వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2012)

వికీపీడియా నుండి

2012 సంవత్సరంలో "ఈ వారం వ్యాసం" శీర్షికలో ప్రదర్శించిన వ్యాసాలు

ప్రస్తుత ప్రతిపాదనలు, జాబితా కోసం వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి.


1వ వారం
Guntur.jpg

గుంటూరు జిల్లా


గుంటూరు జిల్లా 11,391 చ.కి.మీ. ల విస్తీర్ణములో వ్యాపించి, 48,89,230 (2011 గణన) జనాభా కలిగిఉన్నది. జిల్లాకు తూర్పు, ఈశాన్యాన కృష్ణా నది ప్రవహిస్తూ జిల్లాను కృష్ణా జిల్లా నుండి వేరు చేయుచున్నది. ఆగ్నేయాన బంగాళాఖాతము, దక్షిణాన ప్రకాశం జిల్లా, పశ్చిమాన మహబూబ్ నగర్ జిల్లా, మరియు వాయువ్యాన నల్గొండ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. దీని ముఖ్యపట్టణం గుంటూరు

ఈ జిల్లాకు అతి పురాతన చరిత్ర వుంది. మౌర్యులు, శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు పరిపాలించారు. పల్నాటి యుద్ధం ఇక్కడే జరిగింది. మొగలు సామ్రాజ్యం, నిజాం పాలన, ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ తరువాత మద్రాసు ప్రసిడెన్సీలో భాగమైనది. స్వాతంత్ర్య సమరంలో పెదనందిపాడు పన్నుల ఎగవేత, సైమన్ కమీషన్ వుద్యమం లాంటి ఎన్నో చారిత్రక ఘట్టాల ఈ జిల్లాలో జరిగాయి. స్వాతంత్ర్యం తరువాత ఆంధ్రరాష్ట్రంలో, ఆ తదుపరి ఆంధ్రప్రదేశ్ లో భాగమైంది.

విద్యా కేంద్రంగా అనాది నుండీ పేరు పొందింది. నాగార్జున విశ్వవిద్యాలయం, బాపట్ల వ్యవసాయ కళాశాల, పలు ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలు, పలు ప్రైవేట్ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు వున్నాయి. వరి, పొగాకు, ప్రత్తి మరియు మిర్చి జిల్లా యొక్క ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు. కృష్ణ ముఖ్య నది. చంద్రవంక, నాగులేరు, గుండ్లకమ్మ జిల్లాలో ముఖ్య వాగులు. జిల్లా లోని ముఖ్య చారిత్రక స్థలాలలో పేరుపొందినవి అమరావతి, భట్టిప్రోలు, ఉండవల్లి గుహలు మరియు గుంటూరు లోని మ్యూజియం,

చరిత్ర

గుంటూరు ప్రాంతంలో పాత రాతి యుగము నాటినుండి మానవుడు నివసించినాడనుటకు ఆధారములు కలవు. పాత రాతియుగపు (పేలియోలిథిక్) పనిముట్లు గుంటూరు జిల్లాలో దొరికాయి. వేంగీ చాళుక్య రాజు అయిన అమ్మరాజ (922-929) యొక్క శాసనాలలో గుంటూరు గురించిన ప్రధమ ప్రస్తావన ఉన్నది. 1147 మరియు 1158 నాటి రెండు శాసనాలలో కూడ గుంటూరు ప్రసక్తి ఉన్నది.


ఇంకా....పూర్తివ్యాసం పాతవి

2వ వారం
Brahmam garu.jpg

కాలజ్ఞాన తత్వాలు

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంధాలలో రచించి భద్రపరచారు. వీటినే కాలజ్ఞాన తత్వాలు అంటారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే. ఇలా చెప్పినవారు ప్రపంచమంతా లేకపోలేదు పఠిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో అనేక పేర్లు వెలుగులో ఉన్నా ప్రపంచమంతా పరిచయమున్న పేరు మాత్రం నోస్ట్రడామస్. ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం. ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలానే మర్మంగా ఉంటాయి. అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయ పరచుకుంటారు.

బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతీ నదీ తీరప్రాంతంలో జన్మించారనిన చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్రదేశంలో పలు ప్రదేశాలు చోటు చేసుకున్నాయి. అనేక దేవతలు కూడా చోటు చేసుకున్నారు. గాంధి మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచింపబడింది. ఆంగ్లేయ మరియు మహమ్మదీయ పాలన విజయనగర పతనం లాంటి చారిత్రక మరియు రాజకీయ పరిణామాలు సూచింప బడ్డాయి. ప్రకృతి ప్రకోపాలు వింతలూ చోద్యాలు బాబాల రాక అనేక విధాలుగా ప్రజలు వంచనకు గురికావడం లాంటి సామాజిక విషయాలు వీటిలో చోటు చేసుకున్నాయి. ఆయన కలియుగాంతాన తిరిగి వస్తానని పదేపదే పునరుద్ఘాటించాడు. ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు సూచింప బడ్డాయి. ఒక సందర్భంలో ఆయన పూర్వజన్మల వాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మడం సామాన్యులకు కష్టమే. వీర బ్రహ్మేంద్ర స్వామి కాల జ్ఞానాన్ని వివిధ శైలులను ఉపయోగించి కూర్చారు, అందులో శ్లోకాలు,పద్యాలు, వచనం మొదలైనవి.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

3వ వారం
India Train.jpg

భారతీయ రైల్వేలు భారత ప్రభుత్వ విభాగము. భారత దేశంలో రైల్వేలు మొదటిసారిగా 1853లో ప్రవేశపెట్టబడ్డాయి. 1947 (స్వతంత్రం వచ్చే) నాటికి దేశంలో మొత్తం 42 రైల్వే సంస్థలు నెలకొల్పబడి వున్నాయి. 1951లో ఈ సంస్థలన్నింటినీ కలుపుకొని భారత రైల్వే, ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్బవించింది. భారత రైల్వే దూర ప్రయాణాలకు మరియు నగరాలలో దగ్గరి ప్రయాణాలకు (సబర్బన్ (suburban) అనగా పట్టణపు పొలిమేరల వరకు) అవసరమైన రైళ్ళను నడుపుతోంది.

రైలు మార్గాలు భారతదేశపు నలుమూలలా విస్తరించి వున్నాయి. భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికి ఏకఛ్ఛత్రాధిపత్యం ఉంది. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. రైలు మార్గాలు మొత్తం దూరం సుమారుగా 1,14,500 కి.మీ. ఇది సుమారు 65,000 కి.మీ రూటుపై వుంది మరియు 7,500 స్టేషన్లు వున్నాయి. 2011 నాటికి రైల్వేల వద్ద 2,40,000 వాగన్లు 69,000 కోచ్‌లు, 9,000 ఇంజిన్లు వున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగి వున్న సంస్థలలొ భారతీయ రైల్వేది (సుమారు పదనాలుగు లక్షలు) ద్వితీయ స్థానము.

