వాడుకరి:Jangiti venkatesh

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మోడీ మ‌నువాద‌పు బీసీ

మోడీ...మోడీ...మోడీ...ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ దేశం మొత్తం అన్ని జాతీయ టీవీ చానెళ్లు మోడీ జ‌పంలో త‌రించాయి. మోడీ ప్ర‌ధాని కాబోతున్నారు....దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధివైపు న‌డిపిస్తార‌ని ప్ర‌జ‌ల్లో ఊహ‌ల‌కు అంద‌ని అంచ‌నాల‌ను పెంచేశాయి. ఎవ‌రికి ఏం చేస్తార‌నే అంశాన్ని ప‌క్క‌న‌పెడితే...మోడీ ఒక బీసీ కులానికి చెందిన వ్య‌క్తిగా ప్ర‌స్తుతం ప్రధాన అంశంగా మారింది. భార‌త‌దేశ ప్ర‌ధాని పీఠంపై తొలిసారిగా ఓ బీసీ కులానికి చెందిన మోడీ ఆసీనుల‌య్యారు. మ‌రి దేశంలోని వెనుక‌బ‌డిన వ‌ర్గాల జీవితాల్లో ఆయ‌న నిజ‌మైన వెలుగుల‌ను తేగ‌లుగుతారా అనేది ప్ర‌స్తుతం ఈ వ‌ర్గాల‌కు చెందిన మేధావుల‌ను తొలుస్తున్న ప్ర‌శ్న‌. ఇప్ప‌టి వ‌ర‌కూ అంటే దేశానికి స్వాతంత్రం వ‌చ్చిన‌ 67 ఏళ్ల కాలంలో కేవ‌లం ప‌డికెడు కులాలు/ వ‌ర్ణాలు మాత్ర‌మే అధికార పీఠాన్ని అధిరోహించి విద్యా, ఆర్ధిక‌, రాజ‌కీయ‌, సామాజిక త‌దిత‌ర అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించాయి. ప్ర‌ధానంగా బ్రాహ్మ‌ణ వ‌ర్ణాలు ఎక్కువ కాలం అధికారంలో ఉండ‌టంతో ఆ వ‌ర్గాల‌కే ఎక్కువ మేలు జ‌రిగింది. ఈ కార‌ణంగానే దేశంలో ఐఏఎస్‌, ఐపీఎస్ వంటి కీల‌క ప‌ద‌వుల్లో బ్రాహ్మ‌ణ వ‌ర్గాలు మాత్ర‌మే అగ్ర‌భాగం ద‌క్కించుకున్నాయి. వీరి త‌రువాత అగ్ర‌వ‌ర్ణాలుగా పిల‌వ‌బ‌డే అభివృద్ధి చెందిన కులాలు వేల ఎక‌రాల భూముల‌కు స్వంత‌దారులుగా మారి వేల‌కోట్ల ఆస్థుల‌ను...సంప‌ద‌ను కూడ‌బెట్టుకున్నాయి. ఈ వ‌ర్ణాల సంతానం మాత్ర‌మే సివిల్స్‌, వైద్య‌, ఇంజ‌నీరింగ్ వంటి ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించ‌గ‌లిగాయి. వెనుక‌బ‌డిన‌, ద‌ళిత కులాల‌కు ఇన్నాళ్లూ అధికారం అంద‌ని ద్రాక్ష‌లా మిగిలిపోవ‌డంతో ప్రాథ‌మిక విద్య‌కూ దూరంగా విసిరివేయ‌బ‌డి చివ‌ర‌కు కూలీలుగా స్థిర‌ప‌డాల్సిన దుస్థితిలో బ‌ల‌వంత‌పు జీవితాల‌ను నెట్టుకొస్తున్నారు. మ‌రి ఇన్నాళ్లు...ఇన్నేళ్ల త‌రువాత ఓ బీసీ కులానికి చెందిన వ్య‌క్తి ప్ర‌ధాన‌మంత్రిగా ఎదిగితే....అగ్ర‌వ‌ర్ణాలు అని చెప్పుకునే వారికి మాదిరిగా ఈ బీసీ వ‌ర్గాలూ విద్య‌, ఆర్ధిక‌, రాజ‌కీయ‌, సామాజిక రంగాల్లో అభ్యున్న‌తిని సాధించ‌గ‌లుగుతారా?. నిజానికి అధికారంలో ఏ వ‌ర్గాలు ఉంటే ఆ వ‌ర్గాలు ఖ‌చ్చితంగా అభివృద్ధిని సాధించ వ‌చ్చ‌నేది క‌ళ్ల‌ముందు క‌నిపిస్తున్న న‌గ్న‌స‌త్యం. విద్య‌, ఆర్ధిక‌, రాజ‌కీయ‌, సామాజిక రంగాల్లో ఆయా వ‌ర్గాల ప‌రిస్థితి ఏంట‌నేది ప్ర‌త్యేకంగా స‌ర్వేలు చేయాల్సిన అవ‌స‌రం లేకుండానే క‌ళ్ల‌ముందు క‌నిపిస్తుంది. మ‌రి బీసీ కులానికి చెందిన వ్య‌క్తి ప్ర‌ధాని పీఠంపై కూర్చుంటే బీసీ కులాల‌కు కచెందిన ప్ర‌జ‌లూ పేద‌రికం...