వాలెంతినా తెరిష్కోవా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వాలెంతినా తెరిష్కోవా
వాలెంతినా తెరిష్కోవా

1969 లో వాలెంతినా తెరిష్కోవా

సోవియట్ వ్యోమగామి
అంతరిక్షంలొ ప్రవేశించిన మొదటి మహిళ
జాతీయత సోవియట్ యూనియన్
రష్యన్
జననం
ఇతర వృత్తులు వ్యోమగామి
ర్యాంక్ మేజర్ జనరల్, సోవియట్ ఎయిర్‌ఫోర్స్
అంతరిక్షంలో గడిపిన కాలం 2 రోజులు, 23 గంటల and 12 నిమిషాలు
ఎంపిక మహిళా దళం
మిషన్ వోస్తోక్ 6
Mission
insignia
Vostok5-6patch.png

వాలెంతినా తెరిష్కోవా రష్యాకు మరియు పూర్వపు సోవియట్ యూనియన్ కు చెందిన వ్యోమగామి. ఆమె మార్చి 6, 1937 న జన్మించింది. ఈమె అంతరిక్షంలో కి వెళ్ళిన మొదటి మహిళ గా చరిత్రలో ప్రసిద్ధికెక్కింది. ఆమె జూన్ 16,1963 న అంతరిక్షంలోకి వెళ్ళుటకు ప్రయోగించిన వోస్కోట్-6 అనే అంతరిక్ష నౌక కు పైలెట్ గా నాలుగు వందలమంది దరఖాస్తుదారులలో ఒకరిగా ఎంపికైనది. అంతరిక్ష సంస్థ లోకి అడుగు పెట్టిన తెరిస్కోవా సోవియట్ వాయుసేనా దళంలో మొదటి సారిగా గౌరవప్రథమైన హోదాలో ఉండెడిది. ఆమె అంతరిక్షంలోనికి వెళ్ళిన మొదటి మహిళా పైలట్ గా ప్రసిద్ధి చెందింది.[1] ఆమె మూడు రోజుల అంతరిక్ష యాత్రలో అనేక స్వీయ పరీక్షలను నిర్వహించుకొని ఆమె స్త్రీల శరీరంలో గల మార్పులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది.

తెరిస్కోవా అంతరిక్ష వ్యోమగామి గా నియామకం కాకముందు ఆమె జౌళి పరిశ్రమలో పనిచేసింది. అమె పారాచూట్ లపట్ల ఆశక్తి కనబరచేది. 1969 లో వ్యోమగాముల మొదటి సమూహం విడిపోయిన తర్వాత ఆమె కమ్యూనిటీ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ నందు గౌరవ సభ్యులుగా ఎంపిక కాబడ్డారు. సోవియట్ యూనియన్ విచ్చిన్నం తర్వాత ఆమె ప్రస్తుతం గల సోవియట్ రష్యాలో పూజ్యమైన స్త్రీగా గుర్తింపబడుతున్నారు.


తొలి జీవితం[మార్చు]

తెరిస్కోవా మధ్య రష్యాలోని టుటయెవ్‌స్కీ జిల్లా లోని "మాస్‌లెన్నికోవో" అనే గ్రామంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు బెలారస్ అనే ప్రాంతంనుండి వలస వచ్చారు.[2] ఆమె తండ్రి ఒక ట్రాక్టర్ డ్రైవర్ గానూ మరియు ఆమె తల్లి జౌళి పరిశ్రమలో ఉద్యోగినిగా పనిచేశేవారు. ఆమె 1945 లో తన 8 వయేట ప్రాఠాశాల విధ్య ప్రారంభించారు కానీ 1953 లో పాఠశాలను వదిలి వేసి తర్వాత విద్యను కరెస్పాండెన్స్ ద్వారా పూర్తి చేశారు.[3] ఆమె యుక్త వయస్సు నుండి పరాచూట్ ల పట్ల ఆశక్తి కనబరచేవారు. అందువల్ల ఆమె స్కై డైవింగ్ నందు స్థానిక ఏరో క్లబ్ నందు శిక్షణ పొందారు. ఆమె తన 22 వ యేట అనగా మే 22, 1959 నందు మొదటి సారి ఆకాశం నందు డైవింగ్ చేశారు. ఆ కాలంలో ఆమె జౌళి పరిశ్రమలో ఒక ఉద్యోగినిగా పనిచేసే వారు. ఆమె ఆకాశమార్గం నందు డైవింగ్ చేయు నైపుణ్యం ఆమెను ఒక వ్యోమగామిగా ఎంపిక కాబడుటకు తోడ్పడింది. 1961 లో ఆమె స్థానిక 'కొమ్‌సొమోల్"(యువ కమ్యూనిస్ట్ లీగ్) నందు సెక్రటరీగా ఉన్నారు. తర్వాత ఆమె కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ది సోవియట్ యూనియన్ నందు చేరారు.