భారతీయ రైల్వే కంప్యూటరీకరణలో అన్నిటిలో ప్రథమ స్థానంలో వుంది. ముందస్తుగా ప్రయాణం ఖరారు చేసుకునేందుకు మరియు మార్పులు చేసుకునేందుకు సౌకర్యం అందిస్తోంది. ఈ విభాగాన్ని భారతీయ రైల్వే ఆహార నిర్వహణ మరియు పర్యాటక సంస్థ నిర్వహిస్తుంది. ఇది భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పని చేస్తూ భారత రైల్వే రవాణా వ్యవస్థను నిర్వహిస్తూ ఉంటుంది. రైల్వే మంత్రిత్వ శాఖ కేంద్ర రైల్వే మంత్రి (కేబినెట్ హోదా) నిర్వహణలో ఉండే రైల్వే విభాగం, రైల్వే బోర్డు కింద పని చేస్తుంది. దీనిని పరిపాలనా సౌలభ్యం కోసం 17 జోన్లుగా విభజించారు. ఇంకా…

4వ వారం
గుమ్మడి
Gummadi.jpg

తెలుగు సినిమా రంగములో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు (జ.జూలై 9, 1927 మ.జనవరి 26, 2010 ) తెలుగు చలనచిత్రరంగంలో ఐదు దశాబ్దాలకు పైగా అనుభవమున్న నటుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఈయన 500కు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు పోషించాడు. చలనచిత్ర రంగానికి ఈయన చేసిన సేవలను గుర్తిస్తూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.

గుమ్మడి వెంకటేశ్వరరావు అంటే తెలియని వారు తెలుగునాట ఉన్నారంటే అది అతిశయమే. అద్వితీయమైన గుణచిత్రనటనతో ఆయన తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ముద్రవేసుకున్నాడు. పౌరాణిక చిత్రాలు, సాంఘిక చిత్రాలు, జానపద చిత్రాలు, చారిత్రక చిత్రాలు ఏవిధమైన చిత్రమైనా అయన తనవేషంలో జీవించాడు. తండ్రిగా, అన్నగా, తాతగా వేషమేదైనా దానిని తన నటనతో పండించడం అతడికి కరతలామలకం. అన్ని రకాల వేషాలు ఆయన ధరించినా సాత్విక వేషాలలో ఆధిక్యత సాధించి ప్రేక్షకులను మెప్పించాడు. అయన తన పూర్తి పేరుతో కంటే ఇంటి పేరైన గుమ్మడి పేరుతోనే తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచి పోయాడు. ఆంధ్రుల పంచకట్టులోని హందాతనాన్ని ప్రతిబింబించిన ఏకైక నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు.

ఎన్ టి ఆర్ తో నటించిన తోడు దొంగలు (1954) మరియు మహామంత్రి తిమ్మరుసు (1962) సినిమాలు గుమ్మడికి బాగా గుర్తింపునిచ్చాయి. రాష్ట్రపతి బహమతి మొదటిదానికి రాగా, రెండవదానికి జాతీయ స్థాయిలో ఉత్తమ సహ నటుడు గా ఎంపికయ్యాడు. మాయా బజార్ (1957), మా ఇంటి మహలక్ష్మి (1959), కులదైవం (1960), కుల గోత్రాలు(1962), జ్యోతి(1977), నెలవంక (1981), మరో మలుపు(1982),ఏకలవ్య(1982), ఈ చరిత్ర ఏ సిరాతో? (1982), గాజు బొమ్మలు (1983), పెళ్లి పుస్తకం (1991) గుమ్మడికి పేరుతెచ్చిన సినిమాలలో కొన్ని. తెలుగు విశ్వవిద్యాలయం మహామంత్రి తిమ్మరుసు(1962)లో కధానాయకుడి పాత్రకు జీవం పోసిన గుమ్మడిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. ఇంకా…

5వ వారం
సింధు లోయ నాగరికత
వెలికి తీయబడ్డ మొహంజో-దారో శిథిలాలు

సింధు లోయ నాగరికత (క్రీ.పూ2700 - క్రీ.పూ.1750) ప్రస్తుత పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా మరియు సింధూ నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాధమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్ మరియు పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది. ఈ నాగరికతకు చెందిన హరప్పా నగరము మొదటగా వెలికి తీయుటచే ఇది సింధులోయ హరప్పా నాగరికత అని పిలువబడుతున్నది. సింధూ నాగరికత మెసొపొటేమియా మరియు ప్రాచీన ఈజిప్టు కంచు యుగాలకు సమకాలికమైన అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటి. అత్యంత అభివృద్ధి చెందిన దశగా గుర్తించబడిన నాగరికతను హరప్పా నాగరికతగా పేర్కొంటారు. ఈ నాగరికతకు సంబంధించిన తవ్వకాలు 1920వ సంవత్సరం నుండి జరుగుతున్నా అత్యంత ప్రాముఖ్యత కలిగిన వివరాలు మాత్రం 1999లోనే వెలువడ్డాయి.

ఈ నాగరికతనే ఒక్కోసారి సింధూ ఘగ్గర్-హక్రా నాగరికత అని లేదా సింధూ-సరస్వతి నాగరికతగా కూడా అభివర్ణిస్తారు. ఋగ్వేదంలో వర్ణించబడిన సరస్వతి నదిని ఘగ్గర్ హక్రా నదిగా గుర్తించడం వల్ల ఇలా పిలవబడుతున్నది.

సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందిన పట్టణపు నాగరికత ఈ ప్రాంతంలో విలసిల్లినట్లుగా స్పష్టమైన చారిత్రక ఆధారాలు ఇక్కడి త్రవ్వకాల్లో దొరికాయి. ఇక్కడి మునిసిపల్ టౌన్ ప్లానింగ్ ప్రమాణాలను పరిశీలిస్తే వీరు పట్టణాలను అభివృద్ధి చేయడంలో సిద్ధహస్తులని, పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చేవారని తెలుస్తోంది. ఈ కాలంలో జీవించిన ప్రజలు పొడవు, ద్రవ్యరాశి, కాలాలను మొదలైన రాశులను చాలావరకు ఖచ్చితంగా కొలవగలిగినట్లు ఆధారాలున్నాయి. అనేక రకాలైన శిల్పాలు, ముద్రలు, పింగాణీ మరియు మట్టి పాత్రలు, ఆభరణాలు, మానవశరీర శాస్త్రాన్ని వివరంగా విపులీకరించే అనేక టెర్రాకోట బొమ్మలు, ఇత్తడి వస్తువులు మొదలైనవి ఎన్నో త్రవ్వకాలు జరిపిన ప్రదేశంలో లభించాయి. సింధు లోయ ఆహారోత్పత్తిలో స్వయం సంవృద్ధి కలిగి ఉండేదని తెలుస్తోంది. మేర్గర్ ప్రజలు ఆ ప్రాంతంలోనే పండించిన గోధుమలు, బార్లీలు వాడినట్లు ఋజువైంది. 400కి (600 దాకా ఉండవచ్చునని కొద్దిమంది భావన) పైగా గుర్తులు వివిధ ముద్రల్లోనూ, పింగాణీ పాత్రలపైనా, ఇంకా కొన్ని వస్తువుల పైనా కనుగొనబడ్డాయి. ధోలవిరా పట్టణానికి లోగడ ఉన్న కోట ద్వారం వద్ద వేలాడదీసిన పలక మీద కొన్ని గుర్తులు ముద్రించబడి ఉన్నవి.

