వామన పురాణము

వికీపీడియా నుండి

వ్యాసుడు చేత రచింపబడ్డ పద్దెనిమిది పురాణాలలొ వామన పురాణం ఒకటి. శ్రీమహావిష్ణువు త్రివిక్రమ స్వరూపుడైన బలి చక్రవర్తిని పాతళ లోకానికి పంపిన ఐదవ అవతారమైన వామన అవతారం పై ఆధారమైనది ఈ పురాణం. ఈ పురాణం పూర్వ భాగం ఉత్తర భాగం అంబే రెండు భాగాలుగా విభజింపబడింది. పూర్వభాగం లొ 10 వేల శ్లోకాలు ఉన్నాయి, ఉత్తర భాగం ఇప్పుడు లభించడం లేదు. ఈ పురాణంలో శ్లోకాలే కాకుండా గద్య భాగాలు కూడా ఉన్నాయి. పూర్వ భాగం లొ 97 అధ్యాయాలు ఉన్నాయి. కురుక్షేత్రం లోని బ్రహ్మ సరోవరాన్ని విశేషంగా 28 అధ్యాయలలొ సరో మహత్యంగా అనే పేరు తో వర్ణింపబడుతుంది. బలి చక్రవర్తి జరిపిన యజ్ఞం కురుక్షేత్రంలొ జరిపినట్లు చెప్పబడింది. ఈ పురాణానికి ప్రధాన వక్త పులస్త్యుడు శ్రోత నారదుడు.