష్ణ దేవరాయలు వివాహం చేసుకున్నారు. పింగళి వెంకట్రామారెడ్డి కూతురు కుముదినీ దేవిని శ్రీ రామ దేవరాయులు వివాహం చేసుకున్నారు. రాణి సరళాదేవి పేరుతో వనపర్తి సంస్థానంలో 'సరళా సాగర్' అనే ప్రాజెక్ట్ ను నిర్మించారు.
రాజా శ్రీ క్రిష్ణ దేవరాయలు, రాణి సరళా దేవి కుమారుడు రాజా రామేశ్వర్ రావు. ఇతడు ఉన్నత విధ్యావంతుడు. సంస్థానాన్ని హైదరాబాద్ రాష్ట్రంలోనూ, అనంతరం ఆంద్రప్రదేశ్‌లోనూ విలీనం అయిన పిదప రాజా రామేశ్వర రావు పార్లమెంటు సభ్యునిగా కొనసాగారు. భారత ప్రభుత్వ విదేశాంగ శాఖలో ఉన్నత పదవీ భాద్యతలు నిర్వర్తించారు. ఇతనికి ముగ్గురు ఆడ సంతానం. క్రిష్ణ దేవరావును దత్త పుత్రునిగా స్వీకరించారు.
[మార్చు] విద్యాసంస్థలు
- ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (స్థాపన:1969-70)
- ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (స్థాపన:1988-89)
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉర్దూ మీడియం (స్థాపన:2003-04)
- శ్రీవాణి జూనియర్ కళాశాల (స్థాపన:2006-07)
- స్కాలర్స్ జూనియర్ కళాశాల (స్థాపన:1992-93)
- చైతన్య జూనియర్ కళాశాల (స్థాపన:1993-94)
- వాగ్దేవి మహిళల జూనియర్ కళాశాల (స్థాపన:2002-03)
- కొట్టం మాణిక్యమ్మ జూనియర్ కళాశాల (స్థాపన: 2005-06)
- ఎస్.వి.ఎం.ఆర్.బాలికల జూనియర్ కళాశాల (స్థాపన:2005-06)
- వివేక్ జూనియర్ కళాశాల (స్థాపన:2005-06)
- సి.వి.రామన్ జూనియర్ కళాశాల (స్థాపన:1996-97)
- జాగృతి జూనియర్ కళాశాల (స్థాపన:2006-07)
[మార్చు] పట్టణ విశేషాలు
- రాష్ట్రంలోనే తొలి ఆదర్శ వివాహితుల సంక్షేమ సమితి వనపర్తిలో 1997 ఫిబ్రవరి 16న ఏర్పాటైనది.
[మార్చు] మండలంలోని గ్రామాలు
[మార్చు] ఇవి కూడా చూడండి
మహబూబ్ నగర్ జిల్లా మండలాలు
కోడంగల్ - బొమ్మరాసుపేట - కోస్గి - దౌలతాబాద్ - దామరగిద్ద - మద్దూరు - కోయిలకొండ - హన్వాడ - నవాబ్ పేట - బాలానగర్ - కొందుర్గ్ - ఫరూఖ్ నగర్ - కొత్తూరు - కేశంపేట - తలకొండపల్లి - ఆమనగల్ - మాడ్గుల్ - వంగూరు - వెల్దండ - కల్వకుర్తి - మిడ్జిల్ - తిమ్మాజిపేట - జడ్చర్ల - భూత్‌పూర్ - మహబూబ్ నగర్ - అడ్డకల్ - దేవరకద్ర - ధన్వాడ - నారాయణపేట - ఊట్కూరు - మాగనూరు - మఖ్తల్ - నర్వ - చిన్నచింతకుంట - ఆత్మకూరు - కొత్తకోట - పెద్దమందడి - ఘన్‌పూర్ - బిజినపల్లి - నాగర్‌కర్నూల్ - తాడూరు - తెల్కపల్లి - ఉప్పునూతల - అచ్చంపేట - అమ్రాబాద్ - బల్మూర్ - లింగాల - పెద్దకొత్తపల్లి - కోడేరు - గోపాలపేట - వనపర్తి - పానగల్ - పెబ్బేరు - గద్వాల - ధరూర్ - మల్దకల్ - ఘట్టు - అయిజా - వడ్డేపల్లి - ఇటిక్యాల - మనోపాడ్ - ఆలంపూర్ - వీపనగండ్ల - కొల్లాపూర్
|
|||||||||||||||||||||||||||||||
|
|
|
|---|---|
| రాజాపేట · రాజానగర్ · అచ్యుతాపూర్ · చిట్యాల · అంకూర్ · వెంకటాపూర్ · చిమన్గుంటపల్లి · నాగవరం · పెద్దగూడెం · కాదుకుంట్ల · మెంటపల్లి · నచ్చహళ్ళి · కిష్టగిరి · సవాయిగూడెం · చందాపూర్ · దత్తాయిపల్లి · శ్రీనివాసపూర్ · అప్పాయిపల్లి · ఖాసింనగర్ · అంజన్గిరి · వనపర్తి |