సోవియట్ అంతరిక్ష కార్యక్రమంలో ఉద్యోగం[మార్చు]

Cosmonauts Valentina Tereshkova and Valery Bykovsky among children

1961 లో యూరి గగారిన్ అంతరిక్ష యాత్ర తర్వాత సోవియట్ రాకెట్ ఇంజనీర్ అయిన "సెర్జీ కొరొల్‌యోవ్" ఒక మహిళను అంతరిక్షం లోకి పంపాలనే ఆలోచన చేశాడు. ఫిబ్రవరి 16, 1962 న వాలెంతినా తెరిషోవా ను మహిళా వ్యోమగాముల వర్గం లోకి ఎంపిక చేశాడు. అంతరిక్షం లోకి వెళ్ళుటకు దరఖాస్తుచేసిన 400 మంది లో ఐదు మంది మాత్రమే ఎంపిక కాబడ్డారు: టత్యాన కుజ్‌నెట్సోవా, ఇరినా సొలొవ్యోవ, ఝన్నా యొర్కినా, వాలెంతినా పొనొమార్యొవా మరియు తెలిస్కోవా. తెలిస్కోవా ఎంపిక కాబడడానికి యోగ్యత ఆమె 30 సంవత్సరాలుగా పారాఛూట్ లో డైవింగ్ నందు అనుభవం కలిగి యుండటం, 170 సెం.మీ.(5 అడుగుల 7 అంగుళాలు) ఎత్తు కలిగి ఉండటం మరియు 70 కి.గ్రా. ల బరువు కలిగి ఉండుట.

తెరెస్కోవా ఒక సామర్థం కలిగిన వ్యక్తి గా గుర్తింపు పొందుటకు ఆమె గతచరిత్రకూడా కారణం. ఆమె తండ్రి 'టాంక్ లీడర్ అయిన వ్లాదిమిర్ తెరెస్కోవా యుద్ధ హీరో. ఆయన ప్రపంచ యుద్ధం 2 నందు ఫిన్నిష్(శీతాకాల యుద్ధం) నందు లెమ్మెట్టి ప్రాంతంనందు తెరెస్కోవా రెండేళ్ళ వయస్సు కలిగి యున్నపుడు మరిణించాడు. ఆమె అంతరిక్ష యాత్ర చేసిన తర్వాత సోవియట్ యూనియన్ యే విధంగా కృతజ్ఞతలు తెలుపాలో ఆమెను కోరినది. తెరిస్కోవా తన తండ్రి యే ప్రాంతంలొ మరణించారో ప్రచురించమని కోరారు. ఆమె చేసిన కృషికి కృతజ్ఞతగా సోవియట్ యూనియన్ ఆమె తండ్రి మరిణించిన ప్రాంతం అయిన "లెమెట్టీ" నందు స్మారక స్తంభం నిర్మించింది. అది ప్రస్తుతం రష్యా సరిహద్దులో కలదు. తెలిష్కోవా అనేక సార్లు ఫిన్‌లాండ్ ను సందర్శించారు.