క్రీ.పూ 1800 వచ్చేసరికి నెమ్మదిగా ఈ నాగరికత బలహీనపడటం ఆరంభించింది. క్రీ.పూ 1700 శతాబ్దానికల్లా దాదాపు అన్ని నగరాలూ పాడుబడిపోయాయి. కానీ సింధూ లోయ నాగరికత ఉన్నట్టుండి మాయమైపోలేదు. దీని ప్రభావాలు తరువాత వచ్చిన నాగరికతల్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా…

6వ వారం
ఎలెక్ట్రికల్ ఇంజనీర్లు సంక్లిష్టమైన విద్యుత్ వ్యవస్థలతో పనిచేస్తారు

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్

ఎలెక్ట్రిసిటీ, ఎలెక్ట్రానిక్స్ మరియు ఎలెక్ట్రోమాగ్నెటిజమ్ విషయాలకు సంబంధించన అధ్యయనమే ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ . పందొమ్మిదవ శతాబ్దం చివరి దశలో ఎలెక్ట్రికల్ టెలిగ్రాప్ మరియు విద్యుత్ శక్తి సరఫరా వాణిజ్యపరంగా ప్రారంభంతో ఇది ప్రత్యేక వృత్తిగా గుర్తింపు పొందింది. దీనిలో పవర్, ఎలెక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్ ప్రాసెసింగ్ మరియు టెలికమ్యూనికేషన్ అనే ఉపవిభాగాలు వున్నాయి. భారతదేశంలో ఎలెక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ తక్కువస్థాయి వ్యవస్థలను కంప్యూటర్ మరియు ఇంటిగ్రేటెడ్ సర్కూట్స్ తో పనిని సూచించడానికి వాడతారు, ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్, భారీ స్థాయి వ్యవస్థలను అనగా విద్యుత్ శక్తి వుత్పాదన మరియు పంపిణీ, యంత్రాల నియంత్రణ వంటి వాటికి వాడతారు.

17వశతాబ్ది తొలి దశనుండి శాస్త్రవేత్తలు విద్యుత్ పై అధ్యయనం చేసేవారు. అలెస్సాండ్రో వోల్టా 1775 లో స్థితి విద్యుత్ చార్జీ తయారీ యంత్రం, 1800లో వోల్టాయిక్ పైల్ అనగా ఆధునిక బ్యాటరీకి మూలరూపం తయారు చేశాడు. జార్జి ఓమ్ 1827 లో కరెంటుకి వోల్టేజికి సంబంధాన్ని కనుగొన్నాడు. 1831 లో , మైఖేల్ ఫారడే ,ఎలెక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మరియు , 1873లో జేమ్స్ క్లార్క్ మాక్స్వెల్ విద్యదయాస్కాంత సూత్రాలు కనుగొన్నాడు. 1882 లో థామస్ అల్వా ఎడిసన్ రపంచంలో తొలిసారి విద్యుత్ ప్రసార నెట్వర్క్ తయారుచేశాడు. 1887 లో, నికోలా టెస్లా ఆల్టర్నేటింగ్ కరెంట్ అనబడే విద్యుత్ ప్రసార విధానాన్ని కనుగొన్నాడు. ఇది తరువాత ప్రాచుర్యం పొందింది. వీరికృషి తో ఇండక్షన్ మోటార్ , టెలిగ్రాఫ్ లాంటివి అభివృద్ధి పరచబడ్డాయి.

చాలా మంది శాస్త్రవేత్తలు రేడియో అభివృద్ధికి కృషిచేసారు. 1897 లో కార్ల్ ఫెర్డినాండ్ బ్రాన్ కేథోడ్ రే ట్యూబ్ ని ఆసిలోస్కోప్ కొరకు కనుగొన్నాడు. ఇదే తరువాత టెలివిజన్ కి దారితీసింది. 1895 లో గుగ్లియెల్మో మార్కోని ఒకటిన్నర మైళ్లదూరం వైర్లెస్ సిగ్నల్ ను పంపించాడు. 1941 లో కొన్రాడ్ జూస్ Z3 కంప్యూటర్ తయారు చేశాడు. ట్రాన్సిస్టర్ ను 1947 లో విలియమ్ బి షాక్లీ జాన్ బార్డీన్ మరియు వాల్టర్ బ్రాటెయిన్ తయారు చేశారు. 1958 లో జాక్ కిల్బీ మరియు 1959 లో రాబర్ట్ నోయిస్ (వేర్వేరుగా) ఒకటి కంటే ఎక్కువ ట్రాన్సిస్టర్లు వుండే సమీకృత వలయం (ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్) 1968 లో టెడ్ హాఫ్ నేతృత్వంలో ఇంటెల్ మైక్రోప్రాసెసర్ తయారీచేయడంతో పర్సనల్ కంప్యూటర్ తయారీకి మార్గం సుగమం అయ్యింది. ఇంకా…

7వ వారం
Flag of Bhutan.svg

భూటాన్ రాజ్యం దక్షిణాసియాలోని భూపర్యవేష్టిత (ల్యాండ్ లాక్) దేశం. ఇది హిమాలయాల తూర్పు వైపు ఆఖరు భాగంలో హిమాలయ పర్వత శ్రేణుల మధ్య ఉంది. భూటాన్‌కు దక్షిణ, తూర్పు మరియు పడమట సరిహద్దులలో భారత భూభాగము, ఉత్తర సరిహద్దులలో చైనా దేశంలో భాగమైన టిబెట్ ఉన్నాయి. భూటాన్‌ను నేపాల్ నుండి భారత దేశంలోని రాష్ట్రమైన సిక్కిం వేరుచేస్తుంది. భూటానీయులు తమ దేశాన్ని డ్రక్ యూ (ఉరుముల డ్రాగన్ భూమి) అని పిలుస్తారు.

