వామన్ శ్రీనివాస్ కుడ్వ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Vaman Srinivas Kudva
VSKudva1899-67.jpg
V. S. Kudva
జన్మ నామం Mulky Vaman Kudva
జననం 9 June 1899
Mulky
మరణం 30 June 1967
Mangalore
Cardiac arrest
వృత్తి Industrialist
మతం Hindu
భార్య/భర్త Shantha Kudva
సంతానం 5 sons, 1 daughter

వి.ఎస్. కుడ్వా అని పిలవబడే వామన్ శ్రీనివాస్ కుడ్వ (కొంకణి ವಾಮನ್ ಶ್ರೀನಿವಾಸ್ ಕುಡ್ವ )( జూన్ 9, 1899 - జూన్ 30, 1967) సిండికేట్ బ్యాంకు వ్యవస్థాపక నిర్వాహకుడు. [1] [2]

బాల్యం మరియు విద్యాభ్యాసం[మార్చు]

కుడ్వ 1899లో, ముల్కీలో, పూర్వాచార, సంప్రదాయ గౌడ సారస్వత్ బ్రాహ్మిణ్ (GSB) కుటుంబంలో (ఈ కుటుంబాన్ని ముల్కి కుడ్వాల ని పిలిచేవారు) జన్మించాడు. ఆయన తండ్రి రామచంద్ర కుడ్వకు ఒక చిన్న చేనేత మగ్గాల కేంద్రం ఉండేది. ముల్కీలో కార్లు లేని ఆ రోజులలో ఆయన సైకిల్ వాడేవాడు. నిరాడంబరమైన వాతావరణంలో పెరుగుతూ, ప్రాథమిక విద్యను ముల్కీలోనూ, ఉన్నత పాఠశాల విద్యను ఉడిపిలోనూ ఆయన పూర్తి చేశాడు. పాఠశాలలో జరిగే వక్తృత్వ పోటీలలో ఆయన చురుకుగా పాల్గొనేవాడు. ఇంగ్లీషు కన్నడ భాషలలో బాగా రాయగలిగే వాడు.

1908లో ఆయన తండ్రి ఉడిపికి మకాం మార్చి, అక్కడ ఇనుప సామాన్ల దుకాణాన్ని ప్రారంభించాడు. కుడ్వ తన మిగిలిన సమయాన్ని ఆ దుకాణంలోనే గడిపేవాడు. 1918లో మంగళూర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణుడై, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరడం కోసం బొంబాయి వెళ్ళాడు. బొంబాయిలోని విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ లో (VJIT) చేరాడు. చదువులో ఉన్నత శ్రేణి విద్యార్థిగా కొనసాగుతూ, 3 సంవత్సరాల అనంతరం మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమ పిలుపునందుకుని ఉడిపికి తిరిగి వెళ్ళాడు. ఆంగ్ల ద్రవ్య సహాయ పాఠశాలకు బదులుగా గాంధీజీ పిలుపుననుసరించి కాంగ్రెస్ పార్టీ చేత ప్రారంభించబడిన జాతీయ పాఠశాలలో ఆయన స్వచ్ఛంద ఉపాధ్యాయునిగా పనిచేశాడు.

CPC కంపెనీ లిమిటెడ్‌లో చేరాడు[మార్చు]

ఆయన 1922 నుండి 1926 వరకు ఒక ఇంజనీరింగ్ వర్క్ షాప్‌ని నడిపాడు.1926లో ది కెనరా పబ్లిక్ కన్వేయన్స్ కంపెనీ లిమిటెడ్(CPC కో లిమిటెడ్) మేనేజింగ్ డైరెక్టర్ అయిన వి.యస్.కామత్ పిలుపు నందుకుని, మంగుళూర్ పోయాడు. అక్కడ వర్క్ మేనేజర్‌గా చేరాడు. 1928లో కామత్ కూతుర్ని వివాహం చేసుకున్నాడు. 1932లో కామత్ మరణానంతరం జనరల్ మేనేజరుగా బాధ్యతలు తీసుకున్నాడు. 1938లో కంపెనీ మేనేజింగ్ డైరక్టరుగా ఎన్నికై 1966 వరకు ఆ స్థానంలోనే కొనసాగారు. ఈ కాలంలో ది సిపిసి కో లిమిటెడ్ ఎంతో అభివృద్ధిని, సంపదను సాధించి దేశంలో మంచి పేరు ప్రఖ్యాతులను పొందింది.