శిక్షణ నందు తేలిక్ విమానాలు, నిర్జనత్వ పరీక్షలు, అపకేంద్రబల పరీక్షలు, రాకెట్ సిద్ధంతం, స్పేస్ కాప్ట్ ఇంజనీరింగ్, 120 పారాచూట్ నుండి దూకటం మరియు పైలట్ శిక్షణ లను MiG-15UTI నందు యివ్వబడ్డాయి. ఈ బృందం అనేక నెలల పాటు తీవ్రమైన శిక్షణ పొంది నవంబర్ 1962 లో పరీక్షలను హాజరయ్యారు. తర్వాత మిగిలిన నలుగురు సోవియట్ ఎయిర్ ఫోర్స్ నందు సహాయకులుగా నియమించబడ్డారు. తెరిష్కోవా, సోలోవ్యోవా మరియు పొనొమార్యోవా లు ముఖ్యమైన వ్యక్తులు మరియు ఒక ఉమ్మడి కార్యక్రమం అభివృద్ధి చేసిరి. దాని ప్రకారం మార్చి లేదా ఏప్రిల్ 1963 లో ఇద్దరు మహిళలు సోలో వాస్కోక్ ప్లైట్ పై నుండి వరుస రోజులలో అంతరిక్షంలో అడుగు పెట్టాలని ప్రణాళిక తయారుచేశారు.

Cosmonauts Andriyan Nikolayev and Valentina Tereshkova on a Hungarian stamp.

మొదట తెరిష్కోవా వాస్టోక్ 5 లో ప్రవేశించాలని, పొనొమర్యోవా ఆమెను అనుసరించి వాస్టోక్ 6 నుండి కక్ష్యలో ప్రవేసించాలని నిర్ణయించారు. కాని ఆ నిర్ణయం మార్చి 1963 లో మార్పు చెయబదినది. వాస్టోక్ 5 అనునది పురుష వ్యోమగామి వారెరీ బైకోస్కై తో ప్రయాణీంపబడేది. అది మహిళా వ్యోమగాములతో కూడిన వోస్టోక్ 6 తొ కలసి ఉమ్మడిగా జూన్ 6, 1963 లో వెళ్ళుటకు నిర్ణయింపబడినది. స్టేట్ స్పేస్ కమిషన్ మే 21 న సమావేశమై తెరిష్కోవా ను వోస్కోవ్ 6 కు పైలట్ గా నియమించింది. ఇది నిఖిత ఖ్రుష్‌చెవ్ చే ధృవీకరింపబడినది. ఎంపికైన సమయంలో తెరిష్కోవా మెర్క్యురీ సెవెన్ అనే వ్యోమగామి కంటె పది సంవత్సరాలు వయసులో చిన్నది.

జూన్ 14 న వోస్టోక్ 5 అనే అంతరిక్ష నౌక దిగిన తర్వాత తెరిష్కోవా తన స్వంత ప్లైట్ కొరకు చివరి ప్రయత్నాలు ప్రారంభించింది. అపుడు ఆమె వయస్సు 26 సంవత్సరాలు. జూన్ 16 , 1963 న ఉదయం, తెరిష్కోవా మరియు ఆమె అనుచరులు సోలోవ్యొవా లు అంతరిక్ష దుస్తులు(space suits) ధరించారు. అంతరిక్ష నౌక బయలుదేరే స్థలం వద్దకు బస్ పై వెళ్ళారు.తన ప్రయాణ సమాచారము పూర్తయిన తర్వాత మరియు ప్రాణ రక్షణ కొరకు ప్రయత్నాలు సరిచూసుకొన్న తర్వాత ఆమె వోస్టోక్ అనే అంతరిక్ష నౌక లోనికి వెళ్ళినది. అపుడు ఆ నౌక సీల్ చేయబడినది. కౌంట్ డౌన్ ప్రారంభించబడినది. వోస్టోక్ 6 లోప రహితంగా చేరినది. తెలిష్కోవా అంతరిక్షం లోకి వెళ్ళిన మొదటి మహిళగా చరిత్రలో నిలిచినది. ఆమెకు ఈ అంతరిక్ష నౌకలో పిలుచుకొను గుర్తుగా "చైకా" గా నిర్ణయింపబడినది. అంతరిక్ష యాత్ర నిర్విఘ్నంగా పూర్తయిన తదుపరి ఆమె విజయానికి గుర్తుగా ఒక ఉల్క కు ఆమె సజ్ఞానామం అయిన చైకా అని పేరు పెట్టారు.ఆ ఉల్క పేరు 1671 Chaika.