భూటాన్ ఒకప్పుడు ప్రంచానికంతటికీ దూరంగా ఏకాంతంగా ఉండే దేశాలలో ఒకటి. కానీ ప్రస్తుతం దేశంలో సాంకేతిక మరియు ఇతర అభివృద్ది కారణంగా ప్రపంచానికి భూటాన్ ద్వారాలు తెరువబడ్డాయి. ఇంటర్‌నెట్ (అంతర్జాలం), మొబైల్ ఫోన్లు, కేబుల్ టీవి కార్యక్రమాలు మరియు అంతర్జాతీయ విమానసేవలు భూటాన్‌ను ప్రపంచంతో అనుసంధానం చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. సనాతన ధర్మాలు సంస్కృతిని కాపాడుతూ అధునికతకు మారుతూ సమతూకాన్ని కాపాడుతూ భూటాన్ అభివృద్ధి పధంలోకి నడుస్తూ ఉంది. భూటాన్ పరిసరాలకు కీడు కలిగించే కార్యాలకు అనుమతి లభించదు. భూటాన్ ప్రభుత్వం సంస్కృతి రక్షణ, పరిసరాల రక్షణ, తమ ప్రత్యేకత కాపాడటానికి ప్రాముఖ్యత నిస్తుంది. 2000లో భూటాన్ వ్యాపార వారోత్సవాల (బిజినెస్ వీక్) తరవాత భూటాన్ అత్యంత ఆనందకరమైన దేశంగా వరల్డ్ మ్యాప్ ఆఫ్ హ్యాపీనెస్ 2000 సంవత్సరపు పరిశీలన ద్వారా గుర్తించబడింది.

భూటాన్ భూభాగం దక్షిణంలో సమశీతోష్ణ మండల మైదానాలు, ఉత్తరాన ఉన్న హిమాలయ శిఖరాలు వీటి ఎత్తు సముద్ర మట్టానికి 7,000 మీటర్లు (23,000 అడుగులు) ఉంటుంది. భూటాన్ దేశం యొక్క మతం వజ్రయాన బౌద్దం. బుద్దమతావలంబీకుల సంఖ్య అధికం. రెండవ స్థానంలో హిందూ మతం ఉంది. రాజధాని పెద్దనగరం తింఫూ. దీర్ఘ కాలిక రాజపాలన తరవాత 2008 మార్చిలో మొట్టమొదటగా ప్రజా ప్రభుత్వం అమలు చేయడానికి కావలసిన ఎన్నికలు నిర్వహించింది. అంతర్జాతీయ అసోసియేషన్ లలో భూటాన్‌కు ఐక్యరాజ్య సమితి సభ్యత్వం ఉంది, ఆసియా అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్‌లో భూటాన్‌కు సభ్యత్వం ఉంది. పరిపాలనలో ఎక్కువ రోజులు ఉన్న సౌత్ ఆసియా దేశాలలో భూటాన్ ఆఖరుది. అసియాలో ఎప్పుడూ కాలనీ ఆధీనంలో లేని కొన్ని దేశాలలో భూటాన్ ఒకటి. ఇంకా…

8వ వారం
నాట్య ముద్రలో ఈశ్వరుడు

మహాశివరాత్రి

హిందూ మతం పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది.

ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలొనర్చి, ఉపవాసం ఉండి రాత్రి అంతయు జాగరణము చేసి మరునాడు భోజనం చేయుదురు. రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుదురు. అన్ని శివక్షేత్రము లందు ఈ ఉత్సవము గొప్పగా జరుగును. పూర్వం శ్రీశైలం క్షేత్రమందు జరుగు ఉత్సవమును పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రము లో విపులముగా వర్ణించాడు. శైవులు ధరించు భస్మము/విభూతి తయారుచేయుటకు ఈనాడు పవిత్రముగా భావిస్తారు.

మహాశివ రాత్రి వృత్తాంతం

మహాశివ రాత్రి మహాత్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది.

గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో (నేటి అలహాబాదు) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణమహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పుమనగా అతను తనకు గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాధను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాధను తెలుపుమంటాడు.

అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా , నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.
ఇంకా…

9వ వారం
ప్రముఖ వ్యంగ్యచిత్రకారుడు జయదేవ్ గీసిన చిత్రం

జయదేవ్ ప్రముఖ తెలుగు వ్యంగ్య చిత్రకారుడు. 1940 సెప్టెంబర్ 13న కడపలో జన్మించాడు. ఇతని పూర్తి పేరు సజ్జా జయదేవ్ బాబు. 1959వ సంవత్సరం నుండి కార్టూన్లు (వ్యంగ్య చిత్రాలు) చిత్రిస్తూ ఉన్నాడు. గీతల్లో ఒడుపే కార్టూన్ కు ప్రాణం అన్నమాటను నిత్య సత్యం చేస్తూంటాయి ఆయన కార్టూన్లు. ఈయన తన బాల్యంలో ఎక్కువ భాగం మదరాసు లోని పాత చాకలి పేటలో గడిపాడు. చదువుకొనే రోజుల్లోనే స్వతహాగా చిత్రాలు గీయటం ప్రారంభించాడు. ఆచార్యుడిగా జంతుశాస్త్రాన్ని మదరాసులోని సర్ త్యాగరాయ కాలేజీ లో 1997 వరకు బోధించాడు.

ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రికలో 1959లో మొదలు పెట్టి, తెలుగులో వచ్చిన దాదాపు అన్ని వార, మాస పత్రికలన్నిటిలోనూ తన వ్యంగ్య చిత్రాలను ప్రచురించాడు. అన్ని ప్రముఖ పత్రికలు, ముఖ్యంగా యువ దీపావళి సంచికలలో ఈయన కార్టూన్లు లేకుండా ప్రచురించబడేవి కాదు. 2002 వరకు ఆయన చిత్రీకరించిన వ్యంగ్య చిత్రాల సంఖ్య 40,000 పైగా ఉన్నాయి. జయదేవ్ కార్టూన్లతో వుత్తేజంపొంది ఆయనకు ఏకలవ్య శిష్యులుగా చాలా మంది తెలుగు కార్టూనిష్టులు ఏర్పడ్డారు. వారినందరిని వీలైనంతవరకు ముఖాముఖిగా కలిసి ప్రోత్సహించేవాడు. కార్టూన్ల సంకలనాలు, "గ్లాచ్చూ మీచ్యూ" అనే ఆత్మకధ రచించాడు. వివిధ సంస్థలచే సత్కరించబడ్డాడు. ధూమపానం వల్ల వచ్చే దుష్పరిణామాలను గురించిసామాజిక స్పృహ కల్గించే వ్యంగ్య చిత్రాలు కూడా గీశాడు. వ్యంగ్యచిత్రాల కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేశాడు. నేపాళం, భూపాళం, (తాగుబోతు) బ్రహ్మం, మిస్టర్ నో, బాబాయ్-అబ్బాయ్ వంటి పాత్రలను కార్టూన్లలో సృష్టించి పాఠకులను అలరించాడు. అంతర్జాలంలో వ్యంగ్యచిత్రాల వెబ్సైట్ లను నిర్వహించాడు. తోటి కార్టూనిస్టులను కూడా అంతర్జాలాన్ని అధునిక సాంకేతికతలను వాడటానికి ప్రోత్సహించాడు. (ఇంకా…)

10వ వారం
Suhani kalita.jpg

హోలీ అనేది రంగుల పండుగ, వసంత కాలంలో వచ్చే ఈ హిందువుల పండుగను భారత దేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్ లలోనూ మరియు ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారత దేశంలోని పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా (దోల్ జాత్రా) లేదా బసంత-ఉత్సబ్ (వసంతోత్సవ పండుగ) అని అంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథుర, బృందావనం, నందగావ్ మరియు బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగ సందర్బంగా ఈ ప్రదేశాలు 16 రోజులు పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి.