నూతన పరిశ్రమలను ప్రారంభించడం[మార్చు]

సాహసోపేతమైన స్వభావం గల వ్యక్తులు మరిన్ని పరిశ్రమలను స్థాపించినప్పుడే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని కుడ్వ గ్రహించారు. తన నిర్ణయాన్ని ఆయన, 1938లో ది కెనరా సేల్స్ కార్పోరేషన్ లిమిటెడ్‌ని స్థాపించడం ద్వారా, 1941లో ది కెనరా మోటార్ & జనరల్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్‌ను స్థాపించడం ద్వారా ఆచరణలోనికి తెచ్చాడు.

1943లో ది కెనరా వర్క్ షాప్స్ లిమిటెడ్‌ని స్థాపించి ఆటోమొబైల్స్ రంగానికి సంబంధించిన లీఫ్ స్ప్రింగ్సును, కెనరా స్ప్రింగ్స్ అనే పేరుతో 1950లో తయారు చేయడం ప్రారంభించాడు. ఉత్పత్తులకున్న గిరాకీ దృష్ట్యా ఉత్తర భారతదేశంలోని నాగపూర్లో మరో పరిశ్రమను ప్రారంభించారు. కంపెనీ ఎదుర్కొన్న అనేక సమస్యల రీత్యా 60'ల చివర్లలో ఈ విభాగాన్ని మూసివేశారు.

ఆరోజులలో లీఫ్ స్ప్రింగులను, స్ప్రింగ్ స్టీల్ ఫ్లాట్లను తయారు చేయడానికి కావలిసిన ముడి సామాగ్రిని దేశంలోకి దిగుమతి చేసుకునేవారు. దేశ అవసరాలకు కావలిసిన స్ప్రింగ్ స్టీల్ కోసం 60'ల చివర్లలో కుడ్వ ఒక చిన్న స్టీల్ ప్లాంట్ అవసరమని భావించాడు. దీనికోసం ఐదు మెట్రిక్ టన్నుల సామర్ధ్యంగల ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్, నిలువుగా ఉండి నిరంతరం పోత పోస్తూ ఉక్కు కడ్డీలను తయారు చేసే యంత్రం, ఒక రోలింగ్ మిల్లుతో చిన్న స్టీల్ ప్లాంట్ ఊహా చిత్రాన్ని ఆయన తయారు చేసుకున్నాడు.

1963లో మంగుళూరులో స్టీల్ ప్లాంట్ ఏర్పరచారు, ఒక సంవత్సరం తర్వాత ప్రాథమిక ఉత్పత్తిని ప్రారంభించి, తత్సంబంధమైన లోటుపాట్లన్నింటిని తెలుసుకున్నారు. నిరంతరంగా ఉత్పత్తిని చేయగలిగిన ఈ రకమైన యంత్రాన్ని వినియోగించడం భారతదేశంలో[3] ఇదే మొదటి సారి.

1947లో ఆయన ది కెనరా టైర్ & రబ్బర్ వర్క్స్ లిమిటెడ్‌ని ప్రారంభించాడు. రవాణా సంబంధమైన అనేక సంస్థలను కూడా ఆయన ప్రారంభించి నిర్వహించాడు. బోనస్, గ్రాట్యుటీ, పెన్షన్ సదుపాయాలను, చట్టప్రకారం అందించవలసిన తప్పనిసరి సదుపాయాలుగా ప్రకటించకమునుపే వాటిని ఆయన తన ఉద్యోగులకు అందించాడు.

జర్నలిజంలో ఆసక్తి[మార్చు]

కుడ్వ చదువుకునే రోజులనుండి జర్నలిజంలో ఆసక్తి చూపేవాడు. ఆయన 1922లో సత్యగ్రహి అనే కన్నడ వారపత్రికకు సంపాదకుడిగా వ్యవహరించాడు. 1923 నుండి 1934 వరకు "స్వదేశాభిమాని" అనే కన్నడ వారపత్రికకు ఎడిటర్‌గా పనిచేశాడు.

ఆయన రాష్ట్ర జర్నలిస్టుల సలహా సంఘంలో సభ్యునిగా పనిచేసాడు. 1941లో ది న్యూస్ పేపర్ పబ్లిషర్స్ ప్రైవేటు లిమిటెడ్‌ని స్థాపించి నవభారత్ అనే కన్నడ వార్తాదినపత్రికను ప్రచురించాడు. సంపాదకునిగా కన్నడ విలేకరులలో గౌరవాన్ని పొందాడు. మంగుళూరులో అఖిల కర్నాటక జర్నలిస్టుల సమావేశాన్ని నిర్వహించారు.