From right to left: Nikita Khrushchev, Valentina Tereshkova, Pavel Popovich and Yury Gagarin at the Lenin Mausoleum, during a celebration honoring the Soviet cosmonauts, 1963

కానీ తెరిష్కోవా అంతరిక్షనౌకలో భౌతికంగా అసౌకర్యంగా అనుభూతిపొందినది.[4] ఆమె భూమి యొక్క కక్ష్యలో 48 సార్లు తిరిగి మొత్తం మూడు రోజులు అంతరిక్షంలొ గడిపింది. ఆమె తన విమానంలో గడిపిన సమయం యిదివరకు అమెరికా వ్యోమగాములు గడిపిన సమయం కంటే ఎక్కువ. తెరిష్కోవా ప్లైట్ లో తన అనుభవాలను నమోదు చేయుతకు ఒక లాగ్ బుక్ నిర్వహించినది.ఆమె ఖగోళ విషయాలను ఫోటోలు కూడా తీసినది. ఆ చిత్రాలు తర్వాతి కాలంలో వాతావరణం లోని పొరలను కనుగొనుటలో ఉపయోగపడినవి.

తెరిస్కోవా ప్రయాణించిన వోస్టోవ్ 6 అనునది చివరి వోస్టోక్. ఇది వాలెరీ బైకోవ్‌స్కై అనే వ్యోమగామి ప్రయాణించిన వోస్టోక్ 5 బయలుదేరిన రెండు రోజుల తర్వాత బయలుదేరినది. ఇది వోస్టో 5 ప్రయాణించిన కక్ష్యలోనికే వెళ్ళినది. వోస్టోక్ 5 కక్ష్యలో ఐదు రోజులు అనగా తెరిష్కోవా వోస్టోక్ 6 నుండి దిగిన మూడు గంటల వరకు ఉన్నది. ఈ రెండు వ్యోమ నౌకలు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నవి. అందులో గల తెరిష్కోవా వైకోవ్‌స్కై తో సంభాషించినది. వీరిద్దరూ రేడియో ద్వారా ఖ్రుష్‌చెవ్ తో కూడా సంభాషించారు.

ఆ తర్వాత అంతరిక్షంలోకి రెండవ మహిళను పంపే పథకం 19 సంవత్సరాల తర్వాత నెరవేరినది. తెరిష్కోవా తర్వాత స్వెత్లానా సవిక్షయ అనే మహిళ అంతరిక్షంలోకి అడుగు పెట్టినది. ఆ తర్వాత తెరిష్కోవా బృందం లోని ఎవరూ అంతరిక్షంలోకి వెళ్ళలెదు. అక్టోబర్ 1969 లో ఆ మహిళా బృందము నకు విరమణ కలిగినది.

విద్య[మార్చు]

Tereshkova, skiing, 1964

అంతరిక్ష ప్రయాణం చేసిన తదుపరి తెరిష్కోవా జుకోవ్‌స్కై ఎయిర్ ఫోర్స్ అకాడమీ లో చదువుకొని అత్యధిక మార్కులతో అంతరిక్ష ఇంజనీరింగ్ నందు పట్టభద్రురాలైనది. 1977 లో ఆమె ఇంజనీరింగ్ నందు డాక్టరేట్ పొందినది.

సోవియట్ రాజకీయాలలో ప్రాధాన్యత[మార్చు]

ఆమెకు వ్యోమగామిగా వచ్చిన ఔన్నత్యంతో అనేక రాకకీయ పార్టీలలో అనేక పదవులు లభించాయి. 1966 నుండి 1974 వరకు ఆమె "సుప్రీం సోవియట్ ఆఫ్ ద సోవియట్ యూనియన్" లో సభ్యురాలిగా ఉన్నారు. 1974 నుండి 1989 వరకు "ప్రెసిడియం ఆఫ్ ద సుప్రీం సోవియట్" కు సభ్యులైనారు. 1969 నుండి 1991 వరకు ఆమె "సెంట్రల్ కమిటీ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ" లో ఉన్నారు. 1977 లో ఆమె రష్యా ఎయిర్ ఫోర్స్ నందు పదవీ విరమణ పొందారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు వ్యోమగామిగా కూడా పదవీవిరమణ చేశారు.