దుల్‌హేతి, ధులండి మరియు ధులెండి అని కూడా పిలిచే ముఖ్యమైన రోజు హోలీ ఉత్సవ రోజున ప్రజలు రంగుల పొడిని మరియు రంగు నీళ్ళను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు. ముందు రోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోలిక దహన్ (హోలికను కాల్చడం) లేదా చోటీ హోలీ (చిన్న హోలీ) అని అంటారు. హిరణ్యకశిపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటలలో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు అందుకే భోగి మంటలు అంటిస్తారు. హోలిక ఈ మంటలలో దహనమయ్యింది కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు, అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు. ఆంధ్ర ప్రదేశ్లో హోలిక దహన్‌ను కామ దహనం అని అంటారు.

సాధారణంగా శీతాకాలం చివర్లో, ఫిబ్రవరి లేదా మార్చి నెలల తదుపరి వారాల్లో, వచ్చే చివరి ఫాల్గుణమాసము (ఫిబ్రవరి/మార్చి) (ఫాల్గుణ పూర్ణిమ), పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. కొన్ని రోజుల తరువాత, ఫాల్గుణ బహుళ పంచమి (పౌర్ణమికి ఐదవ రోజు)న పండుగ ముగింపున సూచిస్తూ రంగులతో రంగ పంచమి ఉత్సవాన్ని జరుపుకుంటారు. (ఇంకా…)

11వ వారం
కుబనెల్లే మిరపకాయలు

మిరపకాయ నాహూటల్‌ చిల్లీ నుంచి ఉద్భవించిన ఈ పదాన్ని చిల్లీ పెప్పర్ మరియు చిల్లీ అని అనేక రూపాల్లో సంభోదిస్తుంటారు. ఇది సొలనేసి కుటుంబం, మిరప కాప్సికమ్ తరగతికి చెందిన మొక్కలకు కాచే కాయ.

మిరపకాయలనేవి మొదట అమెరికాల్లో వెలుగుచూశాయి. అమెరికాలో యూరోపియన్లు కాలిడిన తర్వాత, మిరపకాయలకు సంబంధించిన అనేక రకాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో పాటు ఆహారం మరియు ఔషధాల తయారీల్లో ఉపయోగించడం ప్రారంభమైంది. భారతదేశంలో గుంటూరు మిరపపంటకు ప్రసిద్ధి. ఇవి ఘాటుగా వుంటాయి. మిరపకాయలను వంటలలో, వైద్యపరంగా, రక్షణకు, మనస్సుని దిటవు పరచుకోటానికి , ఆహర రక్షణకు వాడుతారు.ఇంకా…

12వ వారం
ఉగాది పచ్చడి

ఉగాది తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన్నే లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవస్థానములకు వెళ్ళి పూజలు చేయిస్తారు. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.

ఈ పండగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతోనూ, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు. (ఇంకా…)

13వ వారం
Female hands.jpg

చేయి అనగా మానవులు, చింపాంజీలు, కోతులు మరియు లెమూర్లకు గల శరీరభాగమునకు వేళ్లు కలబాహ్యంగము. కోలా చేతికి ఎదురెదురుగా వున్న రెండు బొటనవ్రేళ్లు వుంటాయి కాబట్టి దాని శరీరభాగాన్ని కూడా చేయి లేక 'పా'లు అంటారు.

చుట్టూవున్న పర్యావరణంతో క్రియాశీలమవటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇవి స్థూల కదిల్చే నైపుణ్యాలు ( పెద్ద వస్తువుని పట్టుకోవడం)మరియు సూక్ష్మ కదిల్చే నైపుణ్యాలు (చిన్న రాయిని పట్టుకోవడం) ప్రదర్శించడంలో ప్రముఖపాత్ర వహిస్తాయి. చేతి వేళ్లమొనలు, చాలా నాడీకొనలతో వుండి, స్పర్శకి ప్రధానపాత్ర వహిస్తాయి మరియు స్థానాన్ని తెలియచేయడంలో శరీర అంగాలలోముఖ్యమైనవి. ఇతర జతగావుండే శరీరభాగాలవలె, ప్రతి చేయి దాని వ్యతిరేఖ దిశలోని మెదడుతో నియంత్రించబడుతుంది. చేతివాటం మెదడు పనిచేసేతీరుని తెలుపుతుంది,

మానవుని చేతిలో మణికట్టు, అరచేయి మరియు వేళ్ళు చేతిలోని ప్రధానమైన భాగాలు. మన రెండు చేతులు ఎముకలు, కీళ్ళు, కండరాలు, నాడులు, రక్తనాళాలు మొదలైన వాటితో చేయబడినవి.మానవుని చేతిలో 27 ఎముకలు, వాటిలో వేళ్లకు 14 ఫలాంజిస్ (దగ్గరి, మద్యస్థ మరియు దూరపు) ఎముకలు వుంటాయి. మెటాకార్పల్ ఎముకలు వేళ్లని మణికట్టుకి కలుపుతుంది. ఇవి ఐదు. (ఇంకా…)

14వ వారం
N-s-dos-passos-19.jpg

గుడ్ ఫ్రైడే ఇది క్రీస్తును శిలువ వెయ్యటం మరియు కాల్వరి వద్ద అతని మరణం యొక్క జ్ఞాపకాలను గుర్తుచేసుకొనే క్రైస్తవమత విశ్వాసకులకి ప్రాధమికంగా ఒక సెలవు దినం. ఈ సెలవు దినం పవిత్ర వారం సమయంలో పవిత్రమైన మూడు రోజులలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించబడుతుంది మరియు తరచుగా పాసోవర్ పై యూదుల అభిప్రాయంతో సరిపోలుతుంది. హోలీ ఫ్రైడే , బ్లాక్ ఫ్రైడే లేదా గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలువబడుతుంది,

