వాడుకరి చర్చ:లక్ష్మీదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

లక్ష్మీదేవి గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

లక్ష్మీదేవి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Bhaskaranaidu (చర్చ) 08:44, 27 జూన్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
బొమ్మలను "క్రాప్" చేయడం

ఔత్సాహికులు తీసే చాలా ఫొటోలలో అనవసర భాగం వస్తుంటుంది. ఉదాహరణకు బొమ్మ తొలి ఎక్కింపు] చూడండి. ఇందులో ఆకాశం, నేల అధికభాగం ఉన్నాయి. వీటిలో ఉపయోగకరమైన సమాచారం లేదు.
బొమ్మలు సవరించే అప్లికేషన్ లో "crop" ఆదేశం వాడి అనవసర భాగాలు కత్తిరించేస్తే బొమ్మ సైజు తగ్గి తేలికగా లోడ్ అవుతుంది. చూడడానికి కూడా బాగుంటుంది. మరొ కొన్ని సూచనలకు ఇమేజ్ ఎడిటింగ్ వ్యాసం చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Bhaskaranaidu (చర్చ) 08:44, 27 జూన్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

లక్ష్మీదేవి గారూ స్వాగతమ్[మార్చు]

ఫేస్‌బుక్‌లో నేను పెట్టిన పోస్టుకు స్పందించిన అతి కొద్ది కాలంలోనే మీరు తెవికీలో వాడుకరి పేరు ఏర్పాటుచేసుకుని కృషిచేసేందుకు ప్రయత్నించినందుకు కృతజ్ఞతలు. మీరు మెయిల్‌లో నన్ను సంప్రదించి అడిగిన ప్రశ్నలకు ఇక్కడే సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. అక్కడ వికీలో టేబుల్ రావాలంటే సోర్సులో మార్కప్‌కోడ్‌తో రాయాల్సివుంటుంది. ఉదాహరణకు టేబుల్ రావాలంటే {| class="wikitable" |- ! పుస్తకం పేరు !! రచయిత !! వివరాలు |- | శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు || శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి || ఈ పుస్తకంలో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి రచించిన కథలు ఉంటాయి. |- | ఆంధ్రవీరులు || శేషాద్రి రమణ కవులు || తెలుగు వారిలోని వీరుల గురించి ఈ పుస్తకంలో వ్యాసాలు వ్రాశారు. |} అన్న వివరాలతో, పై విధంగా మార్కప్ కోడ్ రాస్తే కింది విధంగా వస్తుంది.

పుస్తకం పేరు రచయిత వివరాలు
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ఈ పుస్తకంలో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి రచించిన కథలు ఉంటాయి.
ఆంధ్రవీరులు శేషాద్రి రమణ కవులు తెలుగు వారిలోని వీరుల గురించి ఈ పుస్తకంలో వ్యాసాలు వ్రాశారు.

ప్రాజెక్టు సభ్యత్వ మూస వాడుకునే విధానం[మార్చు]

ప్రాజెక్టు సభ్యత్వ మూస వాడుకోవాలంటే {{తెలుగు సమాచారం అందుబాటులోకి}} అని మీ వాడుకరి పేజీలో పెట్టుకోండి సరిపోతుంది. మీరు ఇప్పుడు ఆ సభ్యత్వ మూస పేజీకి లింకు ఇచ్చారు. ఇది అనవసరం. నేను చెప్పినట్టు పెట్టుకుంటే ఈ క్రింది విధంగా మీ పేజీలో వస్తుంది.

--పవన్ సంతోష్ (చర్చ) 06:11, 1 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

{{సహాయం కావాలి}}

ఏ విధమైన సహాయం కోరనందున "సహాయం కావాలి" మూసను తొలగించితిని. ఏదైనా సహాయం కావాలంటే తెలియజేయండి.---- కె.వెంకటరమణ చర్చ 13:29, 1 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

దీపావళి శుభాకాంక్షలు[మార్చు]

మీకూ, మీ కుటుంబసభ్యలకు దీపావళి శుభాకాంక్షలు. వెలుగుల పండుగ మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుతున్నాను.

అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా
మృత్యోర్మా అమృతంగమయా ఓం శాంతి శాంతి శాంతి:

మీ సన్నిహితుడు
--పవన్ సంతోష్ (చర్చ) 15:57, 23 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం[మార్చు]

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

స్వాగతం[మార్చు]

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టు[మార్చు]

హలో లక్ష్మీదేవి! గారు, స్త్రీవాదం కు సంబంధించిన కథనాలు నందు మీ సహకారానికి ధన్యవాదాలు. వికిప్రాజెక్ట్ ఫెమినిజం ఒక వికీప్రాజెక్ట్ నందు మీరు కూడా ఒక భాగంగా కావాలని మీకు ఈ ఆహ్వానము ద్వారా ఆహ్వానించుతున్నాము. ఈ వికీప్రాజెక్ట్ ఇక్కడి స్త్రీవాదం వ్యవహరించే వ్యాసాల నాణ్యత మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశ్యం.

మరింత సమాచారం కోసం వికీప్రాజెక్టు/స్త్రీవాదం నందు మీరు పాల్గొనేందుకు కావాలనుకుంటే, దయచేసి సందర్శించండి. "సభ్యులు" కింద మీ పేరు సైన్ అప్ కొరకు సంకోచించకండి. ధన్యవాదాలు!

JVRKPRASAD (చర్చ) 06:41, 12 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

డీఎల్ఐ పుస్తకాల జాబితాలో రాసే విషయం[మార్చు]

లక్ష్మీదేవి గారూ నమస్తే. "జాబితా లో ఎడిట్ సెక్షన్ పేజ్ అస్సలు లోడ్ కావడం లేదండి. పుస్తకం వివరాలు టైపు చేసేటపుడు ఒక్క అక్షరం ప్రింట్ అవడానికి పది నిముషాలు టైమ్ తీసుకుంటుంది. జాబితా పేజ్ సమస్య లేదు. ఎడిట్ పేజ్ కూడా చప్పున వచ్చేస్తుంది. టైపు చేయడం మొదలుపెట్టాకే సమస్య వస్తుంది. కొంచెం చూడగలరు." అని అడిగారు. దాని గురించి కొంత ప్రయత్నించి, ఇంతకుమునుపు పనిచేసిన మా మీనాగాయత్రితో మాట్లాడి తెలుసుకున్నాను. సమస్యకి కారణం ఆయా పేజీల్లో డేటా విపరీతంగా పెరిగిపోవడమే. ఉదాహరణకు లవకుశ (1934 సినిమా) చరిత్ర చూడండి. ప్రస్తుతం 10,575 బైట్లు సమాచారం ఉంది. అదే డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - స తీసుకుంటే 5,09,895 బైట్ల సమాచారం ఉంది. అది లవకుశ వంటి సగటు పేజీతో పోలిస్తే 48 రెట్లు ఎక్కువ. దాంతో రాయడానికి చాలా ఆలస్యమౌతోంది. పేజీ మొత్తాన్ని ఎడిట్ చేయాలంటే అంతా లోడ్ అవడానికో మరెందుకో ఆలస్యవుతుంది. అదే అంతటి సమాచారం ఉన్న పేజీలోనూ విభాగాలుంటే ఒక్కో విభాగాన్నీ విడిగా ఎడిట్ చేయాలంటే తేలిగ్గానే అయిపోతుంది. ఎందుకంటే ఆ చిన్న విభాగంలో (పెద్ద పేజీతో పోలిస్తే) తక్కువ డేటా ఉంటుంది కనుక. మరో పరిష్కారం చెప్పాలంటే ఒక్కో పేజీని వేర్వేరు భేదాలతో చిన్న చిన్న పేజీలుగా విభజించుకోవచ్చు. ఈ రెండో ప్రయత్నం చేస్తే ఈ పేజీలు పెరిగిపోతాయని సముదాయం నుంచి వ్యతిరేకత ఎదురుకావచ్చు. ఏం చేద్దామన్నది చర్చిద్దాం. --పవన్ సంతోష్ (చర్చ) 13:29, 1 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అనువాదం[మార్చు]

YesY సహాయం అందించబడింది

జాబితాలోని ఒక వ్యాసపులంకె నొక్కినపుడు వచ్చిన ఆంగ్లసమాచారాన్ని అనువదించినపుడు దానిని అప్లోడ్ చేయడం గురించి వివరాలు కావాలి. ఉదాహరణకు విజయనగర అను వ్యాసం యొక్క అనువాదం వర్డ్/బరహా ఎటువంటి ఫైల్ లో ఎవరికి పంపవలసి ఉంటుంది? పోటీలో పాల్గొనే ఉద్దేశ్యం లేనపుడు అనువాదం చేయవచ్చునా? లేదా?