సామాజిక కార్యకర్త[మార్చు]

మణిపాల్‌కి చెందిన టి.యమ్.ఏ. పాయ్ ఉపేంద్ర అనంత్ పాయ్‌లతో పాటూ కుడ్వ కూడా సిండికేట్ బ్యాంకు వ్యవస్థాపక నిర్వాహకుడు, ఇదే ఆ తర్వాత కెనరా ఇండస్ట్రీయల్ బ్యాంకింగ్ సిండికేట్ లిమిటెడ్‌ గా పిలవబడింది.

1948లో ఇతడు సౌత్ కెనరాలోని, కెనరా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్‌ కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తదుపరి 3 సంవత్సరాల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగాడు. ఈయన తన స్నేహితుడు యూ. శ్రీనివాస్ మాల్యాతో కలిసి మంగుళూరులో నౌకాశ్రయం, విమానాశ్రయం ఏర్పడడానికి కారణమయ్యాడు.

జిల్లా ఆర్థిక సంక్షేమం కోసం పనిచేసినప్పుడు, గణనీయంగా విద్యాభివృద్ధి కోసం కూడ కృషి చేశాడు. ఉన్నత సాంకేతిక విద్యని అభ్యసించడం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఋణ స్కాలర్ షిప్పులను మంజూరు చేసేందుకు 1955లో కెనరా ఫౌండేషన్‌ను స్థాపించాడు. కర్నాటకలో కర్నాటక రీజనల్ ఇంజినీరింగ్ కాలేజ్‌‌ని ఏర్పరిచేందుకోసం మరోసారి తన స్నేహితుడు యూ.శ్రీనివాస మాల్యాతో కలిసి కృషి చేశాడు. ఇప్పుడు దాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కర్నాటక (NITK) గా పిలుస్తున్నారు. ఇది సూరత్కల్లో వుంది. దీనిలో ఆయన చాలా ఏండ్ల పాటు నిర్వాహక కమిటీలో పనిచేశాడు.

రోటరీ క్లబ్[మార్చు]

తను చార్టర్ ప్రెసిడెంట్‌గా ఉండగా మంగళూరులో రోటరీ క్లబ్ ప్రారంభం కావడానికి ఆయన దోహదపడ్డారు.[4] ఆయన యస్.కె డెవలప్‌మెంట్ అండ్ వెల్ ఫేర్ బోర్డు, చిన్న తరహా పరిశ్రమల సంఘం, యస్.కే ఇండస్ట్రీస్ అసోసియేషన్‌లకు అధ్యక్షులుగా ఉన్నారు.

భారతదేశంలోనూ, విదేశాల్లోనూ ఆయన విస్తృతంగా పర్యటించారు. దేశాన్ని దాటి బయటకి ప్రయాణించడం వ్యయ ప్రయాస భరితం, మరియూ అరుదయిన కాలంలో ఆయన ఈ పనిని చేశాడు. 1951లోమధ్య ప్రాచ్యంలోనూ, యూరప్, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోనూ ఆయన పర్యటించాడు. 1960 మరియు 1963లలో ఆయన మరోసారి యూరప్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, జపాన్‌లలో పర్యటించాడు.

ఆఖరి[మార్చు]

1967లో కుడ్య మరణించాడు. మంగళూరు, దక్షిణ కన్నడ ప్రాంత ప్రజలకు కర్మయోగిగా ఈయన ఙ్ఞాపకమున్నాడు.

సూచనలు[మార్చు]

  1. "Brief History". Syndicate Bank. Retrieved 2006-08-18. 
  2. "MyIris.com: Syndicate Bank Q1 net rises 10.71% to Rs 1805.80 mn". My Iris. 2006-07-27. Retrieved 2008-01-28. 
  3. Tupkary, Dr. R. H.. Modern Steel Making. Khanna Publishers. p. 450. 
  4. "Welcome to the Rotary Club of Mangalore!". Rotary Club of Mangalore. Retrieved 2007-01-27. 
  • దివంగత వి.ఎస్ కుడ్య ఎస్టేట్ ద్వారా అందించబడిన సమాచారం మరియు చిత్రం.
  • "Kanara Saraswat Association Magazine - August 1999". Archived from the original on 2003-01-11.  వి.ఎస్. కుడ్య శత జయంతి నోట్స్