సువార్తల ఆధారంగా క్రీస్తును శిలువ వెయ్యటం దాదాపుగా శుక్రవారమే జరిగింది. రెండు వేర్వేరు సమూహాలచే గుడ్ ఫ్రైడే యొక్క సంవత్సరం క్రీ.శ. 33 గా అంచనా వెయ్యబడింది మరియు వాస్తవానికి బైబిలికల్ మరియు జూలియన్ క్యాలెండర్ల మధ్య ఉన్న వ్యత్యాసాలు మరియు చంద్రవంక ద్వారా ఐజాక్ న్యూటన్ చే క్రీ.శ. 34 గా చెప్పబడింది. మూడవ విధానం ఏంటంటే, శిలువ వేసినప్పుడు చంద్రుని కాంతి తగ్గిపోయి చీకటి అవ్వటం మరియు అదే తేదీన అనగా శుక్రవారం ఏప్రిల్ 3, క్రీ.శ. 33 న గ్రహణం ఏర్పడటం (2:20 చట్టాలలో "మూన్ ఆఫ్ బ్లడ్" పై అపోస్తిల్ పీటర్ యొక్క సూచనతో సంబంధం కలిగి ఉంటుంది) ఆధారంగా చెప్పబడిన ఒక పూర్తి వైవిధ్యమైన ఖగోళపరమైన విధానం. (ఇంకా…)


15వ వారం
Anna Hazare.jpg

అన్నా హజారే గా సుప్రసిద్ధుడయిన కిసాన్ బాబూరావ్ హజారే , ఒక భారతీయ సామాజిక కార్యకర్త, భారతదేశం లోని మహారాష్ట్రలో ఉన్న అహ్మద్‌నగర్‌ జిల్లాలో రాలెగాన్ సిద్ధి గ్రామ అభివృద్ధికి చేసిన తోడ్పాటుకు ఈయన ప్రత్యేక గుర్తింపు పొందారు, దీన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటానికి తను చేసిన ప్రయత్నాలకు గుర్తుగా 1990 లొ పద్మశ్రీ అవార్డు తోనూ మరియు 1992లో భారత ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై పోరాడేందుకోసం తను చేపట్టిన కృషిలో భాగంగా అన్నా, భారత్‌లో సమాచార హక్కు లక్ష్యం కోసం పాటుపడిన ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా నిలిచారు.

5 ఏప్రిల్ 2011 న జనలోక్పాల్ బిల్లుకు పోలినట్లు లోక్పాల్ అవినీతి నిరోధక బిల్లు తేవాలని ప్రభుత్వాన్ని కోరుతూ నిరవధిక నిరాహరదీక్ష చేపట్టాడు. దేశమంతా దీనికి మద్దతులభించింది. 9 ఏప్రిల్ 2011 న ప్రభుత్వము అంగీకరించినతరువాత నిరాహారదీక్ష విరమించాడు. ప్రభుత్వం ఒక పౌరసమాజం ప్రతినిధులు మరియు ప్రభుత్వ ప్రతినిధులతో సంయక్త కమిటీ ఏర్పాటుచేసింది. 2011 సంవత్సరానికి విదేశవిధానాల పత్రిక ప్రపంచంలో 100 మేధావేత్తలలో ఒకరిగా నిర్ణయించింది.అదే సంవత్సరంలో ముంబైలో అత్యంత ప్రభావశీలిగా డిఎన్ఎ పత్రిక గుర్తించింది. అతని న్యాయ నిర్ణయంలో నియంతృత్వ ధోరణులు (ఉదా అవినీతి ఉద్యోగస్తులను వురితీయాలనడం, కుటుంబ సంక్షేమానికి బలవంతపు గర్భనిరోధకఆపరేషన్ల అమలుపరచాలనటం) విమర్శలకు లోనయ్యాయి.(ఇంకా…)

16వ వారం
అమరావతి కథల సంపుటి ముఖ చిత్రం

అమరావతి కధలు సత్యం శంకరమంచి రచించిన తెలుగు కధాసంపుటి . అమరావతి గ్రామం, అక్కడి ప్రజలు ఇతివృత్తంగా రచించిన ఈ 100 కధలు మొదట ఆంధ్రజ్యోతి వారపత్రికలో సుమారు రెండు సంవత్సరాలు 1975-77 మధ్య ప్రచురించబడ్డాయి.ఏ కథా కూడ ఒక పేజి కంటే ఎక్కువ ఉండేది కాదు. అప్పట్లో ముద్రణ కాయితం కరువు ఉండేది. ఆ కారణాన,ఆంధ్రజ్యోతి పత్రిక ప్రస్తుతపు వారపత్రిక సైజులో కాకుండా అందులో సగం సైజులో అంటే చందమామ మాసపత్రిక సైజులో కొన్నాళ్ళు వచ్చింది. కారణమేమయినా, కథలన్నీ కూడ రచయిత చక్కగా కుదించి వ్రాశారు. అంత చిన్నకథలో కూడ ఎంతో కథా శిల్పాన్ని ప్రదర్శించిన రచయిత సత్యం శంకరమంచి అభినందనీయులు. శంకరమంచి సత్యంచక్కని తేట తెలుగులో, సరళమైన భాషలో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించుతూ, ప్రజల వేషభాషలు, ఆచారవ్యవహారాలు, కష్టసుఖాలు, జీవన విధానం గురించి విపులం వ్రాసాడు .

ఈ కథా సంపుటికి 1979వ సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ప్రముఖ సినీ దర్శకులు శ్యామ్ బెనగళ్ ఈ కథలను హిందీలో ధారావాహికగా చిత్రీకరించారు. ఈ ధారావాహిక దూరదర్శన్ లో ప్రసారం అయ్యి ఈ కథా సంపుటి ప్రాచుర్యం మరింత పెంచింది. ఈ ధారావాహిక అమరావతిలోనే చిత్రీకరించబడటం విశేషం.

17వ వారం
[[File:PrashantiNilayam1.jpg right|ప్రశాంతి నిలయం, పుట్టపర్తి, ఆం.ప్ర.]]

