వాణిశ్రీ
వికీపీడియా నుండి
వాణిశ్రీ (జ.1948, ఆగష్టు 3, నెల్లూరు) 1960 మరియు 1970 దశకములలో పేరొందిన తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు రత్నకుమారి. వాణిశ్రీ తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ, కన్నడ మరియు మలయాళ సినిమాలలో కూడా నటించింది. మరపురాని కథ సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేసిన వాణిశ్రీ సుఖదుఃఖాలు సినిమాలో చెల్లెలి పాత్రతో మంచి పేరుతెచ్చుకున్నది. ఈ సినిమాలో ఇది మల్లెల వేలయని ప్రసిద్ధ పాటను ఈమెపై చిత్రీకరించారు. ఆ తరువాత కధానాయకిగా అనేక సినిమాలో నటించి 1970వ దశకమంతా తెలుగు చిత్రరంగములో అగ్రతారగా నిలచినది. ఈ దశాబ్దపు చివరలో శ్రీదేవి మరియు జయప్రదలు తెరపై వచ్చేవరకు వాణిశ్రీనే అగ్రతార.
ఆ తరువాత సినీ రంగమునుండి విరమించి, వాణిశ్రీ పెళ్లి చేసుకొని సంసారజీవితంలో స్థిరపడింది. ఈమెకు ఒక కొడుకు మరియు ఒక కూతురు. 80వ దశకములో ఈమె తిరిగి తల్లి పాత్రలతో సినీ రంగములో పునః ప్రవేశించింది.
వాణిశ్రీ నటించిన తెలుగు చిత్రాలు [మార్చు]
- భీష్మ
- ఎదురీత
- చిట్టి చెల్లెలు
- బంగారు పంజరం
- శ్రీకృష్ణ తులాభారం
- రంగులరాట్నం
- ఉమ్మడి కుటుంబం
- మరపురాని కథ
- సుఖదుఃఖాలు
- ఆడపడుచు
- కంచుకోట
- రణభేరి
- నిండు హృదయాలు
- భలే రంగడు
- ఆత్మీయులు
- కధానాయిక మొల్ల
- ప్రేమ్ నగర్
- జీవిత చక్రం
- దసరా బుల్లోడు
- చిన్ననాటి స్నేహితులు
- చెల్లెలి కాపురం
- విచిత్ర బంధం
- కొడుకు - కోడలు
- ఇద్దరు అమ్మాయిలు
- బంగారు బాబు
- ఆరాధన
- జీవన తరంగాలు
- గంగ - మంగ
- దేశోద్ధారకులు
- జీవన జ్యోతి
- సెక్రెటరీ
- భక్త కన్నప్ప
- చక్రధారి
- ఆలూమగలు
- సింహబలుడు
- రామచిలక
- గోరంత దీపం
- దేవదాసు మళ్లీ పుట్టాడు
- అనుగ్రహం
- శ్రీవినాయక విజయం
- దేవుడు మామయ్య
- అత్తకు యముడు - అమ్మాయికి మొగుడు
- బొబ్బిలి రాజా
- ఖైదీ దాదా
- సీతారత్నంగారి అబ్బాయి
- ఏమండీ, ఆవిడ వచ్చింది
- రౌడీ మొగుడు
బయటి లింకులు [మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వాణిశ్రీ పేజీ