సోవియట్ యూనియన్ నందు రాజకీయ విభాగంలో ఆమెకు గల గుర్తింపు తో ఆమె సోవియట్ నుండి విదేశ ప్రతినిధిగా గుర్తింపుపొందారు. ఆమె ప్రపంచ శాంతి కౌన్సిల్ కు మెంబర్ గా 1966 లో నియమింపబడ్డారు. 1967 లో ఆమె యారోస్లావ్ల్ సోవియట్ కు సభ్యులుగా ఉన్నారు.1966–1970 మరియు 1970–1974 లలో ఆమె సుప్రీం ఆఫ్ ద సోవియట్ యూనియన్ కు మెంబరుగా ఉన్నారు. ఆమె ప్రెసిడియం ఆఫ్ ద సుప్రీం సోవియట్ కు 1974 లో ఎన్నికైనారు.1975 లో మెక్సికో నగరం నందు ఐక్యరాజ్యసమితి తరపున జరిగిన "అంతర్జాతీయ మహిళా సంవత్సరం " కు సోవియట్ తరపున ప్రతినిధిగా పాల్గొన్నారు.

ఆమె ప్రపంచ మహిళా సమావేశాలకు సోవియట్ యూనియన్ తరపున కోపెన్ హగ్ నగరంలో ముఖ్య భూమిక పోషించి శాతికోసం గ్లోబల్ అజెండాకు రూపకల్పన చేశారు. ఆమె సుప్రీం సోవియట్ లో డిప్యూటీ రాంకును పొందారు.కమ్యూనిస్ట్ పార్టీ, సోవియట్ యూనియన్ కేంద్రకమిటీ లో సభ్యత్వాన్ని తీసుకున్నారు. అమె అంతర్జాతీయ మహిళా ప్రజాస్వామ్య ఫెడరేషంకు ఉపాధ్యక్షులుగా, సాఒవియట్-అల్జీరియన్ మైత్రీ సంఘానికి అధ్యకులుగా కూడా ఉన్నారు. ఆమె USSR లోని అత్యున్నత అవార్డు అయిన హీరో ఆఫ్ ద సోవియట్ యూనియన్ పతకాన్ని పొందినది. ఆమె ఆర్డర్ ఆఫ్ లెనిన్ , ఆర్డర్ ఆఫ్ ద అక్టోబర్ రివొల్యూషన్, అనేక విశేష పతకాలు, విదేశ పతకాలు ముఖంగా కార్ల్ మార్క్స్ ఆర్డర్ ను, యునైటెడ్ నేషన్స్ "గోల్డ్ మెడల్ ఆఫ్ పీస్"ను, సింబా అంతర్జాతీయ మహిళా ఉద్యం అవార్డును పొందారు. ఆమె హీరో ఆఫ్ సోషలిస్ట్ లేబర్ ఆఫ్ చెకోస్లేవేకియా, హీరో ఆఫ్ వియత్నాం, మరియు హీరో ఆఫ్ మంగోలియా అనే అవార్డులు సంపాదించింది. 1990 లో ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఏడిన్‌బర్గ్ నుండి గౌరవ డాక్టరేట్ ను పొందినది. చంద్రుని వెనుక భాగమునకు ఆమె పేరు మీద "తెరిష్కోవా క్రేటర్" అని నామకరణం చేశరు. వాలెంటినా తెరిష్కోవా సోవియట్ మరియు రష్యా సైనిక విభాగంలో మొదటి మరియు ఏకైన మహిళా జనరల్ అధికారిగా ఉన్నారు.

Tereshkova in 1970

సోవియట్ విచ్చిన్నం తర్వాత తెరిష్కోవా తన రాజకీయ జీవితాన్ని కోల్పోయింది. కాని ఈ రోజు ఆమె సోవియట్ స్పేస్ చరిత్రలో యూరీ గగారిన్, అలెక్సీ లియొనోవ్ సరసన అసమన గుర్తింపు పొందింది. ఆమె రాజకీయ జీవితం నుండి పదవీ విరమన చెందిన తర్వాత అంతరిక్ష కార్యక్రమాలలో తరచుగా కనబడేది.