ప్రశాంతి నిలయం సత్య సాయి బాబా యొక్క ముఖ్య ఆశ్రమం పేరు. ఇది సముద్రమట్టమునుండి 800 మీటర్ల (2624 అడుగులు) ఎత్తులో ఉంది. "ప్రశాంతి నిలయము యొక్క పట్టణవాటిక శ్రీ సత్య సాయి బాబా జన్మించిన పుట్టపర్తి అనే గ్రామములో ఉంది. ఈ ప్రదేశము దక్షిణ భారతదేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురము జిల్లాలో ఒక భాగము. ప్రశాంతి నిలయం అంటే "మహోన్నత శాంతి యొక్క దామము". జీవించి ఉన్నప్పుడు సత్య సాయి ఈ ఆశ్రమములో ప్రతిరోజూ వేలకొలది తన భక్తులకు దర్శనము ఇచ్చేవాడు. ఆ సమయంలో సత్య సాయి బాబాసాధారణంగా జూన్ మొదలు నుండి మార్చ్ మధ్య వరకు ప్రశాంతి నిలయములో ఉండేవాడు. ఆయన గతించాక ఇక్కడి సాయి కుల్వంత్ హాల్ లో సమాధి చేయబడ్డాడు. (ఇంకా…)


18వ వారం
Mahabubnagar Toorpu Kaman.JPG

మహబూబ్ నగర్ జిల్లాకేంద్ర స్థానమైన మహబూబ్ నగర్ పట్టణం భౌగోళికంగా జిల్లా మధ్యలో రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు నైరుతి వైపున 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. చుట్టూ ఎత్తయిన కొండలు, గుట్టలచే ఆవరించబడిన ఈ పట్టణానికి రవాణా పరంగా రోడ్డు మరియు రైలు మార్గాన మంచి వసతులున్నాయి. వ్యవసాయికంగా మరియు పారిశ్రామికంగా ఈ పట్టణం అంతగా అభివృద్ధి చెందలేదు. పట్టణ పాలన స్పెషల్ గ్రేడు పురపాలక సంఘంచే నిర్వహించబడుతుంది. జిల్లా కేంద్రం కావడంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పట్టణంలో ఉన్నాయి. పాలమూరు అని కూడా పిల్వబడే ఈ పట్టణానికి చరిత్రలో రుక్కమ్మపేట అని పేరు ఉండేది. 1883 నుండి ఈ పట్టణం జిల్లా కేంద్రంగా సేవలందిస్తున్నది. (ఇంకా…) IT/S VERY GOOD BOY


19వ వారం
CottonPlant.JPG

ప్రత్తి అనేది మెత్తని, మృదువైన దారముగా అవగల పీచు పదార్థము. నూలును తయారు చేయుటకు ఉపయోగించే 'ప్రత్తి' లేదా 'పత్తి' (దూది) ఈ మొక్కలనుండే లభిస్తుంది. ఇది వాటి విత్తనాల చుట్టూ ఒక బంతిలాగా ఏర్పడుతుంది. ప్రత్తి మొక్క అనేది అమెరికా, ఆఫ్రికా మరియు భారత దేశాలకు చెందిన పొద లాంటి మొక్క. ఇది ఉష్ణ,సమశీతోష్ణ మండలాలలో మాత్రమే పెరిగే మొక్క. ఈ మొక్క పీచును వడికి దారాలుగా చుట్టి, గుడ్డలు నేయటానికి వాడతారు. ప్రపంచంలో గుడ్డలు నేయటానికి అత్యధికంగా వాడబడే ప్రకృతి సహజమైన పీచుపదార్థము. ఇలా నేసిన గుడ్డ మృదువుగా, గాలి ఆడేటట్లు ఉంటుంది. (ఇంకా…)


20వ వారం
Ramoji Film City.jpg

రామోజీ ఫిల్మ్ సిటీ రెండు వేల ఎకరాలలో విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం ( ఫిలింసిటీ)గా పేరుగాంచినది. ఇది హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్ళు 9వ నెంబరు జాతీయ రహదారి ప్రక్కన హైదరాబాదు నుండి 25 కిలోమీటర్ల దూరములో ఉన్నది. రామోజీ గ్రూపు అధిపతి రామోజీరావు 1994లో స్థాపించిన ఈ ఫిలింసిటి పర్యాటక ప్రదేశం గానూ పేరుగాంచినది. ఇందులో తెలుగు సినిమాలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు, టెలివిజన్ సీరియళ్లు నిర్మించబడ్డాయి. హైద్రాబాదు నుండి బస్సు సౌకర్యంకలదు. దీనిలో వివిధ దేశాలలోని ఉద్యానవనాల నమూనాలు, రకరకాల దేశ విదేశీ శిల్పాలు, సినిమా దృశ్యాలకు కావలసిన రకరకాల రంగస్థలాలు వున్నాయి. సందర్శకులకు ఆనందాన్ని కల్గించటానికి ప్రత్యేక సంగీత,నృత్య కార్యక్రమాలు రోజూ వుంటాయి. (ఇంకా…)


21వ వారం
Bermuda Triangle.png

బెర్ముడా ట్రయాంగిల్ వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రం లోని ఒక ప్రాంతం. దీనినే "డెవిల్స్ ట్రయాంగిల్" అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. చాలా సంవత్సరాల నుంచీ ఈ ప్రదేశం మీదుగా ఎగిరే విమానాలు, ఆ భాగంలో ప్రయాణించే నౌకలు అనుమానాస్పద రీతిలో అదృశ్యం అవుతుండడం వలన ఇది ఒక ప్రమాదకరమైన ప్రదేశంగా పరిగణించబడింది. ఇక్కడ జరిగిన సంఘటనల గురించి అనేక కధలు, సిద్ధాంతాలు, ఊహలు ప్రచారంలో ఉన్నాయి.

సామాన్యమైన మానవ తప్పిదాలు లేదా ప్రకృతి సహజమైన భౌతిక విషయాలు ఇక్కడి ఘటనలకు సంతృప్తికరమైన కారణాలను చెప్పలేకపోతున్నాయని పలువురి భావన. కనుక గ్రహాంతర వాసులు, అసాధారణమైన ప్రాకృతిక నియమాలు ఇక్కడ పనిచేస్తున్నాయని విస్తృతమైన అభిప్రాయాలున్నాయి. ఇక్కడి ఘటనలపై విస్తారంగా పరిశోధనలు జరిగినాయి. చాలా ఘటనల గురించి ప్రజలలో ఉన్న అభిప్రాయాలు అపోహలని, వాటిని రిపోర్టు చేయడంలో అసత్యాలు కలగలిసి పోయాయని తెలుస్తున్నది. అయినాగాని, ఇతర ప్రాంతాలలో జరిగే ఇటువంటి ప్రమాదాలు లేదా ఘటనలతో పోలిస్తే ఇక్కడ జరిగినవి కొంత భిన్నంగా ఉన్నాయని, వీటికి సరైన వివరణలు లభించడం లేదని వివిధ నివేదికలలో పేర్కొనబడింది. (ఇంకా…)


