వికీపీడియా నుండి
వరాహస్వామి భూదేవి అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడం
పద్దెనిమిది పురాణాలలొ ఒకటైన ఈ వరాహపురాణం వరాహ దేవుడు భూదేవి మానవ కళ్యాణం గురించి అడిగిన ప్రశ్నలకు చెప్పిన విషయాలు వరాహ పురాణం లొ ఉన్నవి. భూదేవి సృష్టి క్రమమం గురించి ప్రశ్నలు వరాహదేవుడు ఆదిసృష్టి గూర్చి సమాధానం చెప్పాడు. ప్రియవతోపాఖ్యానం, రైభ్య బృహస్పతి సంవాదము, వసుకథ, ధర్మవ్యాధోపాఖ్యానము, మత్స్యావాతార కథ , దుర్జయుని వృత్తాంతము, దుర్జయగౌరముఖ సంవాదము, మార్కండేయ గౌరముఖ సంవాదము, పితృ దేవతల ఆవిర్భావము, శ్రాద్ధ వర్ణనము, శ్రాద్ధ విధి, ప్రరమాకథ, ప్రజాపాల కథలొ ఈ పురాణంలొ చెప్పబడ్డాయి. అంతే కాకుండా తిథుల విశేషాలు ప్రత్యేకంగా చెప్పబడినవి. దుర్వాసస్సత్యతవుల సమవాదరూపమున ద్వాదశివ్రతము, ధన్యవ్రత, కాంతివ్రత కథలు చెప్పబడింది. విష్ణువారద సంవాదమున యుగాదుల ప్రమాణము, బ్రాహ్మాణ పరిభ్రష్టత, ప్రాయశ్చిత్తకాండ కూడా చెప్పబడినవి. జంభూ ద్వీపాది భౌగోళిక వర్ణనము వ్శేషం గా చెప్పబడింది. అంతేకాకుండా శక్తి లీలలు, నారాయణార్చన విధానం, కోలాముఖ తీర్థ వర్ణనం, ఋతు భేదముననుసరించి ఋతువులలొ చేయవలసిన అర్చన భేదములు, విష్ణు మాయ కథలైన సోమశర్మోపాఖ్యానము కోలాముఖ కుబ్జామ్రక తీర్థవర్ణనం చెప్పబడ్డాయి.