తెరిష్కోవా యొక్క జీవితం మరియు అంతరిక్ష యాత్ర మొదట 1975 మిట్చెల్ ఆర్.షార్పె వ్రాసిన పుస్తకం అయిన It Is I, Sea Gull; Valentina Tereshkova, the first woman in space ద్వారా పరీక్షింపబడినది.[5] మరియు ఆమె జీవిత విశేషాలను 2007 లో "కోలిన్ బుర్జెస్స్" మరియు "ఫ్రాన్సిస్ ప్రెంచ్" వ్రాసిన Into That Silent Sea లో కలదు. ఈ పుస్తకంలో తెరిష్కోవా మరియు ఆమె బృంద సభ్యుల ఇంటర్వ్యూలు కూడా కలవు.

ఆమె తన 70 సంవత్సరాల పుట్టిన రోజు సందర్భంగా రష్యా ప్రధానమంత్రి నివాసానికి ఆహ్వానం పంపారు. ఆ కార్యక్రమఖ్లో ఆమె మార్స్ పైకి ఒన్ వే ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నట్లు చెప్పారు[6].

ఏప్రిల్ 5, 2008 న ఆమె సెయింత్ పీటర్స్ బర్గ్, రష్యాలో జరిగిన 2008 సమ్మర్ ఒలెంపిక్స్ కు టార్చ్ బేరర్ అయ్యారు.[7]

ఆమె జర్మన్ "ఎడుయార్డ్ రెయిన్ పౌండేషన్" నుండి 2007 లో "ఎడుయార్డ్ రెయిన్ రింగ్ ఆఫ్ ఆనర్" అనే అవార్డును అందుకున్నారు.[8][9]

వ్యక్తిగత జీవితం[మార్చు]

"వోస్టోక్ 6" లో అంతరిక్ష యాత్ర తరువాత ఆమె ఒక వ్యోమగామి "ఆండ్రియన్ నికొలాయెవ్"(1929–2004) తో వివాహం కానున్నట్లు పుకార్లు వ్యాపించాయి. అదే విధంగా నవంబర్ 3, 1963 న మాస్కో వెడ్డింగ్ పాలస్ లో వారు వివాహం చేసుకున్నారు. "ఆండ్రియన్ నికొలాయెవ్" ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు మరియు అంతరిక్ష కార్యక్రమాల అధికార్లకు వివాహానికి ఆహ్వానించి సత్కరించాడు.

జూన్ 8, 1964 న వారికి "ఎలెనా ఆండ్రియనోవా-తెరిష్కోవా" అనే కుమార్తె కలిగినది.[10].(ప్రస్తుతం ఆమె ఒక డాక్టర్ మరియు తల్లి దండ్రులు వ్యోమగాములైన మొదటి వ్యక్తి). ఆమె నికొలయెవ్ కు 1982 లో విడాకులిచ్చింది. ఆమె ఆర్థోపెడిస్ట్ అయిన యులీ జి.షాపొష్నికోవ్ ను వివాహమాడింది. ఆయన 1999 లో మరణించాడు.

The wedding ceremony of pilot-cosmonauts Valentina Tereshkova and Andrian Nikolaev, 3 November 1963.

గౌరవాలు మరియు సత్కారాలు[మార్చు]

Tereshkova at the Heureka science centre, in Finland, 2002
Tereshkova visiting the Lvov confectionary, 1967
Valentina Tereshkova and Neil Armstrong, 1970
Valentina Tereshkova among delegates of the 24th CPSU congress, 1971
Valentina Tereshkova and NASA astronaut Catherine Coleman at the Gagarin Cosmonaut Training Center in December 2010.
Tereshkova receives the Order of Friendship from Russian President Dmitry Medvedev on 12 April 2011 at the Moscow Kremlin.
రష్యన్
  • Order of Merit for the Fatherland;
    • 2nd class (6 March 2007) – for outstanding contribution to the development of domestic space
    • 3rd class (6 March 1997) – for services to the state and the great personal contribution to the development of domestic space
  • Order of Honour (10 June 2003) – for outstanding contribution to the development and strengthening of international scientific, cultural and social ties
  • Order of Friendship (April 12, 2011) – for outstanding contribution to the development of national manned space flight and long-term fruitful public activity
  • Russian Federation State Prize for outstanding achievements in the field of humanitarian action in 2008 (4 June 2009)
  • Certificates of appreciation from the Government of the Russian Federation;
    • 16 June 2008, – for long-term fruitful state and public activities, considerable personal contribution to the development of manned space flight and in connection with the 45th anniversary of spaceflight
    • 12 June 2003, – for large contribution to the development of manned space flight
    • 3 March 1997) – for the contribution to the development of space, the strengthening of international scientific and cultural ties and years of diligent work
సోవియట్
యితర అవార్డులు – వార్సా పాక్ట్
యితర అవార్డులు


వైజ్ఞానిక, సాంఘిక మరియు ఆధ్యాత్మిక సంస్థలు
  • Gold Medal, Tsiolkovsky Academy of Sciences of the USSR
  • Gold Medal of the British Society for interplanetary communications "For achievements in space exploration" (February 1964)
  • Gold Medal of the "Cosmos" (FAI)
  • Award Galambera Astronautics
  • Gold Medal of Peace Joliot-Curie (France, 1964)
  • Order "Wind Rose" International Committee of the National Aeronautics and Space Missions
  • "Golden mimosa" of the Italian Union of Women (1963)
  • Sign of the Komsomol "For active in the League" (1963)
  • Gold Medal Exhibition of Economic Achievements (28 June 1963)
  • Honour of DOSAAF (1 July 1963)
  • Order of St. Euphrosyne, Grand Duchess of Moscow, 2nd class (2008)


గౌరవ పౌరసత్వాలు 

Kaluga, Yaroslavl (Russia), Karaganda, Baikonur (Leninsk, Kazakhstan, 1977), Gyumri (Leninakan, Armenia, 1965), Vitebsk (Belarus, 1975), Montreux (Switzerland), Drancy (France), Montgomery (UK), Polizzi Generosa ( Italy), Darkhan (Mongolia, 1965), Sofia, Burgas, Petrich, Stara Zagora, Pleven, Varna (Bulgaria, 1963), Bratislava (Slovakia, 1963)

గుర్తింపు

Various locations and monuments have been named after Valentina Tereshkova:

యివి కూడా చూడండి[మార్చు]

సూచికలు[మార్చు]

  1. "Valentina Vladimirovna TERESHKOVA". 
  2. Першая жанчына‑касманаўт ў дзяцінстве гаварыла па‑беларуску. Nn.by (2009-04-24). Retrieved on 2013-03-04.
  3. Valentina Tereshkova. Starchild.gsfc.nasa.gov. Retrieved on 2013-03-04.
  4. "Valentina Tereshkova: the Woman who Conquered the Space" (Russian)
  5. Mitchell R Sharpe (1975). "It is I, Sea gull;": Valentina Tereshkova, first woman in space. Crowell. ISBN 978-0-690-00646-9. 
  6. Reuters (6 March 2007). "First woman in space dreams of flying to Mars". Retrieved 2008-05-26. 
  7. // Олимпийский огонь понесут Друзь, Фрейндлих и Плющенко. Kp.ru (2012-10-16). Retrieved on 2013-03-04.
  8. "The Eduard Rhein Ring of Honor Recipients". Eduard Rhein Foundation. Retrieved ఫిబ్రవరి 5, 2011 (2011-02-05). 
  9. "Ring of Honor 2007 – Dr. techn. Dr.h.c.mult. Valentina V. Tereschkova". Eduard Rhein Foundation. Retrieved ఫిబ్రవరి 5, 2011 (2011-02-05). 
  10. Feldman, Heather. Valentina Tereshkova: The First Woman in Space. The Rosen Publishing Group, 2003. ISBN 0-8239-6246-6

బయటి లంకెలు[మార్చు]


బయటి లంకెలు[మార్చు]