లక్ష్మీదేవి (చర్చ) 08:05, 17 ఏప్రిల్ 2018 (UTC)లక్ష్మీదేవి.[ప్రత్యుత్తరం]

కొత్త పేజీ సృష్టించడం ఎలా?
లక్ష్మీదేవి గారూ! బహుశా మీరు అడుగుతున్నది కొత్త వ్యాసాలను ఎలా అనువదించి సృష్టించాలి అని కావచ్చు. దానికి ఇది సమాధానం:
  1. పైన కుడివైపు చివర "వికీపీడియాలో వెతకండి" అన్న అక్షరాలు కనిపిస్తూ ఒక పెట్టె ఉంది చూడండి. దాన్నే వెతుకు పెట్టె లేక సెర్చ్ బాక్స్ అంటారు. దానిలో మీరు వెతకదలుచుకున్న వ్యాసం కొట్టాలి. ఉదాహరణకు విజయనగర అన్నదొక ఊరు అనుకోండి, కర్ణాటకలోని ఒక ప్రాంతం అనుకుందాం. దాన్ని విజయనగర అని, దొరకకపోతే విజయనగర (కర్ణాటక) అనీ రెండు మూడు రకాలుగా వెతికి చూసి ఎలాగా దొరకకపోతే కొత్త పేజీ తయారుచేయడానికి నిర్ణయించుకోవాలి.
  2. తర్వాతి అడుగు ఏమిటంటే మీరు సృష్టించదలిచిన వ్యాసానికి సరియైన పేరు ఏమిటో నిర్ణయించుకోండి. ఆ పేరును పెట్టి వెతకండి. అప్పుడు కూడా వ్యాసం లేనందును లేదనే వస్తుంది. కానీ " ఈ వికీలో "విజయనగర" అనే పేరుతో పేజీని సృష్టించండి! వెతుకులాట ఫలితాలను కూడా చూడండి." అని ఒక సందేశం వస్తుంది. దానిలో ఉన్న ఎర్రలింకు (విజయనగర)పై నొక్కితే ఓ పేజీ తెరుచుకుంటుంది. ఆ తెరుచుకున్న పేజీలో మీ అనువాదం రాసుకుంటూ పోతూ, మార్పులను ప్రచురించు నొక్కుతూ ప్రచురించాలి. వ్యాసం కూడా ఒకమారే రాయనక్కరలేదు. క్రమంగా అభివృద్ధి చేయవచ్చు.

ఇక అప్పటికే ఓ వ్యాసం ఆ పేరుతో ఉందనుకుందాం. అప్పుడేం చేయాలి?

  1. వెతుకుపెట్టెలో వెతికినప్పుడు మీరు అనుకున్న సమాచారం అందించే వ్యాసం ఒకటి ఉందనుకుంటే దానిని తెరిచి, ఆ వ్యాసంలో మీరు అనువదించదలిచిన సమాచారం ఉందో లేదో చూసుకోవాలి.
  2. మీరు రాయదలిచిన సమాచారం అందులో లేదు అనుకుందాం. అప్పుడు సవరించు నొక్కి రాయడం మొదలుపెట్టవచ్చు.

మీకు ఇంకా స్పష్టత రావడానికి ఈ కుడిపక్కన ఓ వీడియో పెట్టాను. చూసి ప్రయత్నించండి. చెప్పవచ్చేదేమిటంటే, పత్రికల వలె దీనిలో ఒక సంపాదకుడికి పంపడం, వారు ఆమోదించాకానే ప్రచురించడం లాంటివి ఉండవు. ముందు ప్రచురించి తర్వాత అభివృద్ధి చేయవచ్చు. ఇక పోటీ సంగతి అంటారా, పోటీ కేవలం ప్రోత్సహించేందుకు పెట్టినదే. మీకు ఎలా కావాలంటే అలా, ఎప్పుడు వీలైతే అప్పుడు అనువాదాలు చేసుకోవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 05:01, 2 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]