వాల్-మార్ట్

వికీపీడియా నుండి
వాల్-మార్ట్ స్టోర్స్ ఐ.ఎన్.సి
రకం పబ్లిక్
Founded 1962 (1962)
వ్యవస్థాపకు(లు) సామ్ వాల్టన్
ప్రధానకార్యాలయం బెన్టన్ విల్,ఆర్కాన్సా
36°21′51″N 094°12′59″W / 36.36417, -94.21639
Number of locations 8,970 (2011)
Area served ప్రపంచవ్యాప్తంగా
కీలక వ్యక్తులు మైక్ డ్యూక్ (ప్రెసిడెంట్ & సిఈఓ)
రాబ్సన్ వాల్టన్ (Chairman)
పరిశ్రమ రీటైల్
ఆదాయం Green Arrow Up Darker.svg US$ 421.849 billion (2011)
నిర్వహణ రాబడి Green Arrow Up Darker.svg US$ 25.542 billion (2011)
Net income Green Arrow Up Darker.svg US$ 15.355 billion (2011)
ఆస్తులు Green Arrow Up Darker.svg US$ 180.663 billion (2011)
Total equity మూస:Decrease US$ 68.542 billion (2011)
యాజమాని వాల్టన్ కుటుంబం
ఉద్యోగులు సుమారు . 2.1 million (2011)
విభాగాలు Walmart Canada
Subsidiaries Asda, Sam's Club, Seiyu Group, Walmex
వెబ్‌సైటు http://www.walmartstores.com

వాల్ మార్ట్ స్టోర్స్ లేదా వాల్ మార్ట్ ఐ.ఎన్.సి (NYSE: WMT), ప్రపంచంలోనే అతిపెద్ద చిల్లర సరుకుల వ్యాపార సంస్థ. ఈ కంపెనీ అక్టోబర్ 31, 1969 న ఆరంభించబడినది, 1962 లో సామ్ వాల్టన్ స్థాపించిన ఈ కంపెనీ 1972 లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లొ వర్తకం ప్రారంభించింది. దీని ప్రధాన కార్యాలయం బెన్టన్ విల్, ఆర్కాన్సాలొ ఉంది. వాల్ మార్ట్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అతి పెద్ద చిల్లర సరుకుల వ్యాపార సంస్ఠగా ఉంది. 2009 లో, కిరాణా వ్యాపారం నుంచి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో $ 258 బిలియన్ల అమ్మకాలు జరిపింది. ఇది మొత్జం అమ్మకాల్లొ 51%. అంతేకాక ఇది ఉత్తర అమెరికాలో సామ్స్ క్లబ్ టోకు గిడ్డంగులను (హోల్ సేల్ వేర్ హౌస్) నిర్వహిస్తోంది.

వాల్ మార్టుకు 55 వివిధ పేర్లతొ, 15 దేశాలలో 8.500 దుకాణాలు ఉన్నాయి. ఈ కంపెనీ 50 సంయుక్త రాష్ట్రాలు మరియు ప్యూర్టో రికో సహా, యునైటెడ్ స్టేట్స్ లో తన సొంత పేరుతో వ్యాపారం నిర్వహిస్తోంది. ఇది భారతదేశం లో బెస్ట్ ప్రైస్ గా (ఇది సామ్స్ క్లబ్ వంటిది), జపాన్ లో సేయుగా, యునైటెడ్ కింగ్డమ్ లో ఆస్డాగా, మరియు మెక్సికో లో వాల్-మెక్స్ గా పనిచేస్తుంది . ఆర్జెంటినా, బ్రెజిల్, మరియు కెనడా లో కార్యకలాపాలకు ఇది పూర్తిగా యజమాని. ఉత్తర అమెరికా వెలుపల వాల్ మార్ట్ యొక్క పెట్టుబడులు మిశ్రమ ఫలితాలను కలిగివున్నాయి: యునైటెడ్ కింగ్డమ్, దక్షిణ అమెరికా మరియు చైనా, దాని కార్యకలాపాలు అత్యంత విజయవంతమైయ్యాయి, అయితే జర్మని మరియు దక్షిణ కొరియా లో సంస్థలు విజయవంతం కాలేదు.

[మార్చు] చరిత్ర

అర్కాన్సాస్ కు చెందిన వ్యాపారవేత్త సామ్ వాల్టన్ , జూన్ 3, 1940న ఐయోవా లొని దేస్ మొయిన్స్ నగరంలొని ఒక జెసి పెన్ని దుకాణం వద్ద పని ఆరంభించి, తన రిటైల్ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ ఉద్యొగము 18 నెలల పాటు కొనసాగింది. 1945 లో, అతను బెన్ ఫ్రాంక్లిన్ అను దుకాణాల యాజమాని బట్లర్ బ్రదర్స్ ను కలుసుకున్నారు. వారి సహకారంతొ అర్కాన్సా లోని న్యూపోర్ట్ నగరంలొ ఒక దుకాణం ప్రారంభించాడు.[1] .వాల్టన్, న్యూపోర్ట్ లో దుకాణాన్ని అంచనాలకు మించి అత్యంత విజయవంతంగా నడిపించారు.[2] . అయితే, దుకాణం ఉన్న స్థలం కౌలు పునరుద్ధరణ కోసం వచ్చినప్పుడు, వాల్టన్ పునరుద్ధరణ ఒప్పందానికి రాలేక పోయారు.అందుకోసం న్యూపోర్ట్ లో ఒక కొత్త స్థానాన్ని కనుగొలు చేయటానికి విఫల యత్నం చెసారు. బదులుగా, అతను బెంటన్విల్, అర్కాన్సాస్ లో ఒక కొత్త బెన్ ఫ్రాంక్లిన్ ఫ్రాంచైజ్ తెరిచారు. కానీ దీనిని "వాల్టన్స్ ఐదు అండ్ డైమ్" అని నామకరణం చెశారు. అక్కడ, అతను పోటీదారులు కంటే కొద్దిగా తక్కువ ధరలతొ అధిక అమ్మకాలు సాధించారు[3].

1962 జూలై 2న, ఆర్కాన్సాలోని రోజర్స్ నగరంలొని 719 వాల్నట్ ఏవన్యూ వద్ద మొదటి వాల్ మార్ట్- డిస్కౌంట్ సిటీని తెరిచారు. ఆ భవనంలో ఇప్పుడు ఒక హార్డ్వేర్ దుకాణం మరియు ఒక పురాతన వస్తువుల దుకాణం ఉన్నాయి. తదుపరి ఐదు సంవత్సరాలలో, ఈ సంస్థ ఆర్కాన్సా అంతటా 24 దుకాణాలతొ విస్తరించబడింది మరియు అమ్మకాలలో $12.6 మిలియన్ చేరుకుంది.[4].1968 ఆరొభంలో, అర్కాన్సాస్ వెలుపల సైక్ స్టోన్, మిస్సోరి మరియు క్లేర్మోర్, ఓక్లహోమా నగరాలలో తొలి దుకాణాలను తెరిచింది.[5]

[మార్చు] ఉదహరింపు

  1. Walton, Sam; Huey, John. Sam Walton: Made in America: My Story. New York: Bantam, 1993. ISBN 978-0-553-56283-5.
  2. Sam Walton: Great From the Start — HBS Working Knowledge
  3. Frank, T.A. "A Brief History of Wal-Mart." The Washington Monthly. April 1, 2006. Retrieved July 24, 2006.
  4. The Rise of Wal-Mart. Frontline: Is Wal-Mart Good for America? (2004-11-16). తీసుకొన్న తేదీ: 2007-09-19.
  5. "The Wal-Mart Timeline." Wal-Mart (published on walmartfacts.com). Retrieved July 24, 2006.

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు