వింధ్యరాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వింధ్యరాణి
(1948 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.పుల్లయ్య
కథ పింగళి నాగేంద్రరావు
తారాగణం డి.వి. సుబ్బారావు,
జి.వరలక్ష్మి,
రేలంగి వెంకట్రామయ్య,
పుష్పవల్లి,
పద్మనాభం
సంగీతం ఈమని శంకరశాస్త్రి, సాలూరి రాజేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
జి.వరలక్ష్మి
నృత్యాలు జయశంకర్
గీతరచన పింగళి నాగేంద్రరావు
సంభాషణలు పింగళి నాగేంద్రరావు
ఛాయాగ్రహణం సి.వి.రామకృష్ణన్
కళ కె.ఆర్.శర్మ
కూర్పు కె.ఆర్.కృష్ణస్వామి
నిర్మాణ సంస్థ వైజయంతీ ఫిలిమ్స్ లిమిటెడ్
పంపిణీ జెమిని
విడుదల తేదీ జనవరి 14, 1948
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

వింధ్యరాణి 1948, జనవరి 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. వైజయంతీ ఫిలిమ్స్ లిమిటెడ్ పతాకంలో సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డి.వి. సుబ్బారావు, జి.వరలక్ష్మి, రేలంగి వెంకట్రామయ్య, పుష్పవల్లి, పద్మనాభం ప్రధాన పాత్రల్లో నటించగా, ఈమని శంకరశాస్త్రి, సాలూరి రాజేశ్వరరావు సంగీతం అందించారు. పింగళి నాగేంద్రరావు రాసిన నాటకం ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.[1][2][3]

కథ[మార్చు]

దుర్జయ వింధ్య రాజ్యానికి చెందిన తనఅన్నయ్య మహారాజా జయవీరను చంపి సింహాసనాన్ని ఆక్రమించాడు. శతామిత్ర రహస్యంగా యువరాజు శివశ్రీని చూసుకుంటూ, ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తుంటుంది. అవంతి ఒక సామంత రాజు కుమార్తె. ఆమె పురుషులను ద్వేషిస్తుంటుంది. దుర్జయ ఆమెను రాజ్యానికి తీసుకువచ్చి రాణిగా ప్రకటిస్తాడు. శివశ్రీ, అవంతి ఒకరినొకరు ప్రేమించుకోవడం ప్రారంభిస్తారు. దుర్జయను చంపడానికి శతామిత్ర శివశ్రీకి సందేశం పంపుతుంది. తన ప్రేమ తన ప్రతీకారానికి అడ్డంకి అని భావించి అవంతికి తనను, తన ప్రేమను మరచిపోమని శివశ్రీ చెప్తాడు. అవంతి దుర్జయను చంపి, శివశ్రీని వివాహం చేసుకోవాలనుకుంటుంది. శివశ్రీ దుర్జయపై దాడి చేసి, అతడిని క్షమిస్తాడు. అవంతి దుర్జయను చంపి తప్పించుకుంటుంది. చివరికి, శివశ్రీ అవంతి వివాహం చేసుకుని వింధ్య రాజ్యాన్ని పరిపాలిస్తారు..

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. https://www.imdb.com/title/tt0255682/
  2. "Vindhyarani 1948". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-29.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  3. "Vindhyarani (1948)". Indiancine.ma. Retrieved 2020-08-29.

ఇతర లంకెలు[మార్చు]