నిర‌క్ష‌రాస్య‌త‌...సామాజిక అస‌మాన‌త‌ల నుంచి బ‌య‌ట ప‌డాలి. బీసీ విద్యార్థులు అభివృద్ధి చెందిన కులాల పిల్ల మాదిరిగా ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించే అవ‌కాశాలు అందుబాటులోకి రావాలి.....ఉద్యోగ‌...రాజ‌కీయ రంగాల్లోనూ కీల‌క స్థానాల‌ను ద‌క్కించుకోవాలి....ఆర్ధికంగా ఉన్న‌త స్థాయికి చేరుకోవాలి. ప్ర‌తి బీసీ కానీ ఈ ఆశ‌లు నెర‌వేరుతాయా అంటే అవున‌ని ఖ‌చ్చితంగా చెప్ప‌లేని దుస్థితిలో ఉన్నాం . ఎందుకంటే. మోడీ తాను బీసీ కులానికి చెందిన వాడిన‌ని ఏనాడైనా చెప్పుకున్నాడా?...ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వి రేసులో ఉండి తాను బీసీని అని ప్రోజెక్ట్‌ చేసుకున్నాడా?. ఈ ప్ర‌శ్న‌ల‌కు లేద‌నే స‌మాధానం వ‌స్తుంది. నిజానికి మోడీ బీసీ కులానికి చెందిన వ్య‌క్తి అని బీసీ నేత‌లు చెప్పేవ‌ర‌కూ దేశంలోని 90 శాతం మంది బీసీల‌కు తెలియ‌దంటే ఆశ్చ‌ర్యం ఏమీలేదు. మోడీ తాను బీసీని అని చెప్పుకోక‌పోవ‌డం వ‌ల్లే బీసీల‌కు ఆయ‌నెవ‌రో తెలియ‌కుండా పోయింది. మ‌రి తాను బీసీన‌ని చెప్పుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని మోడీ త‌న జాతి సంక్షేమం గురించి ఆలోచిస్తాడా? అనేది డౌటే. అస‌లు మ‌నువాద‌పు ఆలోయ‌ణాదోర‌ణితో కూడిన భార‌తీయ జ‌న‌తా పార్టీలో ఉండీ బీసీల సంక్షేమ‌మంటూ మ‌నువాద వ్య‌తిరేక నిర్ణ‌యం తీసుకునే సాహ‌సానికి మోడీ ఒడిగ‌ట్ట‌గ‌ల‌డా అనేదీ సందేహ‌మే. పైకి మోడీ ప్ర‌ధాన మంత్రి అయినా తెర‌వెనుక న‌డిపేదీ...న‌డిపించేదీ బ‌య‌ట‌కు క‌నిపించ‌ని ఆరెస్సెస్ శ‌క్తులే. నిన్న‌టి వ‌ర‌కూ మ‌న్మోహ‌న్ సింగ్‌ను రోబో పీఎంగా అభివ‌ర్ణించిన బీజేపీ శ్రేణులూ త‌మ ప్ర‌ధాని మోడీ మ‌నువాదుల చేతుల్లో కీలుబొమ్మ‌నే విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్ప‌గ‌ల‌రా?...అంత ద‌మ్ము వారికి ఉందా?...వీరి ద‌మ్ము సంగ‌తి ప‌క్క‌న‌పెడితే....మొద‌టి నుంచీ చాతువ‌ర్ణం పేరిట బ‌హుజ‌నుల‌ను అణిచివేస్తూ వ‌చ్చిన మ‌నువాద‌పు నీడ‌లోనే మోడీ పెరుగుతూ వ‌చ్చారు. త్రివ‌ర్ణాల కుట్ర‌లు...కుతంత్రాలను ప‌సిగ‌ట్టే ఆలోచ‌ణాశ‌క్తి మోడీకి అబ్బ‌లేదు. కాబ‌ట్టి ఆ శ‌క్తుల ఆలోచ‌ణ‌ల‌కు అనుగుణంగానే త‌న పాల‌న సాగిస్తాడే త‌ప్ప బీసీల సంక్షేమం గురించి ప‌ట్టించుకుంటాఈడ‌నుకుంటే అది అమాయ‌క‌త్వ‌మే. మ‌న రాష్ట్రఆనికి చెందిన అంటే తెలంగాణ‌....సీమాంధ్ర ప్రాంతాల్లో మొద‌టి నుంచీ బీసీల హ‌క్కుల కోసం పోరాడుతూ వ‌చ్చిన ఆర్‌.కృష్ణ‌య్య మోడీ బీసీ కులానికి చెందిన వాడ‌ని ఉప్పొంగిపోతున్నారు. మోడీ వ‌ల్ల బీసీల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని న‌మ్ముతున్నారు. ఇదే నిజ‌మైతే చ‌ట్ట స‌భ‌ల్లో బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌న్న డిమాండ్‌న్ మోడీ వెంట‌నే అమ‌లులోకి తేవ‌ల‌సిన అవ‌స‌రం ఉంది. అట్లాగే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో బీసీల రిజ‌ర్వేష‌న్ శాతాన్ని పెంచ‌డంతోపాటు...ప్ర‌మోష‌న్ల‌లో బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాలి. ప్ర‌ధాని ప‌ద‌వి చేప‌ట్టీ చేప‌ట్ట‌గానే పోల‌వ‌రం...న‌ల్ల‌ధ‌నం విష‌యాల్లో క్యాబినెట్ స‌మావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణ‌యాలు తీసుకున్న మోడీ బీసీల విష‌యంలోనూ ఇదే విధంగా త‌న ప‌నిత‌నాన్ని చూపాలి. అప్పుడే మోడీ బీసీ కులానికి చెందిన వ్య‌క్తిగా గుర్తింపు పొందుతాడు. కానీ...త‌ర‌త‌రాలుగా బీసీలు...ద‌ళితుల‌ను క‌ట్ట‌బానిస‌లుఉగా మార్చి అణివేస్తూ వ‌చ్చిన మ‌నువాదులు బీసీల‌కు స్వేచ్చ‌ను ఇస్తారా....వారికి అన్ని రంగాల్లో సంపూర్ణ హ‌క్కుల‌ను క‌ల్పిస్తారా? అంటే న‌మ్మ‌శ‌క్యం కావ‌డంలేదు. మ‌రి ఒక బీసీ అయిన మోడీని ప్ర‌ధాని పీఠంపై కూర్చోపెట్ట‌లేదా అంటే...దీనికి రెండు భావ‌జాలాన్ని ఏ కోశానా ప‌ట్టించుకోని...న‌ర‌న‌రాన మ‌నువాదాన్ని జీర్ణించుకున్న పెద్ద‌లు మోడీని కూర్చోపెట్టేందుకు అయిష్టంగానే అంగీక‌రించారు. ఇది మొద‌టిది. రెండ‌వ‌ది.ధికారంలోకి తేవాలంటే వేల కోట్ల రూపాయ‌లు ఉన్న ఆ భారాన్ని భ‌రిస్తాన‌ని ముందుకు వ‌చ్చాడు. కానీ పార్టీని అధికారంలోకి తేవ‌డానికి అవ‌స‌ర‌మ‌య్యే ఆర్ధిక వ‌న‌రుల‌ను స‌మ‌కూర్చ‌డానికి మోడీ త‌ప్ప ఇత‌రులెవ‌రూ ముందుకు రాలేద‌నే వాద‌న ఉంది. ఈ కార‌ణంగానే మోడీ బ‌డా పారిశ్రామిక వేత్త‌ల‌తో వేల కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేయించి పార్టీని అధికారంలోకి తేగ‌లిగారు. అయితే ఈ ర‌కంగా ప్ర‌ధాని పీఠం ఎక్కినంత మాత్రాన తాను పూర్తి స్వేచ్చావాయువులు పిల్చే అధికారం మాత్రం మోడీకి లేద‌నే చెప్పాలి. ఓర‌కంగా మ‌నువాద‌పు ఆరెస్సెస్ అడుగుజాడ‌ల్లో మాత్ర‌మే న‌డ‌వాలి. ఒక‌వేళ త‌న‌ అడుగుల్లో అడుగు వేయ‌కుంటే మాత్రం మ‌నువాదులు మోడీని రాజ‌కీయంగా కోలుకోలేని దెబ్బ‌తీయ‌డం ఖాయం...హిర‌ణ్య‌క‌శిపుడు...హ‌రిణ్యాక్షుడు...బ‌లిచ‌క్ర‌వ‌ర్తి వంటి అట్ట‌డుగు వ‌ర్గాల‌ను అధికారం కోసం ఏర‌కంగా మ‌ట్టుబెట్టారో ఈ వ‌ర్గాల మేధావుల‌కు తెలిసిందే. కాబ‌ట్టి మోడీ బీసీ అంటూ ఇక మా బ‌తుకుల్లో ప‌గ‌లే వెన్న‌ల కురుస్తుంద‌ని అమాయ‌కంగా ప‌రుగెడితే ఆ ఆశ‌లు ఎండ‌మావులుగా మిగిలిపోతాయ‌ని బీసీ మేధావులు . లేదూ.కాదూ అంటే తాను బీసీ కులానికి చెందిన వ్య‌క్తిని అని...బీసీల సంక్షేమానికి ఎన‌లేని కృషిని సాగిస్తాన‌ని నోరువిప్పి నాలుగుముక్క‌లు చెబితే నాలాంటి బీసీల‌కు కొంత‌వ‌ర‌కైనా న‌మ్మ‌కం కుదురుతుంది. – - జంగిటివెంక‌టేష్‌, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌


htttp://www.bloger.com/bahujana rajyam