22వ వారం
Partenza da Quarto.jpg

1860 లో మొదలైన వెయ్యి మంది సాహసికుల యాత్ర అనే దండయాత్రకు తిరుగుబాటు జనరల్ గిసేప్పి గరిబాల్ది నేతృత్వం వహించాడు. ఈ స్వచ్ఛంద సైనికుల దళం రెండు సిసిలీల రాజ్యాన్ని ఓడించింది. దీని వలన ఆ రాజ్యం రద్దు రద్దుచెయబడి సార్దీనియాకు స్వాధీనం చెయడం జరిగినది, ఇది ఏకీకృత ఇటలీ రాజ్యం ఏర్పడటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ సాహసయాత్ర యొక్క సంఘటనలు ఇటలీ ఏకీకరణ మొత్తం ప్రక్రియలో భాగంగా జరిగాయి. ఇటలీ ఏకీకరణ ప్రక్రియను సార్దీనియా-పీడ్మొంట్ ప్రధాన మంత్రి అయిన కామిల్లో కావూర్ ప్రారంభించాడు. ఇది అతని జీవిత లక్ష్యం. దీనిలో ఎక్కువ భాగాన్ని ఆయనే సాధించాడు. టుస్కానీ, మోడేనా, పార్మా, రోమాగ్నా సంస్థానాలను మార్చి 1860 సంవత్సరానికి పీడ్మాంట్ రాజ్యం ఆక్రమించింది. తరువాత ఇటాలియన్ జాతీయవాదుల చూపు రెండు సిసిలీల రాజ్యంపై పడింది. రెండు సిసిలీల రాజ్యంలో దక్షిణ ఇటలీ ప్రధాన భూభాగం మరియు సిసిలీ ద్వీపం కలిసి ఉన్నాయి. సిసిలీల రాజ్యం ఆక్రమణ ఆనేది ఇటలీ ఏకీకరణలో తదుపరి దశ. (ఇంకా…)

23వ వారం
వ్యవసాయంలో సాయం చేస్తున్న యెద్దులు, బండికి కట్టబడినవి

వ్యవసాయం

ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో మొక్కలను, జంతువులను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార మరియు ఇంధనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయం లేదా కృషి అంటారు. వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశము. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్ధిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి ఒక కీలకాంశము. వేటాడటం ద్వారా ఆహార సముపార్జన చేసుకొనే స్థితిలో ఉన్న సంస్కృతులలో కనిపించని సంపద సమకూర్చుకోవటం మరియు సైనిక కలాపాలవంటి ప్రత్యేకతలు వ్యవసాయం అభివృద్ధి చెందటంతోనే ప్రారంభమయ్యాయి. సమాజంలోని కొందరు రైతులు తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండిచటం ప్రారంభించడంతో తెగ/జాతి/రాజ్యంలోని మిగిలిన వ్యక్తులకు ఇతర వ్యాపకాలను పోషించే వెసలుబాటునిచ్చింది. ప్రపంచములోని శ్రామికులలో 42% మంది వ్యవసాయ రంగములో పనిచేస్తున్నారు అందుచేత వ్యవసాయం, ప్రపంచములోనే అధిక శాతం ప్రజల యొక్క వృత్తి. అయితే వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచ ఉత్పాదనలో (అన్ని దేశాల సమిష్టి ఉత్పాదనల కూడిక) కేవలం 5% మాత్రమే.(ఇంకా…)


24వ వారం
దుర్ఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత దృశ్యం

జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారత దేశంలోని అమృత్‌సర్ పట్టణంలో ఒక తోట.ఏప్రిల్ 13, 1919 న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు మరియు పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.(ఇంకా…)


25వ వారం
DowntownBombay.jpg

ముంబై

ముంబయి (మరాఠీ: मुंबई) , పూర్వము దీనిని బొంబాయి అని పిలిచేవారు. ఇది భారత దేశంలోని ఒక ప్రముఖ నగరము. ఇది మహారాష్ట్ర రాష్ట్రము యొక్క రాజధాని మరియు ప్రపంచంలో రెండవ అత్యంత జన సమ్మర్ధం గల నగరము. దీని ప్రస్తుత జనాభా 13 మిలియన్లు (ఒక కోటి ముప్పై లక్షలు ). ఇది మహరాష్త్రలోని పశ్చిమ సముద్ర తీరంలోని సాష్టీ ద్వీపంలో ఉన్నది. ఆధునిక భారతదేశ విభిన్నతను ఈ నగరంలో చూడచ్చు. ఈనగర సినీ పరిశ్రమ, రాజకీయాలు, నేరస్తులు కలసిపోయి భవిష్యత్తు గురించి ఆందోళన కలిగిస్తుంది అదే సమయంలో ఈనగర వాసుల సాహసము ఆశ కలిగిస్తుంది.దక్షిణ ఆసియా లొ ముంబాయ్ అతి పెద్ద నగరము.(ఇంకా…)


26వ వారం
Sachintendulkar.jpg

సచిన్ టెండుల్కర్


ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండుల్కర్. క్రికెట్ క్రీడకు భారతదేశం లో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండుల్కర్ ఏప్రిల్ 24, 1973 న జన్మించాడు. ఈనాడు భారత్ లో ఈ క్రీడకు ఇంత జనాదరణ ఉందంటే అదంతా సచిన్, అతని ఆట తీరే కారణం. 1990 దశకంలో భారత క్రికెట్ లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆటగాడు సచిన్. భారత జట్టుకు ఆపద్భాందవుడిగా ఎన్నో విజయాలు అందజేసిన ఈ ముంబాయి కి చెందిన బ్యాట్స్‌మెన్ ను పొగడని వారు లేరనే చెప్పవచ్చు. 39 ఏళ్ళ వయసులో కూడా ఇప్పటికీ జట్టు విజయాలకై శాయశక్తుల ప్రయత్నిస్తూ వెన్నెముకలా నిలబడ్డాడు. 2002 లో విజ్డెన్ పత్రిక టెస్ట్ క్రికెట్ లో ఆస్ట్రేలియా కు చెందిన డాన్ బ్రాడ్‌మెన్ మరియు వన్డే క్రికెట్ లో వెస్ట్‌ఇండీస్ కు చెందిన వివియన్ రిచర్డ్స్ ల తర్వాత క్రికెట్ క్రీడా ప్రపంచంలోనే సచిన్ ను రెండో అత్యున్నత బ్యాట్స్‌మెన్ గా ప్రకటించింది.(ఇంకా…)


27వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 27వ వారం
28వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 28వ వారం
29వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 29వ వారం
30వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 30వ వారం
31వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 31వ వారం
32వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 32వ వారం
33వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 33వ వారం
34వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 34వ వారం
35వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 35వ వారం
36వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 36వ వారం
37వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 37వ వారం
38వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 38వ వారం
39వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 39వ వారం
40వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 40వ వారం
41వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 41వ వారం
42వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 42వ వారం
43వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 43వ వారం
44వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 44వ వారం
45వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 45వ వారం
46వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 46వ వారం
47వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 47వ వారం
48వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 48వ వారం
49వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 49వ వారం
50వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 50వ వారం
51వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 51వ వారం
52వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 52వ వారం
53వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 53వ వారం
54వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 54వ వారం


[మార్చు] ఇవి కూడా చూడండి

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె