వారణాసి ఘంటయ్య శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వారణాసి ఘంటయ్య శాస్త్రి (1895 - 1957) ప్రముఖ మృదంగ వాదన నిపుణుడు.

ఇతడు కృష్ణా జిల్లా లోని వడాలి అగ్రహారంలో సుబ్బరామయ్య, లక్ష్మీ నరసమాంబ దంపతులకు మూడవ పుత్రునిగా జన్మించాడు. చిన్నతనం నుండే అన్నగారైన వారణాసి బ్రహ్మయ్య శాస్త్రి వద్ద విద్య నేర్చి తర్వాత తోట్లవల్లూరు లోని శివలెంక వీరయ్య అయ్యవార్ల వద్ద శాస్త్రాభ్యాసం చేసి, కుంభకోణం లో మృదంగం కోదండరామయ్యరు వద్ద తన కళా కౌశలానికి మెరుగులు దిద్దుకున్నాడు.

ఇతడు అనేక సంస్థానాలలో తన వాద్య నైపుణ్యాన్ని ప్రదర్శించి, సువర్ణ ఘంటా కంకణాది బహుమతులు పొంది, మృదంగ కేసరి, మార్దంగిక శిరోమణి మొదలైన బిరుదులు పొందాడు.

1932లో చెన్నై లో ఇతనికి "టైగర్" బిరుదు, సువర్ణ ఘంటాకంకణం ఇచ్చి ఆంధ్ర ప్రజాసంఘం, సంగీత విద్వన్మండలి సన్మానించింది.

ఇతడు 62 వ ఏట పరమపదించాడు.